
సాక్షి, బెంగళూరు: డిసెంబరు 25వ తేదీన అన్నీ చెబుతానని మాజీ మంత్రి తెలిపారు. తుమకూరు నగరంలో ఉన్న సిద్దగంగా మఠాన్ని మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, భార్య లక్ష్మి అరుణ సందర్శించారు. శివకుమార స్వామి సమాధి వద్ద పూజలు చేసి మఠాధ్యక్షుడు సిద్దలింగ స్వామిని కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మఠం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 14 సంవత్సరాల నుంచి మఠాన్ని సందర్శిస్తున్నట్లు తెలిపారు.
బసవణ్ణ ఆదర్శంగా ఎలాంటి ప్రచారం లేకుండా లక్షల మందికి సేవ చేసిన ఘనత దివంగత శివకుమార స్వామిదని అన్నారు. తనకు మానసికంగా, దైహికంగా శక్తిని ఇచ్చేది మఠాలేనని చెప్పారు. మఠంలో ఎలాంటి రాజకీయాలను మాట్లాడనని, ఈ నెల 25వ తేదీన బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలనూ అక్కడ వెల్లడిస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment