భీమదేవరపల్లి: కరీంనగర్ జిల్లాలో భారీగా జిలిటెన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 480 జిలిటెన్ స్టిక్స్ లభించాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొవ్వూరు గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన దున్నపోతుల యాదగిరి బోరు బావులు తవ్వుతూ జీవనం సాగిస్తుంటాడు. జిలిటెన్ స్టిక్స్ ఉన్నాయనే సమాచారంతో సోదాలు చేసిన పోలీసులకు ఆయన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన జిలిటెన్ స్టిక్స్ బయటపడ్డాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యాదగిరి పరారిలో ఉన్నారు.