
సాక్షి, తుమకూరు: ప్రధాని నరేంద్రమోదీ సోమవారం తుమకూరు జిల్లాలో పర్యటించనుండగా ఆయన కోసం అపురూపమైన హారం, తల పేటా సిద్ధమయ్యాయి. జిల్లా వ్యవసాయ సంస్కృతికి అద్దం పట్టేలా వక్కలతో తీర్చిదిద్దిన హారం, పేటా సిద్ధమయ్యాయి. జిల్లాలో వక్క, టెంకాయ తోటలు విస్తారంగా ఉండడం తెలిసిందే.
నేడు ప్రధాని మోదీ పర్యటన
శివాజీనగర: ప్రధాని నరేంద్రమోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం బెంగళూరుకు వస్తున్నారు. నెల రోజుల్లో మోదీ రావడం ఇది మూడవసారి. ప్రత్యేక విమానంలోఉదయం 8.20 గంటల సమయంలో డిల్లీ నుంచి బయలుదేరి 11 గంటలకు బెంగళూరుకు చేరుకొంటారు. నగరంలో జరిగే భారత ఇంధన వారోత్సవాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తుమకూరు జిల్లాకు వెళ్తారు.
(చదవండి: ఎన్‌ఐఏ చేతికి ‘ఉగ్ర త్రయం’ కేసు )