Revanth Reddy's Convoy Met with Major Accident at Sircilla - Sakshi
Sakshi News home page

రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌కి భారీ యాక్సిడెంట్‌... బెలూన్లు ఓపెన్‌ కావడంతో..

Published Sat, Mar 4 2023 12:18 PM | Last Updated on Sat, Mar 4 2023 12:35 PM

Revanth Reddys Convoy Had Major Accident At Sircilla - Sakshi

సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి భారీ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ అతివేగంతో రావడంతో ఆరు కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరు కార్లు ధ్వంసం కాగా, పలువురు రిపోర్టర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సమయంలో రేవంత్‌ రెడ్డి కారులో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది.

ఈ కార్లలో రిపోర్టర్లు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన రిసోర్టర్లను, సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. ఐతే ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా ప్రమాదం కాకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.  స్వల్ప గాయాలతో సిరిసిల్ల రిపోర్టర్లు బయటపడ్డట్టు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం రేవంత్ రెడ్డి శ్రీ పాద ప్రాజెక్టు సందర్శనకు వెళుతుండగా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజి వద్ద జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

(చదవండి: డీఎల్‌పీవోపై కొనసాగుతున్న విచారణ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement