తాను చనిపోతూ.. బిడ్డను బతికించిన తల్లి | Despite his death, the mother of the child | Sakshi
Sakshi News home page

తాను చనిపోతూ.. బిడ్డను బతికించిన తల్లి

Published Fri, Jun 24 2016 3:53 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

తాను చనిపోతూ.. బిడ్డను బతికించిన తల్లి

తాను చనిపోతూ.. బిడ్డను బతికించిన తల్లి

వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఘటన
రైల్వేగేట్ (వరంగల్): ప్రమాదంలో తాను చనిపోతానన్న విషయూన్ని గమనించిన ఓ మహిళ తన చేతిలో ఉన్న ఏడాదిన్నర వయసున్న బిడ్డను ప్లాట్‌ఫామ్‌పై విసిరేసి తాను రైలు పట్టాల మధ్య పడి చనిపోయింది. ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్‌లో గురువారం జరిగింది. వరంగల్ జీఆర్‌పీ ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన చిర్ర రజని (25) హైదరాబాద్ వెళ్లేందుకు వరంగల్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. అప్పటికే ఆమె కుటుంబ సభ్యులు రెలైక్కగా, రజని కదులుతున్న పుష్‌పుల్ రైలు ఎక్కబోయి ప్లాట్‌ఫామ్-రైలు మధ్య పడిపోయింది.

ఇక తన మరణం తప్పదనుకున్న ఆ మాతృమూర్తి ఏడాదిన్నర కూతురు సాత్వికను మాత్రం ప్లాట్‌ఫామ్‌పైకి విసిరేసింది. రజని రైలుకింద పడి మృతిచెందగా, ఆ పసిపాప స్వల్ప గాయూలతో బయటపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement