manuguru express
-
మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సోనాలి.. ప్రయాణీకుల ప్రశంస
సాక్షి, వరంగల్: ఓ మహిళ ప్రాణాలను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సోనాలి మాల్కే కాపాడారు. వరంగల్ రైల్వేస్టేషన్లో రైలు నుంచి దిగుతుండగా ఓ మహిళ ప్లాట్‌ప్లామ్, రైలు మధ్య పడిపోయింది. ఈ సమయంలో ప్లాట్‌పామ్‌పై విధుల్లో ఉన్న సోనాలి ఆమెను సమయ స్ఫూర్తితో కాపాడింది. దీంతో, ఆమెను ఉన్నాతాధికారులు ప్రశంసించారు. వివరాల ప్రకారం.. మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలు మణుగూరు నుండి సికింద్రాబాద్‌కు వెళ్తుండగా ట్రైన్ వరంగల్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఈ క్రమంలో రైలు ప్లాట్‌ఫామ్‌పై ఆగే సమయంలో ట్రైన్ స్లో కావడంతో ఓ మహిళ రైలు దిగే ప్రయత్నం చేసింది. దీంతో, ప్లాట్‌ఫామ్, రైలుకు కింద ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సోనాలి మాల్కే వెంటనే స్పందించింది. సదరు మహిళను రైలు నుంచి దూరంగా లాగడంతో ప్రమాదం తప్పింది. అయితే, దీనికి సంబంధించిన దృశ్యాలు స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ఇక, సదరు మహిళను ప్రాణాలకు తెగించి కాపాడాని కానిస్టేబుల్ సోనాలి మాల్కేను ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, ప్రయాణికులు అభినందించారు. ఇది కూడా చదవండి: రోడ్డుపై నిమ్మకాయలతో హిజ్రాతో పూజలు.. ఎస్ఐ చేసిన పనికి షాక్‌లో ప్రయాణీకులు -
మణుగూరు ఎక్స్‌ప్రెస్ బోగీల్లో మంటలు
కొత్తగూడెం : మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ బోగిల్లో సోమవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో ప్రయాణికులు బెంబేలెత్తి పోయారు. షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. మణుగూరు నుంచి సికింద్రాబాద్ వెళుతున్న మణుగూరు ఎక్స్‌ప్రెస్ భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్లో రాత్రి 10:40 సమయంలో ఆగింది. మరికొన్ని నిమిషాల్లో సికింద్రాబాద్ బయల్దేరే క్రమంలో షార్ట్ సర్క్యూట్ వల్ల రైలులోని ఏ1, బీ1 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో స్టేషన్ ప్లాట్ ఫాంపైకి ఉరుకులు పరుగులు తీశారు. మిగతా బోగీల్లోని వారు కూడా ఏం జరిగిందో అర్థంకాక స్టేషన్లోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో స్టేషన్ ప్రాంగణం పూర్తిగా దట్టమైన పొగ కమ్ముకోవడంతో అంతా భయాందోళన చెందారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు ఏసీ బోగీల అద్దాలను పగులగొట్టి మంటలను అదుపు చేశారు. రాత్రి 11:30 వరకు కూడా మరమ్మతులు కొనసాగుతున్నాయి. అంతా సవ్యంగానే ఉంటే.. రైలు బయల్దేరుతుందని, లేకుంటే.. ఆ రెండు బోగీలను తొలగించి పంపించనున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. -
మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
కేసముద్రం: సిగ్నల్ టాంపరింగ్‌తో రైలును నిలిపివేసిన దొంగలు ఇద్దరు ప్రయాణికుల మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కుని పరారయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రం రైల్వేస్టేషన్ సమీపంలోని ఐబీ సిగ్నల్ పాయింట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మణుగూరు నుంచి సికింద్రాబాద్ వైపు శనివారం రాత్రి మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. కేసముద్రం–తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం తెల్లవారుజామున 1.40 గంటలకు రైలు ఆగిపోయింది. అప్పటికే ఎస్–5 బోగీలో కాచుకుని ఉన్న దుండగులు, భాగ్యనగర్‌తండాకు చెందిన మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు పుస్తెలతాడు, అదే తండాకు చెందిన మరో వ్యక్తి మెడలో ఉన్న తులంనర బంగారు చైన్ లాక్కుపోయారు. బాధితులు కేకలు వేయడంతో దుండగులు ఎస్–6 బోగీలోకి పరుగుతీసి అక్కడా చోరీకి ప్రయ త్నించగా ప్రయాణికులు గట్టిగా కేకలు పెట్టడంతో కిందకు దూకి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను విచారించగా ముగ్గురు వ్యక్తులు బోగీలోకి వచ్చినట్లు తెలిపారు. దీంతో ఆర్పీఎఫ్, జీఆర్పీ బృందం చుట్టుపక్కల గాలింపు చేపట్టింది. బాధి తులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సిగ్నల్ టాంపరింగ్ చేయడం ద్వారా దుండగులు రైలును నిలిపివేసినట్లు అనుమానిస్తున్నామని జీఆర్పీ సీఐ వినయ్‌కుమార్ చెప్పారు. ఇదే ప్రాంతంలో ఈ ఘటనకు ముందూ దుండగులు బెంగళూరు నుంచి పట్నా వెళ్లే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను ఆపడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. -
మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ నెంబర్ మార్పు
హైదరాబాద్: సికింద్రాబాద్-మణుగూరు ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్ల నెంబర్లు మారనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్-మణుగూర్ ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న 12752/12751 నెంబర్ ఆగస్టు ఒకటవ తేదీ నుంచి 17026/17025 గా మారనుంది. అలాగే ప్రస్తుతం సికింద్రాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న 17050/17049 నెంబర్ ఆగస్టు ఒకటో తేదీ నుంచి 17250/17249 గా మారనుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.