జగిత్యాల: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం కల్లెడ గ్రామంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రేషన్ డీలర్ల నుంచి సుమారు 50 క్వింటాళ్ల బియ్యాన్ని సేకరించి వాటిని బ్యాగుల్లో ప్యాక్ చేసి రవాణాకు సిద్ధంగా ఉంచినట్టు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామంలో తనిఖీలు చేసి 50 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిపై 6ఏ కింద కేసు నమోదు చేయనున్నట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
Published Tue, Nov 17 2015 1:06 PM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM
Advertisement
Advertisement