
తుమకూరు/కర్ణాటక: మూడు నెలల బాలింతపై పోలీసులు దౌర్జన్యం చేశారు. ఆమె ఇంట్లోని సామగ్రినంతా బయటకు పడవేసి బాలింతతో పాటు చిన్నారిని ఇంటి నుంచి గెంటేశారు. ఈ ఘటన తురువేకెరె తాలూకా దండినశివర హోబళి బాణసంద గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామంలో సదరు బాలింతకు జరిగిన అన్యాయాన్ని మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసి అనంతరం ఆ గ్రామస్తులంతా ఆమెకు బాసటగా నిలిచారు.
ఆ మహిళకు న్యాయం చేయాలని గ్రామంలోనే బైఠాయించి నిరసన తెలిపారు. అక్క, చెల్లికి పొలం వాటా విషయంలో వివాదం ఉంది. ఈ క్రమంలో చంద్రమ్మ అక్కడే గుడిసెలో ఉంటోంది. దీంతో తరచూ అక్క చెల్లి మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతుండటంతో పోలీసులు చంద్రమ్మను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని దౌర్జన్యానికి పాల్పడ్డారని గ్రామస్తులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment