ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ వైఫల్యం | Congress failure of public problems | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ వైఫల్యం

Published Sun, Jan 19 2014 3:57 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress failure of public problems

తుమకూరు, న్యూస్‌లైన్ :  తుమకూరు జిల్లా ప్రజలకు హేమావతి నీటిని అందించడానికి దేవెగౌడ కుటుంబ ఎప్పుడు కూడ అడ్డు పడలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వసతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విపలమైందని, కాంగ్రెస్ పార్టీలోఇప్పటికి గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని, కేవలం ప్రజల మెప్పు పొందడానికి రూపాయికి కిలోబియ్యం పథకం ప్రవేశపెట్టి దానిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.
 
 అదే విధంగా చెరకు రైతులకు మద్దతు ధర అందించడం లేదని, ఇందు కోసం ఏర్పాటు చేసిన కమిటీ రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేవెగౌడ కటుంబానికి చెందిన వారు ఎవరు ఎన్నికల పోటీలో ఉండరని, కేవలం దేవెగౌడ వ ూత్రం బరిలో ఉంటారని కుమార స్పష్టం చేశారు. రాష్ట్రంలో జేడీఎస్ పార్టీని బలోపేతం చేయడానికి బూత్ స్థాయి కార్యకర్తలు కృషి చేయాలని, అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కష్టపడాలన్నారు. కార్యక్రమంలో కుణిగల్ ఎమ్మెల్యే నాగరాజయ్య, స్థానిక నాయకులు సురేష్‌బాబు, శిరా మాజీ మంత్రి సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement