RPF Constable Sonali Saves Woman's Life At Warangal Railway Station - Sakshi
Sakshi News home page

Warangal Railway Station: ప్రాణలకు తెగించి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ సోనాలి.. ప్రయాణీకుల ప్రశంసలు 

Published Sat, Jun 10 2023 7:58 PM | Last Updated on Sat, Jun 10 2023 8:08 PM

RPF Constable Sonali Saves Woman Life At Warangal Railway Station - Sakshi

సాక్షి, వరంగల్: ఓ మహిళ ప్రాణాలను ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సోనాలి మాల్కే కాపాడారు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో రైలు నుంచి దిగుతుండగా ఓ మహిళ ప్లాట్‌ప్లామ్‌, రైలు మధ్య పడిపోయింది. ఈ సమయంలో ప్లాట్‌పామ్‌పై విధుల్లో ఉన్న సోనాలి ఆమెను సమయ స్ఫూర్తితో కాపాడింది. దీంతో, ఆమెను ఉన్నాతాధికారులు ప్రశంసించారు. 

వివరాల ప్రకారం.. మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు మణుగూరు నుండి సికింద్రాబాద్‌కు వెళ్తుండగా ట్రైన్‌ వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఈ క్రమంలో రైలు ప్లాట్‌ఫామ్‌పై ఆగే సమయంలో ట్రైన్‌ స్లో కావడంతో ఓ మహిళ రైలు దిగే ప్రయత్నం చేసింది. దీంతో, ప్లాట్‌ఫామ్‌, రైలుకు కింద ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సోనాలి మాల్కే వెంటనే స్పందించింది. సదరు మహిళను రైలు నుంచి దూరంగా లాగడంతో ప్రమాదం తప్పింది. 

అయితే, దీనికి సంబంధించిన దృశ్యాలు స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాలు రి​కార్డు అయ్యాయి. ఇక, సదరు మహిళను ప్రాణాలకు తెగించి కాపాడాని కానిస్టేబుల్‌ సోనాలి మాల్కేను ఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు, ప్రయాణికులు అభినందించారు. 

ఇది కూడా చదవండి: రోడ్డుపై నిమ్మకాయలతో హిజ్రాతో పూజలు.. ఎస్‌ఐ చేసిన పనికి షాక్‌లో ప్రయాణీకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement