
పవిత్ర (ఫైల్)
సాక్షి, బెంగళూరు(తుమకూరు): చదువులో రాణించలేననే భయంతో ఓ యువతి సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తుమకూరు తాలూకా బెళ్లావిలో పవిత్ర (18) అనే విద్యార్థిని బీకాం డిగ్రీ మొదటి ఏడాది చదువుతోంది.
అయితే ఎప్పుడు ఆటలాడుతూ సమయం వృథా చేస్తావా? చదువుకో అని తల్లిదండ్రులు చెప్పిన మాటలే ఆ పవిత్రకు చేదుగా అనిపించాయి. దీనికి తోడు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు కోపడుతారని, అలాగే మొబైల్ కొనివ్వరని మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకుందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment