పనికి రాకపోవడంతో బాలునిపై దౌర్జన్యం చేస్తున్న యజమాని. ఆదివారం బెంగళూరు లాల్‌బాగ్‌లో బాల కార్మిక దురాచారానికి వ్యతిరేకంగా నిర్వహించిన బయలు నాటకంలో ఓ సన్నివేశం. బాలలను పనికి కాదు, బడికి పంపాలని ఈ సందర్భంగా చాటిచెప్పారు.
బోనులో చిక్కిన భల్లూకం
తుమకూరు: తుమకూరు సిద్దగంగ మఠ పరిసరాల్లో సంచరిస్తున్న ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. నాలుగైదు నెలలుగా ఓ ఎలుగుబంటి మఠం పరిసరాల్లో సంచరిస్తు రెండుసార్లు ఏకంగా మఠంలోకే ప్రవేశించింది. దీంతో మఠం సిబ్బంది ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు మఠం చుట్టుపక్కల బోన్లు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి ఎలుగుబంటి బోనులో చిక్కింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఎలుగుబంటిని అడవిలోకి తరలించారు.
పక్షులను కాపాడుకోవాలి
గౌరిబిదనూరు: వేసవి ప్రారంభం కావడంతో పక్షులను కాపాడుకోవాలని యశస్వీ పీయూ కళాశాల అధ్యక్షుడు శశిధర్ అన్నారు. ఆదివారం పక్షులకు ఆహారం, నీరు ఇవ్వండి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పక్షులకు ఆహారం, నీరు సకాలంలో అందక పోవడంతో మృత్యువాతపడుతున్నాయని, ఈ నేపథ్యంలో వాటి సంరక్షణకు విద్యార్థులు చిన్నపాటి ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు, ధాన్యపు గింజలు ఉంచి మానవత్వం చాటుకుంటున్నారని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment