రాములును రక్షించడానికి చెట్టుపైకి ఎక్కుతున్న పర్శరాములు
సాక్షి, ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): మండలంలోని దుమాలలో ఓ గీత కార్మికుడు కల్లు గీయడానికి బుధవారం తాటి చెట్టుపైకి ఎక్కి మోకు జారడంతో అక్కడే చిక్కుకొని రెండు గంటల పాటు విలవిల్లాడాడు. చివరికి మరో గీతకార్మికుడి సాహసంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దుమాల గ్రామానికి చెందిన ఆరేటి రాములు ఎప్పట్లాగే కల్లు గీసేందుకు బుధవారం ఉద యం తాటి చెట్టు ఎక్కాడు.
కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నడుంపైనున్న మోకు భుజాలపైకొచ్చింది. దీంతో పట్టు తప్పి చెట్టుపైనే తలకిందులుగా వేలాడ సాగాడు. సమీపంలోని తోటి గీత కార్మికుడు ఆరేటి పర్శరాములు ప్రాణాలకు తెగించి చెట్టు పైకెక్కాడు. రాములు భుజం వద్ద ఉన్న మోకు ను సరిచేసి నడుంకు కట్టి కిందకు దించాడు. రాములును కాపాడిన పర్శరాములును సర్పంచ్ కదిరె రజిత, మండల ఉపాధ్య క్షుడు కదిరె భాస్కర్, గ్రామస్తులు అభినందించారు.
చదవండి: సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలు.. ఐదు జిల్లాల్లో పర్యటన
Comments
Please login to add a commentAdd a comment