
బాధితునితో మాట్లాడుతున్న జడ్జి
సాక్షి, తుమకూరు: డబ్బులు, ఆస్తి కోసం సొంత కొడుకునే తల్లిదండ్రులు పిచ్చివానిగా ప్రచారం చేసి ఇంట్లో బంధించి హింసించిన అమానవీయ ఘటన ఇది. ఈఘటన తిపటూరు తాలూకా నొణవినకెరె హోబళి నెల్లికెరె గ్రామ పంచాయతీ పరిధిలోని చిగ్గావి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సోమశేఖరయ్య కుమారుడు మంజునాథ్ (23) బాధితుడు. సోమశేఖరయ్య మంజునాథ్‌ను సరిగా చూసుకునేవాడు కాదు. ఇటీవల కొబ్బరి పంట అమ్మగా వచ్చిన రూ.3 లక్షలను కూడా కూతురు, అల్లునికి ఇచ్చాడు.
మంజునాథ్ ఖర్చుల కోసం రూ.2 వేలు ఇమ్మని ప్రాధేయపడితే రూపాయి కూడా ఇవ్వనని చెప్పి కొట్టి గదిలో వేసి బంధించారు. అతనికి పిచ్చిపట్టిందని అందరికీ చెప్పారు. ఈ నెల 23న సీనియర్ సివిల్ జడ్జి నూరున్నీసాకు ఒక వ్యక్తి మంజునాథ్ దీనగాథను వివరించాడు. వెంటనే జడ్జి, పోలీసులతో కలిసి వచ్చి మంజునాథ్‌ను గృహ నిర్బంధం నుంచి విడిపించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కర్కోటక తండ్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment