
ఫ్రిజ్‌లో దూరిన పాము
మండుతున్న ఎండలకు మనుషులే కాదు.. జంతువులకు సైతం ‘సెగ’ తగులుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్‌లో మంగళ వారం రాత్రి నాగుపాము ఫ్రిజ్‌లో దూరింది.
సిరిసిల్ల/సిరిసిల్ల క్రైం: మండుతున్న ఎండలకు మనుషులే కాదు.. జంతువులకు సైతం ‘సెగ’ తగులుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్‌లో మంగళ వారం రాత్రి నాగుపాము ఫ్రిజ్‌లో దూరింది. నాలుగు అడుగుల పొడవున్న నాగుపాము రాపెల్లి రాజు ఇంట్లోని ఫ్రిజ్‌లోకి ఎలాగో దూరింది. ఎప్పటిలాగే నీళ్ల కోసం రాజు ఫ్రిజ్ తెరవగా.. అందులో నాగుపాము కనిపించడంతో కుటుంబసభ్యులంతా ఆందోళనకు గురయ్యారు. పాములు పట్టే పరశరాముకు సమాచారం ఇవ్వగా... పట్టుకొని తీసుకెళ్లాడు.