
ప్రతీకాత్మకచిత్రం
తుమకూరు (కర్ణాటక): నగరంలోని బెస్కాం ఆఫీసులో మహిళా సిబ్బందిని తిపటూరు సబ్‌టౌన్ రెవెన్యూ శాఖలో అసిస్టెంట్‌గా పనిచేసే బీకే జగదీశ్ లైంగిక వేధిస్తున్నట్లు ఏడుగురు మహిళా సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఓ ఉద్యోగిని మాట్లాడుతూ జగదీశ్‌ను తాను అన్న అని పిలుస్తానని, అలా పిలవరాదని అసభ్యంగా మాట్లాడాడని తెలిపారు. డ్యూటీ అయిపోయాక ఫోన్లు చేస్తూ ఇంట్లో ఎవరూ లేకుంటే.. వచ్చేస్తా.. ఓకేనా అంటూ వేధిస్తున్నట్లు వాపోయారు. లాడ్జికి రావాలని వేధించినట్లు మరో ఉద్యోగిని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమశేఖర్‌గౌడ స్పందిస్తూ జగదీశ్‌ను మరో ప్రాంతానికి బదిలీ చేస్తామని చెప్పారు.
చదవండి: (ఆరు నెలలుగా బాలికపై లైంగిక దాడి.. ఒంటిపై పంటిగాట్లు గుర్తించి..)
Comments
Please login to add a commentAdd a comment