ఐసీడీఎస్‌కు యువతి అప్పగింత
ఐసీడీఎస్‌కు యువతి అప్పగింత
Published Wed, Oct 5 2016 12:16 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
రైల్వేగేట్ : నగరంలోని వరంగల్ రైల్వేస్టేషన్ జీఆర్‌పీ పోలీసులు ముస్లిం యువతిని ఐసీడీఎస్‌కు అప్పగించారు. సీఐ స్వామి కథనం ప్రకారం.. వరంగల్ జీఆర్‌పీ సీఐ స్వామి కథనం ప్రకారం.. వరంగల్ రైల్వేస్టేషన్‌లో సల్మాబేగం(25) అనే యువతి మంగళవారం ఏడుస్తుండగా ప్రయివేటు సానిటేషన్ వర్కర్ మహాలక్ష్మి జీఆర్‌పీ పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో పోలీసులు సల్మాబేగంను స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ ఆమె వివరాలు అడగగా తమది వరంగల్ అని, తన తల్లిదండ్రులు తనను చిన్నప్పుడే జైపూర్‌కు తీసుకెళ్లారని తాను రైలులో ఇక్కడికి వచ్చినట్లు చెప్పింది. అలాగే కొన్ని విషయాల్లో పొంతనలేని సమాధానాలు చెప్పడంతోపాటు తనకు ఈ పోలీస్టేషన్‌లో ఉద్యోగం ఇప్పించాలని, ఉపాధి కావాలని అన్నట్లు పోలీసులు తెలిపారు. సల్మాబేగం మానసిక స్థితి బాగాలేకనే ఇలా మాట్లాడుతున్నట్లు గమనించి ఐసీడీఎస్ అర్బన్-2 సీడీపీఓ మధురిమకు యువతిని అప్పగించినట్లు సీఐ పేర్కొన్నారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ మురళి తదితరులున్నారు.
Advertisement
Advertisement