68 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం | 68 kilos sliver metals seized by police at warangal railway gate | Sakshi
Sakshi News home page

68 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం

Published Sat, Jan 30 2016 5:51 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

68 kilos sliver metals seized by police at warangal railway gate

వరంగల్ రైల్వేగేట్: వరంగల్ రైల్వేస్టేషన్‌లో శనివారం 68 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. త్రివేండ్రం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న కేరళా ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా వెండి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశగా తనిఖీలు చేపట్టారు.

తమిళనాడులోని సేలంకు చెందిన నటరాజన్ కేరళా నుంచి వరంగల్‌కు వెండి వస్తువులు తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.   అతన్ని అదుపులోకి తీసుకొని 68 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం విచారణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement