convoy accident
-
ఒకదానికి ఒకటి గుద్దుకున్న సీఎం కాన్వాయ్ కార్లు
-
బ్రిజ్‌భూషణ్ కుమారుడు కరణ్ కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
లక్నో: లోక్‌సభ ఎన్నికల వేళ యూపీ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌లోని ఓ కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.వివరాల ప్రకారం.. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బ్రిజ్‌భూషణ్ కుమారుడు, కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌లోని ఫార్చ్యూనర్ కారు(UP 32 HW 1800) బుధవారం అతి వేగంతో వెళ్తూ ఓ బైక్‌ను ఢీకొట్టింది. హుజూర్‌పూర్-బహ్రైచ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో గోండా వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బైక్‌పై ప్రయాణిస్తున్న రెహాన్, షెహజాద్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పాదచారులు గాయపడ్డారు. కాగా, కారుపై పోలీస్ ఎస్కార్ట్ అని రాసి ఉంది. BREAKING: Two killed as a car in Brijbhushan Singh’s son Karan Bhushan’s convoy runs over a motorcycle in Gonda. Two deaths confirmed, one grievously injured and hospitalised. pic.twitter.com/50K3CWcdi6— Prashant Kumar (@scribe_prashant) May 29, 2024 ఇక, ఈ ప్రమాదంలో ఫార్చ్యూనర్ కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులోకి ఎయిర్‌బ్యాగ్‌లు తెరుకుకోవడంలో డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం అనంతరం కారు వదిలేసి వారు పారిపోయారు. కాగా, సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న సీహెచ్‌సీకి తరలించి వైద్య చికిత్స అందించారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రమాదం సందర్భంగా కరణ్ భూషణ్ కాన్వాయ్ ఉన్నాడా? లేదా? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.మరోవైపు.. ప్రమాదం అనంతరం ప్రజలు ఆగ్రహంతో సీహెచ్‌సీని ముట్టడించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో మృతుడు రెహాన్ ఖాన్ తల్లి చందాబేగం కల్నల్‌గంజ్ కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలో కూడా కరణ్ భూషణ్ ఇదే తీరుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. యూపీలో అతి వేగంగా కారు నడిపి రైతుల మీదకు దూసుకెళ్లాడు. ఈ సందర్భంగా పలువురు రైతులు మృతిచెందారు. ఈ ఘటన అప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. -
కేసీఆర్ బస్సు యాత్ర.. కాన్వాయ్‌లో ప్రమాదం
సాక్షి,నల్లగొండజిల్లా: బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడ వెళ్లిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో బుధవారం(ఏప్రిల్24) సాయంత్రం ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ రోడ్ షో కు వెళ్తుండగా కేసీఆర్ కాన్వాయ్‌లో వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. వేములపల్లి సమీపంలో కాన్వాయ్‌లో ముందు వెళుతున్న వాహనం సడెన్ బ్రేక్ కొట్టడంతో ప్రమాదం జరిగింది.ముందు వెళుతున్న కారును వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లో తొమ్మిది వాహనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.కాగా, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ బుధవారం నుంచి బస్సుయాత్ర చేపట్టారు. బుధవారం మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర మే 10వ తేదీన సిద్దిపేటలో ముగియనుంది. బస్సు యాత్రలో భాగంగా పలు చోట్ల కేసీఆర్ రోడ్‌షోలలో ప్రసంగిస్తారు. ఇదీ చదవండి.. కవిత బెయిల్‌పై మే మొదటి వారంలో తీర్పు -
అమెరికా: బైడెన్ కాన్వాయ్‌ను ఢీకొట్టిన వ్యక్తి
వాషింగ్టన్: అమెరికాలో కలకలం చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రెసిడెంట్ సురక్షితంగా ఉన్నట్లు అధికారులుప్రకటించారు. అగ్రరాజ్యం అమెరికాలో భద్రతా వైఫల్య ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. వైట్‌హౌజ్ తెలిపిన వివరాల ప్రకారం.. బైడెన్ దంపతులు ఆదివారం రాత్రి డెలావర్‌లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిన్నర్ ముగించుకుని ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్ వద్దకు వస్తుండగా.. ఓ కారు వేగంగా దూసుకొచ్చి యూఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఢీకొంది. #BREAKING: Car crashes into vehicle which is part of US President Joe Biden's motorcade in Delaware. The circumstances of the accident are unclear at this time, President Biden was at a campaign event at the time, and not involved. pic.twitter.com/WDyApyLVS4 — Hexdline (@HexdlineNews) December 18, 2023 అనంతరం మరో వాహనంపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు కారు నడిపిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మెల్యే వల్లభనేనికి తప్పిన ప్రమాదం
సాక్షి, సూర్యాపేట: గన్నవరం(ఏపీ) ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కి ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ శనివారం ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగానే బయటపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్తున్న క్రమంలో.. సూర్యాపేట చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం సైతం ప్రమాదానికి గురైంది. -
రేవంత్ రెడ్డి కాన్వాయ్కి భారీ యాక్సిడెంట్... బెలూన్లు ఓపెన్ కావడంతో..
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్కి భారీ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ అతివేగంతో రావడంతో ఆరు కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరు కార్లు ధ్వంసం కాగా, పలువురు రిపోర్టర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సమయంలో రేవంత్ రెడ్డి కారులో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ కార్లలో రిపోర్టర్లు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన రిసోర్టర్లను, సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. ఐతే ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా ప్రమాదం కాకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలతో సిరిసిల్ల రిపోర్టర్లు బయటపడ్డట్టు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం రేవంత్ రెడ్డి శ్రీ పాద ప్రాజెక్టు సందర్శనకు వెళుతుండగా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజి వద్ద జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. (చదవండి: డీఎల్‌పీవోపై కొనసాగుతున్న విచారణ) -
స్పీకర్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఒకరి మృతి
మనోహరాబాద్ (తూప్రాన్): శాసనసభ స్పీక ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టిన సంఘటన లో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లక ల్ గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. స్పీ కర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం కాన్వా య్‌తో హైదరాబాద్ నుంచి బాన్సువాడకు వెళుతున్నారు. అదే సమయంలో కాళ్లకల్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిని దాటుతు న్న దొంతిరెడ్డి నరసింహారెడ్డి (62)ని కాన్వాయ్ లోని వెనుక వాహనం ఢీ కొట్టింది. దీంతో నరసింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం అక్కడే నిలిచిపోగా, స్పీకర్ మిగతా కాన్వాయ్ ముందుకు వెళ్లిపోయింది. మృతుడు దినసరి కూలీగా పని చేస్తున్నాడు. ప్రమాద సమాచారాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్టు స్థానిక ఎస్ఐ రాజాగౌడ్ చెప్పారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని స్పీకర్ ఫోన్లో చెప్పారని ఎస్ఐ వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. -
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి
సాక్షి, మెదక్: తెలంగాణ శాసనసభ స్వీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. మనోహరబాద్ మండలం కాళ్ళకల్ వద్ద స్పీకర్ పోచారం కాన్వాయి వెళ్తుంది. కాన్వాయ్ వస్తున్న విషయాన్ని గమనించకుండా అదే సమమంలో ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. దీంతో కాన్వాయ్‌లోని ఓ వాహనం వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. చదవండి: బద్వేల్, హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిని నర్సింహ్మ రెడ్డిగా (50) పోలీసులు గుర్తించారు. ఇతను కొన్ని సంవత్సరాలుగా వలస వచ్చి కాళ్లకల్ గ్రామంలో నివాసముంటున్నాడు. పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రమాదంపై అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. చదవండి: ‘పది’లో ఇక 6 పేపర్లే.. టీఎస్ సర్కార్ కీలక ఉత్తర్వులు -
మంత్రి ఎర్రబెల్లికి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, యాదాద్రి: తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్‌ను వెనుక నుంచి ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. యాదాద్రి కలెక్టరేట్ సమీపంలో మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌లోని కారును వెనుక నుంచి ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మంత్రి తన కాన్వాయ్‌లోని ఓ కారులో ఆస్పత్రికి తరలించారు. గతంలో ఎర్రబెల్లి దయాకర్ కాన్వాయ్‌కు ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. చదవండి: అంత్యక్రియలు అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ -
ప్రియాంక గాంధీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
లక్నో: వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కాన్వాయ్ ప్రమాదానికి గురయ్యింది. ఒకదానికొకటి వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో ప్రియాంకతో పాటు ఇతరులెవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రియాంక యథావిధిగా తన కార్యక్రమానికి వెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా రాంపూర్‌లో జరిగింది. గణతంత్ర దినోత్సవం రోజు చనిపోయిన రైతు నవరత్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ గురువారం యూపీలోని హాపుర్ జిల్లాకు బయల్దేరారు. ఉదయం ఢిల్లీ నుంచి రాంపూర్ చేరుకున్న ఆమె దిబ్దిబా గ్రామానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రియాంక ప్రయాణిస్తున్న కారు వైపర్లు పనిచేయకపోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. వైపర్లు పని చేయక కారు అద్దంపై పేరుకున్న దుమ్ముతో రోడ్డు కనిపించక డ్రైవర్ కారు వేగం తగ్గించాడు. దీంతో వెనుక ఉన్న వాహనాలు ప్రియాంక వాహనాన్ని ఢీకొట్టాయి. దీంతో ఆమె కాన్వాయ్‌లోని మూడు కార్లు ధ్వంసమయ్యాయి. అనంతరం కారు అద్దాలను స్వయంగా ప్రియాంకా శుభ్రం చేసుకుని కొద్దిసేపటి తర్వాత దిబ్దిబా గ్రామానికి వెళ్లారు. ఆమె వెంట ఆ పార్టీ సీనియర్ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు. -
ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం
సాక్షి, నల్గొండ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టింది. నల్గొండ జిల్లా కోదాడ సమీపంలో ఘటన జరిగింది. ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఉప ముఖ్యమంత్రికి ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
బాబు కాన్వాయ్‌కు ప్రమాదం
చౌటుప్పల్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడు వాహనాలతో కూడిన కాన్వాయ్‌లో చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్తున్నారు. కాన్వాయ్‌లో ముందు మూడు, వెనుక మూడు వాహనాలు ఉండగా మధ్యలో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో చంద్రబాబు ఉన్నారు. ఈ క్రమంలో దండుమల్కాపురం గ్రామం వద్దకు రాగానే.. ఓ ఆవు ఒక్కసారిగా రహదారిపైకి వచ్చింది. వేగంగా వస్తున్న కాన్వాయ్‌లోని మొదటి వాహనం డ్రైవర్ ఆవును గమనించి సడన్ బ్రేక్ వేశాడు. ఆ వెంటనే రెండో వాహనం డ్రైవర్ సైతం బ్రేక్ వేశాడు. మూడో వాహనం ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. అదే సమయంలో ప్రమాదాన్ని పసిగట్టిన చంద్రబాబు కూర్చున్న వాహనం డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి తన వాహనాన్ని పక్కకు తప్పించాడు. దీంతో ప్రమాదం తప్పింది. ముందున్న వాహనాలు ఢీకొనడంతో కొద్ది నిమిషాల పాటు కాన్వాయ్‌ని సెక్యూరిటీ సిబ్బంది రోడ్డు పక్కన ఆపారు. దెబ్బతిన్న వాహనాన్ని అక్కడే వదిలి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లిపోయారు. కారులో కూర్చొని ఉన్న చంద్రబాబు -
చంద్రబాబు కాన్వాయ్కి ప్రమాదం
-
చంద్రబాబు కాన్వాయ్కి ప్రమాదం
సాక్షి, భువనగిరి : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆవును తప్పించబోయి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. సడన్ బ్రేక్ కారణంగా ఒక్కసారిగా కాన్వాయ్‌లోని ముందున్న ఎస్కార్ట్ వాహనాన్ని చంద్రబాబు వాహనం బలంగా ఢీ కొట్టింది. అయితే చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో మరో వాహనంలో వారిని తరలించారు. అమరావతి నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
సీఎం పోలవరం పర్యటనలో అపశ్రుతి
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం చంద్రబాబు తన కుటుంబసభ్యులతో, ప్రజాప్రతినిధులతో కలిసి పోలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం గ్యాలరీని ప్రారంభించారు. కాగా ఈ పర్యటనలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌లోని కారు బోల్తా కొట్టింది. వర్షం కారణంగా కారు టైర్లు జారడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు కొండవైపుకు పడటంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పలువురు టీడీపీ నేతలకు స్పల్ప గాయాలయ్యాయి. -
స్పీకర్ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం
-
స్పీకర్ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం
సాక్షి, జయశంకర్ భూపాల్పల్లి: తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో ప్రమాదం తప్పింది. భూపాలపల్లి జిల్లాలోని గణపురం శివారులో స్పీకర్ కాన్వాయిలోని వాహనాన్ని లారీ ఢీకొట్టింది. తన నియోజవర్గమైన గణపురంలో పల్లెనిద్ర ముగించుకుని భూపాలపల్లికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. లారీ ఢీకొనడంతో కాన్వాయిలోని వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అంతకుముందు గణపురం మండల కేంద్రంలో మధుసూదనాచారి పల్లె నిద్ర చేశారు. ఉదయం స్థానిక ప్రజలతో కలిసి నడుచుకుంటూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. -
కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. తొలుత నేటి ఉదయం ఎల్బీనగర్ చింతలకుంట చెక్ పోస్ట్ వద్ద అండర్ పాస్‌ను ఆయన ప్రారంభించారు. ఎల్బీనగర్ మార్గంలో రెండు నెలల్లో మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అనంతరం మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ ఉప్పల్ నుంచి రామాంతపూర్ బయలుదేరుతుండగా ఆయన కాన్వాల్‌లో ప్రమాదం జరిగింది. కేటీఆర్ కాన్వాయ్‌లో ఉన్న ఎంపీ మల్లారెడ్డి వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బిహార్ సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగులు పోలీసులు గాయపడ్డారు. గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పట్నా నుంచి కిషన్ గంజ్‌కు వస్తుండగా సుపౌల్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎన్‌హెచ్-57 పై ఒక ట్రక్ ను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పిన వీరి వాహనం హఠాత్తుగా బోల్తా పడింది. గాయపడిన వారిని హుటాహుటిన దర్భంగా లోని పరాస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. -
లోకేష్ కాన్వాయ్‌లో అపశ్రుతి: పల్టీలు కొట్టిన కారు
రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారు బొమ్మూరు సమీపంలో వేమగిరి వద్ద కాన్వాయ్‌లోని ఓ కారు ఢివైడర్‌ను ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టింది. ఆ కారు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వాహనంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు కారు డ్రైవర్, గన్మెన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ రోజు చంద్రబాబు కు తృటిలో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. చిత్తూరు పర్యటనలో ఉన్న సీఎం బస్సులో ఒక్కసారి పొగలు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పింది.