వరంగల్ క్రైం : వరంగల్ రైల్వేస్టేషన్‌లో కామాంధుల బారినపడిన ఇద్దరు బాలికల్లో రెండో బాలిక సోమవారం ఉదయం తిరుపతిలోని ఆమె ఇంటికి చేరుకున్నట్లు వరంగల్ పోలీసుల కు సమాచారం అందింది. ఈ నెల 24వ తేదీ రాత్రి వరంగల్ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా 26వ తేదీన విజయవాడలో చైల్డ్‌లైన్ సంస్థ ప్రతినిధులు బాలికను చేరదీసి వివరాలు సేకరించారు. ఆ వివరాల ఆధారంగా బాలికల తల్లిదండ్రులకు సమాచారం అందించి వారిని వరంగల్‌కు రప్పించా రు. పోలీసుల కథనం ప్రకారం... వరంగల్‌లో కీచకుల బారి నుంచి తప్పించుకున్న బాలి కలు ఇద్దరు ఒకే రైలు ఎక్కారు. ఇద్దరు బాలికలు విజయవాడలో దిగారు. ఒక బాలిక మాత్ర మే చైల్డ్‌లైన్ ప్రతినిధులకు దొరకగా మరో బాలిక విజయవాడలోనే ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి తిరుపతికి చేరుకుని తిరుపతిలోనే ఒక రోజు ఉండి మరుసటి రోజు సోమవారం ఉదయం వారి ఇంటికి చేరుకుందని తెలిపారు. బాలిక క్షేమంగా ఉందని తిరుపతి పోలీసులు వరంగల్ పోలీసులకు సమాచారమిచ్చారు. అయి తే ఇద్దరు కలిసి ఒక రైలులోనే ప్రయాణించి విజయవాడలో దిగినప్పటికీ ఒక బాలిక మాత్రమే చైల్డ్‌లైన్‌కు దొరకడం, మరో బాలిక మాత్రం విజయవాడలోనే మరోచోట ఉండిపోవడం అనుమానాలకు తావిస్తోంది. అంతేగాక 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బాలిక ఎక్కడ ఉంది ? ఆమె ఒక్కతే ఉందా? వరంగల్‌కు చెందిన మరో కీచకుడు ఆమెను తన వెంట తీసుకెళ్లాడా ఇవన్ని ప్రశ్నలకు జవాబు దొరకాల్సి ఉంది. క్షేమంగా ఇంటికి చేరుకున్న బాలికను పోలీసులు విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
బాలికల గృహ నిర్బంధం కేసులో మిల్స్‌కాలనీ పోలీసులు ముగ్గురు నిందితులను సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విశ్వనాథ్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. అతడి ఆచూకీ కోసం పోలీసుల కూపీ లాగుతున్నారు. వరంగల్ రైల్వే ప్లాట్‌ఫాంపై ఉన్న చిరు వ్యాపారులను పోలీసులు విచారించినట్లు సమాచారం.
మరో బాలిక క్షేమం
Published Tue, Dec 1 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM
Advertisement
Advertisement