
సాక్షి, కాజీపేట: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని స్టేషన్ల కు అధికారులు బుధవారం ‘స్వచ్ఛ రైల్ – స్వచ్ఛ భారత్’ ర్యాంకులను ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, తరలింపు, ప్రయాణికులకు అవగాహన కల్పించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయించారు. ఈ మేరకు వరంగల్ రైల్వే స్టేషన్‌కు 51వ ర్యాంక్, కాజీపేట జంక్షన్‌కు 67వ ర్యాంక్ లభించింది. అయితే, గత ఏడాది వరంగల్ రైల్వే స్టేషన్‌కు 3వ ర్యాంక్ రాగా ఈ ఏడాది 51వ స్థానానికి పడిపోవడంతో గమనార్హం. రూ.కోట్ల నిధులు వెచ్చించి అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో అత్యాధునీకరించిన వరంగల్ రైల్వే స్టేషన్‌కు ర్యాంకు తగ్గడాన్ని రైల్వే అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment