warangal railway station
-
మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సోనాలి.. ప్రయాణీకుల ప్రశంస
సాక్షి, వరంగల్: ఓ మహిళ ప్రాణాలను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సోనాలి మాల్కే కాపాడారు. వరంగల్ రైల్వేస్టేషన్లో రైలు నుంచి దిగుతుండగా ఓ మహిళ ప్లాట్‌ప్లామ్, రైలు మధ్య పడిపోయింది. ఈ సమయంలో ప్లాట్‌పామ్‌పై విధుల్లో ఉన్న సోనాలి ఆమెను సమయ స్ఫూర్తితో కాపాడింది. దీంతో, ఆమెను ఉన్నాతాధికారులు ప్రశంసించారు. వివరాల ప్రకారం.. మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలు మణుగూరు నుండి సికింద్రాబాద్‌కు వెళ్తుండగా ట్రైన్ వరంగల్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఈ క్రమంలో రైలు ప్లాట్‌ఫామ్‌పై ఆగే సమయంలో ట్రైన్ స్లో కావడంతో ఓ మహిళ రైలు దిగే ప్రయత్నం చేసింది. దీంతో, ప్లాట్‌ఫామ్, రైలుకు కింద ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సోనాలి మాల్కే వెంటనే స్పందించింది. సదరు మహిళను రైలు నుంచి దూరంగా లాగడంతో ప్రమాదం తప్పింది. అయితే, దీనికి సంబంధించిన దృశ్యాలు స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ఇక, సదరు మహిళను ప్రాణాలకు తెగించి కాపాడాని కానిస్టేబుల్ సోనాలి మాల్కేను ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, ప్రయాణికులు అభినందించారు. ఇది కూడా చదవండి: రోడ్డుపై నిమ్మకాయలతో హిజ్రాతో పూజలు.. ఎస్ఐ చేసిన పనికి షాక్‌లో ప్రయాణీకులు -
'స్వచ్ఛ’ ర్యాంకులు: వరంగల్ 51, కాజీపేట స్టేషన్ 67
సాక్షి, కాజీపేట: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని స్టేషన్ల కు అధికారులు బుధవారం ‘స్వచ్ఛ రైల్ – స్వచ్ఛ భారత్’ ర్యాంకులను ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, తరలింపు, ప్రయాణికులకు అవగాహన కల్పించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయించారు. ఈ మేరకు వరంగల్ రైల్వే స్టేషన్‌కు 51వ ర్యాంక్, కాజీపేట జంక్షన్‌కు 67వ ర్యాంక్ లభించింది. అయితే, గత ఏడాది వరంగల్ రైల్వే స్టేషన్‌కు 3వ ర్యాంక్ రాగా ఈ ఏడాది 51వ స్థానానికి పడిపోవడంతో గమనార్హం. రూ.కోట్ల నిధులు వెచ్చించి అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో అత్యాధునీకరించిన వరంగల్ రైల్వే స్టేషన్‌కు ర్యాంకు తగ్గడాన్ని రైల్వే అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
వరంగల్ స్టేషన్: గాంధీజీ నడియాడిన నేల
సాక్షి, వరంగల్: అది మోహన్ దాస్ కరంచంద్ గాంధీ నడియాడిన నేల. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేసిన జాతిపిత గాంధీ వచ్చిన ఆ స్థలంలో స్వాతంత్య్రం వచ్చాక స్థానికులు బాపూజీ యూత్ అసోసియేషన్ పేరిట భవనాన్ని నిర్మించారు. వ్యాయమశాలగా అప్పట్లో యువకులు ఉపయోగించుకోగా.. ఇప్పుడు యూత్ భవనంగా పలు కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది. స్వాతంత్య్ర ఉద్యమం సాగుతున్న సమయంలో గాంధీజీ మద్రాస్ నుంచి రైలులో వార్థాకు వెళ్తున్నారు. ఎలాగైనా గాంధీజీని వరంగల్ రైల్వేస్టేషన్లో ఆపి.. బహిరంగ సభలో మాట్లాడించాలని స్థానికులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సమరయోధుడు భండారు చంద్రమౌళీశ్వర్ రావు అభ్యర్థన మేరకు గాంధీజీ 1946 ఫిబ్రవరి 5న వరంగల్ రైల్వే స్టేషన్లో ఆగారు. ప్రస్తుతం బాపూజీ యూత్ భవనం నిర్మించిన స్థలానికి వచ్చి మాట్లాడాక ఆజంజాహి మిల్లు గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత స్వాతంత్య్రం రావడంతో స్టేషన్ రోడ్డులోని స్థలంలో గూడూరు చెన్న స్వామి, తాళ్ల గురుపాదం, నర్సింగరావు, ముత్యాలు తదితరులు బాపూజీ యూత్ పేరిట భవనాన్ని నిర్మించి బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాలక్రమేణా భవనం శిథిలావస్థకు చేరడంతో పదిహేనేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య, కార్పొరేటర్ జారతి రమేష్ నిధులు కేటాయించగా రెండంతస్తుల భవనం నిర్మాణమైంది. ఈ మేరకు యూత్‌లో సుమారు 20 మంది వరకు సభ్యులు ఉండగా ఏటా గాంధీ జయంతి, వర్ధంతి స్వాతంత్య్ర దినోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గాంధీ జయంతి వేడుకలు నిర్వహిస్తాం మా కాలనీ పెద్దలు బాపూజీ పేరిట భవనాన్ని నిర్మించారు. బాల్యదశలో ఇక్కడ వ్యాయామం చేసేవాళ్లం. కొన్ని దశాబ్దాలుగా గాంధీ జయంతి వేడుకులను ఘనంగా నిర్వహిస్తున్నాం. వినాయక ప్రతిమను ప్రతిష్ఠిస్తున్నాం. వివిధ కార్యక్రమాలకు భవనం ఎంతగానో ఉపయోగపడుతోంది. – గూడూరు సత్యానంద్, బాపూజీ యూత్ సభ్యుడు -
117 కిలోల గంజాయి పట్టివేత
రైల్వేగేట్: వరంగల్ రైల్వేస్టేషన్లో శుక్రవారం వేర్వే రుగా రైళ్లలో తరలిస్తున్న గంజాయి అక్రమ రవాణా ముఠాలను జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే ఎస్పీ జి.అశోక్‌కుమార్ కథనం ప్రకారం.. హర్యానాలోని ప్రీతినగర్ పంచ్కులవాసులు గీతా బౌరి, పూజ బౌరీ, కమలా బగిడి, గంగా బౌరీలు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో హ్యాండ్ బ్యాగుల్లో 75 కిలోల ఎండు గం జాయి ప్యాకెట్లు తరలిస్తుండగా వరంగల్ స్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. మరో ఘటనలో ఒడిశా లోని కోరాపుట్ జిల్లా కులార్సింగ్ ప్రాంతానికి చెం దిన బిస్వంత్ సేతీ, మిరా సేతీ, రాజు సేతీ, పునమా ముత్యం ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ 42 కిలోల ఎండు గం జాయిని తరలిస్తూ వరంగల్ స్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. వీరందరూ కూలీలని, ఈ రెండు కేసుల్లో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామని, ఇందులో ఆరుగురు మహిళలున్నట్లు పేర్కొన్నారు. వీరి వద్ద 117 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
30న ‘భారత్ దర్శన్’ రైలు వరంగల్ రాక
రైల్వే గేట్(వరంగల్): భారత్ దర్శన్‌లో భాగంగా పుణ్యక్షేత్రాల సందర్శనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు వరంగల్ రైల్వే స్టేషన్‌కు ఈనెల 30న అర్ధరాత్రి 2 గంటలకు(31 తెల్లవారు జామున) రానున్నట్లు ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ సంజీవయ్య మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. 12 కోచ్‌లు, ఏసీ 3 టైర్ బోగీలతో 2,440 బెర్త్‌లతో కూడిన రైలు వరంగల్ వస్తున్నట్లు చెప్పారు. ఎనిమిది రోజులు, ఏడు రాత్రులతో కూడిన ఈ ప్రయాణంలో ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ గుడి, భువనేశ్వర్ లింగరాజ్ టెంపుల్, ఆంధ్రలో విశాఖపట్నం బుర్రా కేవ్స్, అరకు వ్యాలీ, సింహాచలం, అన్నవరం, రాజమండ్రి, విజయవాడ కనకదుర్గ, మంగళగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చని వివరించారు. ఒకరికి రూ.7895(స్టాండర్డ్ స్లీపర్), రూ.9575(కంఫర్ట్ ఏసీ 3 టైర్) కింద చెల్లించాల్సి ఉంటుందని, ఆన్లైన్, రైల్వే బుకింగ్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు ఐఆర్సీటీసీ జోనల్ ఆఫీస్ 040–27702407, 9701360701, 9701360690లలో సంప్రదించాలని సంజీవయ్య కోరారు. ఈ ప్రయాణికులకు అల్పాహారం, భోజనం, వసతి, ఉచితంగా ఆలయ దర్శనాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
రైల్వే స్టేషన్లో భారీగా బంగారం
వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్లో భారీగా బంగారం పట్టుబడింది. గురువారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఓ వ్యక్తి వద్ద నుంచి 60 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాల విలువ సుమారు రూ. 18 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తుండటంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
వరంగల్‌లో భారీగా నగదు స్వాధీనం
మట్టెవాడ : వరంగల్ రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి నుంచి బుధవారం రూ.3.5 లక్షల విలువైన పాత నోట్లను జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి వరంగల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నగదు తీసుకొచ్చిన వ్యక్తి వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన సంగా రవి(44)గా గుర్తించారు. -
వరంగల్‌లో రూ.2.65 లక్షలు స్వాధీనం
వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై శనివారం ఉదయం జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బంది అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతన్ని వరంగల్ జిల్లా ములుకలగూడెంకు చెందిన బ్రహ్మదేవ రాజుగా గుర్తించారు. స్థానికంగా కిరాణా షాపు నడుపుతున్న అతని వద్ద రూ.2,65,000లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్తున్నాడని, దీనిపై ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించామని వరంగల్ రైల్వే సీఐ స్వామి తెలిపారు. -
ఐసీడీఎస్‌కు యువతి అప్పగింత
రైల్వేగేట్ : నగరంలోని వరంగల్ రైల్వేస్టేషన్ జీఆర్పీ పోలీసులు ముస్లిం యువతిని ఐసీడీఎస్‌కు అప్పగించారు. సీఐ స్వామి కథనం ప్రకారం.. వరంగల్ జీఆర్పీ సీఐ స్వామి కథనం ప్రకారం.. వరంగల్ రైల్వేస్టేషన్లో సల్మాబేగం(25) అనే యువతి మంగళవారం ఏడుస్తుండగా ప్రయివేటు సానిటేషన్ వర్కర్ మహాలక్ష్మి జీఆర్పీ పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో పోలీసులు సల్మాబేగంను స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ ఆమె వివరాలు అడగగా తమది వరంగల్ అని, తన తల్లిదండ్రులు తనను చిన్నప్పుడే జైపూర్‌కు తీసుకెళ్లారని తాను రైలులో ఇక్కడికి వచ్చినట్లు చెప్పింది. అలాగే కొన్ని విషయాల్లో పొంతనలేని సమాధానాలు చెప్పడంతోపాటు తనకు ఈ పోలీస్టేషన్లో ఉద్యోగం ఇప్పించాలని, ఉపాధి కావాలని అన్నట్లు పోలీసులు తెలిపారు. సల్మాబేగం మానసిక స్థితి బాగాలేకనే ఇలా మాట్లాడుతున్నట్లు గమనించి ఐసీడీఎస్ అర్బన్-2 సీడీపీఓ మధురిమకు యువతిని అప్పగించినట్లు సీఐ పేర్కొన్నారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ మురళి తదితరులున్నారు. -
రైల్వేస్టేన్లో సీఏఓ తనిఖీలు
రైల్వేగేట్ : అలాగే ఆర్‌పీఎఫ్‌లోని సీసీ కెమెరాల పనితీరుతోపాటు భవనం నుంచి వర్షానికి కారుతున్న నీళ్లను పరిశీలించారు. ప్రయాణికులతో క్లీన్ రైల్వే స్టేషన్‌పై మాట్లాడారు. వారి నుంచి అభిప్రాయాలను తెలసుకున్నారు. అనంతరం సికింద్రాబాద్ నుంచి వచ్చిన రైల్వే కళాకారులు స్వచ్ఛ రేల్..స్వచ్ఛ భారత్‌పై నృత్య ప్రదర్శన నిర్వహించి చైతన్య పరిచారు. క్లీన్ రైల్వే స్టేషన్‌కు సహకరించాలని ప్రయాణికులు, రైల్వే స్టేషన్ సిబ్బందిని పూర్ణ కోరారు. ఈ సందర్భగా ఆర్పీఎఫ్ వారు లిట్టరింగ్ కింద 10 కేసులను నమోదు చేసి ఒక్కొక్కరికి రూ.200 జరిమానా విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ శ్రీనివాస్‌రావు, హరిప్రసాద్, సాగర్, సతీష్‌కుమార్, శ్రీనివాస్‌రావు, ఆర్పీఎఫ్ సీఐ నర్సింహ, ఏఎస్సై జనార్దన్, ధారాసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
తాను చనిపోతూ.. బిడ్డను బతికించిన తల్లి
వరంగల్ రైల్వే స్టేషన్లో ఘటన రైల్వేగేట్ (వరంగల్): ప్రమాదంలో తాను చనిపోతానన్న విషయూన్ని గమనించిన ఓ మహిళ తన చేతిలో ఉన్న ఏడాదిన్నర వయసున్న బిడ్డను ప్లాట్‌ఫామ్‌పై విసిరేసి తాను రైలు పట్టాల మధ్య పడి చనిపోయింది. ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్లో గురువారం జరిగింది. వరంగల్ జీఆర్పీ ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన చిర్ర రజని (25) హైదరాబాద్ వెళ్లేందుకు వరంగల్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. అప్పటికే ఆమె కుటుంబ సభ్యులు రెలైక్కగా, రజని కదులుతున్న పుష్పుల్ రైలు ఎక్కబోయి ప్లాట్‌ఫామ్-రైలు మధ్య పడిపోయింది. ఇక తన మరణం తప్పదనుకున్న ఆ మాతృమూర్తి ఏడాదిన్నర కూతురు సాత్వికను మాత్రం ప్లాట్‌ఫామ్‌పైకి విసిరేసింది. రజని రైలుకింద పడి మృతిచెందగా, ఆ పసిపాప స్వల్ప గాయూలతో బయటపడింది. -
68 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం
వరంగల్ రైల్వేగేట్: వరంగల్ రైల్వేస్టేషన్లో శనివారం 68 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. త్రివేండ్రం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న కేరళా ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా వెండి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశగా తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని సేలంకు చెందిన నటరాజన్ కేరళా నుంచి వరంగల్‌కు వెండి వస్తువులు తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని 68 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం విచారణ చేపడుతున్నారు. -
మరో బాలిక క్షేమం
వరంగల్ క్రైం : వరంగల్ రైల్వేస్టేషన్లో కామాంధుల బారినపడిన ఇద్దరు బాలికల్లో రెండో బాలిక సోమవారం ఉదయం తిరుపతిలోని ఆమె ఇంటికి చేరుకున్నట్లు వరంగల్ పోలీసుల కు సమాచారం అందింది. ఈ నెల 24వ తేదీ రాత్రి వరంగల్ రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకోగా 26వ తేదీన విజయవాడలో చైల్డ్‌లైన్ సంస్థ ప్రతినిధులు బాలికను చేరదీసి వివరాలు సేకరించారు. ఆ వివరాల ఆధారంగా బాలికల తల్లిదండ్రులకు సమాచారం అందించి వారిని వరంగల్‌కు రప్పించా రు. పోలీసుల కథనం ప్రకారం... వరంగల్‌లో కీచకుల బారి నుంచి తప్పించుకున్న బాలి కలు ఇద్దరు ఒకే రైలు ఎక్కారు. ఇద్దరు బాలికలు విజయవాడలో దిగారు. ఒక బాలిక మాత్ర మే చైల్డ్‌లైన్ ప్రతినిధులకు దొరకగా మరో బాలిక విజయవాడలోనే ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి తిరుపతికి చేరుకుని తిరుపతిలోనే ఒక రోజు ఉండి మరుసటి రోజు సోమవారం ఉదయం వారి ఇంటికి చేరుకుందని తెలిపారు. బాలిక క్షేమంగా ఉందని తిరుపతి పోలీసులు వరంగల్ పోలీసులకు సమాచారమిచ్చారు. అయి తే ఇద్దరు కలిసి ఒక రైలులోనే ప్రయాణించి విజయవాడలో దిగినప్పటికీ ఒక బాలిక మాత్రమే చైల్డ్‌లైన్‌కు దొరకడం, మరో బాలిక మాత్రం విజయవాడలోనే మరోచోట ఉండిపోవడం అనుమానాలకు తావిస్తోంది. అంతేగాక 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బాలిక ఎక్కడ ఉంది ? ఆమె ఒక్కతే ఉందా? వరంగల్‌కు చెందిన మరో కీచకుడు ఆమెను తన వెంట తీసుకెళ్లాడా ఇవన్ని ప్రశ్నలకు జవాబు దొరకాల్సి ఉంది. క్షేమంగా ఇంటికి చేరుకున్న బాలికను పోలీసులు విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు బాలికల గృహ నిర్బంధం కేసులో మిల్స్‌కాలనీ పోలీసులు ముగ్గురు నిందితులను సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విశ్వనాథ్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. అతడి ఆచూకీ కోసం పోలీసుల కూపీ లాగుతున్నారు. వరంగల్ రైల్వే ప్లాట్‌ఫాంపై ఉన్న చిరు వ్యాపారులను పోలీసులు విచారించినట్లు సమాచారం. -
నిలిచిన కృష్ణా ఎక్స్‌ప్రెస్
మట్టెవాడ: అదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ సాంకేతిక లోపంతో వరంగల్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. స్టేషన్‌కు సమీపంలోకి రాగానే ఇంజన్ ఫెయిల్ కావడంతో.. డ్రైవర్ స్టేషన్లో ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ప్రస్తుతం కాజిపేట నుంచి ప్రత్యేక ఇంజన్ తెప్పించి ఎక్స్‌ప్రెస్‌కు జతచేసే ప్రయత్నంలో రైల్వే అధికారులు ఉన్నారు. -
రైలు ఎక్కుతుంటే హ్యాండ్ బ్యాగులు చోరీ
వరంగల్: గోల్కండ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న మహిళల చేతిలోని హ్యాండ్ బ్యాగులను వరంగల్ రైల్వే స్టేషన్లో శుక్రవారం దుండగులు అపహరించి పరారైయ్యారు. దాంతో బాధిత మహిళలు రైల్వే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హ్యాండ్ బ్యాగుల్లో రూ. 4 వేల నగదుతో పాటు రెండు బ్యాంకు ఏటీఎమ్ కార్డులు ఉన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వరంగల్ రైల్వే స్టేషన్లో బాంబు కలకలం
వరంగల్ (కరీమాబాద్) : వరంగల్ రైల్వేస్టేషన్లో శుక్రవారం సాయంత్రం బాంబు కలకలం రేగింది. ఓ ఆగంతకుడు రైల్వే ఎస్పీకి ఫోన్ చేసి స్టేషన్ ఆవరణలో బాంబు పెట్టినట్లు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే, జిల్లా పోలీసులు డీఎస్పీ సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. బాంబ్, డాగ్ స్కాడ్లు స్టేషన్లో అణువణువూ గాలించారు. కాగా ఇప్పటి వరకు ఎలాంటి బాంబు లభ్యం కాలేదు. -
వరంగల్ రైల్వే స్టేషన్ ఎదుట బాంబు కలకలం
వరంగల్ :వరంగల్ రైల్వేస్టేషన్ లో సోమవారం బాంబు కలకలం రేగింది. వివరాల ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 12గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రైల్వే స్టేషన్ సమీపంలోని కాకతీయ శిలాతోరణం దగ్గర ఓ బ్యాగును వదిలి వెళ్లాడు. ఈ విషయమై సమాచారమందుకున్న రైల్వే, సివిల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం బాంబు స్క్వాడ్ కోసంపోలీసులు ఎదురు చూస్తున్నారు. -
పోలీసు అమరవీరులకు నివాళి
వరంగల్ : నల్గొండ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఎస్సై సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజు, లింగయ్యతో పాటు హోంగార్డు మహేష్‌ల ఆత్మశాంతి కోసం జీఆర్పీ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వేస్టేషన్లో శుక్రవారం రాత్రి నివాళులర్పించారు. స్టేషన్ ప్లాట్ ఫాంలలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. 'జోహార్ పోలీస్ అమరవీరులకు.. మీ త్యాగం మరువలేనిది..'అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్ ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి అమరులైన పోలీసులకు ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాజీపేట రైల్వే డీఎస్పీ శ్రీనివాస్‌రావు, జీఆర్పీ ఎస్సైలు శ్రీనివాస్, శ్రీనివాస్‌లతో పాటు ఆర్పీఎఫ్ ఎస్సై అనామికా మిశ్రా, జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. -
నీకో ముద్ద..నాకో ముద్ద..
వరంగల్(మట్టెవాడ): మనుషులైనా..జంతువులైనా..సృష్టిలోని ఏ ప్రాణికైనా బతకడానికి ఆహారం కావాలి.. మనలోని కొంతమంది ఔత్సాహిక జంతుప్రియులు వాటిని పెంచుకుంటూ ఉంటాం.. వాటి ఆలనా పాలనా చూస్తాం.... వాటికి ఏది కావాలో అదే పెడతాం..లేదంటే మనం ఏది తింటామో అదే వాటికి పెడతాం..అవి తినటానికి చిన్నపిల్లవాడిలా మారాం చేసినా..దగ్గరకు తీసుకుని బుజ్జగించి పెడతాం..అలాంటి సంఘటనే నగరంలోని వరంగల్ రైల్వేస్టేషన్లో మంగళవారం చోటు చేసుకుంది. రైలు బోగీలో చెత్త ఊడ్చి పదో పరకో అడుక్కునే ఓ అమ్మాయి.. తను పెంచుకుంటున్న ఓ చిన్న వానరం అన్నతినకుండా మారాం చేస్తే తను తింటూ వానరానికి తినిపించింది.. -
మహిళా డెంటిస్ట్‌ను వేధించిన ఆకతాయి
మహబూబాబాద్‌లో రైల్వే పోలీసుల తనిఖీ మట్టెవాడ : రైలులో ప్రయాణిస్తున్న మహళా డెంటిస్ట్‌ను ఓ ఆకతారుు ప్రయాణికుడు వేధించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వరంగల్ జీఆర్పీ ఎస్సై గోవర్దన్, డోర్నకల్ ఎస్సై దేవేందర్, ఆర్పీఎఫ్ సీఐ హరిబాబు కథనం ప్రకారం కేరళ నుంచి న్యూఢిల్లీ వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్ రైలులో బీ-3 కోచ్‌లోని 46వ సీటులో కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన ఎంజీఆర్ హాస్పిటల్ డెంటిస్ట్ టిన్సీ మీనన్ ప్రయాణిస్తోంది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తమిళనాడులోని సేలం వద్దకు రాగానే ఓ ప్రయాణికుడు టిన్సీ దగ్గర కూర్చోవడం, అసభ్యంగా ప్రవర్తించడం, వెకిలి చేష్టలతో ఇబ్బందికరంగా ప్రవర్తించడంతో టిన్సీ ఎంచేయాలో తోచలేదు..వ ెంటనే దుబాయిలో ఉన్న తన తండ్రికి ఫోన్ చేసింది. అతను సంబంధిత రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. మహబూబాబాద్‌లో రైలు ఆపి ఆకతారుు కోసం తనిఖీ చేశారు. దీంతో మహబూబాబాద్ స్టేషనలో రైలు రెండు నిమిషాలు ఆగింది. కానీ, సదరు ఆకతారుు విజయవాడలోనే దూకి పారిపోరుునట్లు రైల్వే గార్డు పోలీసులకు తెలపగా రైలును పునరుద్ధరించారు. ఆ తర్వాత ఘటనకు సంబంధించి వరంగల్ రైల్వే స్టేషన్లో టిన్సీని పోలీసులు విచారించారు.ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. టిన్సీని వేధించిన ప్రయాణికుడు కేరళలోని అలువా ప్రాంతానికి చెందిన ఎల్. రాజు అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. -
రైల్వేస్టేషన్లో పేలుడు పదార్థాలు లభ్యం
మట్టెవాడ(వరంగల్): వరంగల్ రైల్వే స్టేషన్లో బుధవారం సాయంత్రం పేలుడు పదార్థాలు ఉన్న బ్యాగ్‌ను పోలీసులు కనుగొన్నారు. నిన్న సాయంత్ర ఆరు గంటల సమయంలో రైల్వే స్టేషన్‌లోని బుకింగ్ కౌంటర్ సమీపంలో వదిలివేసిన బ్యాగ్‌లో 6 జిలెటిన్ స్టిక్స్, 25 డిటొనేటర్స్, రెండు ఎలక్ట్రికల్ వైర్లను గుర్తించారు. ఈ బ్యాగ్‌ను గుర్తుతెలియని వ్యక్తి వదిలి వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. -
రైల్వేస్టేషన్లో 13 కిలోల వెండి స్వాధీనం
పోలీసుల అదుపులో ఇద్దరు వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్లో బిల్లులు లేకుండా తరలిస్తున్న 13 కిలోల వెండిని జీఆర్పీ సిబ్బంది పట్టుకున్నారు. జీఆర్పీ సీఐ రవికుమార్ కథనం ప్రకారం... తమిళనాడు సేలం జిల్లా సేలమంచి ప్రాంతానికి చెందిన అర్జునన్, మారెప్పన్ కరీంనగర్ జిల్లా మెట్పల్లి చక్ర గోల్డ్‌షాపు నుంచి రూ. ఐదు లక్షల విలువైన 13 కిలోల వెండిని తరలించేందుకు వరంగల్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్ ఫాం-1కు చేరుకున్నారు. రబ్దిసాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారి బ్యాగు తనిఖీ చేశారు. అందులో 13 కిలోల ముడి వెండి ఉంది. బిల్లులు లేకుండా వెండిని తరలిస్తున్న వారిద్దరినీ అదుపులోకి తీసుకుని, వెండిని స్వాధీనం చేసుకున్నారు. వెండిని కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లు జీఆర్పీ సీఐ తెలిపారు. -
యువతిని మోసగించిన మరో యువతి
వరంగల్ రైల్వేస్టేషన్ లాకర్లోని బ్యాగుతో అపహరణ బ్యాగులో 10 తులాల బంగారు ఆభరణాలు, దుస్తులు ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన జీఆర్పీ పోలీసులు ఎదుట బాధితురాలి ఆవేదన మట్టెవాడ, న్యూస్‌లైన్ : ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చిన ఓ యువతికి మాయ మాటలు చెప్పి, ఆమెకు సంబంధించిన బ్యాగ్‌ను మరో యువతి ఎత్తుకెళ్లిన సంఘటన వరంగ ల్ రైల్వేస్టేషన్లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి తండ్రి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన బెరైడ్డి నర్సింహారెడ్డికి కూతురు సోనీ(18) ఉంది. ఆమె తన అత్తగారి ఊరైన అదే జిల్లా వల్లభాపూర్ నుంచి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హుజురాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి బస్సులో ఫిబ్రవరి 16న వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. రెండురోజులపాటు ప్లాట్ ఫాంపైనే గడిపింది. 18న సుధ అనే యువతి కలిసి సోనీకి మాయమాటలు చెప్పి ఆమె వద్ద ఉన్న బ్యాగును రైల్వేస్టేషన్‌లోని లాకర్లో పెట్టింది. సుధా తన పేరుతోనే అడ్రస్ రాయించి, రశీదు కూడా తీసుకుంది. అనంతరం సోనీని కరీమాబాద్‌లోని ఎరుకల సాయమ్మ ఇంట్లో వదిలేసి వెళ్లిపోయింది. తిరిగి రైల్వేస్టేషన్‌కు వచ్చిన సుధ లాకర్లోని బ్యాగు తీసుకుని ఉడాయించింది. సాయమ్మ ఇంట్లో ఉన్న ఆమె సుధ కోసం ఎన్నిరోజులు ఎదురు చూసినా ఆమె రాకపోవడంతో అనుమానం కలిగింది. 24వ తేదీన సోనీ తన పుట్టింటికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె తండ్రి నర్సింహారెడ్డితోపాటు బంధువులు వచ్చి సోనీని తీసుకెళ్లారు. అయితే బ్యాగు కోసం వరంగల్ స్టేషన్ లాకర్ వద్దకు వెళ్లగా సుధ అనే యువతి తీసుకెళ్లినట్లు లాకర్ నిర్వాహకుడు చెప్పాడు. అందులో 10 తులాల బంగారం, బట్టలున్నాయని సోనీ బోరున విలపించింది. సుధను పట్టుకుని తమకు న్యాయం చేయాలని వారు రైల్వే పోలీసులను కోరారు. ఈ విషయమై జీఆర్పీ ఎస్సై మునీరుల్లా మాట్లాడుతూ వీణవంక పోలీస్‌స్టేషన్‌లో సోనీ మిస్సింగ్ కేసు నమోదై ఉందని, అక్కడివారే కేసు విచారణ చేస్తారని తెలిపారు. కేసును జీఆర్పీకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు తాము స్పందించనున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా సాయమ్మను వీణవంక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి, సుధను రెండు రోజుల్లో తమ వద్దకు తీసుకురావాలని హెచ్చరించినట్లు తెలిసింది. -
కొడుకును కాపాడి.. కాళ్లు కోల్పోయిన తల్లి
వరంగల్, న్యూస్‌లైన్: తాను రైలు కింద పడిపోతున్న విషయం తెలిసీ.. ఆ తల్లి కన్న బిడ్డ క్షేమాన్ని కోరుకుంది. చివరి నిమిషంలో కొడుకును ప్లాట్‌ఫాంపైకి విసిరి.. తాను మాత్రం రైలుకింద పడి రెండు కాళ్లు కోల్పోయింది. వరంగల్ రైల్వేస్టేషన్లో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని నెల్లికుదురు మండలం ఆలేరు సమీపంలోని ఇస్రాతండాకు చెందిన బానోతు చిట్టి తన మూడు నెలల బాబుకు వైద్యం చేయించేందుకు బుధవారం వరంగల్‌కు వచ్చింది. మహబూబాబాద్ వెళ్లేందుకు టికెట్ తీసుకొని మూడో నెంబర్ ప్లాట్‌ఫాంపై కూర్చుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పుష్పుల్ రైలు రాగా, అందులో ఎక్కింది. అయితే ఆ రైలు మహబూబాబాద్ వెళ్లదని, హైదరాబాద్‌కు వెళ్తుందని ప్రయాణికులు చెప్పారు. దీంతో చిట్టి ఒక్కసారిగా ఆయోమయానికి గురైంది. అదే సమయంలో రైలు కదులుతుండగా.. దిగాలనే ఆత్రుతతో చంకలోని బాబుతో సహా ప్రయత్నించింది. అయితే ప్రమాదవశాత్తు ఆమె రైలు కింద పడిపోతున్న క్రమంలో ఒక్కసారిగా బిడ్డ గురించి ఆలోచించింది. తాను ఏమైపోయినా పర్వాలేదు.. బిడ్డ మాత్రం బతకాలనుకుని ప్లాట్‌ఫాంపైకి విసిరేసి.. తాను మాత్రం రైలుకింద చిక్కుకుపోయింది. ఈ సంఘటనలో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన జీఆర్పీ పోలీసులు 108లో ఆమెను ఎంజీఎంకు తరలించారు. ఆస్పత్రిలో చిట్టి రెండు కాళ్లు తీసివేయగా, బాబుకు స్వల్పగాయాలయ్యాయి.