
తుమకూరు: అనారోగ్యంతో మృతి చెందిన నాలుగు నెలల చిన్నారి అంత్యక్రియలను అడ్డుకున్న ఘటన సోమవారం తుమకూరు జిల్లా కొరటిగెరె తాలుకా జెట్టి అగ్రహార పంచాయతీ పరిధిలోని కైమార గ్రామంలో చోటుచేసుకుంది. కొరటెగెరె నుంచి మధుగిరి వైపు వెళ్లే ఎత్తినహొళె పైప్‌లైన్ బ్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. బ్లాస్టింగ్‌ల కారణంగా రంగనాథ్, నేత్రా దంపతులకు చెందిన నాలుగు నెలల చిన్నారి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది.
దీంతో తల్లిదండ్రులు చిన్నారిని తీసుకుని కొరటగెరెలోని తాలూకా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారి మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు తిరిగి గ్రామానికి వచ్చి సమీపంలోని షాహీ గార్మెంట్స్ సంస్థ సమీపంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సంస్థ సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఇక్కడ పాతిపెట్టొద్దని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అక్కడకు చేరుకుని సిబ్బందికి సర్దిచెప్పి అక్కడే అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment