jiliten sticks
-
భారీ డంప్ స్వాధీనం
ఏవోబీలో భారీగా మావోయిస్టుల డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోరాపూట్ జిల్లా నారాయణ పట్నం బ్లాక్ కుంబర పుట్టి సమీపంలో డంప్ ఉందన్న సమాచారంతో.. కూంబింగ్ నిర్వహించిన పోలీసులు.. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు సీజ్ చేశారు. డంప్ లో రెండు ల్యాండ్ మైన్స్, పెద్ద ఎత్తున జిలిటెన్ స్టిక్స్, వైర్ కట్టలను స్వాధీనంచేసుకున్నారు. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు. -
భారీగా జిలిటెన్ స్టిక్స్ లభ్యం
భీమదేవరపల్లి: కరీంనగర్ జిల్లాలో భారీగా జిలిటెన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 480 జిలిటెన్ స్టిక్స్ లభించాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొవ్వూరు గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన దున్నపోతుల యాదగిరి బోరు బావులు తవ్వుతూ జీవనం సాగిస్తుంటాడు. జిలిటెన్ స్టిక్స్ ఉన్నాయనే సమాచారంతో సోదాలు చేసిన పోలీసులకు ఆయన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన జిలిటెన్ స్టిక్స్ బయటపడ్డాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యాదగిరి పరారిలో ఉన్నారు. -
క్వారీలపై దాడి: పేలుడు పదార్థాలు స్వాధీనం
విశాఖపట్నం : విశాఖ జిల్లా రౌలుకుంట మండలంలోని నల్లరాతి క్వారీలపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందున ఈ దాడులు నిర్వహించారు. పాతంపేట క్వారీకి చెందిన రాజుల నాయుడును అదుపులోకి తీసుకున్నారు. మరో క్వారీకి చెందిన వ్యక్తి పరారయ్యాడు. ఈ రెండు క్వారీల నుంచి 70 జిలెటిన్ స్టిక్స్, 36 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (రౌలుకుంట) -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ఖమ్మం: జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర్ వద్ద శుక్రవారం భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు సోదా చేయగా పది బాక్సుల్లో మొత్తం రెండు వేల జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. వీటిని మావోయిస్టులకు చేరవేసేందుకు తీసుకెళ్తున్నట్లు అనుమానాలున్నాయని కొత్తగూడెం ఓఎస్డీ డేవిస్ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
రైల్వేస్టేషన్లో పేలుడు పదార్థాలు లభ్యం
మట్టెవాడ(వరంగల్): వరంగల్ రైల్వే స్టేషన్లో బుధవారం సాయంత్రం పేలుడు పదార్థాలు ఉన్న బ్యాగ్‌ను పోలీసులు కనుగొన్నారు. నిన్న సాయంత్ర ఆరు గంటల సమయంలో రైల్వే స్టేషన్‌లోని బుకింగ్ కౌంటర్ సమీపంలో వదిలివేసిన బ్యాగ్‌లో 6 జిలెటిన్ స్టిక్స్, 25 డిటొనేటర్స్, రెండు ఎలక్ట్రికల్ వైర్లను గుర్తించారు. ఈ బ్యాగ్‌ను గుర్తుతెలియని వ్యక్తి వదిలి వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.