
ప్రమాదానికి కారణమైన లారీ, కాన్వాయిలోని వాహనం
సాక్షి, జయశంకర్ భూపాల్‌పల్లి: తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో ప్రమాదం తప్పింది. భూపాలపల్లి జిల్లాలోని గణపురం శివారులో స్పీకర్ కాన్వాయిలోని వాహనాన్ని లారీ ఢీకొట్టింది. తన నియోజవర్గమైన గణపురంలో పల్లెనిద్ర ముగించుకుని భూపాలపల్లికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. లారీ ఢీకొనడంతో కాన్వాయిలోని వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
అంతకుముందు గణపురం మండల కేంద్రంలో మధుసూదనాచారి పల్లె నిద్ర చేశారు. ఉదయం స్థానిక ప్రజలతో కలిసి నడుచుకుంటూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment