వరంగల్ రైల్వే స్టేషన్ లో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
28 గంటలపాటు వరంగల్ రైల్వేస్టేషన్ లో అవస్థలు
రైల్వేగేట్(వరంగల్): వరంగల్ రైల్వే స్టేషన్ లో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. శబరి మలకు వెళ్లడానికి శుక్రవారం వరంగల్ రైల్వే స్టేషన్ కు సుమారు 300 మంది అయ్యప్ప భక్తులు వచ్చారు. ఉదయం 11 గంటలకు రావాల్సిన కేరళ ఎక్స్‌ప్రెస్ 24 గంటలు దాటినా రాకపోవడంతో ఓపిక నశించి ఆందోళనకు దిగారు. రైళ్ల రాకపోకలకు అంతరాయ కలిగేలా నిరసన తెలిపారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 3.30 గంటలకు వచ్చిన రైలులో స్వాములు వెళ్లిపోయారు.