Swacch Bharath
-
పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ కింద వివిధ విభాగాల్లో రాష్ట్రం 13 అవార్డులతో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సుస్థిరాభివృద్ధితో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, స్వచ్ఛభారత్ సర్వేక్షణ్ లోనూ మరోసారి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శవంతమైన, పారదర్శక పాలనకు ఇది అద్దం పడుతోందన్నారు. పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పునరుద్ఘాటించారు. ’పల్లె ప్రగతి’ని సమర్థవంతంగా అమలు చేస్తున్న పంచాయతీరాజ్‌శాఖ మంత్రిని, శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులను సీఎం అభినందించారు. ‘రాష్ట్రం, దేశ ప్రగతిలో తన వంతుగా గుణాత్మక భాగస్వామ్యం పంచుకోవడం ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం. ఇదే పరంపరను కొనసాగిస్తాం’అని కేసీఆర్ పేర్కొన్నారు. -
చెత్తను ఏరిన ప్రధాని మోదీ.. నెటిజన్ల ప్రశంసలు
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కాగా, స్వచ్ఛ భారత్‌లో భాగంగా నగరాలను శుభ్రంగా ఉంచాలని మోదీ పిలుపునిచ్చారు. అయితే.. తాజాగా ప్రధాని మోదీ మరోసారి స్వచ్ఛ స్పూర్తిని చాటుకున్నారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీనే స్వయంగా చెత్త ఏరివేసి దేశ ప్రజలకు మరోసారి 'స్వచ్ఛ భారత్' సందేశాన్ని వినిపించారు. కాగా, మోదీ.. ఆదివారం ఢిల్లీలో నిర్మించిన 'ప్రగతి మైదాన్ సమీకృత ట్రాన్స్పోర్ట్ టన్నెల్'ను ప్రారంభించారు. అనంతరం ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్‌ను మోదీ పరిశీలించారు. ఈ సందర్భంగా మోదీ అక్కడ కొంద దూరం ముందుకు సాగారు. ఈ క్రమంలో మోదీ.. అక్కడ కనిపించిన చెత్త, ప్లాస్టిక్ సీసాను తన చేతులతో ఎత్తారు. అనంతరం పరిశుభ్రతను పాటించాలని చాటి చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Prime Minister Narendra Modi picks up litter at the newly launched ITPO tunnel built under Pragati Maidan Integrated Transit Corridor, in Delhi (Source: PMO) pic.twitter.com/mlbiTy0TsR — ANI (@ANI) June 19, 2022 ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం.. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంతంలో కొత్తగా ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీఓ) తదితర ఏజెన్సీల ముఖ్య కార్యాలయాలు అక్కడ ఉండటంతో సందర్శకులు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే రూ.920 కోట్లతో 'ప్రగతి మైదాన్ సమీకృత రవాణా కారిడార్'ను నిర్మించింది. -
'స్వచ్ఛ' తిరుపతి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పట్టణాల్లో ‘స్వచ్ఛ భారత్’ అమలు తీరును తెలియజేసే స్వచ్ఛ సర్వేక్షణ్–2019 సర్వేలో ఆంధ్రప్రదేశ్ స్థానం దక్కించుకుంది. మొదటి 10 స్థానాల జాబితాలో తిరుపతి పట్టణానికి చోటు దక్కింది. 2019 జనవరిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్వచ్చ సర్వేక్షణ్–2019 పేరిట ఈ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 4,237 పట్టణాల్లో 6.53 లక్షల మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. పరిశుభ్రతపై నిర్వహించిన అతిపెద్ద సర్వేగా ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది. సర్వే వివరాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ప్రకటించింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. 2017లో పనితీరు ఆధారంగా 2018లో ప్రకటించిన సర్వేలో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ 2018లో పనితీరు ఆధారంగా ప్రకటించిన 2019 అవార్డుల్లో 6వ స్థానానికి పడిపోయింది. ఫీడ్‌బ్యాక్‌లో తిరుపతికి మొదటి స్థానం జాతీయ స్థాయిలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌లో మంచి మార్కులు పొందిన చిన్న పట్టణాల విభాగంలో తిరుపతి మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 44,639 మంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడమే కాకుండా మొత్తం 5,000 మార్కులకు గాను 4,025 మార్కులు సాధించి తిరుపతి మొదటి స్థానంలో నిలిచింది. తిరుపతిలో చాలామంది స్వచ్ఛ భారత్‌పై అవగాహన ఉందని చెప్పడమే కాకుండా పట్టణంలో పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఇక్కడ పరిశుభ్రత పెరిగిందని పేర్కొన్నారు. కానీ, దీనికి భిన్నంగా మొత్తం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే గతేడాదితో పోలిస్తే తిరుపతి రెండు ర్యాంకులు దిగజారి 8 స్థానంలో నిలవడం గమనార్హం. టాప్–100లో ఐదు పట్టణాలు 2018 సర్వేలో 6వ స్థానంలో ఉన్న తిరుపతి 2019లో 8వ స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది సర్వేలో టాప్–100లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు పట్టణాలకు చోటు లభించగా, టాప్–200లో 17 పట్టణాలకు చోటు దక్కింది. -
'స్వచ్ఛ’ ర్యాంకులు: వరంగల్ 51, కాజీపేట స్టేషన్ 67
సాక్షి, కాజీపేట: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని స్టేషన్ల కు అధికారులు బుధవారం ‘స్వచ్ఛ రైల్ – స్వచ్ఛ భారత్’ ర్యాంకులను ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, తరలింపు, ప్రయాణికులకు అవగాహన కల్పించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయించారు. ఈ మేరకు వరంగల్ రైల్వే స్టేషన్‌కు 51వ ర్యాంక్, కాజీపేట జంక్షన్‌కు 67వ ర్యాంక్ లభించింది. అయితే, గత ఏడాది వరంగల్ రైల్వే స్టేషన్‌కు 3వ ర్యాంక్ రాగా ఈ ఏడాది 51వ స్థానానికి పడిపోవడంతో గమనార్హం. రూ.కోట్ల నిధులు వెచ్చించి అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో అత్యాధునీకరించిన వరంగల్ రైల్వే స్టేషన్‌కు ర్యాంకు తగ్గడాన్ని రైల్వే అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
'సిటీ' బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. దానిని కాపాడుకోవాలంటే నగరంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో రోగులకు ఆయన పండ్లు పంపిణీ చేశారు. తొలుత ఛాతీ ఆస్పత్రిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన స్వయంగా చీపురు చేతపట్టి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. నానాటికీ నగరంలో ట్రాఫిక సమస్య, కాలుష్యం పెరిగిపోవడం, మరోవైపు డెంగీ లాంటి ప్రమాదకర జ్వరాలు వస్తున్నాయని అన్నారు. ఎక్కడ చూసినా చెత్త, వ్యర్థాలు పెద్ద మొత్తంలో కనిపిస్తున్నాయని, జీహెచ్ఎంసీ అధికారులు మరింత సమర్థంగా పని చేయాలని సూచించారు. విషజ్వరాలకు కారణమైన మురుగు కూపాలకు స్వస్తి చెప్పాలని, అదేవిధంగా ట్రాఫిక్ సమస్య, జల, వాయు కాలుష్యాల నుంచి ప్రజలను రక్షించుకుంటేనే నగర బ్రాండ్ ఇమేజ్ నిలబడుతుందన్నారు. ప్రధాని సూచించినట్టుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించాలన్నారు. సమావేశంలో ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఎన్.విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చెత్త వేస్తే ఫైన్లు తప్పవు
సాక్షి, సంగారెడ్డి: రోడ్లపై చెత్త వేస్తే దుకాణాల యజమానులపై ఫైన్లు వేయకతప్పదని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సంగారెడ్డి పట్టణంలో మంగళవారం సాయంత్రం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణపై ఆరా తీశారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న కొన్ని దుకాణ సముదాయాలను ఆయన తనిఖీ చేశారు. దుకాణాల ముందున్న చెత్తను చూసి అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలను అపరిశుభ్ర పరిస్తే ఎంతటివారైనా సహించేది లేదని హెచ్చరించారు. కొంతమంది దుకాణదారులకు ఫైన్లు వేశారు. ప్రతీ ఒక్క పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హరితహారంలో భాగంగా దుకాణ సముదాయాల ముందు మొక్కలను నాటతామని, వాటిని దుకాణాల యజమానులు సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని తెలిపారు. పట్టణాన్ని జోన్లవారీగా విభజించి ప్రతి జోన్లో రెండు రోజులపాటు పర్యటించనున్నట్లు కలెక్టర్ వివరించారు. పట్టణంలో పరిశుభ్రత స్థిరంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
కలెక్టర్ రొనాల్డ్‌రోస్ వినూత్న ప్రయోగం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రభుత్వ పాఠశాలలంటే అందరిలోనూ చిన్నచూపు ఉంటుంది. చదువు బాగా చెప్పరని, తరగతి గదులు సరిగా ఉండవని, సర్కారీ స్కూళ్లన్నీ సమస్యల వలయం లోనే కొట్టుమిట్టాడతాయని భావిస్తారు. పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు చూస్తే ఆ అభిప్రాయాలు మార్చుకోక తప్పదు. చుట్టూ పచ్చని చెట్లు.. పరిశుభ్రమైన పరిసరాలు.. ఆకర్షణీయమైన తరగతి గదులు.. చూస్తే ఇది సర్కారీ స్కూలేనా అని ఆశ్చర్యపోయే రీతిలో పాలమూ రు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త శోభతో కనిపిస్తాయి. ఏళ్లుగా అనేక సమస్యలతో కొనసాగిన ఈ పాఠశాలల్లో ఇప్పుడు ఒక్కొక్క టిగా సదుపాయాలు సమకూరుతున్నాయి. కలెక్టర్ రోనాల్డ్‌రోస్ తీసుకున్న చొరవే ఇందుకు కారణం. సర్కారీ స్కూళ్లంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రమే కాదని.. వాటి బాధ్యత అందరిపై ఉందని పేర్కొంటూ ‘ఇంటికి వంద.. బడికి చందా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి నుంచి స్వచ్ఛందంగా రూ.వంద వసూలు చేసి ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల న్నది దీని ఉద్దేశం. ఏడాది క్రితమే దీనికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, ప్రైవేట్ కంపెనీలు, స్వచ్చంద సంస్థ ల నిర్వాహకులంతా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు రూ.1.11 కోట్లు జమ కాగా, ఆ నిధులతో వసతులు కల్పిస్తున్నారు. అందరి భాగస్వామ్యంతోనే.. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగానికి అండగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయం. రూ.కోటికి పైగా వచ్చిన విరాళాలతో జిల్లాలో 601 ప్రభుత్వ పాఠశాలలను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుకుని.. స్వచ్ఛ పాఠశాలలుగా ప్రకటించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం అదే స్థాయిలో చదువు సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటున్నారు. ఇదంతా అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమైంది. – రొనాల్డ్‌రోస్, కలెక్టర్, మహబూబ్‌నగర్ సమస్యలు గుర్తించి.. పరిష్కారం మహబూబ్‌నగర్ జిల్లాలో 830 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 83వేల మంది చదువుతున్నారు. కనీస సదుపాయాలు లేకపోవడంతో ఈ పాఠశాలల్లో చేరేందుకు నిరుపేద విద్యార్థులు సైతం ముందుకు వచ్చేవారు కాదు. కొన్నిచోట్ల టాయిలెట్లు లేక.. ఉన్నచోట నిర్వహణ సరిగాలేక బాలికలు ఇబ్బందులు పడేవారు. దీంతో చదువుకు స్వస్తి పలికేవారు. ఫలితంగా విద్యార్థుల సంఖ్య పడిపోతూ వచ్చింది. ఆయా స్కూళ్లలో నెలకొన్న సమస్యలే దీనికి కారణమని గుర్తించిన కలెక్టర్ రొనాల్డ్‌రోస్ వాటిని పరిష్కరించాలని నిర్ణయించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ సదుపాయాలు కల్పించే బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న పాఠశాల నిర్వహణ నిధులు సరిపోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.వంద చొప్పున వసూలు చేసి ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా రు. ఈ చర్యలతో ప్రభుత్వ స్కూళ్లలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 30వేల మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఎంతో కృషి చేశాం కొన్నేళ్లుగా పాఠశాలను పూర్తిస్థాయి స్వచ్ఛ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నాం. స్వచ్ఛభారత్ నిబంధనలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో వసతులు కల్పించినందుకు స్వచ్ఛ పాఠశాలగా ప్రకటించాం. – బాలుయాదవ్ బైకని, హెచ్ఎం,జెడ్పీహెచ్ఎస్ ధర్మాపూర్ -
తెలంగాణకు స్వచ్ఛత శక్తి పురస్కారం
జగదేవ్‌పూర్ (గజ్వేల్): దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు స్వచ్ఛతా శక్తి అవార్డులకు ఎంపికయ్యాయి. ప్రథమ బహుమతిని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి అందుకున్నారు. ద్వితీయ బహుమతి తమిళనాడు రాష్ట్రం దక్కించుకుంది. ‘స్వచ్ఛ సుందర్ శౌచాలయ్’లో భాగంగా ఇటీవల కేంద్ర బృందం ఎర్రవల్లి గ్రామాన్ని సందర్శించి డాక్యుమెంటరీ తీసింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. హరియాణా రాష్ట్రంలోని కురుక్షేత్రం గ్రామంలో మంగళవారం జరిగిన స్వచ్ఛ శక్తి పురస్కారం అందజేత కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛత శక్తి అవార్డును సర్పంచ్ భాగ్యలక్ష్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 128 మంది మహిళా సర్పంచ్‌లతోపాటు జిల్లా నుంచి స్వచ్ఛభారత్ మిషన్ కో ఆర్డినేటర్ చెన్నారెడ్డి, కొండపాక సర్పంచ్ మాధురి, మిట్టపల్లి సర్పంచ్ వరలక్ష్మి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు. -
టాయిలెట్ ఏదైనా..కంపు కామనే!
రైళ్లలోని టాయిలెట్లు.. వాటి పేరెత్తితే చాలు.. మొహం చిట్లించే వారెందరో.. తలుపు తీస్తే.. కంపు తప్ప ఇంకేమీ ఉండదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇక ట్రాకుల మీద పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు.. వీటన్నిటికీ చెక్ పెట్టేలా.. స్వచ్ఛ భారత్ ప్రాజెక్టులో భాగంగా తెచ్చినదే.. బయో టాయిలెట్లు.. ఇందుకోసం నాలుగేళ్లలో సుమారు రూ.1,305 కోట్లను భారత రైల్వే ఖర్చు చేసింది. అయితే.. సెప్టిక్ ట్యాంక్‌లతో పోలిస్తే.. ఇవి ఏమాత్రం మెరుగైనవి కావని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) మద్రాస్ తేల్చి చెప్పింది. రెండేళ్ల పాటు రైలు బోగీల్లోని బయో టాయిలెట్లపై అధ్యయనం చేసి మరీ.. ఈ విషయాన్ని స్పష్టం చేసింది. బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ సౌజన్యంతో ఐఐటీ మద్రాస్ నిర్వహించిన ఈ సర్వేకు సంబంధించిన నివేదికను ఇటీవలే కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందజేశారు. బయో టాయిలెట్స్ అంటే.. ప్రధానమైన ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లలో సుమారు 93,537 బయో–డైజెస్టర్స్(బయో టాయిలెట్స్)ను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. బయో టాయిలెట్లలో టాయిలెట్ సీటు కింది భాగంలో చిన్న స్థాయి మురుగునీటి శుద్ధి వ్యవస్థ ఉంటుంది. ట్యాంకు ఆకారంలో ఉండే ఈ బయో డైజెస్టర్లలో మనుషుల మల వ్యర్థాలను తినే బ్యాక్టీరియాను ఉంచుతారు. మలవ్యర్థాలను ఈ బ్యాక్టీరియా స్వీకరించడమే కాకుండా నీరు వాసన రాకుండా శుభ్రం చేస్తుంది. ఈ నీటిని బయటకు వదిలేసినా(అంటే రైలు వెళ్తున్నప్పుడు పట్టాలపై) ఏ విధమైన సమస్యలు రావు. వాస్తవంలో ఈ ప్రక్రియ సక్సెస్ కావట్లేదని శానిటేషన్ నిఫుణులతో పాటు రైల్వే శాఖ ఏర్పాటు చేసిన కమిటీలు కూడా చెపుతున్నాయి. శుద్ధి కాకుండానే బయటకు.. బయో టాయిలెట్ల నిర్వహణ సరిగా ఉండటం లేదని, అందువల్ల బయటకు వదులుతున్న వ్యర్థాలు శుభ్రం కాకుండా ఉండిపోతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. బయో డైజెస్టర్ల నుంచి తాము సేకరించిన మల వ్యర్థాలు ఎటువంటి శుద్ధికీ నోచుకోలేదని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ లిజీ ఫిలిప్ స్పష్టం చేశారు. సెప్టిక్ ట్యాంకుల్లో మాదిరిగానే మల వ్యర్థాలు నీటిలో కలసిపోయి బయటకు విడుదల అవుతున్నాయని చెప్పారు. బయో టాయిలెట్ల వినియోగంపై విమర్శలు వస్తున్నప్పటికీ 2018 డిసెంబర్ నాటికి 1,20,000 బోగీల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో), భారత రైల్వే శాఖ సిద్ధమవుతున్నాయి. దీనికి రూ.1,200 కోట్లు వ్యయం కానున్నట్టు ఇటీవల సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే శాఖ చెప్పింది. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
వచ్చే ఏడాదికల్లా స్వచ్ఛ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: వచ్చేఏడాది అక్టోబర్ 2 నాటికి తెలంగాణను బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా రూపుదిద్దాలన్న ఆశయంతో గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యార్థులు స్వచ్చందంగా భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ కోరారు. ‘స్వచ్ఛ సంకల్ప్ సే స్వచ్ఛసిద్ధి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం స్వచ్ఛభారత్‌పై నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, షార్ట్ఫిలింలపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన 19 మందికి సర్టిఫికెట్లను శుక్రవారం సచివాలయంలో ప్రదానం చేశారు. వ్యాసరచన పోటీల్లో ఓపెన్ కేటగిరి విభాగంలో వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన బి.ప్రియాంక, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కె.రమేశ్, ఖమ్మం జిల్లాకు చెందిన గురుస్వామి, నిజామాబాద్‌కు చెందిన నిషాంత్‌లు బహుమతులు గెలుపొందారు. సర్పంచ్ల విభాగంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రామ్‌సాగర్ గ్రామ పంచాయతీకి చెందిన పి.గంగాధర్, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షెట్టిపల్లి కలాన్ గ్రామ పంచాయతీకి చెందిన మల్లేశం, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి గ్రామపంచాయతీకి చెందిన జిన్న గంగాధర్‌లు బహుమతులు గెలుపొందారు. పెయింటింగ్ విభాగంలో భూపాలపల్లి జిల్లాకు చెందిన సాహస, జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన వీరేశ్, ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్.సుష్మలు బహుమ తులు గెలుపొందారు. షార్ట్ ఫిల్మ్ మేకింగ్ విభాగంలో జగిత్యాల జిల్లాకు చెందిన అశోక్ భోగే, భద్రాద్రి జిల్లాకు చెందిన జగత్‌కుమార్‌రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన డి.ప్రకాశ్, ఖమ్మం జిల్లాకు చెందిన మొగలి వెంకటేశ్వర్లు బహుమతులు గెలుపొందారు. ఈ పోటీలు ఆగస్టు్ట 16 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహించారు. -
నోట్ల రద్దు పేదల కోసమే :మోదీ
-
నోట్ల రద్దు పేదల కోసమే
సాక్షి, న్యూఢిల్లీ: పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. నల్లధనం, అవినీతిపై పోరాటానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మున్ముందు పేదల, సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ ముగింపు సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ‘నేను అధికారం కోసం పాకులాడను. స్వర్గం వద్దు.. మరో జన్మ వద్దు. పేదల సేవయే.. దేవుడి సేవ. పేదల జీవితాల్లో కష్టాలు తొలగిస్తే చాలు.’అంటూ ఓ సంస్కృత శ్లోకాన్ని ఉటంకించారు. పేదలను, పేదరికాన్ని ఓట్లు పొందేందుకు దగ్గరి దారిగా బీజేపీ ఏనాడూ చూడదన్నారు. ‘దేశంలోని పేద ప్రజలు.. చరిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతించారు. అవినీతి సహా పలు సామాజిక సమస్యలకు ఇదే మంచి మందు అని అంగీకరించారు. ఈ నిర్ణయంతో తమకు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదురైనా మార్పుకోసం అన్నీ భరించి స్వాగతించారు’’అని మోదీ వ్యాఖ్యానించారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ ప్రసంగం వివరాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఆ ఆదివాసీ మహిళ నన్ను ఆశీర్వదించింది రెండున్నరేళ్లుగా ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు మద్దతిచ్చారని మోదీ పేర్కొన్నారు. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. ఛత్తీస్‌గఢ్‌లో 90 ఏళ్ల ఆదివాసీ మహిళ తన గొర్రెలమ్మి మరుగుదొడ్డి నిర్మించుకుందని, ఈ ఘటన తనను ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు. ఆ ఆదివాసీ మహిళ ఆశీస్సులను కోరినప్పుడు మంచి పనులు చేస్తున్నావంటూ ఆశీర్వదించిందని మోదీ గుర్తుచేసుకున్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాలకోసం అమలవుతున్న వివిధ పథకాలను, కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలు తెలియ చెప్పాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు జైట్లీ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని పార్టీ జాతీయ కార్యవర్గం ఆమోదించింది. నోట్లరద్దుతో నల్లధనం చాలా వరకు బ్యాంకులకు చేరిందని.. దీని వల్ల కేంద్ర, రాష్ట్రాలకు ఆదాయం పెరిగి జీడీపీ వృద్ధి చెందుతుందని తీర్మానంలో పేర్కొన్నారు. బ్యాంకుల వద్దకు పెద్దమొత్తంలో నగదు చేరటంతో.. తక్కువ వడ్డీకే రుణాలు అందుతాయని, జైట్లీ తెలిపారు. ఎన్నికల సంస్కరణలకు సిద్ధం ‘‘ఐదు రాష్ట్రాల్లో పరిస్థితి మనకు అనుకూలంగానే ఉంది. కార్యకర్తలు బూత్ స్థాయిలో పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. పేదల కోసం పేదల ప్రభుత్వం పనిచేస్తుందనేదే మనం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి’’అని మోదీ తెలిపారు. దేశంలో ఎన్నికల సంస్కరణలు రావటానికి, పార్టీల విరాళాలపై పారదర్శకంగా ఉండేందుకు ఏకాభిప్రాయం రావాలని.. అందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. నోట్ల రద్దు, డిజిటల్ లావాదేవీలతో పారదర్శక లావాదేవీలు జరుగుతాయన్నారు. రాజకీయ పార్టీలకు నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయో ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందన్నారు. నోట్ల రద్దుతో అసహనంలో ఉన్న విపక్షాలు బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని.. వీటిని పార్టీ నాయకులు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న సుపరిపాలనపై బీజేపీ గుడ్ గవర్నెన్స్ సెంటర్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చిందని, దీని ప్రకారం బీజేపీ పాలితరాష్ట్రాల్లో సుపరిపాలన బాగుందని రవి శంకర్ ప్రసాద్ చెప్పారు.