Bcom student
-
బీకాం విద్యార్థిని ఆత్మహత్య.. తల్లిదండ్రుల మాటలే..
సాక్షి, బెంగళూరు(తుమకూరు): చదువులో రాణించలేననే భయంతో ఓ యువతి సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తుమకూరు తాలూకా బెళ్లావిలో పవిత్ర (18) అనే విద్యార్థిని బీకాం డిగ్రీ మొదటి ఏడాది చదువుతోంది. అయితే ఎప్పుడు ఆటలాడుతూ సమయం వృథా చేస్తావా? చదువుకో అని తల్లిదండ్రులు చెప్పిన మాటలే ఆ పవిత్రకు చేదుగా అనిపించాయి. దీనికి తోడు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు కోపడుతారని, అలాగే మొబైల్ కొనివ్వరని మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకుందని పోలీసులు తెలిపారు. చదవండి: (రోడ్డు ప్రమాదంలో డాక్టర్ ఎస్.పి.నాయుడు మృతి) -
ఉరివేసుకుని బీకాం విద్యార్థిని ఆత్మహత్య
నల్లకుంట: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతురాలి సోదరి నర్మదా రెడ్డి, పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఏపీ అనంతపురం గుంతకల్ అయ్యవారిపల్లికి చెందిన కందనూల వెంకటరమణ రెడ్డికి ఇద్దరు కూతుళ్లు నర్మదారెడ్డి, తనూజ ఉన్నారు. వీరిద్దరూ ఉన్నత చదువుల నిమిత్తం నగరానికి వచ్చారు. నర్మదారెడ్డి ఎంబీఏ చదువుతోంది. తనూజ బీకాం మొదటి సంవత్సరం చదువుతూ నల్లకుంటలో నివాసముంటున్న అమ్మమ్మ వెంకటలక్ష్మి వద్ద ఉంటున్నారు. తనూజ కొంత కాలంగా ఫిట్స్‌తో బాధపడుతోంది. దీంతో మనోవేదనకు గురయ్యేది. ఈ క్రమంలో యోగా మాస్టర్‌గా పనిచేస్తున్న మేనమామ సత్యనారాయణ బుధవారం ఉదయం ఇందిరాపార్క్‌లో యోగా తరగతులకు వెళ్లారు. అదే సమయంలో నిద్రలేసిన తనూజ తిరిగి గది తలుపులు వేసుకుని బెడ్ రూమ్‌లో పడుకుంది. ఉదయం 6.30 గంటలకు నిద్రలేచిన అమ్మమ్మ చూడగా తనూజ బెడ్ రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్ హుక్కు చీరతో ఉరివేసుకుని కనిపించింది. తనూజను కిందకు దింపి చూడగా ఆమె అప్పటికే మృతి చెందింది. మృతురాలి సోదరి నర్మదా రెడ్డి ఫిర్యాదు పోలీసులు కేసు దర్యాపు చేస్తున్నారు. -
యాసిడ్ దాడి డ్రామా!
అనంతపురం, న్యూస్‌లైన్ : అనంతపురంలో సంచలనం రేపిన బీకామ్ విద్యార్థిని వాణిపై జరిగిన యాసిడ్ దాడి కేసు మిస్టరీగా మారింది. ప్రియుడిపై కసితో ఆమే యాసిడ్ పోసుకుందని జిల్లా ఎస్పీ మీడియాకు వెల్లడించగా, కేసును పోలీసులు తప్పుదారి పట్టిస్తున్నారని బాధితురాలు కలెక్టర్‌కు విన్నవించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపిస్తామని కలెక్టర్ లోకేష్‌కుమార్ బాధితురాలికి హామీ ఇచ్చారు. ‘ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన వాణి అనం తపురంలోని ఓ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. చిన్ననాటి మిత్రుడైన పయ్యావుల రాఘవతో ప్రేమలో పడింది. కొద్ది రోజుల తర్వాత విభేదాలు రావడంతో రాఘవ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో వాణి.. మహేష్ అనే మిత్రుని సాయంతో రాఘవపై పగ తీర్చుకునేందుకు కుట్ర పన్నింది. ఈనెల 2న కళాశాల నుంచి బస్సు దిగి కాలి నడకన ఇంటికి వెళుతూ తనవద్ద ఉన్న యాసిడ్‌ను ఒంటిపై పోసుకుని, గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి యాసిడ్ చల్లారని స్థానికులను నమ్మించింది. వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి చేర్చారు. ప్రియుడు పయ్యావుల రాఘవ, అతని సోదరుడు రామకృష్ణ తనపై యాసిడ్ దాడి చేశారంటూ వాణి ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో భాగంగా బాధితురాలి సెల్‌ఫోన్ కాల్స్ జాబితాలో మహేష్ అనే యువకుడితో ఆమె ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించాం. మొదట వాణి ఫిర్యాదు మేరకు రాఘవ, రామకృష్ణలపై కేసు నమోదు చేశాం. పోలీసులను తప్పుడు ఫిర్యాదుతో పక్కదారి పట్టించిన వాణిపై కూడా చట్టరీత్యా కేసు నమోదు చేస్తాం..’ అని ఎస్పీ చెప్పారు. యాసిడ్‌ను వాణికి ఇచ్చింది తానేనని ఆమె మిత్రుడు మహేష్ మీడియాకు చెప్పారు. ఆమె తనకు తాను యాసిడ్ దాడి చేసుకుంటానని చెప్పిందని, తాను భయపడి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని తెలిపారు. ‘పోలీ సులు ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నారు’ అంటూ వాణి మీడియా ఎదుట కంటనీరు పెట్టారు.