రెండు కిలోల బంగారం పట్టివేత
విజయవాడ: నెల్లూరు నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ప్రియాంక జ్యువెలరీ నుంచి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు ఆభరణాల తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
కేరళ ఎక్స్‌ప్రెస్ లో గురువారం ఉదయం రెండు కిలోల ఆభరణాలతో వచ్చిన నితీష్, నందకిషోర్‌లను చాకచక్యంగా వ్యవహరించి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వివరించారు.