
సాక్షి, బెంగళూరు: చెరువులో మునిగిపోతున్న ఇద్దరు బాలికలను ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలతో కాపాడిన ఘటన ఆదివారం సాయంత్రం తుమకూరు జిల్లా శిర తాలూకా హందికుంటె అగ్రహరలో చోటుచేసుకుంది. వివరాలు.. కేఎస్‌ఆరీ్టసీ డిపోకు చెందిన డ్రైవర్ మంజునాథ్ ఆదివారం సాయంత్రం ప్రయాణికులతో నాగప్పనకహళ్లి గేట్ మార్గంలో వస్తుండగా సుదూరంలో ఉన్న చెరువులో ఇద్దరు బాలికలు మునిగిపోతున్నట్లు గుర్తించాడు.
వెంటనే బస్సును పక్కకు నిలిపి నీటిలో దూకాడు. ఇద్దరిని పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. డ్రైవర్ సాహసాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. డ్రైవర్ మంజునాథ్ మాట్లాడుతూ... పిల్లలు మునిగిపోతుండగా అక్కడే చెరువు వద్ద తల్లి ఏడుస్తుండటాన్ని గమనించి వెంటనే బస్సు ఆపి చెరువులో దూకి చిన్నారులను రక్షించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంజునాథ్‌ను డిపో మేనేజర్, సిబ్బంది ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment