భర్తతో కమలమ్మ (ఫైల్)
సాక్షి, బెంగళూరు: పండంటి బిడ్డకు జన్మ ఇవ్వాల్సిన గర్భిణి వైద్య సేవలు అందక కన్నుమూసింది. ఈ విషాద ఘటన తుమకూరు జిల్లాలోని హొసకెర పీహెచ్‌సీలో చోటు చేసుకుంది. వివరాలు.. మధుగిరి తాలూకా బ్రహ్మదేవరహళ్లికి చెందిన కమలమ్మ(28) కు పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఎంతసేపైనా రాకపోవడంతో కారులో హొసకెరె పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు లేకపోవడంతో నర్సులే కాన్పు చేసేందుకు ఉపక్రమించారు. ఈక్రమంలో పరిస్థితి విషమించి కడుపులో ఉన్న బిడ్డతో సహా గర్భిణి మృతి చెందింది. వైద్యులు లేకపోవడం వల్లనే తన భార్య మృతి చెందినట్లు భర్త కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment