
సాక్షి, ములుగు: తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(Medaram Jathara) తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది మేడారంలో జరగబోయే సమ్మక్క, సారలమ్మ మహా జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం ప్రకటించింది. మేడారం పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు ఈ మేరకు తేదీలను వెల్లడించారు. 2026 జనవరి 28వ తేదీన జాతర ప్రారంభం కానుంది.
జాతర తేదీలు ఇవే..
- 2026 జనవరి 28వ తేదీన(బుధవారం) శ్రీ సారాలమ్మ దేవత..
- 29న సమ్మక్క దేవతలు (గురువారం) వారివారి గద్దెల మీదకు చేరుకుంటారు.
- 30వ తేదీన (శుక్రవారం) మొక్కులు చెల్లించుట.
31వ తేదీన (శనివారం) సమ్మక్క, సారలమ్మ వనదేవతలు, గోవింద రాజు, పగిడిద్దరాజు దేవుళ్లు వన ప్రవేశం.
చదవండి: బయ్యారం చెరువు.. చరిత్రకు సాక్ష్యం..