Kerala Express
-
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో భారీ అగ్నిప్రమాదం
-
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఫ్లాట్‌ఫాం 8లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. కాగా స్టేషన్లో నిలిచి ఉన్న ఛండీఘడ్-కొచువెల్లి ఎక్స్‌ప్రెస్ బోగీల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ నుంచి ప్రయాణికులను అక్కడ నుంచి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
కేరళ ఎక్స్‌ప్రెస్‌లో విషాదం
సాక్షి, న్యూఢిల్లీ : రెండు వారాలుగా వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాది అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఆగ్రా నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్‌కు కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణీకులు ఝాన్సీ వద్ద ఉగ్ర తాపాన్ని భరించలేక మరణించారు. వడదెబ్బతోనే వీరు మరణించారని భారతీయ రైల్వే ప్రతినిధి అజిత్‌కుమార్ సింగ్ మంగళవారం వెల్లడించారు. కేరళ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం బాధితులు ప్రయాణిస్తున్న రైలు ఝాన్సీకి చేరుకుంటుండగా ప్రయాణీకుల్లో ఒకరు స్పృహ కోల్పోయారని తమకు సమాచారం అందిందని, తాము వైద్య సిబ్బందితో స్టేషన్‌కు చేరుకోగా ముగ్గురు ప్రయాణీకులు అప్పటికే మరణించగా, మరో ప్రయాణీకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని చెప్పారు. కాగా, ఝాన్సీలో ఇటీవల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. తాము ఆగ్రా దాటిన వెంటనే ఎండ వేడిని భరించలేకపోయామని, కొందరికి శ్వాస సమస్యలు తలెత్తగా మరికొందరు అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేశారని కొందరు ప్రయాణీకులు చెప్పారు. ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా రాజస్ధాన్‌లో రికార్డుస్ధాయిలో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. -
రెండు కిలోల బంగారం పట్టివేత
విజయవాడ: నెల్లూరు నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ప్రియాంక జ్యువెలరీ నుంచి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు ఆభరణాల తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కేరళ ఎక్స్‌ప్రెస్ లో గురువారం ఉదయం రెండు కిలోల ఆభరణాలతో వచ్చిన నితీష్, నందకిషోర్‌లను చాకచక్యంగా వ్యవహరించి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వివరించారు. -
అయ్యప్పస్వాముల నిరసన
28 గంటలపాటు వరంగల్ రైల్వేస్టేషన్ లో అవస్థలు రైల్వేగేట్(వరంగల్): వరంగల్ రైల్వే స్టేషన్ లో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. శబరి మలకు వెళ్లడానికి శుక్రవారం వరంగల్ రైల్వే స్టేషన్ కు సుమారు 300 మంది అయ్యప్ప భక్తులు వచ్చారు. ఉదయం 11 గంటలకు రావాల్సిన కేరళ ఎక్స్‌ప్రెస్ 24 గంటలు దాటినా రాకపోవడంతో ఓపిక నశించి ఆందోళనకు దిగారు. రైళ్ల రాకపోకలకు అంతరాయ కలిగేలా నిరసన తెలిపారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 3.30 గంటలకు వచ్చిన రైలులో స్వాములు వెళ్లిపోయారు. -
68 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం
వరంగల్ రైల్వేగేట్: వరంగల్ రైల్వేస్టేషన్లో శనివారం 68 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. త్రివేండ్రం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న కేరళా ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా వెండి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశగా తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని సేలంకు చెందిన నటరాజన్ కేరళా నుంచి వరంగల్‌కు వెండి వస్తువులు తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని 68 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం విచారణ చేపడుతున్నారు. -
మత్తుమందిచ్చి చోరీ
విజయవాడ (రైల్వేస్టేషన్): ప్రయాణికులకు మత్తు మందు ఇచ్చి ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన బుధవారం న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్తుతున్న కేరళ ఎక్స్‌ప్రెస్(12626)రైల్లో జరిగింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నీలిమ సొప్పాంజి(35), మణిక్కాం(41) దంపతులు న్యూఢిల్లీ నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌కు కేరళ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. మార్గ మధ్యలో ముగ్గురు యువకులు వీరు ప్రయాణిస్తున్న ఎస్7 బోగీలో ఎక్కి, దంపతులతో మాటలు కలిపి బిస్కెట్లు ఇచ్చారు. అందులో మత్తు మందు కలిపి ఉండటంతో దంపతులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో వారి వద్ద ఉన్న లాప్‌ట్యాప్, రూ.3,000 నగదు, బంగారపు గొలుసును చోరీ చేశారు. వీరికి మెలకువ వచ్చేసరికి రైలు వరంగల్ చేరింది. అక్కడ రైలు ఎక్కువసేపు ఆగక పోవడంతో జీఆర్పీ పోలీసులు విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. వారిని విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నడుస్తున్న రైల్లోనే ఆగిన డ్రైవర్ గుండె
వేటపాలెం(ప్రకాశం): గమ్యం దిశగా సాగిపోతున్న ఓ గూడ్సు రైల్లో డ్రైవర్ గుండె ఆగిపోయింది. శనివారం ఉదయం 9 గంటల సమయంలో బిట్రగుంట నుంచి విజయవాడ వైపు (ద్వారపూడి)నకు గూడ్సు రైలు వెళ్తోంది. ప్రకాశం జిల్లా చిన్నగంజాం స్టేషన్ దగ్గరలో రైలు ఇంజిన్ క్యాబిన్లో ఉన్న ఇద్దరు డ్రైవర్లలో ఒక డ్రైవర్ వి.సూర్యప్రకాష్(45)కు గుండెలో నోప్పి వచ్చింది. విషయం పక్కనున్న తోటి డ్రైవర్‌కు చెప్పి క్యాబిన్‌లోనే కుప్పకూలి పడిపోయాడు. కో డ్రైవర్ యూ.హరి వేటపాలెం స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించడంతో ఆయన 108 సిబ్బందిని అప్రమత్తం చేశారు. గూడ్సు రైలు వేటపాలెం చేరుకోగానే సూర్యప్రకాష్‌ను ప్లాట్‌ఫారంపైకి దించారు. 108 సిబ్బంది వచ్చి డ్రై వర్ను పరీక్షించి అప్పటికే వృతి చెందినట్లు ధ్రువీకరించారు. అనంతరం చెన్నై నుంచి న్యూఢిల్లీ వైపు వెళ్తున్న కేరళ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను వేటపాలెం స్టేషన్లో ఆపి వృతదేహాన్ని ఆయన స్వస్థలం విజయవాడ తరలించారు. -
కేరళ ఎక్స్‌ప్రెస్‌లో కొట్టుకున్నారు..
వరంగల్ : కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా మట్టెవాడ రైల్వేస్టేషన్లో బయటపడింది. వివరాల ప్రకారం.. కేరళకు చెందిన రాజేష్, రామచంద్ర ఉన్నితన్లు ఉజ్బెకిస్తాన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. స్వదేశం వచ్చిన ఇద్దరూ ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి కేరళ వెళ్లేందుకు శనివారం కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఉన్నితన్, రాజేష్‌పై దాడి చేసి తలపై కొట్టాడు. రాజేష్ గాయపడటంతో విషయం గమనించిన తోటి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు రైలు వరంగల్ మట్టెవాడ స్టేషన్లో ఆగగానే రాజేష్‌ను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం వివరాలను సేకరిస్తున్నారు. గొడవకు గల కారణాలు ఇంకా తెలిసిరాలేదు. -
ఖమ్మంలో కేరళ ఎక్స్‌ప్రెస్ ఆపండి
మధిరలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వండి రైల్వేమంత్రికి ఎంపీ పొంగులేటి వినతిపత్రం సాక్షి, న్యూఢిల్లీ: ఖమ్మంలో కేరళ ఎక్స్‌ప్రెస్ ఆగేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభును కోరారు. సోమవారం ఇక్కడ రైల్వేభవన్‌లో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం రైల్వే మంత్రిని కలిసిన సందర్భంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి పలు అంశాలను పొంగులేటి రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల నుంచి చాలా కాలంగా ఈ డిమాండ్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చాలాసార్లు ఈ అంశంపై విన్నవించామని, త్వరితగతిన దీనిపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాల్వంచ మండలం పాండురంగాపురంలోని రైల్వే స్టేషన్ గ్రామానికి 13 కి.మీ. దూరంలో అడవుల్లో ఉందని, దీనిని గ్రామానికి అందుబాటులో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఖమ్మంలో కేరళ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పద్మావతి ఎక్స్‌ప్రెస్, స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌ను, మధిరలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్, లక్నో ఎక్స్‌ప్రెస్, హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని విన్నవించారు. ఎర్రుపాలెంలో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను ఆపాలని కోరారు. -
రైల్లో మహిళా ఎడిటర్‌కు వేధింపులు..
వరంగల్ : కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ఓ పత్రిక మహిళ ఎడిటర్‌ను ఆకతాయిలు వేధింపులకు గురిచేశారు. ఆమె వారించినా ఆకతాయిలు రెచ్చిపోవటంతో ఈ విషయాన్ని సెల్‌ఫోన్ ద్వారా పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కోటి ఆశల రైలు కూత
ఖమ్మం మామిళ్లగూడెం: గత యూపీఏ పాలనలో ప్రతిసారి జిల్లాకు మొండి‘చేయే’ ఎదురైంది. ఇప్పుడు ఎన్డీఏ పాలన వచ్చింది. ఈ ప్రభుత్వంలోనైనా జిల్లాకు న్యాయం జరుగుతుందా...? అనే ప్రశ్న సర్వత్రా నెలకొంది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే మొదటి రైల్వేబడ్జెట్‌పై జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా జిల్లాలో ఉంటున్న రైల్వే సమస్యలుకు ఈ సారైనా పరిష్కారం లభిస్తుందని జిల్లావాసులు ఆశాభావంతో ఉన్నారు. ఖమ్మం రైల్వేస్టేషన్లో ప్రతి రైలుకూ హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. తమిళనాడు, కేరళ ఎక్స్‌ప్రెస్‌లను జిల్లాకేంద్రంలో ఆపాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు. వీక్లీ రైళ్ల విషయంలోనూ జిల్లాకు ఇదే అన్యాయం జరుగుతోంది. దీనిపై ఎంతమేరకు న్యాయం జరుగుతుందో చూడాలి. సారథీనగర్- మామిళ్లగూడెం అండర్‌బ్రిడ్జి ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. కమాన్‌బజార్ మధ్యగేటు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ గేటు ఎక్కువసేపు వేసి ఉంటుంది. గేటు కింద నుంచి దూరివెళ్లే క్రమంలో రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఖమ్మం రైల్వేస్టేషన్లో ఉన్న గూడ్స్ షెడ్‌ను జిల్లాకేంద్రానికి సమీపంలోని పందిళ్లపల్లికి మార్చారు. ఖమ్మంలో ఉన్న షెడ్‌ను పడవేశారు. గూడ్స్ రైళ్లలో సరుకులు నేరుగా ఖమ్మం వస్తాయి. వాటిని లోడింగ్, అన్లోడింగ్ చేసే సమయంలో ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరుకుల రవాణాకు మహిళా కళాశాల వైపు ఒక ద్వారం ఉంది. ఆ ఒక్క ద్వారం నుంచే లారీలు వచ్చిపోవడం ఇబ్బందికరంగా మారింది. మరో ద్వారం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మేరకు అధికారులు సర్వే చేశారు. కానీ ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. మధ్యగేటు వద్ద ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని గతంలో రైల్వే డీసీఎం దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఇక్కడ బ్రిడ్జి లేకపోవడం వల్ల వన్‌టౌన్ నుంచి త్రీటౌన్లోకి వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారిందని ఫిర్యాదు చేశారు. ఖమ్మం స్టేషన్ మీదుగా రోజుకు దాదాపు 50 వరకు రైళ్లు వచ్చిపోతుంటాయి. కాబట్టి ఎప్పుడూ గేటు వేయక తప్పటం లేదు. దీనివల్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అధికారులు స్పందించి ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మించి ఇవ్వాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. -
కేరళ ఎక్స్ ప్రెస్ నుంచి టీటీఈ తోసివేత, పరిస్థితి విషమం!
వరంగల్: కేరళ ఎక్స్ ప్రెస్ లో విధులు నిర్వహిస్తున్న ట్రైన్ టికెట్ కలెక్టర్ (టీటీఈ) ఉదయ్ కుమార్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిందకు తోసిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట స్టేషన్ కు సమీపంలోని బిజిగీరి షరీఫ్ స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. ట్రాక్ పక్కన పడి ఉన్న టీటీఈని బిజిగీర్ షరీఫ్ గ్రామస్తులు గమనించి.. ఆస్పత్రికి తరళించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన టీసీ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. టీటీఈ వరంగల్ పట్టణంలోని సుబేదారి కి చెందినట్టు తెలిసింది. టికెట్ అడిగినందుకు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి. ట్రైన్ నుంచి.తోసి వేసారని గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలిపారు. -
కేరళ ఎక్స్‌ప్రెస్‌లో రగడ
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: త్రివేండ్రం నుంచి న్యూ ఢిల్లీకి వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకున్న రగడ ఒకరి ప్రాణంపైకి రాగా, ముగ్గురు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు రైల్వే టీటీలకు చుట్టుకుంది. చిత్తూరు రైల్వే స్టేషన్లో ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. గవర్నమెంట్ రైల్వే పోలీసుల కథనం మేరకు.. కేరళ ఎక్స్‌ప్రెస్ గత నెల 31వ తేదీ అర్ధరాత్రి 2.50 గంటలకు చిత్తూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఎస్-9 కోచ్ నుంచి సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ హరిసింగ్ (54)ను రైలు నుంచి కొడుతూ కొందరు కిందకు దింపేశారు. తమిళనాడులోని కొయంబత్తూరులో శిక్షణ పూర్తి చేసుకుని హరిసింగ్ స్వస్థలమైన ఆగ్రాకు వెళుతున్నా డు. ఇతను ప్రయాణికులతో అమర్యాద ప్రవర్తించడం తో వాగ్వాదం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న ఇ ద్దరు టికెట్ కలెక్టర్లు, ముగ్గురు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు కానిస్టేబుళ్లు, ఒక ప్రయాణికుడు హరిసింగ్‌పై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన హరిసింగ్ ప్రథమ చి కిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నాడు. ఒక రోజు చికిత్స తీసుకుని పరిస్థితి విషమించడంతో సమాచారాన్ని బంధువులకు తెలియచేశాడు. వారు చిత్తూరుకు చేరుకుని, అతన్ని తిరుపతిలోని ప్రైవేటు ఆ స్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారకస్థితిలోకి వె ళ్లడంతో అక్కడి నుంచి చెన్నైలోని మియాట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయస్థితిలో ఉ న్నారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అరెస్టు.... ఈఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు చిత్తూరు గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) ఈ నెల 3న కేసు నమోదు చేశారు. చిత్తూరు ఆర్పీఎఫ్లో పనిచేసే మో హన్‌రెడ్డి, వాసు, కనవ్, టికెట్ కలెక్టర్లు కన్నన్కుట్టి, జ యరాజ్, మరో ప్రయాణికుడిపై కేసు నమోదు చేశా రు. మోహన్‌రెడ్డిని శుక్రవారం అరెస్టు చేసి నెల్లూరు రై ల్వే కోర్టుకు తరలించగా, రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన ఇద్దరు కానిస్టేబుళ్లలో వాసు తిరుపతి రుయా ఆస్పత్రి లో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతుండగా, ఇతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేయనున్నారు. మరో కానిస్టేబుల్ కన్నన్ కోసం గాలిస్తున్నారు. టికెట్ కలెక్టర్లను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందం ఇప్పటికే కేరళలో గాలిస్తోంది. ఈ దాడిని కేంద్ర పోలీసు దళాలు తీవ్రంగా పరిగణించారుు. నిందితులను వదలిపెట్టకూడదని జీఆర్పీ పోలీసులను ఆదేశించాయి. జీఆర్పీ డీ ఎస్పీ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు సాగుతోంది.