save life
-
ప్రాణాలు కాపాడిన కండక్టర్
-
తాటిచెట్టుపై విలవిల్లాడిన గీత కార్మికుడు.. ప్రాణాలకు తెగించి కాపాడి..
సాక్షి, ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): మండలంలోని దుమాలలో ఓ గీత కార్మికుడు కల్లు గీయడానికి బుధవారం తాటి చెట్టుపైకి ఎక్కి మోకు జారడంతో అక్కడే చిక్కుకొని రెండు గంటల పాటు విలవిల్లాడాడు. చివరికి మరో గీతకార్మికుడి సాహసంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దుమాల గ్రామానికి చెందిన ఆరేటి రాములు ఎప్పట్లాగే కల్లు గీసేందుకు బుధవారం ఉద యం తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నడుంపైనున్న మోకు భుజాలపైకొచ్చింది. దీంతో పట్టు తప్పి చెట్టుపైనే తలకిందులుగా వేలాడ సాగాడు. సమీపంలోని తోటి గీత కార్మికుడు ఆరేటి పర్శరాములు ప్రాణాలకు తెగించి చెట్టు పైకెక్కాడు. రాములు భుజం వద్ద ఉన్న మోకు ను సరిచేసి నడుంకు కట్టి కిందకు దించాడు. రాములును కాపాడిన పర్శరాములును సర్పంచ్ కదిరె రజిత, మండల ఉపాధ్య క్షుడు కదిరె భాస్కర్, గ్రామస్తులు అభినందించారు. చదవండి: సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలు.. ఐదు జిల్లాల్లో పర్యటన -
మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సోనాలి.. ప్రయాణీకుల ప్రశంస
సాక్షి, వరంగల్: ఓ మహిళ ప్రాణాలను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సోనాలి మాల్కే కాపాడారు. వరంగల్ రైల్వేస్టేషన్లో రైలు నుంచి దిగుతుండగా ఓ మహిళ ప్లాట్‌ప్లామ్, రైలు మధ్య పడిపోయింది. ఈ సమయంలో ప్లాట్‌పామ్‌పై విధుల్లో ఉన్న సోనాలి ఆమెను సమయ స్ఫూర్తితో కాపాడింది. దీంతో, ఆమెను ఉన్నాతాధికారులు ప్రశంసించారు. వివరాల ప్రకారం.. మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలు మణుగూరు నుండి సికింద్రాబాద్‌కు వెళ్తుండగా ట్రైన్ వరంగల్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఈ క్రమంలో రైలు ప్లాట్‌ఫామ్‌పై ఆగే సమయంలో ట్రైన్ స్లో కావడంతో ఓ మహిళ రైలు దిగే ప్రయత్నం చేసింది. దీంతో, ప్లాట్‌ఫామ్, రైలుకు కింద ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సోనాలి మాల్కే వెంటనే స్పందించింది. సదరు మహిళను రైలు నుంచి దూరంగా లాగడంతో ప్రమాదం తప్పింది. అయితే, దీనికి సంబంధించిన దృశ్యాలు స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ఇక, సదరు మహిళను ప్రాణాలకు తెగించి కాపాడాని కానిస్టేబుల్ సోనాలి మాల్కేను ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, ప్రయాణికులు అభినందించారు. ఇది కూడా చదవండి: రోడ్డుపై నిమ్మకాయలతో హిజ్రాతో పూజలు.. ఎస్ఐ చేసిన పనికి షాక్‌లో ప్రయాణీకులు -
ఎత్తయిన భవనం కిటికి నుంచి వేలాడిన చిన్నారి, తల ఇరుక్కుని..
-
బస్ నడుపుతుండగా స్పృహ కోల్పోయిన డ్రైవర్‌కు.. ఈ బుడ్డోడు ఏం చేశాడో చూశారా?
-
శభాష్ డ్రైవరన్న.. చెరువులో మునిగిపోతున్న బాలికలను రక్షించి..
సాక్షి, బెంగళూరు: చెరువులో మునిగిపోతున్న ఇద్దరు బాలికలను ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలతో కాపాడిన ఘటన ఆదివారం సాయంత్రం తుమకూరు జిల్లా శిర తాలూకా హందికుంటె అగ్రహరలో చోటుచేసుకుంది. వివరాలు.. కేఎస్‌ఆరీ్టసీ డిపోకు చెందిన డ్రైవర్ మంజునాథ్ ఆదివారం సాయంత్రం ప్రయాణికులతో నాగప్పనకహళ్లి గేట్ మార్గంలో వస్తుండగా సుదూరంలో ఉన్న చెరువులో ఇద్దరు బాలికలు మునిగిపోతున్నట్లు గుర్తించాడు. వెంటనే బస్సును పక్కకు నిలిపి నీటిలో దూకాడు. ఇద్దరిని పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. డ్రైవర్ సాహసాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. డ్రైవర్ మంజునాథ్ మాట్లాడుతూ... పిల్లలు మునిగిపోతుండగా అక్కడే చెరువు వద్ద తల్లి ఏడుస్తుండటాన్ని గమనించి వెంటనే బస్సు ఆపి చెరువులో దూకి చిన్నారులను రక్షించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంజునాథ్‌ను డిపో మేనేజర్, సిబ్బంది ఘనంగా సన్మానించారు. -
ఛాతీలోకి లైవ్ గ్రనేడ్.. ఎలా కాపాడావయ్యా?!
కీవ్: తమపై దురాక్రమణలో రష్యా బలగాల అకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఉక్రెయిన్ వాపోతోంది. ఏడాదికి సమయం దగ్గరపడుతున్నా.. ప్రాణ, ఆస్తి నష్టం కొనసాగుతుండడం యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ ఆర్మీ డాక్టర్ ఒకాయన చేసిన పని సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. లైవ్ గ్రనేడ్ ఒకటి ఓ సైనికుడి ఛాతీలో ఇరక్కుపోవడంతో.. ఆయన చాకచక్యంగా వ్యవహరించి దానిని బయటకు తీశాడు. ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా.. బక్ముట్ వద్ద భీకర పోరాటం జరుగుతోంది. ఆ సమయంలో వీవోజీ గ్రనేడ్ లాంఛర్ ద్వారా దూసుకెళ్లాల్సిన ఓ లైవ్ గ్రనేడ్.. సైనికుడి ఛాతీలోకి వెళ్లిందట. అది ఏ క్షణమైనా అది పేలి అతను చనిపోవచ్చు. ఆ టైంలో మేజర్ జనరల్ డాక్టర్ అండ్రి విల్లో, సర్జరీకి దిగారు. తన ప్రాణాలకు తెగించి మరీ ఆపరేషన్ చేసి దానిని తొలగించి అతని పాలిట దేవుడిగా నిలిచాడు. ఆ డేరింగ్ ఆపరేషన్‌ను ఆయన ఇద్దరు సైనికుల సహకారంతో నిర్వర్తించడం విశేషం. వీవోజీ గ్రనేడ్ బాడీలోకి వెళ్లాక ఏమాత్రం చెదరలేదట. ఛాతీలో అలాగే చిక్కుకుపోయిందట. ఏమాత్రం పొరపాటు జరిగినా అది పేలిపోయి ఆ సైనికుడు ముక్కలు ముక్కలు అయిపోతాడు. అతనితో పాటు సర్జరీకి దిగిన వైద్యుడు కూడా హరీమంటాడు. ఆ సమయంలో ఎలెక్ట్రో కోగ్యులేషన్ చర్యకు దిగి ఉంటే.. కచ్చితంగా ఆ గ్రనేడ్ పేలిపోయేది. కానీ, మేజర్ ఆండ్రి విల్లో ఆ పని చేయలేదు. సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి.. ఆ సైనికుడి ప్రాణాలు నిలబెట్టాడు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సైన్యం ధృవీకరించింది కూడా. అయితే సైనికుడి ఛాతీలోకి ఆ గ్రనేడ్ ఎలా వెళ్లిందనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఎక్స్‌రే ద్వారా ఛాతీలో గ్రనేడ్ ఇరుక్కున ఫొటో, ఆపరేషన్ చేశాక ఆ గ్రనేడ్‌ను తొలగించిన ఫొటోలను మాత్రం రిలీజ్ చేసింది ఉక్రెయిన్ సైన్యం. -
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం బాలసాయిబాబా ట్రస్ట్ భూములను రక్షించే క్రమంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ప్రజా గాయకుడు గద్దర్ కోరారు. ఈ మేరకు శనివారం వెస్ట్‌జోన్ డీసీపీ సీతారాంను జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రెండు షిఫ్టులు పని చేసేలా నలుగురు గన్మెన్లను రక్షణగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ బాలసాయిబాబా ట్రస్ట్ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని కొంతకాలంగా పోరాటం చేస్తున్నానని చెప్పారు. భూముల పరిరక్షణకు తరుచూ ఈ ప్రాంతానికి వస్తున్నానని, పలువురు ప్రజాప్రతినిధులు, రియల్టర్లతో తనకు ప్రాణహాని ఉన్నట్లు తెలిసిందన్నారు. మండలగూడెం రియల్టర్ల చేతిలో ఉన్న 59 ఎకరాల బాలసాయిబాబా ట్రస్ట్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో అక్కడే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గద్దర్ డిమాండ్ చేశారు. బాలసాయిబాబా కుటుంబ సభ్యులు ఆ భూములను హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి విక్రయించినట్లు సమాచారం ఉందని, భూముల వివరాలు కావాలని మూడు రోజుల కిందట సమాచార హక్కు చట్టం కింద రఘునాథపల్లి రెవెన్యూ అధికారులను కోరినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఓసారి తనపై హత్యాయత్నం జరిగిందని, బాలసాయిబాబా భూములను కాపాడేందుకు చేస్తున్న పోరాటంలో రక్షణ కల్పించాలని కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారాంకు గద్దర్ విన్నవించారు. -
ఆమె పూర్వానుభవం.. ఒక ప్రాణం నిలిపింది
వైరల్: ఆపదలో ఉన్న వ్యక్తుల్ని ఆదుకోవడం నిజంగా గొప్ప విషయం. కేవలం మానవ సంబంధాలతో సాయం చేసేవాళ్లను చూస్తే అభినందించకుండా ఉండలేం. అయితే.. ముప్పును అంచనా వేసి సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు నిలబెట్టడం మరింత విశేషమే కదా. అలాంటి ఘటనే ఇది.. గుడ్ న్యూస్ మూమెంట్ అనే ఇన్స్టాగ్రామ్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో.. ఒక ఫ్యామిలీ ఓ రెస్టారెంట్లో తింటూ ఉంటారు. అందులో ఓ వ్యక్తికి గొంతులో ఏదో అడ్డం పడి.. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఏం జరిగిందంటూ ఆరా తీసే యత్నం చేస్తారు. అంతలో ఓ వెయిట్రెస్ అక్కడి రావడంతో.. ఆమెకు అతని పరిస్థితిని వివరిస్తారు. ఇంక.. క్షణం ఆలస్యం కూడా చేయకుండా ఆమె అతనికి యాంటీ చోక్ ట్రీట్మెంట్ ఇస్తుంది. దీనినే హిమ్లిచ్ మనువహ్(heimlich maneuver) అంటారు. గొంతుకు ఏదైనా అడ్డం పడి.. శ్వాసకు ఇబ్బంది ఏర్పడిన తరుణంలో ఈ తరహా చికిత్స అందిస్తారు. తద్వారా అడ్డం పడ్డ వస్తువు బయటకు రావడం లేదంటే లోపలికి వెళ్లిపోవడం ద్వారా ఆ వ్యక్తికి ఉపశమనం కలిగి.. సాధారణ స్థితికి వచ్చాడు. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఆమెను షీ(హీ)రోగా అభివర్ణిస్తున్నారంతా. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) కస్టమర్‌ను కాపాడిన ఆ వెయిట్రెస్ పేరు లేసీ గప్టిల్ అని.. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌గా గతంలో పని చేసిన ఆమె సీపీఆర్‌తో పాటు హిమ్లిచ్ మనువర్లోనూ శిక్షణ తీసుకుందని తెలుస్తోంది. అమెరికన్ డాక్టర్ హెన్రీ హీమ్లిచ్ ఈ విధానానికి సృష్టికర్త కాగా.. ఆ పేరు మీదుగా ఈ అత్యవసర చికిత్సకు పేరొచ్చింది. గొంతులో ఏదైనా అడ్డం పడినప్పుడు.. ఉక్కిరిబిక్కిరి అయిన బాధితుడు ఊపిరి పీల్చుకోలేని స్థితిలో సాధారణంగా మాట్లాడలేడు. గొంతుపై రెండు చేతులను ఉంచి. సాయం కోసం వేడుకుంటాడు. అలాంటప్పుడు ఈ చికిత్సను చాలా జాగ్రత్తగా అందించాల్సి ఉంటుంది. -
ఇద్దరి ప్రాణాలు నిలబెట్టారు..
ఈపూరు(పల్నాడు జిల్లా): మండలంలోని నెమలిపురికి చెందిన సాంబశివరావు, కోటేశ్వరరావులు బంధువులు. బొమ్మరాజుపల్లికి చెందిన వీరి బంధువు శేషారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని చూసేందుకు వీరిద్దరు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. భద్రుపాలెం గ్రామసమీపంలోకి వచ్చేసరికి ద్విచక్రవాహనం అదుపు తప్పి నాగార్జున సాగర్ మెయిన్‌కెనాల్‌లో పడింది. స్పందించిన గ్రామస్తులు రక్షించారు. తాళ్ల సహాయంతో ఇద్దరిని పైకి లాగి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. అనంతరం ద్విచక్ర వాహనాన్ని కూడా తాళ్ల సాయంతో పైకి తీశారు. ఇద్దరి ప్రాణాలను కాపాడిన గ్రామస్తులను అధికారులు అభినందించారు. -
400 మంది ప్రాణాలను కాపాడిన ఏపీ పోలీసులు
సాక్షి, విజయవాడ: పోలీసులు సకాలంలో స్పందించి 400 మంది ప్రాణాలను కాపాడారు. జీజీహెచ్‌లో ఆక్సిజన్‌తో 400 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఒడిశా నుంచి బయల్దేరిన ఆక్సిజన్ ట్యాంకర్ ట్రాకింగ్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోవడంతో విజయవాడ సిటీ కమిషనర్‌కు అధికారులు సమాచారం అందించారు. వెంటనే ఒరిస్సా నుండి విజయవాడ వరకు మార్గ మధ్యలో ఉన్న జిల్లాల ఎస్పీలను విజయవాడ సీపీ అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలోని ఓ డాబా వద్ద ఆక్సిజన్ ట్యాంకర్‌ను గుర్తించారు. అలసిపోయి వాహనాన్ని నిలిపి వేసినట్టుగా పత్తిపాడు సీఐకి డ్రైవర్ వివరించాడు. డ్రైవర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి సీఐ తీసుకెళ్లారు. అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్‌కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్‌ను పోలీసులు విజయవాడ జీజీహెచ్‌కు చేర్చడంతో పెను ప్రమాదం తప్పింది. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా కొనసాగింది. సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్‌ను తీసుకొచ్చిన పోలీసులకు డీజీపీ అభినందనలు తెలిపారు. చదవండి: ఏపీకి 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు ఏపీ: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు పునరావాసం -
తన కొడుకు ప్రాణాలను కాపాడమని ఓ తల్లి ఆవేదన
-
ఆ బాలిక దైర్యానికి అందరూ ఫిదా..
-
ఆ బాలిక ధైర్యానికి అందరూ ఫిదా..
సాక్షి, బెంగళూరు: ప్రమాదం సంభవించే ముందు ఏమి చేయాలో అర్థం కాదు. కొంతమంది అయితే ప్రమాదం వచ్చినప్పుడు తమ వారిని వదిలి పారిపోయేవాళ్లు కూడా ఉంటారు. కానీ తన బుజ్జి తమ్ముడిని కాపాడుకునేందుకు ఎనిమిది సంవత్సరాల బాలిక తన వయసుకు మించిన సాహసం చేసింది. మృత్యువు ఆవు రూపంలో వచ్చింది. దారిపొడవునా అందర్ని పొడుచుకుంటూ వస్తున్న ఆవు ఒక్కసారిగా అడుకుంటున్న చిన్నారుల వైపు దూసుకొచ్చింది. వివరాలివి.. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఆర్తి తన చిట్టి తమ్ముడు కార్తీక్‌ని చిన్న కారులో కూర్చోబెట్టుకుని ఇంటి ఆవరణలో ఆడిస్తోంది. ఆ సమయంలో అటువైపుగా పరుగెత్తుకు వచ్చిన ఆవు వారివైపు మళ్లింది. దాంతో తమ్ముడిని తన చేతులతో పక్కకు లాగేసుకుంది. కానీ ఆవు మాత్రం వాళ్లను వదలకుండా కొమ్ములతో కుమ్ముతున్నా ఆ చిన్నారి తన శరీరాన్ని అడ్డంగా పెట్టి తన బుజ్జి తమ్ముడిని రక్షించేందుకు ప్రయత్నించింది. ఆవు మాత్రం అలానే ఆర్తిని రెండు, మూడు సార్లు పొడిచింది. ఫిబ్రవరి 13న ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఇంట్లో నుంచి ఓ వ్యక్తి వచ్చి ఆవును అక్కడి నుంచి తరిమేశాడు. ఆ బాలికకు మాత్రం చిన్నపాటి గాయాలయ్యాయి. సీసీటీవిలో రికార్డు అయినా ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిన్నారి ధైర్య సాహసాలను అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
మెరుపు వేగంతో ప్రాణాలు కాపాడాడు
సాక్షి, ముంబై : మెరుపు వేగంతో, సాహసం ప్రదర్శించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఓ బాలుడి ప్రాణాలు కాపాడి హీరో అయ్యాడు. రన్నింగ్ ట్రెయిన్ నుంచి కింద పడిపోయిన బాలుడిని పట్టాల మధ్య పడిపోకుండా రక్షించాడు. ముంబైలోని నైగావ్ రైల్వే స్టేషన్లో ఫ్రిబ్రవరి 2న ఈ ఘటన చోటు చేసుకుంది. సెకన్ల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఏడేళ్ల బాలుడు తన తల్లితో కలిసి రైలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. అంతలో రైలు కదలగా.. తల్లి ఎక్కేసింది. అయితే తల్లిని అనుసరించే క్రమంలో పిల్లాడు కిందపడిపోయాడు. ఫ్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య అతను ఇరక్కుపోగా.. అది గమనించిన సునీల్ నాపా అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ చాకచక్యంగా అతన్ని పక్కకు లాగాడు. ఆ బాలుడిని గమనించి ముందు కంపార్ట్మెంట్లో ఉన్న మరో వ్యక్తి సైతం కింద పడటం వీడియోలో గమనించవచ్చు. స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజీలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రాణాలకు తెగించి మరీ బాలుడి ప్రాణాలు కాపాడిన సునీల్ నాపాపై అధికారులు, ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఆ హోంగార్డులకు హ్యాట్సాఫ్
సాక్షి, హైదరాబాద్ : గుండెపోటుకు గురైన వాహనదారుడి ప్రాణాలు కాపాడిన హోంగార్డులపై ప్రశంసలు కురుస్తున్నాయి. మంత్రి కేటీఆర్ వారికి అభినందనలు తెలుపుతూ గురువారం ఉదయం ట్వీటర్లో ఓ సందేశం ఉంచారు. బహదూర్‌పుర పీఎస్‌లో పని చేసే హోంగార్డులు చందన్‌సింగ్, ఇనాయాతుల్లా ఖాన్లు గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడారు. వారికి అభినందనలు. నగరంలో మరింత మంది కానిస్టేబుల సీపీఆర్ విధానంపై శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని.. ఇలాంటి సమయాల్లో అది పనికొస్తుంది అంటూ కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఆ వీడియోను కూడా మంత్రి పోస్టు చేశారు. బహుదూర్‌పుర ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, నగర ట్రాఫిక్ డీసీపీ రఘనాథ్ కూడా వారిపై ప్రశంసలు కురిపించారు. బుధవారం ఉదయం పురానాపూల్ మీదుగా జహనుమా వైపు బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా కిందపడిపోయాడు. ఇది గమనించిన చందన్‌సింగ్, ఇనాయాతుల్లా ఖాన్లు వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు పరిగెత్తారు. ఆ వ్యక్తి ఛాతిపై సీపీఆర్(కార్డియోపల్మనరి రెససిటేషన్) పద్ధతి ద్వారా ఛాతీపై మసాస్ చేసి.. ఊపిరి పీల్చుకునేలా ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత 108కు ఫోన్ చేసి అంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహనదారుడి ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరిపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఆ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. Yesterday Homeguards K. Chandan & Inayathulla Khan of Bahadurpura PS saved the life of a person who had suddenly undergone a cardiac arrest at Puranapul Darwaja in Old City🙏🙏 Many Constables & Homeguards in Hyderabad have undergone CPR (cardio pulmonary resuscitation) training pic.twitter.com/k7D13RwqHL — KTR (@KTRTRS) 1 February 2018 -
మహిళను భుజాన మోసి హీరో అయ్యాడు
ముంబై : కమలా మిల్స్ కాంపౌండ్ ప్రమాద ఘటనలో నిర్లక్ష్యం ఎవరిదైనా.. 14 మంది అమాయక ప్రాణాలు బలికావటం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ప్రమాద సమయంలో సమయ స్ఫూర్తి, ధైర్యం ప్రదర్శించి 8 మంది ప్రాణాలు కాపాడాడు సుదర్శన్ శివాజీ షిండే అనే కానిస్టేబుల్. ఆయన ఓ మహిళను భుజాన మోసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. అతని విధి నిర్వహణలో అతని పనితీరుకు మెచ్చి ముంబై పోలీస్ కమిషనరేట్ అతనిని సన్మానించింది. ఈ కార్యక్రమానికి కమిషనర్ దత్తాత్రేయ పడ్సల్గికర్, మేయర్ విశ్వనాథ్ మహదేశ్వర్‌లు హాజరై శివాజీని సన్మానించి ప్రశంసలు కురిపించారు. అనంతరం శివాజీ మాట్లాడుతూ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఘటన గురించి వివరిస్తూ.. ‘‘అర్ధరాత్రి 12గం.30ని. సమయంలో వైర్లెస్ ద్వారా సమాచారం నాకు అందించింది. వెంటనే నా బృందంతో అక్కడికి చేరుకున్నాం. అప్పటికే అక్కడ దట్టమైన పొగ, మంటలు అలుముకున్నాయి. అరుపులు, అగ్నిమాపక సిబ్బంది సహయక చర్యలతో హడావుడిగా ఉంది. వెంటనే మేం రంగంలోకి దిగాం. లోపల చిక్కుకున్న బాధితులను సాధ్యమైనంత మేర బయటకు తీసుకొచ్చాం. ఒకే ఒక్క దారి ఉండటంతో చాలా మంది రెస్ట్ రూంలోకి వెళ్లి దాక్కున్నారు. దీంతో ఎక్కువ మందిని కాపాడలేకపోయాం. ఊపిరిరాడని స్థితిలో మిగతా వారంతా విగత జీవులుగా పడి ఉన్నారు. కానీ, ఆ 14 మందిని కూడా కాపాడాల్సి ఉంది’’ అని భావోద్వేగంతో శివాజీ ప్రసంగించాడు. ఇక శివాజీలానే పక్కనే ఉన్న టెలివిజన్ స్టేషన్లో పని చేస్తున్న మహేష్, సూరజ్ గిరిలు కూడా సుమారు 50 మంది ప్రాణాలు కాపాడారు కూడా. Constable Sudarshan Shinde - Saved 8 people. #KamlaMillsFire - Extremely proud of our @MumbaiPolice. सुदर्शन शिंदे तुमच्या शौर्याला माझा सलाम ... 🙏🏽🙏🏽 pic.twitter.com/tbH3vvWgDW — Riteish Deshmukh (@Riteishd) 2 January 2018 -
'క్షణాల్లో నిండు ప్రాణం కాపాడాడు'
ముంబయి: ఓ వ్యక్తి అప్రమత్తత మరో వ్యక్తిని ఎప్పుడూ కాపాడుతుందంటారు. మహారాష్ట్రలో సరిగ్గా అదే విషయం రుజువైంది. విధుల్లో ఉన్న ఓ రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తంగా ఉండటంతో ఓ ప్రయాణీకుడి ప్రాణాలుపోకుండా కాపాడాడు. ప్రమాదవశాత్తు రైలు కిందపడిపోతున్న అతడిని ఎంతో సాహసంతో రక్షించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చంద్రకాంత్ రప్దే అనే వ్యక్తి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా కజ్రాత్ రైల్వే స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సరిగ్గా 2గంటల ప్రాంతంలో రైలు నెంబర్ 16339 సీఎఎస్టీ-నాగర కోయిల్ ఎక్స్ ప్రెస్ రైలు ఫ్లాట్ ఫాం నెంబర్ 1 వద్దకు వచ్చి ఆగింది. అందులో ప్రయాణీస్తున్న పాండా అనే వ్యక్తి స్టేషన్లో పండ్లు కొనుగోలు చేసేందుకు దిగాడు. అనంతరం వాటిని తీసుకొని వస్తుండగా రైలు నెమ్మదిగా కదలడం ప్రారంభించింది. దీంతో అతడు కంగారులో రైలు ఎక్కే ప్రయత్నం చేసి అదుపుతప్పాడు. కాళ్లు జారి ప్లాట్‌పాంకు రైలుకు మధ్యలో ఇరుక్కుపోయాడు. అప్పుడు అక్కడే అప్రమత్తంగా ఉన్న ఆర్పీఎఫ్ అధికారి చంద్రకాంత్ శరవేగంగా స్పందించి అతడి చేతులను అందుకుని అమాంతం బయటకు లాగడంతో స్వల్పగాయాలతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో మొత్తం సీసీటీవీలో రికార్డయి ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. -
బుల్లెట్ నుంచి ప్రాణాలను కాపాడిన స్మార్ట్‌ఫోన్
బీజింగ్: స్మార్ట్‌ఫోన్ సాంకేతిక, సమాచారం కోసమే కాదు బుల్లెట్ల నుంచి కూడా ప్రాణాలను కాపాడుతుంది. చైనాలో ఓ వింత సంఘటన జరిగింది. ఓ వ్యక్తికి సరుకుల సంచి దొరికింది. అయితే ఆ సంచి యజమానితో అతను జోక్ చేయడం ప్రాణాల మీదకు తెచ్చిపెట్టింది. సరుకుల సంచి ఆమ్మేసి బీరు కొనుకుంటానని సరదాగా అన్నాడు. ఈ వ్యాఖ్యలను తేలికగా తీసుకోని యజమాని కోపంతో తుపాకీ తీసుకుని కాల్చాడు. ఈ దెబ్బకు జోక్ చేసిన వ్యక్తికి పిట్టలా రాలిపోయేవాడు. అయితే అతని చొక్కా జేబులో ఉన్న శామ్సంగ్ గెలాక్సీ మెగా 6.3 స్మార్ట్‌ఫోన్ కాపాడింది. ఫోన్ బుల్లెట్‌ను అడ్డుకుంది. దీంతో అతను సురక్షితంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాగా ఫోన్ మాత్రం పాడైంది. ఏమైతేనేం స్మార్ట్‌ఫోన్ నిండు ప్రాణాన్ని కాపాడింది.