Sircilla District
-
‘కేటీఆర్ టీస్టాల్’ మూసివేత వివాదాస్పదం
సిరిసిల్ల టౌన్/హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘కేటీఆర్ టీస్టాల్’ను అధికారులు మూసివేయించడం చర్చనీయాంశంగా మారింది. ట్రేడ్‌లైసెన్స్ లేకపోవడంతోనే మూసివేయించామని అధికారులు పేర్కొంటుండగా.. కేటీఆర్ పేరుతో టీస్టాల్ నిర్వహిస్తుండటంతో అధికారులు ఉద్దేశపూర్వకంగా మూసివేయించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బుధవారం జిల్లా కేంద్రం మానేరుతీరంలోని మార్కెట్ కాంప్లెక్స్, బతుకమ్మఘాట్ పరిసర ప్రాంతాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పరిశీలించారు. మడేలేశ్వర ఆలయం ఎదుట రెండు మున్సిపల్ టేలాల్లో టీస్టాల్స్ ఉండగా.. అందులో ఒకటి కేటీఆర్ టీస్టాల్ పేరుతో బత్తుల శ్రీనివాస్ దంపతులు నడిపిస్తున్నారు. కలెక్టర్ పర్యటనలో భాగంగా ఆ టీస్టాల్స్‌కు అనుమతులున్నాయా? అంటూ ఆరా తీస్తూనే ఒకవేళ లేకపోతే మూసివేయాలని మున్సిపల్ అధికారులకు మౌఖికంగా ఆదేశాలిచ్చారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ దంపతులు గుండెలు బాదుకుంటూ.. లైసెన్సు తీసుకోవాలని తమకు తెలియదని, అదేంటో చెబితే వెంటనే తీసుకుంటామని అధికారులను ప్రాధేయపడ్డారు. అయినా కలెక్టర్ ఆదేశించారని పేర్కొంటూ టీ స్టాల్ మూసివేయించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, కత్తెర వరుణ్, దార్ల సందీప్, గెంట్యాల శ్రీనివాస్, సబ్బని హరీశ్ ఆందోళన చేపట్టారు. ప్రతీది గుర్తు పెట్టుకుంటున్నా.. ఎవర్నీ వదలను సిరిసిల్లలో జరిగిన ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ‘ఎక్స్’లో ఘాటుగా స్పందించారు. ‘చిరువ్యాపారిపై కలెక్టర్ అనుచిత ప్రతాపం చూపించారు. ప్రతీది గుర్తు పెట్టుకుంటున్నా.. ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదు. ఇదే మాట మీద ఉంటానని మీకు మాట ఇస్తున్నా’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేర కు టీ షాపు యజమాని బి.శ్రీనివాస్ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు. -
తాటిచెట్టుపై విలవిల్లాడిన గీత కార్మికుడు.. ప్రాణాలకు తెగించి కాపాడి..
సాక్షి, ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): మండలంలోని దుమాలలో ఓ గీత కార్మికుడు కల్లు గీయడానికి బుధవారం తాటి చెట్టుపైకి ఎక్కి మోకు జారడంతో అక్కడే చిక్కుకొని రెండు గంటల పాటు విలవిల్లాడాడు. చివరికి మరో గీతకార్మికుడి సాహసంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దుమాల గ్రామానికి చెందిన ఆరేటి రాములు ఎప్పట్లాగే కల్లు గీసేందుకు బుధవారం ఉద యం తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నడుంపైనున్న మోకు భుజాలపైకొచ్చింది. దీంతో పట్టు తప్పి చెట్టుపైనే తలకిందులుగా వేలాడ సాగాడు. సమీపంలోని తోటి గీత కార్మికుడు ఆరేటి పర్శరాములు ప్రాణాలకు తెగించి చెట్టు పైకెక్కాడు. రాములు భుజం వద్ద ఉన్న మోకు ను సరిచేసి నడుంకు కట్టి కిందకు దించాడు. రాములును కాపాడిన పర్శరాములును సర్పంచ్ కదిరె రజిత, మండల ఉపాధ్య క్షుడు కదిరె భాస్కర్, గ్రామస్తులు అభినందించారు. చదవండి: సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలు.. ఐదు జిల్లాల్లో పర్యటన -
వెండితో సీతమ్మ వారికి సిరిసిల్ల చీర
-
జవాన్ అనిల్ కు కన్నీటి వీడ్కోలు..
-
రేవంత్ రెడ్డి కాన్వాయ్కి భారీ యాక్సిడెంట్... బెలూన్లు ఓపెన్ కావడంతో..
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్కి భారీ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ అతివేగంతో రావడంతో ఆరు కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరు కార్లు ధ్వంసం కాగా, పలువురు రిపోర్టర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సమయంలో రేవంత్ రెడ్డి కారులో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ కార్లలో రిపోర్టర్లు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన రిసోర్టర్లను, సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. ఐతే ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా ప్రమాదం కాకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలతో సిరిసిల్ల రిపోర్టర్లు బయటపడ్డట్టు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం రేవంత్ రెడ్డి శ్రీ పాద ప్రాజెక్టు సందర్శనకు వెళుతుండగా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజి వద్ద జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. (చదవండి: డీఎల్‌పీవోపై కొనసాగుతున్న విచారణ) -
కలుషిత ఆహారంతో 29 మంది చిన్నారులకు అస్వస్థత
సిరిసిల్లటౌన్: కలుషిత ఆహారంతో 29 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వీరిలో ఏడుగురు విద్యార్థులు వాంతులు, డీహైడ్రేషన్ బారిన పడ్డారు. బడిలో కొత్తగా నిర్మిస్తున్న సంపులో నింపిన నీటితో మధ్యాహ్న భోజనం వండి పిల్లలకు పెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేసిన విద్యార్థుల్లో 2 గంటలకు ఫుడ్‌పాయిజన్ లక్షణాలు కనిపించాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులు ఒకటో తరగతిలో ఐరా, వర్షిణి, రిషిత, రెండో తరగతిలో వర్షిణి, శ్రీజ, లక్కీ, వేదిక, వినతి, వరుణ్, శ్రీలక్ష్మి, మూడో తరగతిలో చెఫాన్, వర్షిణి, రిషి, నాలుగో తరగతిలో సంజన, ధీరజ్, రిషివర్ధన్, నిశాంత్, శివ, చరణ్, గౌతమ్, అభిలాష్, ఐదో తరగతిలో రాంచరణ్, శ్రీజ, రిష్రిత్, లాస్య, శామన్‌లిల్లి, రిషివర్ధన్, దివ్య, రిషిత్, ఇందు ఉన్నారు. 29 మంది చిన్నారులను 108 వాహనంలో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా డీఎంహెచ్‌వో సుమన్ మోహన్‌రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీధర్‌రావు ఆధ్వర్యంలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం 25 మందిని డిశ్చార్జి చేయగా.. తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. సంఘటనపై జిల్లా విద్యాధికారి రాధాకిషన్ విచారణకు ఆదేశాలిచ్చారు. మంత్రి కేటీఆర్ పిల్లల పరిస్థితిని తెలుసుకుని తదుపరి చర్యలకు డీఈవోకు ఆదేశాలు జారీచేశారు. -
నన్ను పెళ్లి చేసుకో.. లేదా పురుగు మందు తాగు..
బోయినపల్లి (చొప్పదండి): నన్ను ప్రేమించు..పెళ్లి చేసుకో.. లేదంటే పురుగు మందు తాగి చావు.. అంటూ యువకుడు బెదిరించడంతో క్రిమిసంహారకమందు తాగిన ఓ ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని తడగొండకు చెందిన మోకెనపెల్లి రాజు–స్వప్న దంపతుల కుమార్తె త్రిష (18) గంగాధరలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న తడగొండకు చెందిన కోరెపు సతీశ్ ప్రేమించాలంటూ ఆరు నెలలుగా యువతిని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సతీశ్‌ను హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోని యువకుడు సోమవారం ఎవరూ లేని సమయంలో త్రిష ఇంటికి వచ్చి ‘ప్రేమించు.. పెళ్లి చేసుకో.. లేదంటే పురుగుమందు తాగి చావు..’అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంట తెచ్చిన పురుగు మందు డబ్బా చూపిస్తూ ఆత్మహత్యకు ప్రేరేపించా డు. సతీశ్ వేధింపులు భరించలేక త్రిష పురుగు మందు తాగింది. అప్పుడే వచ్చిన త్రిష సోదరిని చూసిన సతీశ్ పరారయ్యాడు. త్రిషను ఆస్పత్రికి తరలించేలోపే మరణించింది. కాగా సతీశ్‌పై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరెపు సతీశ్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చంద్రమౌళి మంగళవారం తెలిపారు. -
సిరిసిల్ల అతలాకుతలం
సిరిసిల్ల: నైరుతి రుతుపవనాలకుతోడు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆదివారం ఉత్తర తెలంగాణ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీటమునగగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లాయి. వర్షాలు, వరద సంబంధ ఘటనల్లో ఐదుగురు మృతిచెందగా ఒకరు గల్లంతయ్యారు. పలుచోట్ల పిడుగుపాట్లకు వందలాది గొర్రెలు మృత్యువాతపడ్డాయి. పలుచోట్ల రోడ్లకు గండ్లుపడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సిరిసిల్లలో..:భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా అతలాకుతలమైంది. శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా ముస్తాబాద్‌లో 17.76 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలైన సర్దార్‌నగర్, అశోక్‌నగర్, సంజీవయ్యనగర్, శాంతినగర్, సిద్ధార్థనగర్ జలమయమయ్యాయి. ముస్తాబాద్ మండలంలో ఎగువమానేరు కాల్వకు గండిపడి జనావాసాలు, పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. జిల్లాలో మానేరువాగు, మూలవాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు కోతకు గురికావడంతో వీర్నపల్లి, నిమ్మపల్లి ప్రాంతాలకు రవాణా సౌకర్యం తెగిపోయింది. మధ్యమానేరు జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న యోగా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పలు జిల్లాల బాలలు అశోక్‌నగర్‌లో జలదిగ్బంధంలో చిక్కుకోగా వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిజామాబాద్, కామారెడ్డి విలవిల.. నిజామాబాద్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు భారీ వర్షాలకు విలవిల్లాడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్లో అత్యధికంగా 17.68 సెంటీమీటర్ల వర్షం కురవగా పట్టణంలోని వివిధ ప్రాంతాలు నీటమునిగాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని మాణిక్‌భండార్ వద్ద ఆదివారం సాయంత్రం మహారాష్ట్రలోని భరాడా గ్రామానికి చెందిన ప్రభు కాంబ్లే అనే యువకుడు కాలువలో పడి గల్లంతయ్యాడు. బోధన్ మండలంలోని సాలూర వద్ద మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మంజీర వంతెనలపై నుంచి తెలంగాణ, మహరాష్ట్రల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని గడ్డమీద తండా వద్దనున్న లోలెవల్ వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డిలో వాటర్ ట్యాంకుపై పిడుగు పడడంతో పిల్లర్ పెచ్చులూడాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఎదులపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పిడుగుపాటుకు 152 గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయి. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టణ సమీపంలో బతుకమ్మ వాగుకు వరద పోటెత్తడంతో వాగుపై నిర్మించిన వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు కోతకు గురై పెద్ద బుంగ పడింది. దీంతో ఇరువైపులా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. -
వినాయక చవితి రోజు షాకింగ్ ఘటన.. సోషల్ మీడియాలో వైరల్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల గోపాల్‌నగర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మండపం నుండి వినాయకుని ప్రతిమను దొంగలు ఎత్తుకెళ్లారు. వీధిలోని చిన్న పిల్లలు తొలిసారి ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. రాత్రి 12 గంటల వరకూ జనాలు, పిల్లలు అక్కడే ఉండగా, అర్థరాత్రి తర్వాత ప్రతిమ చోరీకి గురైంది. ఘటన పట్ల కాలనీ కాలనీ వాసుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం దొంగతనం వ్యవహారం వైరల్‌గా మారింది. మరో చోట తాళం వేసిన ఇంటి తలుపులు పగులకొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. గోపాల్ నగర్లో చోరీ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: గణేష్ ఉత్సవాలు షురూ.. ఈ జాగ్రత్తలు, సూచనలు మర్చిపోకండి! -
ఆత్మగౌరవంతో ముందుకు వెళదాం
సిరిసిల్ల: ఆకలితోనైనా చస్తాం.. కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టు కోమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పేర్కొ న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీలంతా కలసి ఆత్మగౌరవంతో ముందుకు వెళదామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం విశ్వకర్మీయుల ఆత్మగౌరవసభలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. తెలంగాణలో అగ్రకులాలు పేదలను విభజించి పాలిస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏకంగా బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్నే మార్చాలంటున్నారని విమర్శించారు. ‘నేను సిరిసిల్లకు వస్తుంటే అనేక అడ్డంకులు సృష్టించారు, మీ నాయన కుట్రలను భరించలేకనే 26 ఏళ్లు చేసిన ఉద్యోగాన్ని వదిలేసి ప్రజల కోసం బయటకు వచ్చా’అని ప్రవీణ్‌కుమార్.. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రగతిభవన్ వేదికగా అనేక కుట్రలు జరుగుతున్నాయన్నారు. ‘బహుజనులంతా ఒకరితో ఒకరు కలుద్దాం.. నిలుద్దాం.. గెలుద్దాం’అని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆయన గంభీరావుపేట మండలం నర్మాలలో కూడా మాట్లాడారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరిట 200 మంది పేదల వద్ద బలవంతంగా 370 ఎకరాల భూములు లాక్కున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. వారికి ఎకరానికి రూ.5 లక్షలు మాత్రమే చెల్లించారని, ఈ భూముల్లో అధికార పార్టీ నేతలు విల్లాలు కడుతున్నారని మండిపడ్డారు. బాధితులకు అండగా ఉంటానని ప్రవీణ్‌కుమార్ హామీ ఇచ్చారు. సిరిసిల్లలో దీక్షలు చేస్తున్న వీఆర్ఏల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. సిరిసిల్ల సభలో విశ్వకర్మ నాయకులు దాసోజు శ్రవణ్, ఆచారి, మురళి, మధుచారి తదితరులు పాల్గొన్నారు. -
పెద్దరాతియుగం నాటి చిత్రాల తావు గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో ఆదిమానవులు గీసిన చిత్రాల తావు వెలుగు చూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ బుర్కగుట్ట మీద ఈ చిత్రాలున్నాయి. ఇవి పెద్ద రాతియుగానికి చెందినవిగా భావిస్తున్నారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు అల్లె రమేశ్ ఈ చిత్రాలను గుర్తించినట్లు ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. చదరంలో తేలు, వృత్తాకారాలు, త్రిభుజాకార గీతలు, ఆరు వేళ్లున్నట్లుగా ఉన్న పాదాలు, చేతులు పైకెత్తిన మనిషి రూపాన్ని పోలిన చిత్రాలతో పాటు అంతుచిక్కని మరెన్నో చిత్రాలున్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లా ఒంటిగుండుపై కనిపించిన చిత్రాల తరహాలో ఇవి ఉన్నాయని, నరసింహస్వామి క్షేత్రం పక్కనే ఉండటంతో మొత్తం సున్నాలు కొట్టించటంతో చాలా చిత్రాలు అంతర్ధానమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉద్యోగం నుంచి తొలగించారని.. ఉరి వేసుకున్నాడు
కోనరావుపేట(వేములవాడ): ముప్పై ఏళ్లుగా చేస్తున్న పనిలోంచి అకారణంగా తొలగించడంతో మనస్తాపానికి గురైన పంచాయతీ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే కార్మికుడి మృతికి కారణమైన సర్పంచ్, సర్పంచ్ భర్తను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేటలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆకుల రామదాసు(68) గ్రామపంచాయతీలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న ఉపాధిహామీ పనుల పరిశీలనకు గ్రామానికి కేంద్ర బృందం రాగా..గ్రామస్తులు అడ్డుకుని సర్పంచ్, సర్పంచ్ భర్తపై ఫిర్యాదు చేశారు. గ్రామంలో తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. ఈ సంఘటనతో ఆగ్రహం చెందిన సర్పంచ్ లత భర్త ఆరె మహేందర్ పంపు ఆపరేటర్ రామదాసును దుర్భాషలాడుతూ విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పాడు. వరుసగా మూడ్రోజులు మహేందర్ దగ్గరికి వెళ్లి బతిమిలాడినా వినిపించుకోకపోవడంతో మనస్తాపం చెందిన రామదాసు బుధవారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని జామచెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. గ్రామస్తుల ఆగ్రహం సర్పంచ్, సర్పంచ్ భర్తను శిక్షించాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహా రం అందించాలంటూ గ్రామస్తులు ఆందోళనబాట చేపట్టారు. వేములవాడ ఆర్డీవో లీలావతి, డీఎల్పీవో మల్లికార్జున్ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
గిరిజన హక్కులను కాపాడుదాం: కోదండరామ్
సిరిసిల్లటౌన్: ఏళ్ల తరబడి పోడు భూముల్లో సాగు చేసుకుంటూ బతుకుతున్న గిరిజనులు, గిరిజనేతరులకు అండగా నిలుస్తామని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్మిక భవన్లో సీపీఐ ఆధ్వర్యంలో పోడు సాగుదారుల హక్కులపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ.. జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులు తరతరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నారని, వారి కి హక్కు పత్రాలివ్వడం సర్కారు బాధ్యత అని చెప్పారు. అటవీ చట్టాలన్నీ ఆదివాసులు, గిరిజను లకు అనుకూలంగా ఉన్నా, వాటిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగులో ఉన్న భూము లపై యాజమాన్య హక్కులు పొందడానికి రైతు లకు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లా డుతూ.. జిల్లాలోని 20వేల ఎకరాల్లో గిరిజనులు, ఇతర నిరుపేదలు సాగు చేసుకుంటున్నారని, తద్వారా సుమారు 10వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. ఆయా భూములపై యాజమాన్య హక్కులు వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కేఏ పాల్‌పై టీఆర్ఎస్ కార్యకర్త దాడి
సిద్దిపేట రూరల్, సిద్దిపేట కమాన్/తంగళ్లపల్లి (సిరిసిల్ల): ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తుండగా ఓ టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బస్వాపూర్ గ్రామ రైతులను పరామర్శించేందుకు సోమవారం హైదరాబాద్ నుంచి పాల్ బయలుదేరారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున సిరిసిల్ల సరిహద్దుకు చేరుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు సిద్దిపేట జిల్లా సరిహద్దు గ్రామం జక్కాపూర్‌లో పికెట్ ఏర్పాటు చేసి పాల్‌ను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్కడికి టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మీడియాతో పాల్ మాట్లాడుతుండగా జిల్లెల్ల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త అనిల్‌కుమార్ దాడి చేశాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జక్కాపూర్ రోడ్డుపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ఎదురైంది. పోలీసులు బందోబస్తు మధ్య పాల్‌ను వెనక్కి పంపారు. సిద్దిపేట పట్టణంలో పాల్ మాట్లాడుతూ.. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. రైతు కుటుంబాలను పరామర్శిస్తే తప్పేంటని నిలదీశారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలన్నారు. ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పాల్‌పై దాడిని ఖండిస్తూ బస్వాపూర్ గ్రామస్తులు నిరసన తెలిపారు. -
వైభవంగా రాజన్న కల్యాణోత్సవం
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది. 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు కల్యాణోత్సవానికి మున్సిపాలిటీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కమిషనర్ శ్యాంసుందర్‌రావు పట్టువస్త్రాలు, ఆలయ ఈవో రమాదేవి తలంబ్రాలు సమర్పించారు. స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు, బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణాల మధ్య రెండున్నర గంటల పాటు కల్యాణం కనులపండువగా సాగింది. ఎదుర్కోళ్ల సమయంలో వరుడి తరఫున స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, వధువు పక్షాన ఈవో రమాదేవి కట్నకానుకలు మాట్లాడుకున్నారు. అనంతరం స్వామివారిని పెద్దసేవపై ఊరేగించారు. కల్యాణ వేడుక ఆలయంలో నిర్వహించడం తో చాలామంది భక్తులు ఆలయం బయటే ఎండలో ఉండిపోయారు. ఎల్ఈడీ టీవీలు పనిచేయకపోవడంతో శివపార్వతులు గోల గోల చేశారు. కన్యాదాతలుగా గోపన్నగారి వసంత్–సరిత దంపతులు, వ్యాఖ్యాతగా తిగుళ్ల శ్రీహరిశర్మ, చంద్రగిరిశరత్ వ్యవహరించారు. కల్యాణోత్సవానికి లక్షమంది కిపైగా తరలివచ్చారు. 23న మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం జరగనుంది. -
కట్నం వేధింపులకు ముగ్గురి బలి
గంభీరావుపేట (సిరిసిల్ల): అదనపు కట్నం.. వేధింపులకు మూడు ప్రాణాలు బలయ్యాయి. ముక్కుపచ్చలారని చిన్నారులతో సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం జరిగిన ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం కొత్తపల్లిలో విషా దం నింపింది. ముగ్గురి మృతదేహాలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు. వివరాలిలా ఉన్నాయి.. గంభీరావుపేట మండలం లింగ న్నపేటకు చెందిన రేఖ (28)కు కొత్తపల్లికి చెందిన వరుకుటి రాజు తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. రేఖ తల్లిదండ్రులు దాదాపు రూ.9 లక్షల కట్నం, పది తులాల బంగారం, ఇతర లాంఛానాలతో పెళ్లి చేశారు. అయితే రాజు అదనపు కట్నం కావాలని రేఖను తరచూ శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. నెల క్రితం రేఖ తల్లిదండ్రులు రూ.లక్ష ఇవ్వగా, మూడు రోజుల క్రితం ద్విచక్రవాహనం కొనిచ్చారు. అయినా.. అతను రేఖను వేధించడం మానలేదు. దీంతో మానసికంగా కుంగిపోయిన రేఖ.. భర్త హింస ను తట్టుకోలేక తన పిల్లలు అభిజ్ఞ (3), హన్సిక (ఐదు నెలలు)లతో స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలో గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు. రేఖ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. -
అరచేతిలో ఆరోగ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరుల ఆరోగ్యవంతమైన జీవనానికి ముందడుగు పడింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని పరిశీలించి ఆ వివరాలను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా ఈ కార్యక్రమాన్ని ములుగు, సిరిసిల్ల జిల్లాలో శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య వివరాలు సేకరించడంతో పాటు 30 రకాల పరీక్షలు నిర్వహించనుంది. వాటి ఫలితా లను ప్రత్యేక పోర్టల్‌లో నిక్షిప్తం చేయనుంది. ఆ వ్యక్తికి మాన్యువల్ రిపోర్టులు ఇవ్వడం, ఫలితాల్లో తేడాలను గుర్తిస్తే మందులను ఉచితంగా పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలు అవసరమైతే పెద్దాసుపత్రికి రిఫర్ చేయడం జరిగిపోనుంది. కార్యక్రమాన్ని అతి త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. కీలక పరీక్షలతో ప్రొఫైల్.. హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని 18 సంవత్సరాలు నిండిన వారికే పరిమితం చేశారు. రోగాలు, ఇతర అనారోగ్య సమస్యలు 18 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా నమోదవుతున్నందున ప్రభుత్వం ఈ మేరకు నిర్ధారించింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ 30 రకాల పరీక్షలు చేయనుంది. ప్రధానంగా బ్లడ్ గ్రూపింగ్, మూత్రపిండాల పనితీరు, కాలేయం పనితీరుతో పాటు కొలెస్టరాల్, బ్లడ్ షుగర్, బ్లడ్ యూరియా తదితరాలు పరిశీలించనుంది. పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేయనుంది. ప్రతి పౌరుడికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేస్తుంది. ఈ సంఖ్య ఆధారంగా ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్ ప్రొఫైల్ పోర్టల్‌లో వివరాలను నిక్షిప్తం చేస్తుంది. పోర్టల్ రూపకల్పనలో హైదరాబాద్ ఐఐటీ సహకారం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఇలా.. ‘హెల్త్ ప్రొఫైల్’అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్రే కీలకం. కార్యక్రమంలో భాగంగా హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేస్తారు. హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు ముందుగా కుటుంబానికి చేరుకుని అర్హుల వివరాలు సేకరిస్తారు. వారికి విశిష్ట గుర్తింపు సంఖ్యను జనరేట్ చేసిన తర్వాత శాంపిల్స్ (నమూనాలు) తీసుకుంటారు. వాటిని ప్యాక్ చేసి బ్లడ్ గ్రూపింగ్, సీబీపీ కోసం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు. మిగతా పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నస్టిక్స్‌కు చేరవేస్తారు. అక్కడ పరీక్షలు ముగిశాక ఉన్నతాధికారు లు, వైద్యనిపుణుల ఆమోదం తర్వాత విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారంగా వివరాలను పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు వ్యక్తులకు యూనిక్ డిజిటల్ హెల్త్ కార్డుతో పాటు పరీక్షల ఫలితాల ప్రతులను ఇస్తారు. పరీక్షల్లో లోపాలు గుర్తించిన వారికి మెడిసిన్ కిట్, ఆరోగ్యశాఖ మంత్రి సందేశాన్ని ఇస్తారు. ఇతర జబ్బులున్నట్టు తెలిస్తే జిల్లా ఆస్పత్రి, నగరంలోని ప్రధాన ఆస్పత్రులు, బోధనాస్పత్రులకు రిఫర్ చేసి ప్రత్యేక చికిత్సను అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందం కృషి చేస్తుంది. -
‘డబుల్’ రానివారికి డబ్బులు
సిరిసిల్ల: రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాని అర్హులైన పేదలకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని, లబ్ధిదారులు సొంతస్థలంలో ఇల్లు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తుందని, జాగాలేనివారికి ప్రభుత్వమే స్థలం కేటాయిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను శనివారం ప్రారంభించారు. అలాగే, వేములవాడలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డు పనులకు భూమిపూజ చేశారు. ఆయా కార్యక్రమాల అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఖర్చులతోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు.. వచ్చిన తరువాత ఏం జరిగిందో.. ఏం జరుగుతోందో ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. పొలిటికల్ టూరిస్టులు అబద్ధాలతో అసంబద్ధ విమర్శలు చేస్తున్నారన్నారు. ‘ఇటీవల ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్న పథకాలలో ఒక్కటైనా వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలవుతున్నాయా..? అమలవుతున్నట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా’ అని కేటీఆర్ సవాల్ విసిరారు. కాశీలో వెయ్యి కోట్లు పెట్టిన మీరు కరీంనగర్ ఎంపీగా వేములవాడకు రూ.100 కోట్లు తెచ్చే తెలివి ఉన్నదా..? అని మండిపడ్డారు. సంక్షేమానికి సమ్మెట సునీత ఒక నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమానికి వెంకటాపూర్‌కి చెందిన సమ్మెట సునీతనే ఒక నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఆమెకు ఆసరా పెన్షన్ వస్తోందని, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందని, కూతురు పెళ్లికి కల్యాణలక్ష్మి కూడా రాబోతోందని కేటీఆర్ వివరించారు. సునీతను చూపిస్తూ ఇలాంటి పేద మహిళకు పైసా ఖర్చు లేకుండా ఇన్ని సంక్షేమ పథకాలు ఏనాడైనా ఇదివరకు అందాయా.. అని ప్రశ్నించారు. కేటీఆర్ ఆమెను వేదికపైకి పిలిపించి చెబుతుండగా కన్నీటి పర్యంతమైంది. ఇదే గ్రామానికి చెందిన మేడిశెట్టి రాజు కరెంట్‌షాక్‌తో చనిపోతే, రైతుబీమా రూ.5 లక్షలు, ‘సెస్’నుంచి మరో రూ.5 లక్షలు, టీఆర్ఎస్ పార్టీ పరంగా రూ.2 లక్షలు అందాయని చెప్పారు. నాకు 16 ఏళ్ల కిందటే షుగర్ వచ్చింది రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని వేములవాడ ఏరియా ఆస్పత్రిలో శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘పదహారేళ్ల కిందట హెల్త్ ఇన్సూరెన్స్ కోసం పరీక్షలు చేయించుకుంటే నాకు షుగర్ ఉందని తేలింది.. అప్పటి నుంచి మితంగా తినడం, జాగ్రత్తగా ఉండటం అలవాటైంది’అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.రానున్న ఆరోగ్య ఇబ్బందులను, రోగాలను ముందే గుర్తించేందుకు, వైద్యరంగంలో అవసరం మేర మౌలిక వసతుల కల్పనకు హెల్త్ ప్రొఫైల్స్ ఉపయోగపడతాయన్నారు. -
నీలకంథరా దేవా..
వేములవాడ/వరంగల్/నాగర్‌కర్నూలు: ఉదయమంతా శివయ్య దర్శనాలు.. రాత్రి జాగరణలు.. ‘ఓం నమఃశివాయ’నామస్మరణతో మంగళవారం రోజంతా శివాలయాలు మార్మోగాయి. పోటెత్తిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఇటు వేములవాడ రాజన్న.. అటు వేయిస్తంభాల ఆలయం లోని రుద్రేశ్వరుడు.. మరోపక్క చెంచుల మల్లికార్జునుడు.. భక్తజన దర్శనాలతో ఎటుచూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో లయకారుడు లింగాకారుడై ఉద్భవించిన పర్వదినం సందర్భంగా మంగళవారం ఉదయం స్వామికి మహాలింగార్చనను స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం ఘనంగా నిర్వహించింది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బీసీ సంక్షేమమంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వపక్షాన స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు తిరుమల తిరుపతి వెంకన్న తరఫున టీటీడీ ఏఈవో మోహన్‌రాజు, వేదమూర్తులు సూర్యనారాయణశాస్త్రి, జితేశ్‌ల బృందం రాజన్నకు పట్టువస్త్రాలను సమర్పించారు. ‘కొడుకునియ్యి రాజన్నా..నీకు కోడెను గడుతాం రాజన్నా..’ అని గీతాలాపన చేస్తూ 2 లక్షలమంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. శివదీక్షాపరులతో ఆలయ ప్రాంగణమంతా మంచిగంధం వర్ణమైంది. సాయంత్రం 6 గంటలకు వేదమూర్తులతో మహాలింగార్చన వైభవోపేతంగా సాగింది. అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఆలయాన్ని తెరిచే ఉంచుతున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ప్రకటించారు. దర్శనానికి 6 గంటలు సోమవారం అర్ధరాత్రి 12 నుంచి మంగళవారం వేకువజామున 3.30 వరకు స్థానికుల దర్శనాల అనంతరం లఘుదర్శనాలను కొనసాగించారు. దర్శనానికి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టింది. దీంతో క్యూలైన్లలో పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఆరోగ్యసిబ్బంది సేవలందించారు. భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన షవర్ల వద్ద స్నానాలు చేసి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. గుడిచెరువులో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాగా, రాజన్న దర్శనంలో మంగళవారం దాదాపు ఆరుసార్లు బ్రేక్ విధించారు. దీంతో భక్తులు క్యూలైన్లలోనే గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వేయిస్తంభాల గుడికి పోటెత్తిన భక్తులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. నగరంలోని వేయిస్తంభాల గుడికి భక్తులు పోటెత్తారు. ప్రధాన దారినుంచి రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులుదీరారు. రాత్రి శ్రీ రుద్రేశ్వరస్వామి, రుద్రేశ్వరదేవీ కల్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణంలో పాల్గొన్నారు. కాళేశ్వరంలో భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో పెద్దపట్నం వేశారు. రాత్రి స్వామి కల్యాణం జరిగింది. కురవి వీరన్న ఆలయంలో కల్యాణం వైభవంగా జరిగింది. పిల్లలమర్రి కిటకిట... సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలోని శివాలయం మహా శివరాత్రి సందర్భంగా మంగళవారం తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయాన్నే దర్శనాలు, అభిషేకాలు నిర్వహించేందుకు భక్తులు బారులుదీరారు. అనంతరం రాత్రి స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. -
శివరాత్రికి ఎములాడ సిద్ధం
వేములవాడ: పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎములాడ రాజన్న ఆలయం శివరాత్రి శోభ సంతరించుకుంది. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో సోమవారం నుంచి మార్చి రెండవ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జాతరకు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా రూ. 2 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాన్ని ఇప్పటికే రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేములవాడకు చేరుకునే 5 ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలికేలా భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రాజన్న చెంతకు చేరుకోండిలా.. రాజధాని హైదరాబాద్‌కు 150 కిలోమీటర్లు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి 32 కిలోమీటర్ల దూరంలో వేములవాడ ఉంది. స్వామివారి సన్నిధికి చేరుకోవాలంటే రోడ్డు మార్గం ఒక్కటే. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి ప్రతి అరగంటకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతి 10 నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చేవారు సిద్దిపేట మీదుగా.. వరంగల్ నుంచి వచ్చేవారు కరీంనగర్ మీదుగా వేములవాడ చేరుకోవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా గుడి చెరువుకట్ట కింద ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేశారు. దాదాపు 770 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులకు ప్రసాదాలు అందించేందుకు ధర్మగుండం పక్కనే ఉన్న ప్రసాదాల కౌంటర్, దేవస్థానం దక్షిణ ద్వారం వద్ద, పూర్వపు ఆంధ్రాబ్యాంకులో కౌంటర్ ఏర్పాటు చేశారు. లడ్డూ రూ.20, పులిహోర ప్యాకెట్ రూ.15 చొప్పున విక్రయిస్తారు. రాజన్న జాతర పూజలు మహాశివరాత్రి సందర్భంగా నిరంతర దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ధర్మ దర్శనం, రూ.50తో స్పెషల్ దర్శనం, రూ.100తో శీఘ్రదర్శనం చేసుకోవచ్చు. రూ.100తో కోడె మొక్కులు, రూ.200తో స్పెషల్ కోడె మొక్కులు తీర్చుకోవచ్చు. మార్చి ఒకటిన ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన అక్కడి అర్చకుల ప్రత్యేక బృందం, 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శివస్వాములకు, 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అద్దాల మంటపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 గంటల నుంచి వేకువజాము 3.30 గంటల వరకు లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు (ఈ సమయంలో భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు) నిర్వహిస్తారు. జాతరకు 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
‘మన ఊరు – మన బడి’కి రూ.కోటిన్నర విరాళం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఊరు–మన బడి’కార్యక్రమానికి కరీంనగర్ టీఆర్ఎస్ నాయకుడు, ‘చల్మెడ’వైద్య కళాశాల యజమాని చల్మెడ లక్ష్మీనరసింహారావు స్పందించారు. తన తండ్రి చల్మెడ ఆనందరావు సొంత గ్రామం సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మలకపేటలో పాఠశాల భవనాన్ని రూ. కోటిన్నరతో నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసిన నరసింహారావు కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను అభివృద్ధి చేసేలా రూపొందించిన బిల్డింగ్ ప్లాన్‌ను అందజేశారు. భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి రానున్న విద్యా సంవత్సరం నాటికే ప్రభుత్వానికి అప్పగిస్తామని ఈ సందర్భంగా ఆయన మంత్రికి తెలిపారు. పాఠశాలల అభివృద్ధి కోసం ఇటీవల ప్రభుత్వం ‘మన ఊరు– మన బడి’అనే కొత్త పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం దాతలను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే లక్ష్మీనర్సింహారావు స్కూల్ భవన నిర్మాణానికి ముందుకు వచ్చారు. -
మాటకు కట్టుబడి.. ఇళ్లు కట్టించి..
సిరిసిల్ల: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ డబుల్బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. పేదోళ్లందరికీ డబుల్బెడ్రూమ్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని కొద్దిగా వెనుకా.. ముందు అందరికీ ఇళ్లు వస్తాయని భరోసా ఇచ్చారు. పేదలకు మాట ఇస్తే సీఎం నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు. పనీపాట లేక కొందరు విమర్శలు చేస్తున్నారని.. వారికి దమ్ము ధైర్యం ఉంటే దేశంలో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రభుత్వమే నిర్మించి ఇచ్చిందో చూపెట్టాలని సవాల్ విసిరారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో 2.80 లక్షల డబుల్బెడ్రూమ్ ఇళ్లను రూ.18 వేల కోట్ల ఖర్చుతో నిర్మించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చే ఒక్క అర్ర ఇల్లుకోసం కూడా చేయి తడపాల్సి వచ్చేది. ఇప్పుడు ఎవరికీ ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా లంచం అడిగితే చెంప మీద కొట్టండి.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఏదైనా పట్టుబడితే ఆ పని అయ్యే వరకు సీఎం కేసీఆర్ వదలిపెట్టరని, ఆయన జిద్దు మనిషని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 270 కోట్ల మొక్కలు నాటించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. రాష్ట్రంలో 62 లక్షల మంది రైతులకు రూ.52వేల కోట్లు రైతుబంధు కింద జమ చేశారని, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంలో రూ.8,500 కోట్లు పంపిణీ చేశారని, 11 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చారని వివరించారు. -
మర్రిచెట్టుకు మళ్లీ ప్రాణం
కోనరావుపేట(వేములవాడ): ఎండిన చెట్టుకు ప్రకృతి ప్రకాశ్ జీవం పోస్తే.. చిగురించిన మర్రిచెట్టును తరలించి పునరుజ్జీవం నింపారు ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 70 ఏళ్ల మర్రిచెట్టు వేళ్లతో సహా పడిపోయింది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాశ్ చెట్టుకు మూడు నెలలు నీళ్లు పోయడంతో చిగురించింది. మర్రిచెట్టును తరలించేందుకు రూ.50 వేలకు పైగా అవసరం కావడంతో ప్రకాశ్ దాతల సహకారం కోరారు. విషయం తెలుసుకున్న సంతోష్‌కుమార్ చెట్టును తరలించేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం రెండు భారీ క్రేన్లను పంపించడంతో చిగురించిన మర్రిచెట్టును సుద్దాల నుంచి తరలించారు. ప్రస్తుతం ఈ మర్రిచెట్టును సిరిసిల్ల కలెక్టరేట్లో నాటే పనులు కొనసాగుతున్నాయి. -
పుస్తెలమ్మి.. లంచం ఇమ్మంటుండ్రు.. డబుల్ బెడ్రూం అక్రమాలపై గొంతెత్తిన మహిళ
సిరిసిల్ల టౌన్: ‘ఓట్లప్పుడు మాలాంటి గరీబోళ్లకు డబుల్ బెడ్రూం ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానం చేసిండు. అదే ఆశతో ఉంటున్నాం. కానీ.. సిరిసిల్లలో అధికారులు లంచాలు ఇస్తేనే పని చేస్తున్నారు. డబుల్బెడ్రూం ఇల్లు కోసం పుస్తెలు అమ్మి లంచం ఇవ్వాలని వేధిస్తున్నారు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌కు చెందిన నందగిరి మల్లిక మున్సిపల్ కమిషనర్ వెల్దండి సమ్మయ్యను నిలదీసింది. మల్లిక వివరాల మేరకు.. అధికారులు స్థానిక కమ్యూనిటీ హాలులో డబుల్బెడ్రూం ఇళ్ల అర్హుల లిస్టును మంగళవారం ప్రకటించారు. లిస్టులో మల్లిక కుటుంబం పేరు లేదు. దీంతో దివ్యాంగుడైన తన భర్త పేరు లిస్టులో రాలేదని, తాము ఏ రకంగా అర్హులం కాదని మల్లిక వేదికపై ఉన్న కమిషనర్ వెల్దండి సమ్మయ్యను నిలదీసింది. ‘మా ఆయనకు ఒక చేయి పూర్తిగా పనిచేయదు. నేను ఆ ఇంట్లో, ఈ ఇంట్లో పాచిపని చేసి ఇద్దరు పిల్లలతో పాటు అత్తను పోషిస్తున్న. పదమూడేళ్లుగా పద్మనగర్లోనే కిరాయికి ఉంటున్నం. డబుల్బెడ్రూం కోసం గంపెడాశతో దరఖాస్తు చేసుకున్న. ఆర్పీల ముందే ఇద్దరుసార్లు వచ్చి పార్కులో కూర్చుని రూ.లక్ష లంచం అడిగిండ్రు. అవే ఉంటే డబుల్బెడ్రూం ఇండ్లకోసం ఎందుకు దరఖాస్తు చేసుకుంటా? ఇప్పుడు లిస్టులో పేరు తీసేసిండ్రు. మాకు ఎక్కడా జాగలు, సొంతిల్లు లేవు. పుట్టింటి, అత్తింటి ఆస్తులు కూడా లేవు. ఏ విచారణకైనా సిద్ధం. మేము ఏవి«ధంగా అర్హులము కాదో చెప్పండి. నాకు న్యాయం కావాలి’ అంటూ వేదికపై తన బాధను వెలిబుచ్చింది. మల్లిక ఒక్కతే కాదు.. పద్మనగర్ వార్డుసభలో జాబితాలో పేర్లు రానివారి రోదనలు మిన్నంటాయి. అర్హులైన తమ పేర్లు లిస్టులో లేకపోవడమేంటంటూ వారు అధికారులు, ప్రజా ప్రతినిధులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదోళ్లను లంచాలు అడిగి ఏం బాగుపడుతారంటూ వాపోయారు. దీంతో చివరకు అర్హులైన పలువురి పేర్లను డ్రాలో వేయించడానికి మున్సిపల్ కమిషనర్ వెల్దండి సమ్మయ్య అనుమతించారు. -
సీఎంఆర్ఎఫ్కు యువ రైతు విరాళం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం నీళ్లతో తన బీడు భూమిలో పంటలు పండించిన ఓ యువ రైతు ముఖ్యమంత్రి సహాయ నిధికి పదివేల రూపాయలను విరాళంగా అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం, బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస్‌రెడ్డి అనే యువ రైతు తన పంట ఆదాయంలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏడాదిలో తాను పండించే రెండు పంటల నుంచే వచ్చే ఆదాయంలో ‘పంటకు పదివేల రూపాయల’లెక్కన ఆరునెలలకోసారి సీఎంఆర్ఎఫ్కు జమ చేయాలనే సంకల్పంతో శుక్రవారం ప్రగతి భవన్‌కు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రూ.10 వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ యువత వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవడం సంతోషకరం. ఏదో సంస్థలో అరకొర జీతానికి పనిచేయడమే ఉద్యోగం అనే మానసిక స్థితినుంచి వారు బయటపడుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. తమ స్వంత గ్రామాల్లోనే పచ్చని పంటపొలాల మధ్య ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ వ్యవసాయాన్ని ఉపాధిగా ఎంచుకుని తమ కాళ్లమీద నిలబడడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి తన సంపాదనలోంచి సామాజిక బాధ్యతగా కొంత మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్కు కేటాయించాలనుకోవడం గొప్ప విషయం. శ్రీనివాస్‌రెడ్డి స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలి. అతనికి నా అభినందనలు’అని ప్రశంసించారు. -
1,500 ఏళ్ల క్రితమే పట్నం చిత్రాలు?
సాక్షి, హైదరాబాద్: కొమురవెల్లి మల్లికార్జున దేవాలయం, ఇతర దేవాలయాల్లోనూ జాతరలసమయంలో పట్నం ముగ్గు వేయడం ఆచారం. అయితే దాదాపు 1,500 ఏళ్ల కిందటే ఈ తరహా చిత్రాలను ఓ పెద్ద బండరాతిపై వేసిన విషయం తాజాగా వెలుగు చూసింది. చూడడానికి కొంత భిన్నంగా ఉన్నా.. అది పట్నం ముగ్గు లాంటిదేనని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. ఆదిమానవులు బండ రాళ్లపై చెట్ల పసరు, జంతు రక్తం, చమురు, రంగురాళ్ల పొడితో ఎర్ర రంగు తయారుచేసి గీసిన బొమ్మలు చాలాచోట్ల వెలుగు చూశాయి. అలాగే ఇక్కడ కూడా ఎర్ర రంగుతో ఈ చిత్రాలు వేసి ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె గ్రామ శివారులోని అడవిలో శితారి (చిత్తారు)గట్టు మైసమ్మ గుట్టమీద వీటిని గుర్తించారు. వీటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శివానంద వెలుగులోకి తెచ్చారని ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. అందులో వృత్తం, వాటిలోపల మళ్లీ వృత్తాలు, మధ్యలో చేతులెత్తి నిలబడ్డ మనిషి ఆకృతిని పోలిన చిత్రం, వృత్తం నుంచి బయటకు పొడుచుకొచ్చినట్టుగా కిరణాలు గీశారు. స్థానికులు దీన్ని మైసమ్మగా కొలుస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇవి మత, ధార్మిక విశ్వాసాలకు సంబంధించినవని, 1,500 ఏళ్లకు పూర్వం గీసినవై ఉంటాయని హరగోపాల్ చెప్పారు. -
ఫేస్బుక్ లైవ్: ‘సిరిసిల్ల టౌన్ సీఐ వేధిస్తున్నాడు.. విషం తాగి చనిపోతున్నా’
సిరిసిల్ల: పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ ఆరోపిస్తూ.. ఓ యువకుడు ఫేస్బుక్ లైవ్‌లో పురుగుల మందు తాగాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌కు చెందిన యువకుడు గొలిసెల దిలీప్ (23) ట్రాక్టర్ డ్రైవర్. తనను సిరిసిల్ల టౌన్ సీఐ అనిల్‌కుమార్ వేధిస్తున్నాడని, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించాడని, మళ్లీ తనపై మరో కేసు నమోదు చేశాడని లైవ్‌లో ఆరోపించాడు. వేములవాడ శివారులోని చింతలఠాణాకు చెందిన యువతిని ప్రేమించానని, సదరు యువతితో కలిసి ఉన్న ఫొటోలను పోలీసులు తొలగించారని, ఆమెను వదిలివేయాలని, మరచిపోవాలని వేధిస్తున్నారని పేర్కొన్నాడు. రౌడీషీట్ తెరుస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పాడు. సదరు యువతిని వేధిస్తున్నానంటూ గతంలో కూడా ఓ కేసు నమోదు చేసి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం మరో కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని బెదిరించారని, దీంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఫేస్బుక్ లైవ్‌లో పురుగుల మందు తాగాడు. బస్వాపూర్–నేరెళ్ల గ్రామాల మధ్య దిలీప్ ఉన్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న దిలీప్‌ను సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దిలీప్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఫొటోలు చూపించి బ్లాక్మెయిల్ చేశాడు యువతి ఫొటోలు తీసి దిలీప్ ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ విషయంలో గతంలో పోలీసు కేసు నమోదైంది. జైలుకు వెళ్లి వచ్చా డు. అయినా మళ్లీ అతడి వేధింపులు తగ్గకపోవడంతో షీ–టీమ్‌ను ఆశ్రయించారు. షీ–టీమ్ సూచనలతో అతడిపై మరో కేసు నమోదు చేశాం. యువతిని వేధిస్తున్న అంశంలో చట్టబద్ధంగానే వ్యవహరించాం. అతన్ని మేం వేధించలేదు. – అనిల్‌కుమార్, సిరిసిల్ల టౌన్ సీఐ -
ఈత సరదాకు ఆరుగురు బలి
సిరిసిల్ల: ఈత సరదా ఆరుగురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. దిగిన వారిని దిగినట్లే మానేరు వాగు మింగేసింది. ఈ హృదయ విదారక సంఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులో చోటుచేసుకుంది. ఏం జరిగిందంటే... సిరిసిల్ల శివారులోని రాజీవ్‌నగర్‌కు చెందిన ఎనిమిది మంది పిల్లలు స్థానిక కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్లో 6వ, 8వ, 9వ తరగతి చదువుతున్నారు. పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవం అనంతరం మధ్యాహ్నం నుంచి బడికి సెలవు ఇచ్చారు. దీంతో కొలిపాక గణేశ్, కొంగ రాకేశ్, శ్రీరాము క్రాంతికుమార్, తీగల అజయ్, జడల వెంకటసాయి, కోట అరవింద్, దిడ్డి అఖిల్, వాసాల కల్యాణ్‌లు ఇంటర్ ఫస్టియర్ చదివే సింగం మనోజ్‌తో కలసి రాజీవ్‌నగర్ శివారులో క్రికెట్ ఆడారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నెహ్రూనగర్ మానేరు తీరంలోని చెక్‌డ్యామ్ వద్దకు ఈత కొట్టేందుకు సైకిళ్లపై వెళ్లారు. చెక్‌డ్యామ్ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉన్న విషయాన్ని గమనించకుండానే లోపలికి దిగారు. వారిలో ఎవరికీ ఈత రాదు. కొలిపాక గణేశ్ (14), కొంగ రాకేశ్ (12), శ్రీరాము క్రాంతికుమార్ (14), తీగల అజయ్ (14), జడల వెంకటసాయి (15), సింగం మనోజ్ (16) ఇలా.. దిగినవారు దిగినట్టే నీటిలో మునిగిపోతూ కాపాడాలని కేకలు వేశారు. భయపడిన మిగిలిన విద్యార్థులు కోట అరవింద్ (14), దిడ్డి అఖిల్ (13), వాసాల కల్యాణ్ (15)లు ఇళ్లకు పరుగుపరుగున వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు వివరించారు. దీంతో అందరూ కలిసి మానేరుకు చేరుకుని గాలింపు చేపట్టి సోమవారం సాయంత్రానికి కొలిపాక గణేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు, రెస్క్యూ టీమ్ సభ్యులు మంగళవారం ఉదయం వాగులో గాలింపు ముమ్మరం చేయగా వెంకటసాయి, రాకేశ్, క్రాంతికుమార్, అజయ్ శవాలు బయటపడ్డాయి. మనోజ్ మృతదేహం కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఘటనాస్థలిని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి సందర్శించారు. మంగళవారం సాయంత్రం నాలుగు మృతదేహాలను ఒకే ప్రాంతంలో ఖననం చేశారు. ఆ సమయంలో తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో మానేరు తీరం దద్దరిల్లింది. బడికి సెలవు ఇవ్వకపోయినా పిల్లలు బడిలోనే ఉండేవారని బాధితుల బంధువులు వాపోయారు. కాగా, మృతిచెందిన ఆరుగురిలో గణేశ్, వెంకటసాయి, మనోజ్, క్రాంతికుమార్ కిందటి నెల జరిగిన వెంకన్న జాతరలో కల్యాణ్, అరవింద్‌లతో సెల్ఫీ దిగారు. ఆప్తమిత్రులతో అదే చివరి ఫొటో అయిందంటూ మిగిలిన మిత్రులు వాపోతున్నారు. కేటీఆర్ సంతాపం.. విద్యార్థులు జలసమాధి కావడంపై మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ప్రభుత్వపరంగా బాధితుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ప్రాజెక్టు వద్ద రక్షణ ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఘటనపై సంతాపం తెలిపారు. ఈ పాపం ఎవరిది? సిరిసిల్ల నెహ్రూనగర్ వద్ద ప్రభుత్వం ఈ ఏడాదే రూ. 12 కోట్లతో మానేరు వాగులో 600 మీటర్ల మేర చెక్‌డ్యామ్ నిర్మించింది. అయితే నాణ్యతా లోపం, కాంట్రాక్టర్ల ధనదాహానికి తోడు ఇటీవలి వర్షాలు, వరదలకు చెక్‌డ్యామ్ తెగిపోయింది. ఆ ప్రదేశం మీదుగానే వరద ప్రవహిస్తోంది. దీంతో వాగుకు కుడివైపు నుంచే ఎక్కువ వరద వెళ్లడం.. అక్కడి నుంచే కొందరు అక్రమార్కులు ఇసుకను తోడేయడంతో భారీ గోతులు ఏర్పడి పిల్లలు నీటి లోతును గుర్తించక అందులో ఈతకు వెళ్లి బలయ్యారు. -
హెల్త్ ప్రొఫైల్‌కు సాఫ్ట్వేర్ రూపకల్పన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లా ల్లో ప్రయోగాత్మకంగా హెల్త్ ప్రొఫైల్ తయా రీకి వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆయా వ్యక్తులను హెల్త్ చెకప్ చేసి ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు హైదరాబాద్ ఐఐటీ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ రూపొందించారు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ పనితీరుపై సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ అధికారు లతో చర్చించారు. హెల్త్ ప్రొఫైల్‌పై సమగ్ర కార్యాచరణను రూపొందించడానికి త్వరలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహి స్తారు. కాగా, గ్రామాలు, పట్టణాల్లోని ఇంటిం టికీ వెళ్లి కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఎత్తు, బరువు, బీపీ, షుగర్ పరీక్షలు చేస్తారు. ఈసీజీ సహా కొన్ని రక్త, మూత్ర పరీక్షలను మాత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తారు. బ్లడ్ గ్రూప్, రక్తంలో ఆక్సిజన్ శాతం, గుండె కొట్టుకునే తీరు తదితర పరీక్షలు చేస్తారు. వీటితోపాటు ఇంకా ఏమైనా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అనేదానిపై కూడా పరీక్ష చేసి వివరాలు నమోదు చేస్తారు. ఈ సమాచారాన్ని సేకరించి ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు ప్రతి వ్యక్తికి ఒక ఏకీకృత నంబర్ కేటాయిస్తారు. ఈ రెండు జిల్లాల తర్వాత మిగిలిన జిల్లాల్లోనూ నిర్వహి స్తామని అధికారులు వెల్లడించారు. -
అడవి కబ్జాపై ఆకాశరామన్న ఉత్తరాలు రాయండి
సిరిసిల్ల: భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిపాటు డిజిటల్ భూసర్వేలు నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో శనివారం పోడుభూములపై అఖిలపక్ష నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్రవ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అడవిని.. పుడమిని కాపాడేందుకు నవంబర్ 8వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో అర్జీలు స్వీకరిస్తున్నామని, వాటిని పరిశీలించి శాస్త్రీయంగా గూగుల్ మ్యాప్స్‌తో విశ్లేషించి అర్హులకు పట్టాలిస్తామని తెలిపారు. మళ్లీ అడవుల జోలికి వెళ్లకుండా కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ కృషితో హరితహారంలో అగ్రస్థానంలో ఉన్నామని, నాలుగున్నర శాతం అడవి పెరిగిందని అన్నారు. ‘ధరణి’తో అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని, ఇప్పటికే 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పారు. ధరణితో నేరుగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని, రెవెన్యూ అవినీతి తగ్గిందని మంత్రి స్పష్టం చేశారు. దేశం మొత్తంగా ధరణిని అనుసరించే రోజులు వస్తాయన్నారు. అక్షాంశాలు.. రేఖాంశాలతో సర్వే అక్షాంశాలు.. రేఖాంశాల ఆధారంగా సంపూర్ణ డిజిటల్ భూసర్వే చేయిస్తామని కేటీఆర్ అన్నారు. ఇది పూర్తయితే భూముల హద్దులు, వాటి యజమానుల వివరాలు పక్కాగా నమోదవుతాయని తెలిపారు. అంతకంటే ముందు 2005 నాటి రిజర్వ్ ఫారెస్ట్ భూముల చట్టం ఆధారంగా భూమిని నమ్ముకున్న గిరిజనుల్లో అర్హులకు పారదర్శకంగా పట్టాలిస్తామన్నారు. ఇందులోనూ ఎవరైనా పైరవీలు చేసినా, అనర్హులకు అండగా ఉన్నా జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించారు. ఎవరైనా అటవీ భూములను కబ్జా చేస్తే వెంటనే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయాలని, ఆకాశరామన్న ఉత్తరం రాసినా.. సరిపోతుందని మంత్రి వివరించారు. అడవులను నరికివేసే వారిపై కఠినంగా ఉంటామన్నారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందం అటవీ భూములను ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు పట్టాలిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టమే ప్రతిబంధకంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ చట్ట సవరణకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్తానని చెప్పారని వివరించారు. క్షేత్రస్థాయిలో అర్జీల స్వీకరణ పూర్తయిన తర్వాత సమగ్ర సమాచారంతో మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో అటవీభూములను ఆక్రమించబోమని, ఎవరైనా కబ్జా చేసినా సహించబోమని అఖిల పక్షనేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
యాసంగిలో వరిసాగు వద్దు
సిరిసిల్ల: యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా వే రుశనగ, పొద్దుతిరుగుడు, కందులు, కూరగాయలు, ఆయిల్‌పామ్ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులకు సూచిం చారు. ప్రత్యామ్నాయ పంటల ఆవశ్యకతను వ్యవసాయాధికారులు రైతులకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై రైతుబంధు సమితి సభ్యులకు మంత్రి కేటీఆర్ అవగాహన కల్పించారు. దొడ్డు వడ్లు కొనమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని మంత్రి సూచించారు. దొడ్డు వరి వద్దనే విషయాన్ని రైతులకు కరాఖండిగా చెప్పాలని సూచించారు. ఆదర్శ రైతు పర్శరాములు బ్లాక్‌రైస్ పండించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో ప్రస్తావించారు. అయితే మార్కెటింగ్ లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆ రైతు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. మార్కెటింగ్ అంశాన్ని తెలుసుకుని చెప్తానని మంత్రి స్పష్టం చేశారు. దేశానికి తెలంగాణే ఆదర్శం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.5 లక్ష ల బీమాను అమలు చేస్తున్నామని, ఈ విషయంలో తెలంగాణ, దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. అలాగే రైతుబంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతుల రుణమాఫీ వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నా రు. ఇప్పటి వరకు 9 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశామని వివరించారు. రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి.. రైతులు ఎక్కడ ఏ పంట వేశారన్న సమాచారం.. వ్యవసాయ అధికారుల వద్ద పక్కాగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రైతువేదికల్లో క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులు ముందు గా బాధ్యత తీసుకుని ప్రత్యామ్నాయ పంటలు వేయాలని, ఇతర రైతులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. అలాగే ఆయిల్‌పామ్ సాగు వివరాలు తెలుసుకోవడానికి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు సిరిసిల్ల జిల్లా రైతులను తీసుకెళ్లాలని కేటీఆర్ అధికారులకు సూచిం చారు. ముస్తాబాద్ మండలం మోహినికుంటలో తాను కూడా 15 ఎకరాల భూమి తీసు కుని స్వయంగా ఆయిల్‌పామ్ సాగు చేస్తానని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎడతెరిపిలేని వర్షం.. జల దిగ్బంధంలో సిరిసిల్ల
-
సీఎం కేసీఆర్ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సిరిసిల్ల నుంచి సర్దాపూర్‌లో మార్కెట్ యార్డు ప్రారంభోత్సవానికి సీఎం వెళ్తుండగా చంద్రపేట మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ నాయకులు, వికలాంగుడు శ్రీనివాస్ రోడ్డు దాటుతుండగా, అప్పటికే సీఎం కాన్వాయ్ అక్కడికి చేరడంతో నిరసన తెలిపేందుకు వస్తున్నాడేమోనని పోలీసులు అతని లాగేయడంతో కింద పడ్డారు. తాను టీఆర్ఎస్ నాయకున్నేనని చెప్పినా వినకుండా పోలీసులు కింద పడేసి తొక్కారని శ్రీనివాస్ రోడ్డుపై బైఠాయించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు స్థానికుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శ్రీనివాస్‌ను తన్నిన పోలీస్.. క్షమాపణ చెప్పాలని స్థానికులు డిమాండ్ చేశారు. పోలీస్ అధికారి అక్కడికి చేరుకుని స్థానికులను సముదాయించడంతో ఆందోళన సద్దుమణిగింది. -
నా ప్రస్థానాన్ని ఎవరూ ఆపలేరు: సీఎం కేసీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సీఎం ప్రారంభించారు. 15 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. అనంతరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్, ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌ను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తన ప్రస్థానాన్ని, ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరన్నారు. లక్ష్యంగా దిశగా వెళ్తున్నాం.. ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. 9 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్‌సీఐకి ఇచ్చామని, రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి గొర్రెల పంపిణీ చేస్తున్నామని సీఎం తెలిపారు. వలస వెళ్లినవారు తిరిగి ఊళ్లకు వస్తున్నారని పేర్కొన్నారు. ‘‘మిషన్ కాకతీయ కారణంగా భూగర్భ జలాలు పెరిగాయి. తెలంగాణలో నీళ్ల కోసం 500-600 మీటర్లు లిఫ్ట్ చేయాలని ప్రధాని అంటే.. నేను తీవ్రంగా వ్యతిరేకించా. తెలంగాణలో 50 మీటర్లు లిఫ్ట్ చేస్తే నీళ్లు వస్తాయని ప్రధానికి చెప్పా. కాళేశ్వరం పూర్తవుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఇప్పుడు అద్భుతంగా కళ్లముందు కనిపిస్తోంది. డిస్కవరీలో కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రసారం చేశారని’’ సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లులపై రాద్ధాంతం చేస్తున్నారు. రైతుల కోసం కాళేశ్వరానికి రూ.10వేల కోట్ల బిల్లులైనా భరిస్తా. ఏప్రిల్, మే నెలలో అప్పర్ మానేరు నిండుతుందని ఎవరు ఊహించలేదు. అప్పర్ మానేరు నుంచి గోదావరిలో కలిసే వరకు సజీవ జలధారగా ఉంది. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 3 లక్షల ఎకరాలకు నీళ్లు. మిషన్ భగీరథ ఒక అద్భుతం. 11 రాష్ట్రాల నుంచి వచ్చి మిషన్ భగీరథను పరిశీలించారు. చేనేత కార్మికుల కోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చాం.చేనేత కార్మికులకు బీమా కల్పిస్తాం. ఒక్కో చేనేత కార్మికుడికి రూ.5 లక్షల చొప్పున బీమా కల్పిస్తాం. రూ.10 వేల కోట్లతో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తాం. తెలంగాణలో కొత్తగా 13 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతున్నాం. వేములవాడ రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. దళితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం. త్వరలో 57 ఏళ్లు నిండిన అర్హులందరికి వృద్ధాప్య పింఛన్ అందిస్తామని’’ సీఎం కేసీఆర్ తెలిపారు. -
బుల్లి మగ్గం.. సీఎంకు బహుమానం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి నేడు(ఆదివారం) సిరిసిల్లకు వస్తున్న సీఎం కేసీఆర్‌కు బహుమతిగా అందించేందుకు నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ బుల్లి మగ్గాన్ని సిద్ధం చేశాడు. కర్రలు, చిన్న మోటార్లో పింజర్లతో కూడిన పవర్‌లూమ్‌ను తయారు చేశాడు. ఆ మగ్గంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలతో కూడిన బట్టను, గులాబీ జెండాను ఉంచాడు. బ్యాటరీ సాయంతో మర మగ్గం చకచకా నడుస్తుంది. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ముఖ్యమంత్రికి ప్రత్యేక బహుమతి అందించేందుకు రూ.10 వేలు వెచ్చించి హరిప్రసాద్‌తో ఈ బుల్లి మగ్గం తయారు చేయించాడు. గతంలో హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, చేనేత వస్త్రంపై పలు చిత్రాలను నేశాడు. -
పేదలంటే చిన్నచూపు ఎందుకు?: వైఎస్ షర్మిల
సాక్షి, సిరిసిల్ల: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేదలంటే చిన్నచూపు ఎందుకని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేరిస్తే పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం ఉచితంగా దక్కేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో శుక్రవారం కరోనా బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు జబ్బు చేస్తే ఉచితంగా వైద్యం దక్కాలని దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీని ప్రారంభించారని గుర్తుచేశారు. ఉచితంగా వైద్యం పొందడం పేదల హక్కు అని, ప్రపంచంలో ఎవరూ చేయని ఆలోచన వైఎస్సార్ చేసి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని షర్మిల గుర్తుచేశారు. కరోనాతో వేలాది మంది మరణించారని, కరోనా వైద్యం ఖర్చులు భరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? అని షర్మిల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు కరోనా వస్తే యశోదలో చేరారని, అదే పేదలకు వస్తే ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాలా? ఇదెక్కడి న్యాయమని అడిగారు. ప్రభుత్వ ఆస్పత్రులపై సీఎం కేసీఆర్‌కు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని షర్మిల డిమాండ్ చేశారు. కొందరు టీఆర్ఎస్ నాయకులు వై.ఎస్. రాజశేఖరరెడ్డిని కించపరిచేలా మాట్లాడుతున్నారని, తెలుగు ప్రజలకు వైఎస్సార్ అంటే ఏమిటో తెలుసన్నారు. ఆయన్ను ఏమైనా అంటే ఖబర్దార్.. ఊరుకునేది లేదని షర్మిల హెచ్చరించారు. అంతకుముందు సిరిసిల్లలో నేతన్న విగ్రహానికి పూలమాల వేసిన ఆమె అల్మాస్పూర్లో కరోనా బాధితులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఆమె వెంట పార్టీ నాయకులు కొండ రాఘవరెడ్డి, పి.రాంరెడ్డి, ఇంద్రాశోభన్, రాజగోపాల్, రాంరెడ్డి, అమృతసాగర్, సంధ్యారెడ్డి, శైలజారెడ్డి, మహేశ్‌యాదవ్, చొక్కాల రాము తదితరులు ఉన్నారు. చదవండి: సకల జనుల తెలంగాణే లక్ష్యం: వైఎస్ షర్మిల -
ఆర్ధిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై బలవన్మరణం
-
హద్దులు ఎలా తెలిసేది?
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలోని 13 మండలాల్లో 255 గ్రామాలు, 171 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం 91,416 సర్వేనంబరు ఉండగా.. వారి పరిధిలో 4,68,532 ఎకరాల భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. వీటిని సుమారు నాలుగు దశాబ్దాల క్రితం సర్వే చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల భూరికార్డుల ప్రక్షాళన సర్వే చేపట్టి కొన్నింటిని పరిష్కరించింది. చాలా వరకు వివాదాస్పదంగా ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సిన అధికారులు.. సర్వేయర్ల కొరతతో పనిలో జాప్యమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాలు ఉండగా 9 మంది సర్వేయర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. జిల్లా కార్యాలయంలో ఇద్దరు డెప్యూటీ సర్వేయర్లు, మరో ఇద్దరు సర్వేయర్లు ఉండాల్సి ఉండగా.. ఒక్కరితోనే నెట్టుకు వస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏడుగురు సర్వేయర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో భూమి కొలతలు ముందుకు సాగడం లేదు. ప్రైవేటు సర్వేయర్లపై నమ్మకం లేకపోవడం.. క్షేత్రస్థాయిలో రైతులు అంగీకరించకపోవడంతో ప్రభుత్వ సర్వేయర్ల కోసం నిరీక్షిస్తోది. ప్రతినెలా రూ.40వేల వరకు సర్వే కోసం ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నా.. సర్వేయర్ల కొరతతో ఇబ్బందిగా మారింది. సామాన్యులు భూమిని సర్వే చేయించుకోవడం ఓ సవాల్‌గా పరిణమించింది. కాసులిస్తేనే నోటీసులు.. భూమి సర్వేకు సంబంధించి ఒక్కో సర్వే నంబరుకు మండల సర్వేయర్‌కు రూ.250, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్(జిల్లాస్థాయిలో)కు రూ.300 ప్రభుత్వానికి ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజు మీ సేవ కేంద్రం ద్వారా చెల్లించినా సర్వేయర్లు భూమి కొలతకు ముందుకు రావడం లేదు. సరిహద్దు భూముల యజమానులకు నోటీసులు ఇవ్వడం లేదు. భూమి కొలతలకు సంబంధించి చుట్టూ ఉన్న భూముల యజమానులకు నోటీసులు ఇవ్వాలి. కానీ దరఖాస్తుదారుల వద్ద పెద్దఎత్తున మామూళ్లు దండుకుంటూ సర్వే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వేములవాడలో మండల సర్వేయర్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు ఇటీవల పట్టుకుని జైలుకు తరలించారు. నాలా మార్పిడి కోసం కాసులు తీసుకుంటూ ఆయన పట్టుబడ్డారు. అనేకమంది రైతులు భూములను సర్వే చేయించుకునేందుకు నిరీక్షిస్తున్నారు. ముడుపులు ఇస్తామని చెప్పినా.. సర్వేలు చేసేందుకు అప్పుడప్పుడు సతాయిస్తున్నారనే ఆరోపణ వస్తున్నాయి. ప్రభుత్వ భూసేకరణ పనులు.. జిల్లాలో ప్రభుత్వ భూసేకరణ పనులు ఎక్కువగా ఉన్నాయి. మధ్యమానేరు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ –9, 10, 11, 12 పనులు జిల్లాలో సాగుతున్నాయి. మల్కపేట రిజర్వాయర్, అనంతగిరి జలాశయం, కాల్వలు, రైల్వేలైన్, బైపాస్ రోడ్డు, అపరెల్ పార్క్ కోసం భూసేకరణ.. ఇలా జిల్లాలో అనేక పనులకు భూసేకరణ యుద్ధప్రాతిపదికన చేయాల్సి ఉంటోంది. దీంతో ప్రభుత్వ సర్వేయర్లు తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. సామాన్య రైతులు భూమి కొలతలు చేయించుకునే పరిస్థితి లేకుండా పోయింది. సర్వేయర్ శాఖ అధికారులు డిజిటల్ గ్లోబల్ పోజిషల్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో శాటిలైట్‌తో అనుసంధానంతో సర్వేలు చేయడంతో భూసేకరణ పనులు కాస్త వేగవంతమయ్యాయి. అయినా ఇంకా సర్వే కోసం చలానా చెల్లించిన రైతులు వందల్లో ఉన్నారు. మండలానికో సర్వేయర్‌ను పూర్తిస్థాయిలో నియమించి క్షేత్రస్థాయిలో భూములను సర్వేలు చేస్తే.. వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని అభిప్రాయపడుతున్నారు. హద్దులు పక్కాగా నిర్ధారణ అవుతాయి. ఆ దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పనిఒత్తిడి ఉంది మాపై పనిఒత్తిడి ఉంది. ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నమాట వాస్తమే. కానీ ప్రభుత్వ పరంగా వచ్చే సర్వే ఆర్డర్లను ముందుగా సర్వే చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు జిల్లెల్ల, మర్రిపెల్లి, పెద్దూరు శివారుల్లో 4వేల ఎకరాల భూములను సర్వే చేసి సేకరించారు. సీరియల్ ఆధారంగా, ప్రాధాన్యతాక్రమంలో సర్వే చేస్తాం. – వి.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, సిరిసిల్ల -
ఆర్టీసీ బస్సు,బైకును ఢీకొట్టిన టిప్పర్
-
ఫ్రిజ్‌లో దూరిన పాము
-
ఫ్రిజ్‌లో దూరిన పాము
సిరిసిల్ల/సిరిసిల్ల క్రైం: మండుతున్న ఎండలకు మనుషులే కాదు.. జంతువులకు సైతం ‘సెగ’ తగులుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్‌లో మంగళ వారం రాత్రి నాగుపాము ఫ్రిజ్‌లో దూరింది. నాలుగు అడుగుల పొడవున్న నాగుపాము రాపెల్లి రాజు ఇంట్లోని ఫ్రిజ్‌లోకి ఎలాగో దూరింది. ఎప్పటిలాగే నీళ్ల కోసం రాజు ఫ్రిజ్ తెరవగా.. అందులో నాగుపాము కనిపించడంతో కుటుంబసభ్యులంతా ఆందోళనకు గురయ్యారు. పాములు పట్టే పరశరాముకు సమాచారం ఇవ్వగా... పట్టుకొని తీసుకెళ్లాడు. -
శుభకార్యానికి వెళ్లి వస్తూ..
♦ బస్సు, బైక్ ఢీ.. ముగ్గురి దుర్మరణం ♦ మృతుల్లో నవదంపతులు, చిన్నారి వేములవాడరూరల్/కొడిమ్యాల: వారంతా బంధువుల ఇంట్లో జరిగిన విందుకు హాజరై సంతోషంగా గడిపారు. వెళ్లొస్తామంటూ బైక్‌పై తిరుగుపయనమవ్వగా.. బస్సు రూపంలో వారిని మృత్యువు కబళించింది. మృతుల బంధువుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గౌరపురం గ్రామానికి చెందిన నవదంపతులు కాసాని శ్రీనివాస్(28), లావణ్య(22), వారి బంధువు కూతురు ప్రతిజ్ఞ(5)తో కలిసి వేములవాడ మండలం నమిలగొండుపల్లి గ్రామంలోని బంధువుల ఇంట్లో జరిగిన కర్ణవేదనం కార్యక్రమానికి హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై తిరుగుపయనమయ్యారు. వేములవాడ మండలం ఫాజుల్‌నగర్ గ్రామ శివారులో వెనకనుంచి వచ్చిన వేములవాడ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్, లావణ్య, ప్రతిజ్ఞ మృతిచెందారు. డ్రైవర్ పరారయ్యాడు. మృతుల బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారమిచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ అవధాని చంద్రశేఖర్, రూరల్ సీఐ మాధవి, ఎస్సై రాజశేఖర్ జోక్యం చేసుకోవడంతో శాంతించారు. కంటతడి పెట్టించిన చిన్నారి మృతి కొత్త దంపతులతోపాటు బాలిక మృతిచెందడం విషాదాన్ని నింపింది. శ్రీనివాస్‌కు లావణ్యతో గతేడా ది డిసెంబర్లో వివాహమైంది. శ్రీనివాస్ కొడిమ్యాల వ్యవసాయ మార్కెట్ గోడౌన్లో పని చేస్తున్నాడు. శ్రీనివాస్, లావణ్య నవదంపతులు కావడంతో వేములవాడ మండలం నమిలిగుండుపల్లిలోని వారి బంధువు ఇంటికి విందుకోసం వచ్చారు. వస్తూవస్తూ చిన్నప్పట్నుంచి సన్నిహితంగా ఉండే అన్న కూతురు ప్రతిజ్ఞను తీసుకొచ్చారు. ప్రమాదంలో దంపతులతోపాటు బాలిక మరణించడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. బస్సు ఢీకొన్న అనంతరం ద్విచక్రవాహనంపైనుంచి కింద పడిన శ్రీనివాస్, ప్రతిజ్ఞ అక్కడికక్కడే మృతిచెందగా, లావణ్య మాత్రం బైక్‌పైనుంచి పడి వెంటనే లేచి కూర్చున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆమె వెంటనే 108కు ఫోన్ చేయండంటూనే పక్కనే శ్రీనివాస్, ప్రతిజ్ఞ మృతి చెందినట్లు భావించి హఠాత్తుగా చనిపోయినట్లు పేర్కొంటున్నారు. -
నేతన్నకు చేయూత ఏది?
-
బాబాగా మారిన బీడీ కార్మికుడు
-
సిరిసిల్లలో కొనసాగుతున్న బంద్
-
సిరిసిల్లలో కొనసాగుతున్న బంద్
కరీంనగర్ : సిరిసిల్ల జిల్లా సాధన కోసం జిల్లా జేఏసీ మంగళవారం స్థానిక డివిజన్లో 48 గంటల బంద్‌కు పిలుపు నిచ్చింది. అందులోభాగంగా ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్షం నాయకులు బైఠాయించారు. డిపో నుంచి బయటకు వస్తున్న బస్సు అద్దాలను ధ్వంసం చేసి.. బస్సులను నిలిపివేశారు. అలాగే స్థానిక పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్‌పై జేఏసీ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటనలో పెట్రోల్ బంక్ అద్దాలు ధ్వంసమైనాయి. సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇరువైపులా రోడ్లుపై టైర్లు దహనం చేశారు. సిరిసిల్ల జిల్లా కోసం పట్టణంలోని స్థానిక వర్తక, వాణిజ్య సంస్థలు, విద్యాలయాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సెలవు ప్రకటించాయి. అయితే కోరుట్ల రెవెన్యూ డివిజన్లో కూడా 48 గంటల బంద్‌కు డివిజన్ సాధన కమిటీ మంగళవారం పిలుపు నిచ్చింది.