రైల్వేస్టేషన్‌లో పేలుడు పదార్థాలు లభ్యం | explosives found in warangal railway station | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో పేలుడు పదార్థాలు లభ్యం

Published Thu, Jan 22 2015 12:17 PM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

explosives found in warangal railway station

మట్టెవాడ(వరంగల్): వరంగల్ రైల్వే స్టేషన్‌లో బుధవారం సాయంత్రం పేలుడు పదార్థాలు ఉన్న బ్యాగ్‌ను పోలీసులు కనుగొన్నారు. నిన్న సాయంత్ర ఆరు గంటల సమయంలో రైల్వే స్టేషన్‌లోని బుకింగ్ కౌంటర్ సమీపంలో వదిలివేసిన బ్యాగ్‌లో 6 జిలెటిన్ స్టిక్స్, 25 డిటొనేటర్స్, రెండు ఎలక్ట్రికల్ వైర్లను గుర్తించారు.

 

ఈ బ్యాగ్‌ను గుర్తుతెలియని వ్యక్తి వదిలి వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement