ఉరివేసుకుని బీకాం విద్యార్థిని ఆత్మహత్య | Bcom Student Commits Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని బీకాం విద్యార్థిని ఆత్మహత్య

May 9 2019 7:29 AM | Updated on May 9 2019 7:29 AM

Bcom Student Commits Suicide in Hyderabad - Sakshi

తనూజ మృతదేహం

నల్లకుంట: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. మృతురాలి సోదరి నర్మదా రెడ్డి, పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఏపీ అనంతపురం గుంతకల్‌ అయ్యవారిపల్లికి చెందిన కందనూల  వెంకటరమణ రెడ్డికి ఇద్దరు కూతుళ్లు నర్మదారెడ్డి, తనూజ ఉన్నారు. వీరిద్దరూ ఉన్నత చదువుల నిమిత్తం నగరానికి వచ్చారు. నర్మదారెడ్డి ఎంబీఏ చదువుతోంది. తనూజ బీకాం మొదటి సంవత్సరం చదువుతూ నల్లకుంటలో నివాసముంటున్న అమ్మమ్మ వెంకటలక్ష్మి వద్ద ఉంటున్నారు.

తనూజ కొంత కాలంగా ఫిట్స్‌తో బాధపడుతోంది. దీంతో మనోవేదనకు గురయ్యేది. ఈ క్రమంలో యోగా మాస్టర్‌గా పనిచేస్తున్న మేనమామ సత్యనారాయణ బుధవారం ఉదయం ఇందిరాపార్క్‌లో యోగా తరగతులకు వెళ్లారు. అదే సమయంలో నిద్రలేసిన తనూజ తిరిగి గది తలుపులు వేసుకుని బెడ్‌ రూమ్‌లో పడుకుంది. ఉదయం 6.30 గంటలకు నిద్రలేచిన అమ్మమ్మ చూడగా తనూజ బెడ్‌ రూమ్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌ హుక్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించింది. తనూజను కిందకు దింపి చూడగా ఆమె అప్పటికే మృతి చెందింది. మృతురాలి సోదరి నర్మదా రెడ్డి ఫిర్యాదు పోలీసులు కేసు దర్యాపు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement