Jayashankar Bhupalpally district
-
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం
-
మేడిగడ్డ విచారణకు కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్డీఎస్ఏ ప్రకటించింది. వచ్చే వారం ఎన్డీఎస్ఏ కమిటీ మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రానుంది. చదవండి: మేడిగడ్డ, కాళేశ్వరంపై చర్యలేవీ? -
కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు: సీఎం రేవంత్
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: గత ప్రభుత్వంలో మెడిగడ్డకు ఎవ్వరినీ చూడనివ్వలేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజిలెన్స్ విచారణ చేయించాము. రీ డిజైన్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయలకు పాల్పడ్డారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సీఎం రేవంత్‌రెడ్డితో సహా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి బృందం ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై అధికారులు.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రజల ముందు దొషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనే కేసీఆర్ నల్గొండ సభ పెట్టారు. కేసీఆర్ కోటి ఒకటోసారి సావు నోట్లో తలకాయ పెట్టిన అని మరోసారి శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెడితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. స్మిత్మా సభర్వాల్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించినట్లు అసెంబ్లీలో బయటపెట్టాము.మెడిగడ్డ పర్యటనకు, అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు. కాలు విరిగిన కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఎలా వెళ్లారు? అసెంబ్లీ దగ్గర ఉందా? నల్గొండ దగ్గర ఉందా? కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ దోపిడీకి మెడిగడ్డ బలైపోయింది. అన్నారం సుందిల్లా సున్నం అయింది. మెడిగడ్డకు వచ్చిన వాళ్ళను కేసీఆర్ అవమాణించారు. ...కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లు అప్పగించడం లేదని అసెంబ్లీ లో చేసిన తీర్మానానికి హరీష్ రావు మద్దతు పలికారు. తీర్మానంపై లోపాలు ఉంటే కేసీఆర్ వచ్చి సవరించి ఉండేది. అఖిల పక్షం ఢిల్లీకి తీసుకుపోవాలని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చెయ్యాలి. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కేసీఆర్ భేదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. భయపడితే భయపడం. మేము కేసీఆర్ లెక్క ఉద్యమం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు. కాళేశ్వరం అంశాన్ని తప్పుదోవ పట్టించాడానికి నల్గొండ సభను కేసీఆర్ పెట్టారు. కేసీఆర్ మనస్తత్వం ముందే తెలుస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోదురు. అధికారం పోగానే మళ్ళీ కేసీఆర్‌కు ఫ్లోరైడ్ గుర్తుకు వచ్చిందా? ప్రపంచ అద్భుతం అంటూ న్యూయార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టును చూపించారు. కేసీఆర్ నల్గొండలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి రావాలి. ఇరిగేషన్‌పై రేపు శ్వేతపత్రం పెడతాం.. కేసీఆర్ చర్చలో పాల్గొనాలి. అన్ని పాపాలకు కారణం కేసీఆర్ మాత్రమే. మెడిగడ్డ తప్పిద్దాల్లో కేసీఆర్ భాగస్వామ్యం ఉంది. ...కేసీఆర్ భాగస్వామ్యం ఉంది కాబట్టే అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మెడిగడ్డ బ్యారేజ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో ఉంది. రేపటి శాసన సభ సమావేశాల్లో పాల్గొని తన అనుభవాన్ని చెప్పాలి. ఎల్ అండ్ టీ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలా వద్దా అనేది కేసీఆర్ సభలో చెప్పాలి. వందల మంది మరణించినా కేసీఆర్ రోడదెక్కలేదు. ప్పుడు అధికారం కోసం నల్గొండ జిల్లాకు వెళ్లారు. కుర్చీ దిగి 60 రోజులు కాలేదు.. అప్పుడే ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది. ...భయం అంటే తెలువని కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి. నల్గొండ సభకు మహబూబ్ నగర్ నుంచి ప్రజలను తీసుకెళ్లారు. కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు పర్యటన కాదు.. కాశి పర్యటనకు వెళ్ళాలి. వస్తానన్న బీజేపీ ఎమ్మెలను కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని మళ్ళీ నిరూపీతం అయింది. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుంది. కేసీఆర్ అవినీతిని బయటకు తియ్యడానికి బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. -
మేడిగడ్డ ఏడో బ్లాక్ పరిధిలో పనులు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పియర్ భారీ శబ్దంతో కుంగిపోయింది. బ్యారేజ్ దెబ్బతినడంతో సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయపరమైన విమర్శలకు తావిచ్చింది. ఒకవైపు బ్యారేజ్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. మరోవైపు డ్యామేజ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. పిలర్లు కుంగిపోయిన ఏడో బ్లాక్ పరిధిలో పనులు కొనసాగుతున్నట్లు సమాచారం. నీటిని మళ్లించినా ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాణహిత నుంచి బ్యారేజ్‌కు నీరు చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. ఎగువ నుంచి 26,350 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 61 గేట్లు ఎత్తి 22,590 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నదిలో కాఫర్ డ్యాం పనులు సాగుతున్నట్లు తెలుస్తోంది. అన్నారం బుంగల కోసం గ్రౌటింగ్ అన్నారం (సరస్వతి) బ్యారేజీ బుంగలు ఏర్పడిన విషషయమూ తెలిసిందే. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఇసుక, రాళ్లతో కూడిన సంచులు వేసినా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదని సమాచారం. దీంతో రెండు పియర్ల వద్ద సీపేజీ (బుంగలు) ఏర్పడగా వాటి మరమ్మతులకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం రానున్నట్లు సమాచారం. 2020లో ఇలాంటి పరిస్థితి ఎదురుకాగా పాలియూరిథిన్ (పీయు) గ్రౌటింగ్ ద్వారా బుంగలను పూడ్చారు. ఈ సారి కూడా ఇదే పద్ధతిని అవలంబించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మేడిగడ్డ పంచాయతీ.. బారికేడ్లతో బ్యారేజ్ మూసివేత -
కేసీఆర్ డిజైన్ చేస్తే ఇలాగే ఉంటుంది: రాహుల్ గాంధీ
సాక్షి, జయశంకర్భూపాలపల్లి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించారు. అయితే ప్రాజెక్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు ముందుగా ఆయన్ని అంగీకరించలేదు. చివరకు కాంగ్రెస్ శ్రేణుల రిక్వెస్ట్‌తో ఏరియల్ సర్వేకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో ఆయన హెలికాఫ్టర్‌లోనే మేడిగడ్డను పరిశీలించారు. మేడిగడ్డ సందర్శనకు ముందు రాహుల్ గాంధీ అంబట్ పల్లి కాంగ్రెస్ మహిళా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట కరెప్షన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, డొల్లతనం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో బట్టబయలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన డబ్బులు ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసమే పూర్తిగా ఖర్చు పెట్టి ఉంటే.. ఇలాంటి కుంగుబాటు వచ్చి ఉండేది కాదు. ..ప్రాజెక్టు కు కేటాయించిన లక్ష కోట్లల్లో సగం డబ్బులను దోపిడీ చేసి నాసిరకంగా నిర్మాణం చేయడం వల్లే బ్యారేజ్ పిల్లర్లు కుంగాయి. ఆధునిక టెక్నాలజీ లేని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల నెట్టెంపాడు బీమా తదితర ప్రాజెక్టు నేటికీ పటిష్టంగా ఉన్నాయి. కాళేశ్వరం నిర్మాణం చేసి పట్టుమని రోజులు తిరగకముందే ఇలా బ్యారేజ్ కుంగివడం బాధాకరం. ..చిన్నపాటి వర్షాలకే మేడిగడ్డ బ్యారేజీ కుంగితే భారీ వరదలు వస్తే తట్టుకొని నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం గా మారిందని చెప్తున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లు ఎందుకని చర్యలు తీసుకోకపోవడం లేదు. చిన్నపాటి ఇంటికే ఇంజనీర్‌తో డిజైన్ చేయిస్తాం. లక్ష కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఎలా డిజైన్ చేస్తారు. ఇంజనీర్ల పనిని ఇంజనీర్లను చేయిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సీఎం కేసీఆర్ డిజైన్ చేస్తే భవిష్యత్తులో ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంటుందని కాంగ్రెస్ పార్టీగా ముందే చెప్పాము. ఇప్పుడు అదే జరిగింది అని రాహుల్ గాంధీ విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. అంబట్పల్లి, మేడిగడ్డ పర్యటనలో రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావ్ ఠాక్రే, కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నారు. ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత రాహుల్ గాంధీ సందర్శన నేపథ్యంలో మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. 144 సెక్షన్ అమలు ఉందని, సందర్శనకు అమలు లేదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణ ఏర్పడింది. చివరకు రాహుల్‌కు ఏరియల్ సర్వే అనుమతి లభించడంతో కాంగ్రెస్ శ్రేణులు శాంతించాయి. -
‘మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు’
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంపై కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో భేటీ అయింది. ఆనకట్ట కుంగిన వ్యవహారంపై ఇంజినీర్లతో కేంద్ర బృందం చర్చించింది. ఆనకట్టకు సంబంధించిన సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించింది. భేటీ అనంతరం తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మాట్లాడుతూ.. ‘‘మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు. లోపాలు ఉంటే మూడు సీజన్లు తట్టుకునేది కాదు కదా!. ఏడో బ్లాక్‌లో సమస్య వల్ల సెంటర్ పియర్ కుంగింది. ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఇసుక కారణంగా సమస్య వచ్చిందని భావిస్తున్నాం. బ్యారేజీకి సంబంధించి క్వాలిటీ ఆఫ్ శాండ్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనుమతులు ఉన్నాయి. కాపర్ డ్యామ్‌కు వరద తగ్గాక నవంబర్ చివరలో ఘటనపై సమగ్ర పరిశీలన చేస్తాం’’ అని ఈఎన్సీ పేర్కొన్నారు. ఈ భేటీలో తెలంగాణ ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశపాండే, ఎల్ అండ్ టీ ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్ద శబ్దంతో కుంగుబాటు.. కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ శనివారం రాత్రి భారీ శబ్దంతో కుంగిపోయింది. మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం ఆందోళన రేకెత్తించింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. దీంతో బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన గేట్లు ఎత్తి.. జలాశంయలోని నీటిని దిగువకు విడుదల చేశారు. ఆపై కేంద్రం తరపున నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగుబాటును మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మేడిగడ్డ ఆనకట్ట, కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ఇంజనీర్ల ద్వారా వివరాలు తీసుకున్నారు. -
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించిన కేంద్ర బృందం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ కుంగిన సందర్భంలో ఆ బ్యారేజ్‌ను కేంద్రం బృందం మంగళవారం పరిశీలించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించింది. బ్యారేజీలోని ఆరవ బ్లాకు నుండి ఎనిమిదవ బ్లాకు వరకు, 15వ పిల్లరు నుండి 20వ పిల్లరు వరకు కేంద్రం బృందం నిశితంగా పరిశీలించింది. అనంతరం హైదరాబాద్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం.కాగా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో తొలిమెట్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్. గోదావరి నదిపై రూ.1849 కోట్ల వ్యయంతో లక్ష్మీ బ్యారేజ్‌ను నిర్మించారు. 24 నెలల్లో బ్యారేజ్ నిర్మాణాన్ని ఎల్అండ్ టీ పూర్తి చేయగా, దీని నీటీ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలుగా ఉంది. బ్యారేజ్ పొడువు 1.6 కిలోమీటర్లు. -
ఆపరేషన్ మోరంచపల్లి.. గ్రామస్తులు సేఫ్
సాక్షి, భూపాలపల్లి: వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామాస్థులు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాఫ్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామంలోని ప్రజలందరినీ సేఫ్‌జోన్‌కు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా మోరంచపల్లి గ్రామస్తులు అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అంతకుముందు మోరాంచపల్లిలో రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఫైర్ సర్వీస్& డిజాస్టర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 70మందిని సేఫ్ చేశామని, దాదాపు గ్రామాన్ని కాళీ చేస్తున్నామని పేర్కొన్నారు.వరరంగల్ టౌన్లో సైతం బోట్స్ సహాయంతో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. మంథనిలో ఇసుక క్వారి వద్ద తొమ్మిది మందిని కాపాడామని, ఇద్దరిని ఇంకా కాపాడే ప్రయత్నం సాగుతోందని తెలిపారు. ఎలికాఫ్టర్ సహాయంతో రెస్క్యూ ప్రయత్నం సాగుతుందన్నారు. కాటారం మండలం గంగారం నలుగురిని కాపాడే రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుందన్నారు. ఎక్కడ ఇబ్బందిఉన్నా 100,101కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సెల్ఫీలు, ఫొటోలు దిగడానికి ఎవరు కూడా బయటకు వెళ్లరాదని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకి రావద్దని, రేపు కూడా వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలోఅప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుతున్నాయి. కుండపోత కారణంగా మోరంచ వాగు ప్రవాహం ప్రమాదకర స్థాయి దాటి మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో కొందరు గ్రామస్తులు వర్షంలోనే బిల్డింగ్‌లపైకి ఎక్కి రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గ్రామస్తులు వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. చాలామంది సెల్ఫోన్లు కూడా పని చేయడం లేదని.. దీంతో అధికారుల సాయం కోరేందుకు కూడా వీలుకావడం లేదని వాపోతున్నారు. వందేళ్ల తర్వాత ఇలాంటి స్థాయిలో వరద ముంచెత్తినట్లు తెలుస్తోంది. మోరంచపల్లి గ్రామంలో 300 మంది.. వెయ్యి జనాభా దాకా ఉంది. వానాకాలం వచ్చినప్పుడల్లా మోరంచవాగు ప్రవాహంతో గ్రామం చుట్టూ నీరు చేరుతుంటుంది. అయితే ఈ దఫా గ్రామాన్ని వాగు పూర్తిగా ముంచెత్తడం గమనార్హం. ఈ ప్రభావంతో భూపాలపల్లి-హన్మకొండ వైపు రహదారిపై ఆరు అడుగుల ఎత్తు నుంచి నీరు ప్రవహిస్తుండగా.. రాకపోకలు నిలిచిపోయాయి. -
రోడ్డుపై ధాన్యం పోసి తగలబెట్టిన రైతులు..
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: గణపురంలో రైతులు ఆందోళన నిర్వహించారు. రహదారిపై బైఠాయించిన రైతులు.. వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టారు. సకాలంలో ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసిందని నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఢిల్లీకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదం..NWCకి ఫిర్యాదు -
పాట రచయిత చంద్రబోస్ స్వగ్రామం చల్లగరిగెలో సంబరాలు
-
‘పచ్చగా ఉన్న తెలంగాణను పిచ్చోళ్ల చేతుల్లో పెట్టొద్దు’
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కేసీఆర్, టీ(బీ)ఆర్ఎస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రతిపక్షాలను నిలదీశారు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. భూపాలపల్లిలో గురువారం జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్.. రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నాయకత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లను ఒక్కటే అడుగుతున్నా. తెలంగాణ రాకుంటే మీ ఇద్దరినీ ఎవరైనా పట్టించుకునేవాళ్లా? పార్టీలకు అధ్యక్షులు అయ్యేవాళ్లా? అని ప్రశ్నించారు కేటీఆర్. ‘ఓ పిచ్చోడు ప్రగతి భవన్ తేల్చేస్తామంటాడు. మరో పిచ్చోడు సెక్రెటేరియేట్‌ను పేల్చేస్తామంటాడు. అలాంటి పిచ్చోళ్ళ చేతుల్లో పార్టీలు ఉంటే.. రాష్ట్ర మొత్తానికి నష్టమే జరుగుతుంది. పచ్చగా ఉన్న తెలంగాణను పిచ్చోళ్ళ చేతుల్లో పెట్టద్దు’ అని సభకు హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని రేవంత్ రెడ్డి అడుక్కుంటున్నాడు. ఈ డెబ్భై ఏళ్లలో ఒక్కటి కాదు.. పది ఛాన్సులు ఇచ్చాం. మరి ఏం చేశారో చెప్పండి అంటూ తీవ్ర విమర్శలు చేశారాయన. అలాంటి దిక్కుమాలిన అసమర్థ పాలన మళ్లీ మనకు కావాలా? అని ప్రశ్నించారు కేటీఆర్. బీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికపై రేవంత్‌రెడ్డి చేస్తున్న విమర్శలపై కేటీఆర్ స్పందించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే.. ఎమ్మెల్యే గండ్ర బజాప్తుగా కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో చేరారు. రాజస్థాన్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోలేదా?. రాజస్థాన్‌లో కాంగ్రెస్ చేస్తే సంసారం.. ఇక్కడ బీఆర్ఎస్ చేస్తే వ్యభిచారమా? అని రేవంత్ రెడ్డిని నిలదీశారు కేటీఆర్. ఇదెక్కడి నీతి? ఒక్కటే అడుగుతున్నా.. ఆలోచించుమని కోరుతున్నా. ప్రజల మనసు గెలవాలంటే అధికారంలోకి రావాలంటే.. ఏం చేసినమో చెప్పాలి. ఏం చేస్తామో చెప్పాలి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మనపై కక్షగట్టి శత్రుదేశంపై దాడి చేసినట్లు.. ప్రధాని మోదీ, బిజేపీ వేటకుక్కల్లా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అసమర్థ ప్రధానిని.. బలవంతంగా విశ్వగురువు.. విశ్వగురువు అంటున్నారు. ఢిల్లిలో ఉన్నోడు పేకుడు.. ఇక్కడున్నోడు జోకుడు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ను నిర్మించిన ఘనత కేసీఆర్‌ది. ముమ్మాటికీ మాది కుటుంబ పాలనే. తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే. మనది వసుదైక కుటుంబం.. కుల పిచ్చి మత పిచ్చి మాకు లేదు అని కేటీఆర్ హాట్ కామెంట్లు చేశారు. అలాగే.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో 95% రిజర్వేషన్ తెలంగాణలో ఇస్తున్నామని కేటీఆర్ ప్రస్తావించారు. సింగరేణిపై బీజేపీ కన్నుపడింది. సింగరేణిని ప్రైవేట్‌పరం కానివ్వం.. అవసరమైతే సకల జనుల సమ్మెకు సైతం సిద్ధమవుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కూడా తమ దగ్గర అమలు చేయాలని కోరుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే.. నాలుగు కోట్ల ప్రజలకు లాభమని పేర్కొన్నారు. -
భూమి అమ్మించి.. సాదడం మానేశారు
భూపాలపల్లి అర్బన్: భార్య మరణంతో ఒంటరైపోయిన తండ్రిని చేరదీసి బాగోగులు చూసుకోవాల్సిన కొడుకులు నిర్ధాక్షిణ్యంగా వదిలే శారు. కొడుకులుండి అనాథగా మారిన ఆ తండ్రి తనను చూడటం లేదన్న ఆవేదనతో నిరసనకు దిగాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రేగొండ మండలం గొరికొత్తపల్లి గ్రామానికి చెందిన కట్ల బుచ్చయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు. కొడుకులిద్దర్నీ బాగా చదివించి వారిని ప్రయోజకులుగా తీర్చి దిద్దారు బుచ్చయ్య దంపతులు. ఇద్దరు కొడుకులూ పోలీసుశాఖలో ఉద్యోగం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం బుచ్చయ్య భార్య మరణించింది. దీంతో ఆస్తిని కొడుకులిద్దరికీ పంచిన బుచ్చయ్య 30 గుంటల భూమిని మాత్రం తన పేరుమీద ఉంచుకున్నాడు. కొద్ది రోజులక్రితం పెద్దకొడుకు రవీందర్ ఆ భూమిని సైతం అమ్మించి వచ్చిన డబ్బులను ఇవ్వకుండా బ్యాంకులో జాయింట్ ఖాతా తీసి అందులో జమ చేశాడు. అప్పట్నుంచి బుచ్చయ్యను ఇద్దరు కొడుకులూ చూడటం మానేశారు. జయశంకర్ విగ్రహం ఎదుట .. కొడుకులు తనను పట్టించుకోకపోవటంతో బుచ్చ య్య జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. ‘నాకు న్యాయం కావా లి.. నా కొడుకులు నన్ను సాదడం లేదు’ అంటూ ప్లకార్డుతో నిరసన తెలిపారు. తన బాగోగులు చూసుకోవాలని అడిగితే ఇద్దరు కొడుకులు దౌర్జన్యానికి దిగారని బుచ్చయ్య ఆరోపిస్తున్నారు. కొడుకులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్, ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేసినట్లు బుచ్చయ్య తెలిపారు. -
పల్లెప్రగతి అంతా డొల్ల..అందుకు జయశంకర్ స్వగ్రామమే నిదర్శనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పల్లెప్రగతి కార్యక్రమం డొల్లతనానికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామంలో జరిగిన అభివృద్ధే నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. జయశంకర్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధిలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు వరంగల్ జిల్లాలో శనివారం పర్యటించిన సందర్భంగా తన దృష్టికి వచ్చిన విషయాలను వివరిస్తూ సీఎం కేసీఆర్‌కు రేవంత్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ‘ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నాను. అది ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం. ఆయన లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించడం కష్టం. కానీ, రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లవుతున్నా ఆ గ్రామంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించట్లేదు. కనీస మౌలిక సదుపాయాల్లేవు. రెవెన్యూ గ్రామమనే హోదా కూడా ఇవ్వలేదు. ఆ ఊరికి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. నిరుపేద దళితుడు సిలివేరు జానీ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. మీరేమో మిషన్ భగీరథ, దళితబంధు అని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. జయశంకర్ గ్రామంలో అభివృద్ధి జరగకపోవడం ఆ పెద్దమనిషి మీద మీకు ఎంత విద్వేషం, వ్యతిరేక భావం ఉన్నాయో చెబుతోంది. వెంటనే భగీరథ ద్వారా ఆ గ్రామానికి నీళ్లివ్వాలి. గ్రామంలోని నిరుపేద దళితులను ఆదుకోవాలి. అక్కంపేట అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి’అని ఆ లేఖలో పేర్కొన్నారు. వరంగల్ ఓఆర్ఆర్తో పచ్చని పొలాల్లో చిచ్చు వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టు కోసం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ద్వారా పెద్ద ఎత్తున భూ సేకరణకు సిద్ధం చేస్తున్నారని.. ఆ ప్రాజెక్టు పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోందని రేవంత్ అన్నారు. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాలకు చెందిన 21,517 ఎకరాల భూమిని సేకరించడం ద్వారా లక్ష మందికి పైగా రైతులు, కౌలుదారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఓఆర్ఆర్ పేరుతో చిన్న, సన్నకారు రైతుల భూమిని లాక్కుంటే వారెలా బతకాలని ప్రశ్నించారు. అభివృద్ధి ముసుగులో పేదల ఉసురు తీయొద్దని, భూ సేకరణ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైతులకు కంటి మీద కునుకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. ఆ భూ సేకరణ జీవోను విరమించుకుంటున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదంటే రైతులతో కలిసి కాంగ్రెస్ ఉద్యమిస్తుందని లేఖలో రేవంత్ వెల్లడించారు. -
గుప్పెడంత మనసు.. హిజ్రాతో ప్రేమపెళ్లి
ఇల్లెందు: సమాజం నుంచి విమర్శలు, జనాల నుంచి తేడా చూపులు ఎదురైనా.. కలిసే బతకాలనుకుంది ఆ జంట. కారణంగా.. ఆ జంటలో ఒకరు యువకుడు, మరొకరు ట్రాన్స్‌జెండర్ కావడమే!. మూడు నెలలుగా ఆమెతో సహజీవనం చేస్తున్న ఓ యువకుడు.. చివరకు తన ప్రేమకథను సుఖాంతం చేసుకున్నాడు. పెద్దలను ఒప్పించి వాళ్ల సమక్షంలోనే మూడుముళ్లతో ఒక్కటయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగిందీ ఘటన. జయశంకర్ భూపాలపల్లికి చెందిన రూపేశ్‌కు ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన అఖిల(రేవతి) అనే హిజ్రాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. స్నేహం చిగురించి అదికాస్త ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. రహస్యంగా.. ఇల్లెందులోని స్టేషన్‌బస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మూడు నెలలుగా సహజీవనం చేశారు. చుట్టుపక్కల వాళ్లు ఎన్ని మాటలు అన్నా.. బయట ఇబ్బందులు ఎదురైనా ఆ జంట ఒకరి చెయ్యి మరొకరు వీడలేదు. అయితే, ఇలా ఎంతకాలం తల్లిదండ్రులను మోసం చేయాలి అనుకున్న రూపేశ్.. ధైర్యం తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నాడు. భయంభయంగానే వాళ్లకు చెప్పాడు. ముందు వాళ్లు కంగారుపడ్డారు.. తిట్టారు. అయితే తమ ప్రేమను విప్పి వాళ్లను ఒప్పించాడు. వారు కూడా అంగీకరించడంతో నిన్న(శుక్రవారం, మార్చి 11 2022) రూపేశ్-అఖిలకు ఘనంగా వివాహం జరిగింది. ఎవరు ఎమనుకున్నా.. తమ మనుసులు మంచివని, ఒకరినొకరు అర్థం చేసుకున్నామని, జీవితాంతం ఇలాగే కలిసి ఉంటామని చెబుతోంది ఆ జంట. -
విద్యార్థినులకు కేటీఆర్ సాయం
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అండగా ఉండే ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీ రామారావు మరోసారి తన ఔదార్యాన్ని చాటు కున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన అక్కా చెల్లెళ్లు కావేరి (21), శ్రావణి (18)ల ఉన్నత విద్య పూర్తయ్యేంత వరకు అండగా నిలుస్తానని హామీఇచ్చారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పూర్వ విద్యార్థిని కావేరి సిద్దిపేట సురభి కాలేజీలో చదువుతోంది. ఆమె సోదరి శ్రావణి కూడా మోడల్ స్కూల్లో చదివి ఏపీలోని తాడేపల్లిగూడెం ఎన్ఐటీలో బీటెక్ (ఈసీఈ)లో సీటు సాధించింది. ఇద్దరూ మెరిట్ కోటాలోనే ఉన్నత విద్యా కోర్సుల్లో సీటు సాధిం చారు. బీఏ గ్రాడ్యుయేట్ అయిన వీరి తండ్రి రాజమల్లు గతంలో ప్రైవేటు పాఠశాలలో పనిచేయగా, కరోనా వల్ల ఉపాధి కోల్పోయి రోజూవారీ కూలీగా పనిచేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా వీరి పరిస్థితి కేటీఆర్‌కు చేరగా, ఆదివారం రాజమల్లు తన కూతుళ్లతో కలిసి కేటీఆర్‌ను కలిశారు. వారి అవసరాలను తెలు సుకున్న కేటీఆర్ ఉన్నత విద్యను పూర్తి చేసుకునేంత వరకు సాయంగా ఉంటానని భరోసా ఇచ్చారు. తమను ఆదుకునేందుకు కేటీఆర్ ముందుకు రావడం పట్ల విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇంటికి గడియ పెట్టి.. కిరోసిన్ చల్లి
కాటారం: ఓ కుటుంబం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొందరు దుండగులు ఇంటికి గడియ పెట్టి రెండు గుమ్మాలపై కిరోసిన్ చల్లి నిప్పు పెట్టి సజీవ దహనానికి యత్నించారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకానిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకానిలో దూలం రవి అనే యువకుడు తన తల్లిదండ్రులు దూలం రాజయ్య, రాజేశ్వరిలతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో గాఢనిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి రెండు గుమ్మాలకు గడియ పెట్టి వెంట తీసుకొచ్చిన కిరోసిన్ చల్లి నిప్పంటించారు. మంటల వేడి గమనించిన కుటుంబ సభ్యులు ఇంటి వెనకాల గుమ్మంనుంచి బయటికొచ్చారు. వెంటనే మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. ఇంటినుంచి బయటికి వస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పరుగెత్తడాన్ని గమనించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమను సజీవ దహనం చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బాధిత కుటుంబ స భ్యులు పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
రెండు నదులు.. రెండు రంగులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలుస్తాయి. గోదావరి తెలంగాణలోని మంచిర్యాల మీదుగా, ప్రాణహిత నది మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి వచ్చి కాళేశ్వరం వద్ద కలుస్తోంది. దీంతో రెండు నదులు కలవడంతో మూడవ నదిగా సరస్వతి నది ఉద్భవిస్తుంది. దీనినే గుప్త నదిగా పిలుస్తారు. బుధవారం గోదావరి వరద నీరు లేత నీలిరంగులో, ప్రాణహిత వరద నీరు లేత ఎరుపు రంగుల్లో కనిపించి చూపరులను ఆకర్షించింది. రెండు నదులు ఒకేచోట రెండు రంగుల్లో వేర్వేరుగా కనిపించడంతో కాళేశ్వరానికి వచి్చన భక్తులు ఆసక్తిగా తిలకించారు. – కాళేశ్వరం -
ఏసీబీకి చిక్కిన కాటారం తహసీల్దార్
సాక్షి, కాటారం: భూమి ఆన్లైన్ నమోదు, పట్టా పాస్పు స్తకం కోసం ఓ రైతునుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటూ మహిళా తహసీల్దార్ ఏసీబీకి పట్టుబ డ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం లో గురువారం జరిగింది. కాటారం మండలం సుంద రాజ్‌పేటకు చెందిన ఐత హరికృష్ణ అనే దివ్యాం గుడికి కొత్తపల్లి శివారులో ని సర్వేనంబర్ 3లో 4 ఎకరాల 25 గుంటల భూమి ఉంది. ఈ భూమి గతంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆన్లైన్ ధరణి పోర్టల్‌లో నమోదు చేసి కొత్త పట్టా పాస్ పుస్తకం కోసం తహసీల్దార్ మేడిపల్లి సునీతకు విన్నవించుకున్నాడు. భూమి వివాదంలో ఉన్నందున ఆన్లైన్ నమోదు, పట్టాపాస్ పుస్తకం ప్రక్రియ పూర్తి చేయడానికి రూ.5 లక్షలు ఇవ్వాలని తహసీ ల్దార్ డిమాండ్ చేశారు. చివరకు రూ.3 లక్షలకు ఒప్పందం కుదిరింది. హరికృష్ణ 50 వేలు ఇచ్చినా మిగతా డబ్బు ఇస్తేనే పాస్‌పుస్తకం ఇస్తానని సునీత చెప్పడంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం గురువారం సాయంత్రం తహసీల్దార్‌కు తన కార్యాలయంలో రూ.2లక్షలు అందజేయగా.. ఏసీబీ అధికారులు డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. సునీతను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
భూతగాదాలతో ముగ్గురి హత్య
-
15 రోజుల్లో పెళ్లి.. అంతలోనే..
చిట్యాల: పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువకుడు కోవిడ్ బారిన పడి కన్నుమూశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన డబ్బాల రాజేశ్(24) కరోనాతో శుక్రవారం మృతి చెందాడు. రెండు రోజుల క్రితం చేయించుకున్న పరీక్షలో రాజేష్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో శ్వాస సమస్యలు తలెత్తగా మెరుగైన వైద్యం కోసం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. కాగా, రాజేష్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. మరో పదిహేను రోజుల్లో వధూవరులకు వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈలోగా రాజేష్ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. కరోనా రోగి ఆత్మహత్య నర్సింహులపేట: కరోనా భయంతో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామంలో పాలవెల్లి లింగయ్య (35) అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్న లింగయ్య శుక్రవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. చదవండి: అమానుషం: నిండు గర్భిణీపైనా.. దయ చూపలేదు -
దారుణం: కరోనాతో నిన్న భార్య, నేడు భర్త ..
సాక్షి, పర్వతగిరి(జయశంకర్ జిల్లా): వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన దంపతులు కరోనా బారిన పడి మృతి చెందారు. పది రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరూ మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. పర్వతగిరికి చెందిన వ్యక్తి(62) చౌరస్తాలో చెప్పుల షాపు నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య పది రోజుల క్రితం కరోనా బారిన పడగా పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ఆ తర్వాత ఆయనకు కూడా కరోనా సోకగా, హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం మృతి చెందాడు. కాగా, ఈ దంపతులు పిల్లలు లేకపోవడంతో బంధువులే అన్నీ అయి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
కాళేశ్వరం చేరుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంగళవారం ఉదయం బయల్దేరారు. కాళేశ్వరం చేరుకుని నేరుగా కాళేశ్వర.. ముక్తేశ్వర స్వామివార్ల దర్శనానికి వెళ్లారు. సీఎం కేసీఆర్, శోభ దంపతులు, మంత్రులకు వేద పండితులు ఘన స్వాగతం పలికి ఆలయం లోపలకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లారు. యాసంగి సీజన్లో కాళేశ్వరం ద్వారా.. నీటిని పంపించే విధానాన్ని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ఈ పర్యటన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని ప్రధాన బ్యారేజ్‌లు పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగి సీజన్లో పంటలకు జలాలను పంపింగ్చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. లక్ష్మీ బరాజ్ చేరుకొని.. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. యాసంగి పంటలకు సరిపడా సాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తారు. ఈ సందర్భంగా మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. బ్యారేజ్ వద్ద సీఎం కేసీఆర్ భోజనం చేసి అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు. సీఎం వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సాగునీటి అధికారులు ఉన్నారు. -
కాళేశ్వరంలో మళ్లీ ఎత్తిపోతలు
కాళేశ్వరం/మంథని: కాళేశ్వరం పథకం ద్వారా మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి లక్ష్మీపంపుహౌస్లో ఆదివారం ఇంజనీరింగ్ అధికారులు రెండు మోటార్లను ఆన్ చేసి ఎత్తిపోతలను ప్రారంభించారు. లక్ష్మీపంపుహౌస్ నుంచి ఇప్పటికే 11 మోటార్లతో 22 పంపుల ద్వారా గడిచిన రెండు సీజన్లలో నీటిని ఎత్తిపోసిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది ఆగస్టులో భారీ వర్షా లతో ఇంజనీర్లు మోటార్లను నిలిపివేశారు. అప్పటి నుంచి పంపుహౌస్‌లో ఎత్తిపోతలు జరగలేదు. లక్ష్మీబ్యారేజీకి జలకళ: ఈ నెల 1 నుంచి మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీలోని 85 గేట్లు మూసివేసి నీటిని నిల్వచేస్తున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీల వరకు నిల్వ ఉంది. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం వరకు బ్యాక్ వాటర్ 20 కిలోమీటర్ల మేరకు పెరగడంతో ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు తాజాగా ఎత్తిపోతలు ప్రారంభించారు. 10.5 టీఎంసీల లక్ష్యం: లక్ష్మీపంపుహౌస్ మోటార్ల ద్వారా డెలివరీ సిస్టర్న్‌లో ఎత్తిపోసే నీరు.. అక్కడి నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా 13.5 కిలోమీటర్ల దూరాన ఉన్న అన్నారం సరస్వతీ బ్యారేజీలోకి చేరుతుంది. అక్కడి నుం చి ఎగువన ఉన్న లోయర్ మానేరుకు 8 టీఎంసీలు, ఎల్లం పల్లికి 2.5 టీఎంసీలు.. మొత్తం కలిపి 10.5 టీఎంసీల నీటిని తరలించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఏకకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంపుహౌస్‌లలో రెండు చొప్పున మొత్తం పది మోటార్లు రన్ చేస్తున్నారు. వీటి ద్వారా ఒక చోటనుంచి మరో చోటుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. 3,150 క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి ఎల్ఎండీకి తరలించనున్నారు. ఎల్ఎండీ ప్రాజెక్టులోకి 8 టీఎంసీల నీరు బోయినపల్లి(చొప్పదండి): కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ప్రారంభం కావడంతో దానికి అనుగుణంగా శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న కరీంనగర్ ఎల్ఎండీ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం నీటి ని విడుదల చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు 12, 13 గేట్లను ఎత్తడంతో ఒక్కో గేటు ద్వారా 1,500 క్యూసెక్కుల చొప్పు న 3 వేల క్యూసెక్కుల నీరు ఎల్ఎండీ ప్రాజెక్టులోకి వెళ్తోంది. గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరద కాలువ మీదుగా మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి 3 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 25.57 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మిడ్‌మానేరు నుంచి ఎల్ఎండీ ప్రాజెక్టులోకి 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. దేవాదుల పంపింగ్ షురూ కన్నాయిగూడెం(ములుగు): దాదాపు ఐదు నెలల తర్వాత దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ మళ్లీ ప్రారంభమైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న జె.చొక్కారావు దేవాదుల పథకంలోని ఫేజ్–1, ఫేజ్–2లో ఒక్కో మోటారు చొప్పున శనివారం రాత్రి ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. ‘కాళేశ్వరం’ సందర్శనకు పర్యాటకులకు అనుమతి కాళేశ్వరం: దాదాపు 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్ వద్ద పర్యాటకుల ప్రవేశానికి అధికారులు అనుమతులు ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో గతేడాది మార్చి 20 నుంచి పర్యాటకులకు అనుమతులు ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది జూన్ 8న ఆలయాలకు వెళ్లేందుకు భక్తులకు అనుమతులిచ్చినా.. ఇక్కడి పంప్‌హౌస్, బ్యారేజీల్లోకి మాత్రం బ్యారేజీ ఏజెన్సీ సంస్థలు అనుమతించడం లేదు. తాజాగా ఆదివారం నుంచి పంప్‌హౌస్‌లోకి పర్యాటకులను అనుమతిస్తున్నారు. -
ఇసుక రీచ్...విలేజ్ రిచ్
సాధారణ రోజుల్లో కనీసం టీ దొరకని మారుమూల ఊళ్లలో ఇప్పుడు పదుల సంఖ్యలో హోటళ్లు, దుకాణాలు వెలుస్తున్నాయి. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన గ్రామాలు నేడు ఇసుక రీచులతో ప్రత్యామ్నాయ ఉపాధి, ఆదాయం పొందుతున్నాయి. సాధారణంగా వ్యవసాయభూమి ఎకరం కౌలు రూ. 8–9 వేలు ఉంటే ప్రస్తుతం ఏడాదికి రూ.లక్ష వరకు భూ యజమానులకు లీజు చెల్లిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతాలైన కాళేశ్వరం, మహదేవపూర్ పరిధి గ్రామాల్లో కొత్తగా ఇసుక రీచులు ఏర్పాటు చేస్తుండటంతో అక్కడ బతుకు చిత్రం మారుతోంది. సాక్షి, భూపాళపల్లి : భూమికి నీటి వసతి ఉంటేనే ఎవరైనా కౌలు చేసుకోవడానికి ముందుకు వస్తారు. అప్పుడు కూడా ఇచ్చేది ఎకరాకు పదివేలు మించదు. అయితే గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇసుక రీచులు ఏర్పాటు చేస్తున్న చోట మాత్రం ఎకరా వ్యవసాయ భూమి లీజు ధర రూ.లక్ష వరకు ఉంటోంది. దీంతో వ్యవసాయం చేసినా ఇంత లాభం ఉండదని రైతులు ఆనందంగా తమ భూములను డంపింగ్ యార్డుల కోసం లీజుకిచ్చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఇసుక రీచులు ఉన్న జిల్లాగా భూపాలపల్లికి పేరుంది. ఇప్పటికే ఐదు రీచులు నడుస్తుండగా ప్రస్తుతం జిల్లాలో కొత్తగా మరో 10 ఇసుక రీచులు ఏర్పాటు చేసి 73 లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుకను తీయనున్నారు. దీంతో మహదేవపూర్, కాళేశ్వరం పరిసరాల్లోని పలుగుల, మద్దులపల్లి, కుంట్లం, పూస్కుపల్లి, కుదురుపల్లిలో వ్యవసాయ భూముల లీజు ధరలకు రెక్కలొచ్చాయి. గోదావరి నుంచి తీసిన ఇసుకను స్టాక్ చేయడానికి సాగు భూములను ఉపయోగిస్తుండటంతో ఇంతటి విలువ వచ్చింది. ఇలా ఒక్కో రీచ్‌కు సుమారు 50– 60 ఎకరాల చొప్పున 600 నుంచి 700 ఎకరాల భూమిని ఇసుక రీచుల నిర్వాహకులకు రైతులు అప్పగించారు. సొంతూళ్లలో ఉపాధి ఇసుక రీచులతో గ్రామాల్లోని ప్రజలకు స్థానికంగా ఉపాధి దొరుకుతోంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు కూడా సొంతూళ్లకు తిరిగి వస్తున్నారు. ఇసుక రీచులు ప్రారంభం కావడంతో ఇక్కడే ఉపాధి వెతుక్కుంటున్నారు. నలభై మందితో బ్యాచ్‌లుగా ఏర్పడి లారీలకు టార్పాలిన్లు కప్పడం, లారీలోని ఇసుకను చదును చేయడం, రీచ్‌ల్లో ర్యాంప్‌లను సిద్ధం చేయడం లాంటి పనులు చేస్తున్నారు. ట్రాక్టర్ పనులతో పాటు లారీలకు డ్రైవర్లు, క్లీనర్లుగా ఉపాధి పొందుతున్నారు. రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదిస్తున్నారు. మరికొంతమంది హోటళ్లు, కిరాణా షాపులు పెట్టుకుని స్వయంఉపాధి పొందుతున్నారు. ఇసుక రీచులతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి జనం రాకపోకలు పెరగడంతో వీరికి గిరాకీ ఉంటోంది. పదెకరాలు లీజుకిచ్చాను క్వారీలు ఏర్పాటు కావడంతో పంట నష్టాన్ని కూడా కలిపి ఎకరాకు రూ.లక్ష చొప్పున 10 ఎకరాలు లీజుకు ఇచ్చాను. వ్యవసాయం చేసినా కూడా ఇంత లాభాలు రావు. నాతో పాటు చాలామంది రైతులు తమ భూములను ఇసుక డంపింగ్ కోసం ఇచ్చారు. – మచ్చ లచ్చన్న, రైతు, పలుగుల, మహదేవపూర్ గిరాకీ మంచిగ ఉంటోంది కిరాణా షాపు, హోటల్ బిజినెస్‌కు మంచిగానే గిరాకీ ఉంది. లారీ డ్రైవర్లతో పాటు క్వారీల సిబ్బందికి భోజనం పార్సిళ్లు ఆర్డర్లు వస్తున్నాయి. రోజుకు రూ.2 వేల దాకా గిరాకీ అవుతోంది. – రాగం మధుకర్, హోటల్ నిర్వాహకుడు, పలుగుల గ్రామం -
ఏం కష్టం వచ్చింది బిడ్డా!
భూపాలపల్లి: ‘బిడ్డా.. మనకేం కష్టమొచ్చింది. బతకడం కన్నా.. చావడమే శరణ్యం’అని ఓ మహిళ బిడ్డతో సహా తనువు చాలించింది. రెండున్నరేళ్ల కుమార్తెకు ఉరి బిగించి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. డీఎస్పీ ఎ.సంపత్‌రావు, సీఐ ఎస్.వాసుదేవరావు కథనం ప్రకారం.. భూపాలపల్లిలోని జవహర్‌నగర్ కాలనీలో నివాసం ఉండే కుమారస్వామికి జగిత్యాల జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌కు చెందిన లాస్య (25)తో 2015లో వివాహం జరిగింది. కేటీకే 1వ గనిలో కుమారస్వామి జనరల్ మజ్దూర్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం అతను విధులకు వెళ్లగా భార్య లాస్య మధ్యాహ్నం తన కూతురు మహితతో కలసి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చిన కుమారస్వామి తలుపుకొట్టినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా భార్య, కుమార్తె ఉరి వేసుకుని కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను కిందికి దింపారు. మృతురాలి సోదరుడు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త వేధింపుల కారణంగానే లాస్య, తన కూతురికి ఉరి వేసి.. తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని కాలనీవాసులు అనుమానిస్తున్నారు. -
అంత్యక్రియలకు ఏర్పాట్లు.. మరోసారి కన్నీళ్లే
సాక్షి, జయశంకర్ జిల్లా: అనారోగ్యానికి గురై మరణించిందనుకున్న కూతురు మూలుగు శబ్దం ఆఖరి నిమిషంలో ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఆశలు రేపింది. అయితే తమ బిడ్డ బతికేఉందని సంతోషపడేలోపే మళ్లీ విధి వాళ్లను వెక్కిరించింది. కాటి నుంచి ఆస్పత్రికి తరలించిన కూతురు మరణించందని వైద్యులు ధ్రువీకరించడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. మహదేవపూర్ మండలం కుదరుపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని మెండ గీతాంజలి(20) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జ్వరం రావడంతో ఆమెను కొద్ది రోజులు ప్రేవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.(చదవండి: దివ్య తేజస్విని హత్య కేసులో కీలక మలుపు) డిశ్చార్జ్ అయిన అనంతరం ఇంటి వద్దే ఉంటూ మందులు వాడుతోంది. అయితే బుధవారం జ్వరం మరీ తీవ్రం కావడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. అంతలోనే చలనం లేకుండా పడిపోవడంతో ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. గ్రామస్తులు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో దింపుడుకల్లం వద్ద శవాన్ని దించి బంధువులు ఆమె చెవిలో పిలస్తున్న సమయంలో చిన్నగా మూలుగు వినిపించింది. దీంతో వెంటనే మళ్లీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో ఫలితం లేకుండా పోయింది. తిరిగి గ్రామానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు చేశారు. -
దారుణం: భర్తపై భార్య విషప్రయోగం
సాక్షి, కాటారం(జయశంకర్ భూపాలపల్లి): మూడుమూళ్లు, ఏడు అడుగుల బంధానికి కళంకాన్ని తెచ్చింది ఓ మహిళ. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రేగులగూడెంలో చోటు చేసుకుంది. ఆగస్టు 19న ఈ ఘటన చోటుచేసుకోగా అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని చేధించారు. కాటారం సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బి.హతీరాం కేసు వివరాలను వెల్లడించారు. రేగులగూడెం గ్రామానికి చెందిన మారుపాక దేవేందర్(40), మారుపాక స్వప్నకు 12 ఏళ్ల క్రితం వివాహం జరగగా, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఇదే క్రమంలో 2017లో మహాముత్తారం గ్రామానికి చెందిన లింగమళ్ల కళ్యాణ్‌తో స్వప్నకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం దేవేందర్‌కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆయనను అడ్డు తొలగించాలని స్వప్న, ఆమె ప్రియుడు కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం కళ్యాణ్ పురుగుమందు విషపు గుళికలు స్వప్నకు అందించగా, ఆమె మద్యంలో కలిపి దేవేందర్‌కు ఆగస్టు 19న తాగించింది. మరుసటి రోజు ఉదయం దేవేందర్ వాంతులు, విరోచనాలు చేసుకొని మృతి చెందాడు. అయితే, తన కొడుకు మృతిపై అనుమానం ఉందని దేవేందర్ తండ్రి నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాటారం సీఐ హతీరాం నేతృత్వంలో దర్యాప్తు చేపట్టగా, రసాయనిక పరీక్షల ఆధారంగా మృతుడిపై విషప్రయోగం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు స్పప్నపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. దీంతో బుధవారం స్వప్న, కల్యాణ్‌లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
చలివాగులో చిక్కుకున్న రైతులు
-
‘కాళేశ్వరం’పై పోలీసుల నజర్!
సాక్షి, కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులపై పోలీసులు నిఘా పటిష్టం చేశారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. జిల్లాలో మావోయిస్టులు పట్టు కోసం ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో రాత్రీపగలు గోదావరి తీర ప్రాంతాలు, అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. పల్లెలతో పాటు ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే పోలీసులు విచారించి వదిలేస్తున్నారు. వాహనాల తనిఖీలు కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన మీదుగా మహారాష్ట్ర–తెలంగాణకు వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కాళేశ్వరం, మహాదేవపూర్, పలిమెల ఎస్సైలు అభినవ్, అనిల్, శ్యాంరాజ్ ఆధ్వర్యాన తనిఖీలు సాగుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు తెలంగాణ వైపు మహదేవపూర్, పలిమెల మండలాల్లో గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యారు. మహదేవపూర్, పలిమెల మండలంలోని రేవులపై ప్రత్యేక దృష్టిని సారించారు. గోదావరిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రోడ్డు మార్గాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఇక మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డలోని లక్ష్మీ, అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ, కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్, గ్రావిటీ కాల్వల వద్ద నిఘా తీవ్రం చేశారు. జిల్లా ఇన్చార్జి ఎస్సీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, కాటారం డీఎస్పీ బోనాల కిషన్, సీఐ నర్సయ్య ఆధ్వర్యంలో బ్యారేజీలపై ప్రత్యేక నజర్ వేసినట్లు తెలిసింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, డిస్ట్రిక్ గార్డులు, సివిల్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
నది మధ్యలో నరకయాతన
సాక్షి, కాళేశ్వరం: గోదావరి దాటుతున్న ఓ యువకుడు వరదలో చిక్కుకున్నాడు. ఏడు గంటల పాటు నది మధ్యలోనే ఉండిపోయి నరకయాతన అనుభవించాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సమీపంలోని కుంట్లం–3 ఇసుక క్వారీ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కొల్లూరు ఇసుక క్వారీలో పనిచేసే జీవన్‌లాల్ సింగ్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారంలోని క్వారీ వద్దకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కుంట్లం–3 క్వారీ నుంచి కొల్లూరుకు కాలినడకన గోదావరి మీదుగా వెళ్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో మధ్యలో చిక్కుకున్నాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు వరదలో చిక్కుకున్న జీవన్‌లాల్.. అరుపులు, కేకలు వేసినా ఎవరికీ వినపడలేదు. చివరికి మధ్యాహ్నం అతని అరుపులు విన్న క్వారీ సిబ్బంది 100కు డయల్ చేశారు. కానిస్టేబుళ్లు సంజీవ్, మధుకర్ అక్కడికి చేరుకుని ఓ నాటు పడవలో ఇద్దరు గజ ఈతగాళ్లతో వెళ్లి జీవన్‌లాల్ సింగ్‌ను తీసుకువచ్చారు. (ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకోవాలి) -
హార్ట్ టచింగ్: నేలకు దిగిన న్యాయం!
భూపాలపల్లి: ఓ దివ్యాంగుడు లేవలేని స్థితిలో కలెక్టర్ గది వద్ద ఓ అర్జీ పట్టుకొని కూర్చున్నాడు. అటు నుంచి వచ్చిన కలెక్టర్ అబ్దుల్ అజీమ్.. అతని దీనస్థితిని గమనించి.. హోదాను పక్కనబెట్టి తాను సైతం కింద కూర్చొని సమస్యను ఓపికగా విన్నారు. నేనున్నానని, న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సంఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో చోటుచేసుకుంది. వివరాలు.. సింగరేణి బొగ్గు గని ఏర్పాటులో ఇల్లు కోల్పోయిన తనకు పునరావాసం కల్పించాలని కోరేందుకు గణపురం మండలం ధర్మారావుపేట గ్రామపంచాయతీ పరిధిలోని మాధవరావుపల్లికి చెందిన దివ్యాంగుడు కల్లెబోయిన వెంకటేశ్వర్లు కలెక్టరేట్‌కు వచ్చాడు. (చదవండి: సొంతూళ్లోనే కాయకష్టం) కలెక్టర్ గది వద్ద అతను వేచి ఉండగా.. అదే సమయంలో కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ వచ్చారు. దీంతో వెంకటేశ్వర్లు పరిస్థితిని గమనించిన కలెక్టర్ చలించిపోయారు. తాను కూడా కింద కూర్చుని సమస్యను వినమ్రంగా విన్నారు. గని ఏర్పాటుకు ఇల్లు కోల్పోయిన తనకు సింగరేణి సంస్థ పరిహారం చెల్లించినా.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించలేదని బాధితుడు వాపోయాడు. ఈ విషయాన్ని పరిశీలించి త్వరలో తగిన న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వెంకటేశ్వర్లు ఇంటికి బయలుదేరాడు. కాగా, గత ఫిబ్రవరిలో తన కార్యాలయం వద్ద మెట్లపై కూర్చుని నిరీక్షిస్తున్న గిరిజన వృద్ధురాలి పక్కనే కూర్చోని ఆమె సమస్యను కలెక్టర్ అబ్దుల్ అజీమ్ అక్కడికక్కడే పరిష్కరించి మన్నలు పొందారు. (కడుపులో కాటన్ కుక్కి ఆపరేషన్) -
అచ్చం సినిమాలో మాదిరి.. దుమికిన కలెక్టర్!
సాక్షి, భూపాలపల్లి:‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ శుక్రవారం పలు కాలనీల్లో పర్యటించారు. ఈక్రమంలో జవహర్ కాలనీలో శ్మశాన వాటిక స్థల అన్వేషణ కోసం శివారులో ఫారెస్టు చుట్టూ ఉన్న ట్రెంచ్ దాటేందుకు జంప్ చేశారు. అచ్చం సినిమా షూటింగ్లో మాదిరి ఆయన జంప్ చేయగా.. ప్రజాప్రతినిధులు మాత్రం కాలువలో రాళ్లు వేసి దాటారు. కలిసిపోయి.. కలివిడిగా.. ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ శుక్రవారం తొర్రూరులో పర్యటించారు. పార్కుల ఏర్పాటు, ఇతరత్రా అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. తర్వాత ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. అప్పటికే మధ్యాహ్న భోజన సమయం కావడంతో విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటే మెట్లపై కూర్చుని భోజనం చేస్తూ వారి బాగోగులపై ఆరా తీయడం ఆకట్టుకుంది. -
కాళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా, సాగునీటి లక్ష్యాల సాధనకు ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల పునర్ వ్యవస్థీకరణ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకువస్తామని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు, ఇంజనీరింగ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి సరఫరాపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సాగు నీటి ఇంజనీరింగ్ వ్యవస్థను 11 సర్కిల్స్‌గా విభజన చేస్తామని తెలిపారు. సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజనీర్‌ను నియమిస్తామన్నారు. జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఇరిగేషన్ అధికారులు, సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తి పోసేలా అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. సాగునీటి కాలువలకు మే నెలాఖరులోగా అవసరమైన అన్ని మరమ్మత్తులు చేపట్టాలన్నారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోనేలా బ్యారేజీల ఆపరేషన్ రూల్స్ కార్యచరణ సిద్ధం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ల స్థానంలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. కొత్త కలెక్టరేట్లను మంజూరు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమారును ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశానికి ముందు సీఎం కేసీఆర్ జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరంలో గోదావరి పుష్కరఘాట్‌కు చేరుకుని.. గోదావరి మాతకి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరికి చీర, సారే సమర్పించారు. అనంతరం కాళేశ్వరము ముక్తేశ్వర ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు. -
ప్రాణం తీసిన పాతప్రేమ!
కాజీపేట : పదో తరగతి చదువుతున్న ఆమెపై మనస్సు పడ్డాడు. ఆ విషయం తెలిసి కుటుంబీకులు ఆయనను మందలించినా మారలేదు. అలా కాలచక్రం గిర్రున తిరిగిపోగా... ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగింది. అయితే, వేధింపులు భరించలేక ఆయన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇంకేముంది ఒంటరిగా ఉంటున్న ఆయనకు మళ్లీ తన పదో తరగతి నాటి ప్రేమ గుర్తుకొచ్చింది. అయితే, అప్పట్లో బాలికగా ప్రేమను నిరాకరించిన ఆమె ఇప్పుడు మరో వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ చదువుకున్నప్పటి స్నేహితుడి ప్రేమను ఈసారి అంగీకరించింది. ఆ చనువుతో ఇంటికి వచ్చి వెళ్తుండగా చూడలేని ఆమె భర్త ఇళ్లు వదిలేసి వెళ్లిపోయాడు.. ఇక వీరి వ్యవహరం భరించలేని ఆమె తమ్ముడు, మరిది కలిసి ఆయనను తీవ్రంగా కొట్టగా ఆ గాయాలతో మృతి చెందాడు. దీంతో వీరిద్దరితో పాటు ఆమెపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కాజీపేట పోలీసుస్టేషన్లో ఏసీపీ బి.రవీంద్రకుమార్ వివరాలు వెల్లడించారు. చిన్నకోడెపాక టు కాజీపేట.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకోడెపాక గ్రామానికి చెందిన సునీత 10వ తరగతి చదువుతున్న సమయంలో నుంచే అదే గ్రామ వాస్తవ్యుడైన పెరుమాండ్ల బిక్షపతి ప్రేమిస్తున్నట్లు చెబుతూ వెంటపడేవాడు. ఆమె కుటుంబ సభ్యులు ఎంతగా హెచ్చరించినా వినలేదు. ఆ తర్వాత కొన్నేళ్లకు సునీతను కాజీపేటకు చెందిన రామరాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. అలాగే, బిక్షపతి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవిస్తున్నాడు. ఇంతలోనే 2008లో ఆయన భార్య ఆత్మహత్య చేసుకోగా బిక్షపతిపై రేగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. తన భార్య చనిపోయాక బిక్షపతికి సునీత మళ్లీ గుర్తుకొచ్చింది. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకున్న ఆయన అక్కడికి వెళ్లాడు. సునీత బాగానే మాట్లాడేది. దీంతో చనువు పెరగడంతో తరచుగా ఆమె ఇంటికి వచ్చివెళ్తున్నాడు. వీరిద్దరి వ్యవహారం నచ్చని సునీత భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మూడు నెలలుగా ఆయన ఆచూకీ కూడా దొరకలేదు. అయినా సునీత భిక్షపతితో తన సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని సునీత కుటుంబ సభ్యులు పసిగట్టి హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పలుమార్లు పంచాయతీలు పెట్టించారు. అయినా ఇద్దరూ వినడం లేదు. దాడి.. ఆపై ఆస్పత్రికి.. ఈనెల 21న రాత్రి 10 గంటలకు సునీత కోసం ఆమె ఇంటికి బిక్షపతి వచ్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆమె తమ్ముడు మాడా సదా నందం, మరిది పెరుమాండ్ల సుధాకర్‌కు ఇది నచ్చలేదు. తీవ్రంగా హెచ్చరిస్తూ కర్రలు, రాడ్‌తో బిక్షపతిని బాదడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వెంటనే 108 సర్వీసుకు ఫోన్ చేసి భవనం పైనుంచి కింద పడ్డాడని చెబుతూ వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యాడు. అయితే, బిక్షపతి స్పృహలోకి వచ్చా క తనపై దాడి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పగా.. కొద్దిసేపటికే మృతి చెందాడు. దీంతో మృతుడి తమ్ముడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు సదానందం, సుధాకర్‌తో పాటు వారికి సహకరించిన సునీత శుక్రవారం కడిపికోండ ఆర్వోబీ బ్రిడ్జి సమీపంలో ఉన్నట్లుఅందిన సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, నిందితుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా చేధించిన ఇన్స్పెక్టర్ నరేందర్‌తో పాటు సిబ్బందిని ఏసీపీ రవీంద్రకుమార్ ఈ సందర్భంగా అభినందించారు. -
మేడారం జాతర.. బస్సులపై బెంగ !
సాక్షి, ఎస్ఎస్ తాడ్వాయి(వరంగల్) : ఆసియాలోనే అత్యధిక మంది భక్తులు వచ్చే మేడారం శ్రీసమ్మక్క – సారలమ్మ జాతరపై ఈసారి సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ పడనుం దా.. ఒకవేళ సమ్మె ముగిసినా భక్తుల రాకపోకల కు అనుగుణంగా బస్సులు సమకూర్చుకుని నడపగలరా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహా జాతర జరగనుంది. అంటే ఇంకా రెండు నెలల సమయం కూడా లేదు. అయినా ఇంత వరకు ఆర్టీసీ నుంచి ఎటువంటి సన్నద్ధత లేకపోవడం భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. సన్నద్ధత కరువు కోటిమందికి పైగా హాజరవుతారనే అంచనాలు ఉన్న మేడారం జాతరకు భక్తులను తరలించడంలో ఆర్టీసీ సంస్థ కీలకంగా వ్యవహరిస్తుంది. జాతరకు నాలుగు నెలల ముందు నుంచే ఆర్టీసీ ఎండీ, ఈడీ వంటి ఉన్నతాధికారులు మేడారం, వరంగల్‌లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేవారు. ఇక్కడి అధికారులను జాతరకు సమాయత్తం చేసేలా సలహాలు, సూచనలు చేసేవారు. ప్రస్తుతం ఆర్టీసీలో నిరవధికంగా కొనసాగుతున్న సమ్మె కారణంగా మేడారం జాతరకు సంబంధించిన ఊసే ఆర్టీసీలో వినిపించడం లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం అంతా కోర్టుల చుట్టూ తిరుగుతుండటంతో ఉన్నాధికారులంతా ఆ పని మీదే దృష్టి కేంద్రీకరించారు. దీంతో జాతరకు సంబంధించి ఆర్టీసీ పరంగా ముందస్తు సన్నద్ధత కరువైంది. తగ్గిన బస్సులు ప్రభుత్వ విధానాలను అనుసరించి కొత్త బస్సులు కొనడం కంటే అద్దె ప్రతిపాదికన బస్సులను నడిపించడంపై గత కొంత కాలంగా ఆర్టీసీ ఎక్కువ దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీ పరిధిలోని 97 డిపోల్లో 10,640 బస్సులు ఉన్నాయి. వీటిలో అద్దె ప్రతిపాదికన 2140 బస్సులు ఉన్నాయి. సాధారణంగా అద్దె బస్సులను జాతర విధుల నుంచి మినహాయిస్తున్నారు. దీంతో ఆర్టీసీ సంస్థకు 8,320 బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గరుడ, ఏసీ, మినీ పల్లె వెలుగులు, సిటీ సర్వీసులను మినహాయిస్తే ఈ సంఖ్య మరింతగా తగ్గుతుంది. వీటికి తోడు ఇటీవల ఆర్టీసీ సమ్మెను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్పుడు నడుస్తున్న బస్సుల్లో ఐదువందలకు పైగా బస్సులు పూర్తిగా చెడిపోయినట్లేనని చెప్పారు. గత జాతర అనుభవాలను పరిశీలిస్తే ఆర్టీసీ సంస్థ కనీసం 3,600 బస్సులను జాతరకు కేటాయించాల్సి ఉంటుంది. అంటే సంస్థకు అందుబాటులో ఉన్న బస్సుల్లో సగం జాతరకు కేటాయించాలి. ఈ స్థాయిలో పని జరగాలంటే ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. సమ్మె కారణంగా ప్రస్తుతం ఈ పరిస్థితి కనిపించడం లేదు. సమ్మె సవాళ్లు జాతరకు కేటాయించే బస్సులు పూర్తి స్థాయిలో కండీషన్లో ఉండాలి. మార్గమధ్యలో బస్సులు మొరాయిస్తే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ సమస్య ఎదురవుతుంది. గడిచిన నలభై రోజులుగా ఆర్టీసీ సంస్థ అరకొర సౌకర్యాలు, మెకానిక్‌లతో బస్సులను నడిపిస్తోంది. దీంతో బస్సుల కండీషన్ దెబ్బ తింటోందని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. అలవాటు లేని వ్యక్తులు నడిపించడం వల్ల బస్సులు త్వరగా దెబ్బతింటున్నాయనేది వారి వాదనగా ఉంది. సమ్మె విషయంలో ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన వల్ల భవిష్యత్తులో ఆర్టీసీలో ఎంత మంది కార్మికులు ఉంటారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. జాతర విధులు నిర్వర్తించేందుకు కనీసం పదివేల మందికి పైగా కార్మికులు అవసరం ఉంటుంది. భారీ ప్రణాళిక రోడ్డు సౌకర్యం మెరుగైనప్పటి నుంచి జాతరకు వెళ్లేందుకు ఆర్టీసీపై ఆధారపడుతున్న భక్తుల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి చేరుకుంది. ఇందుకు తగ్గట్టుగా ఆర్టీసీ సంస్థ జాతర ప్రారంభానికి నాలుగైదు నెలల ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసేది. రాష్ట్ర వ్యాప్తంగా 71 పాయింట్లు ఏర్పాటు చేసేది. ఇక్కడ నుంచి మేడారం వరకు భక్తులు రాకపోకలు సాగించేందుకు నాలుగు వేల బస్సులు అందుబాటులో ఉంచేది. 2012 జాతర నుంచి మూడు వేలకు తక్కువ కాకుండా బస్సులను నడిపించారు. గత రెండు జాతరలలో ఏకంగా 3,600 బస్సులు భక్తులను తరలించేందుకు ఉపయోగించగా, నాలుగు వందల బస్సులు అదనంగా అందుబాటులో ఉంచారు. ఈ బస్సులు నడిపేందుకు సుమారు పదివేల మంది కార్మికులు పని జాతర సమయంలో అహర్నిశలు శ్రమించారు. -
అనుభవం పేరిట అనుయాయులకు..
సాక్షి, వరంగల్ : మేడారంలో సమ్మక్క – సారలమ్మ మహా జాతర సమీపిస్తుండడంతో పనులు చేపట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు గ్రామీణ నీటిసరఫరా విభాగం ఆధ్వర్యాన చేపట్టాల్సిన అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు కొందరు కాంట్రాక్టర్లు పక్కా స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ శాఖ ద్వారా సుమారు రూ.19 కోట్ల వ్యయంతో పలు పనులు చేపట్టాలని ప్రతిపాదించగా అగ్రభాగం నిధులు మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించారు. ఈ పనులను పొందేందుకు ప్రతీ జాతర సందర్భంగా కాంట్రాక్టర్లు పోటీ పడుతుండడం ఆనవాయితీ. అయితే, ఎక్కువ మందికి పోటీకి రాకుండా.. ఆర్‌డబ్ల్యూఎస్‌లో హవా నడిచే కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా కొత్త నిబంధనలను సృష్టించినట్లు సమాచారం. ఎస్ఈ కార్యాలయంలోని కొందరు అధికారులతో కుమ్మక్కైన సదరు కాంట్రాక్టర్లు టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేయించడంలో విజయం సాధించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మేరకే ఆన్లైన్లో టెండర్ల నోటిఫికేషన్ రావడంతో ఇదేంటని మిగతా కాంట్రాక్టర్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ప్రశ్నిస్తే.. తక్కువ సమయం ఉన్నందున అనుభవం ఉన్న వారికే పనులు కేటాయిస్తే త్వరగా పూర్తవుతాయని, తద్వారా ఇబ్బందులు ఇబ్బందులు ఉండవని ఖరాకండిగా చెబుతుండడం గమనార్హం. రూ.6.50 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణం మేడారంలో గత జాతరలో 8,500 సెమీ పర్మనెంట్(రేకులతో) టాయిలెట్లు నిర్మించారు. జాతర అనంతరం గద్దెలు, చాంబర్లను తొలగించి సామాగ్రిని భద్రపర్చారు. అదే సామాగ్రితో ఈ జాతరలో మళ్లీ 8,500 సెమీ పర్మనెంట్ మరుగుదొడ్లు నిర్మించేందుకు 13 భాగాలుగా విడగొట్టి రూ.6.50కోట్లు కేటాయించారు. ఈ పనులు పొందేందుకు అడ్డగోలు నిబంధనల అండతో కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని మిగిలిన కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అడ్డగోలు నిబంధనలు... ప్రతీ మేడారం జాతరలో నిర్మిస్తున్న మరుగుదొడ్లకు టెండర్లు నిర్వహిస్తున్నప్పటికీ పనులు పొందిన కాంట్రాక్టర్ల నుంచి స్థానిక చోటా కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టు తీసుకొని పూర్తి చేస్తున్నారు. ఈ జాతరలో అడ్డగోలు నిబంధనలను పేర్కొని కొందరికే పనులు దక్కేలా వ్యూహం రచించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే టర్నోవర్ కాకుండా 350 మరుగుదొడ్లు కట్టిన అనుభవం ఉండాలని పేర్కొనడం వివాదానికి దారితీస్తోంది. ఒకే ఏడాదిలో రూ.50 లక్షలు, రూ.కోటి టర్నోవర్ పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు పనుల్లో ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించినా.. కొందరికి కట్టపెట్టేందుకే కొత్త నిబంధనలను తెర పైకి తీసుకొచ్చారని మిగిలిన కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన 12 మంది కాంట్రాక్టర్లు మాత్రమే అర్హత సాధించగా.. వారికే పనులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేడు ఆఖరు... మేడారంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యాన రూ.11.81కోట్లతో చేపట్టనున్న 31 పనులకు టెండర్ల దాఖలు గడువు శుక్రవారంతో ముగియనుంది. టెండర్ల షెడ్యూళ్లను సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించి ఈనెల 18న ఉదయం 11.30గంటలకు ఫైనాన్సియల్ బిడ్ తెరుస్తారు. ఇందులో రూ.6.50కోట్లతో నిర్మించనున్న 8,500 టాయిలెట్ల పనులను 13 భాగాలుగా విభజించి రూ.50 లక్షల చొప్పున కేటాయించా రు. అదే విధంగా రూ.కోటి వ్యయంతో ఇన్‌ఫిల్టరేషన్ బావుల్లో పూడికతీత, మిగిలిన నిధులను డ్రింకింగ్ వాటర్ పైపులైన్ల నిర్వహణ తదితర పనుల కోసం కేటాయించారు. కాగా, టెండర్ల నిర్వహణలో జరుగుతున్న అన్యాయాన్ని అధికార పార్టీ నేతలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఆధికారులపై అగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈనేపథ్యంలో టెండర్ల దాఖలు ప్రక్రియ పొడిగిస్తారా.. లేదా అనే విషయమై సందిగ్ధత నెలకొంది. నాట్ రీచబుల్ టెండర్ల ప్రక్రియలో కొత్త నిబంధన.. పలువురు కాంట్రాక్టర్ల అభ్యంతరాలు వస్తున్న విషయమై ఎస్ఈని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన కార్యాలయంలో అందుబాటులో లేరు. ఇక ఎస్ఈ సెల్‌ఫోన్ సైతం ‘నాట్ రీచబుల్’ అని వస్తోంది. కాగా, మేడారం పనులకు తక్కువ సమయం ఉన్నందున అనుభవం ఉన్న వారికే ఇస్తే తమకు ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు కార్యాలయ వర్గాలు చెబుతుండడం కాంట్రాక్టర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
వేధింపులు బరించలేక పూజారి ఆత్మహత్య
-
అత్యాచార నిందితుడికి శిక్ష ఖరారు
సాక్షి, వరంగల్ : ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్యకు పాల్పడిన ఓ కామాంధుడికి ఎట్టకేలకు శిక్ష ఖరారు అయ్యింది. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును శుక్రవారం జిల్లా కోర్టు వెలువరించింది. జయశంకర్ జిల్లా గోరికొత్త పల్లి గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ శివ అనే నిందితుడుకి వరంగల్ జిల్లా న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. -
చాపకింద నీరులా కమలం
సాక్షి, భూపాలపల్లి: అసెంబ్లీ ఎన్నికల అనంరతం జరిగిన పరిణామాలతో జిల్లాలో కొంత రాజకీయ అనిశ్చితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారడం, టీడీపీ కనుమరుగవ్వడం, లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో జోరుమీదున్న బీజేపీకి జిల్లాలో నెలకొన్న రాజకీయ వాతావరణ పరిస్థితులు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ మారడంతో కాంగ్రెస్ కేడర్‌లో మెజారిటీ నేతలు ఆయన వెంట టీఆర్ఎస్లో చేరారు. గండ్ర పార్టీ మారిన తర్వాత భూపాలపల్లి కాంగ్రెస్‌లో ఏర్పడిన రాజకీయ శూన్యతను కొండా దంపతులు భర్తీ చేస్తారని భావించారు. ప్రస్తుతం వారు కూడా కాంగ్రెస్ కార్యక్రమాలకు అంటీమట్టనట్లు ఉండడంతో భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ కాస్త బలహీనపడిందనే సంకేతాలు వస్తున్నాయి. ఇదే మంచి అవకాశంగా బీజేపీ కేడర్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీనికి తగ్గట్లుగానే టీడీపీ జిల్లా అధ్యక్షుడు చాడరఘనాథ్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. సభ్యత్వ నమోదును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని భూపాలపల్లి నియోజకవర్గంలో 20 వేలకు పైగా సభ్యత్వాలు నమోదు చేయించామని బీజేపీ చెబుతోంది. వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోంది. ఇన్నాళ్లు జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్గా ఉన్న రాజకీయాక ముఖ చిత్రాని బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా మర్చాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం ద్వారా, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ శ్రేణుల్లో అంతర్మథనం ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలుపు సాధించిన బీజేపీ రాష్ట్రంలో బలపడడానికి ప్రయ త్నాలు చేస్తుండగా, రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ శ్రేణులను పట్టించుకునే నాయకులు కరువయ్యారు. భరోసా ఇచ్చే నాయకులు లేకపోవడంతో వలసలు పెరిగే అవకాశం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున గెలిచిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్‌లో కీలక నేతలు కరువయ్యారు. ఇక టీడీపీ పరిస్థితి చెప్పా ల్సిన పనిలేకుండా ఉంది. గండ్ర పార్టీ మారిన తర్వాత మొదట్లో పరిషత్ ఎన్నికల ముందు కొండా దంపతులు, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు భూపాలపల్లి కాంగ్రెస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వారు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కొండా దంపతులు కూడా బీజేపీలోచేరుతున్న ట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆదివారం కాంగ్రెస్ నేతలు శ్రీధర్‌బాబు, బట్టివిక్రమార్క భూపాలపల్లి పీహెచ్సీ సమీక్షించారు. అయితే ఇటువంటి కార్యక్రమాలు గండ్ర పార్టీ మారిన తర్వాత నుంచే ప్రారంభిస్తే బాగుండేదని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. మరింత బలపడనున్న బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గంలో బీజేపీ మరింత బలపడనుంది. ఇటీవల కాలంలో భూపాలపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే దాదాపు 20 వేల మందిని బీజేపీ పార్టీలో చేర్చుకున్నట్లు తెలిసింది. కార్యకర్తలతో పాటు నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో కీర్తి రెడ్డి బీజేపీ గెలుపుకోసం పోరాడారు. ప్రస్తుతం చాడ రఘునాథ్‌రెడ్డి కూడా బీజేపీలో చేరడంతో బీజేపీ నియోజకవర్గంలో మరింత బలపడే అవకాశం ఉంది. మునిసిపల్ ఎన్నికల ముందు టీఆర్ఎస్లో గండ్ర, చారి వర్గాల మధ్య ఎమైనా విభేదాలు ఉంటే తమకు ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఎవరికైనా టికెట్ రాకపోతే బీజేపీ మంచి వేదిక అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. -
దారుణం : నార్మల్ డెలివరీ చేస్తుండగా..
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని చిట్యాల మండల కేంద్ర సివిల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. గైనకాలజిస్ట్ డాక్టర్ లేకుండానే ఓ బాలింతకు నార్మల్ డెలివరీ చేయబోయారు ఆస్పత్రి సిబ్బంది. పరిస్థితి విషమించడంతో తల్లి, బిడ్డ ఇద్దరూ మృతి చెందారు. మొగుళ్లపల్లి మండలం ఎస్ పేట గ్రామానికి చెందిన కవిత అనే బాలింత డెలివరీ కోసం సోమవారం ఆస్పత్రికి వచ్చారు. ఆమెను పరీక్షించిన సిబ్బంది.. నార్మల్ డెలివరీ కోసం లేబర్ రూమ్‌కి తరలించారు. ఆస్పత్రిలో పని చేసే గైనకాలజిస్ట్ లేకుండానే ఆమెకు నార్మల్ డెలివరీ చేయబోయారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి బాలింత మృతి చెందారు. క్రమంలో పరిస్థితి విషమించి బాలింత మృతి చెందారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తల్లి, కూతురు మృతి చెందారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బంధువులతో కలిసి ఆస్పత్రి అద్దాలు, పర్నీచర్ పగులగొట్టారు. -
పరవళ్లు తొక్కుతున్న బొగతా జలపాతం
-
కాకతీయుల స్థావరాలు
జయశంకర్ జిల్లా అటవీ సంపదకు పెట్టింది పేరు. జిల్లా విస్తీర్ణంలో ఎక్కువ భాగం అటవీ ప్రాంతమే ఉంది. ఈ అటవీ ప్రాతంలో ఆదిమానవులు, సమాధులు మొదలుకోని అనేక ఆలయాలు, గుహలు, రాతి చిత్రాలు ఉన్న ప్రాంతాలు, శత్రుదుర్బేధ్యమైన కోటలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. కొన్ని గతంలోనే వెలుగులోకి రాగా మరికొన్ని ఇటీవల కాలంలో బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఇందులో ఒకటి కాపురం గుట్టల్లో ఉన్న సైనిక స్థావరాలు. – మల్హర్ అల్లంత దూరాన దట్టమైన అడవి మల్హర్ మండలంలో తాడిచర్ల గ్రామపంచాయతీ పరిధిలో కాపురం అనే గ్రామం ఉంది. ఈ గ్రామ సరిహద్దులోని కాపురం చెరువు పరిసర ప్రాంతాలకు వెళ్తే అల్లంత దూరాన దట్టమైన అడవిలో మూడు కొండలు కనిపిస్తాయి. ఉలి పట్టుకుని శిల్పులు చెక్కారా అన్న తరహాలో ఈ కొండలు కనిపిస్తాయి. ఈ కొండలు కాకతీయుల కాలంలో సైనిక స్థావరాలుగా ఉపయోగించారనేందుకు అనేక ఆధారాలు లభించాయి. కొండ పైభాగంలో విష్ణుమూర్తి ఆలయంతో పాటు ఆలయ నిర్మాణంలో ఉపయోగించే పెద్ద రాతి స్తంభాలు ఉన్నాయి. సహజసిద్ధంగా ఏర్పడిన రాతి గోడ, ఆ పక్కనే అనేక మానవ నిర్మిత గోడలు, బురుజులు, కొండ పైభాగంలో కుంట పెంకులు, వాన నీటి నిల్వ కోసం బావులను పోలిన చెక్‌డ్యాంలను నేటికీ చూడొచ్చు. ఇక గుట్టల చుట్టూ ప్రహరీలు, సైనికులు నివాసం ఉండేందుకు అనుకూలంగా రెండు భారీ గుహాలు ఉన్నాయి. వీటన్నింటి ఆధారంగా ఇక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. కొండ పైభాగం నుంచి చూస్తే సుమారు 20 కిలోమీటర్ల దూరం వరకు పరిసర ప్రాంతాలు కనబడుతాయి. బావులు.. గుహలు కొండలపై ఉండే సైనికుల దాహార్తి తీర్చేందుకు అనుకూలంగా రెండు చెక్ డ్యాంలను తలిపించే బావుల నిర్మాణాలు చేసుకున్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి కొండ మీద పల్లం వైపు రాతి ముక్కలతో గోడను కట్టి నీటిని నిల్వ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కొండ మధ్య భాగంలో కుడి, ఎడమ వైపుల రెండు గుహలు కనిపిస్తాయి. ఈ రెండు గుహల్లో 200 మంది వరకు ఉండేలా స్థలం కనిపిస్తుండడం విశేషం. సహజసిద్ధమైన రాతి గోడ మొదటి, రెండో కొండను కలుపుతూ సుమరు 500 మీటర్ల మేర సహజసిద్ధంగా ఉంటుంది. ఇది పెట్టని కోట వలె ఉండి శత్రు దుర్భేద్యమైన కోటగోడలా కనిపిస్తుంది. శిథిలావస్థకు చేరిన ఆలయం చారిత్రక నేపథ్యం కొండల నిర్మాణాలు పరిశీలించిన చర్రితకారుల కథనం ప్రకారం.. ఈ నిర్మాణం రెండో ప్రతాపరుద్రుడి కాలం నాటి రహస్య సైనిక స్థావరం కావొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాంతానికి పశ్చిమ దిక్కులో రామగిరి ఖిల్లా, తూర్పు దిక్కున ప్రతాపగిరి కోట ఉంది. క్రీ.శ. 1303 సంవత్సరంలో ఢిల్లీ పరిపాలకుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫర్ కాకతీయ రాజ్యంపై అంటే నేటి వరంగల్‌పై దండెత్తగా ఉప్పరపల్లి గ్రామం వద్ద సైనిక అధ్యక్షు పోతుగంటి మైలి తన సైన్యంతో ప్రతాపగిరి, రామగిరి ఖిల్లా నుంచి వచ్చిన సైన్యం సహకారంతో మాలిక్కాఫర్ని మప్పు తిప్పలు పెట్టారు. కానీ ఢిల్లీ సైనికులకు బలం ఎక్కువగా ఉండటం మూలన ప్రతాపరుద్రుడు ఢిల్లీ సూల్తాన్కు ఏటా కప్పం కట్టేలా సంధి చేసుకున్నాడు. అనంతరం సైనిక కోటను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ రెండు సైనిక స్థావరాల వివరాలు శత్రువులకు తెలిసిపోవడంతో ప్రతాపరుద్రుడు ఇదే ప్రాంతంలోని కాపురంలో ఉన్న ఎత్తైన మూడు కొండల మీద సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశాడని స్థానికులు చెబుతుంటారు. కోట గోడలు శత్రువుల నుంచి రక్షణ కోసం రక్షణ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడంచెలుగా ఈ భద్రత ఉండగా.. సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ అత్యంత పట్టిష్టమైన రాతి గోడలు, సైనికులు పహారా కాసేందుకు నలువైపులా బురుజు వంటి నిర్మాణాలు ఉన్నాయి. అలాగే కొండ పైభాగంలో ఒకటి, రెండో కోట గడీల మధ్య భాగంలో నీటి నిల్వ కోసం చెక్‌డ్యాం తరహాలో నిర్మాణం చేశారు. వర్షపు నీరు వృథా కాకుండా కొండ పైభాగం నుంచి జాలు వారే నీటిని నిల్వ చేయడానికి ఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. -
బీట్.. బహు బాగు
సాక్షి, భూపాలపల్లి: హలో.. హలో బీట్ ఆఫీసరేనా ఇక్కడ దుప్పిని చంపారు సార్. మీరు తొందరగా వచ్చి వేటగాళ్లను పట్టుకోండి అని ఓ బీట్ పరిధిలోని గూడెం నుంచి బీట్ ఆఫీసర్‌కు ఫోన్ కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న బీట్ ఆఫీసర్ ఆగమేగాలతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కొంత దూరం వెళ్లాకా.. మరో ఫోన్ కాల్ వచ్చింది.. సార్ ఇక్కడ పెద్ద ఎత్తున టేకు చెట్లను నరికి దుంగలను తరలించడానికి దుండగులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే రండి.. లేకుంటే వారు వెళ్లిపోతారని ఈ కాల్ సారాంశం. దీంతో ఆ బీట్ ఆఫీసర్ ఎటు వెళ్లాలో తేల్చుకోలేని çపరిస్థితి. దుప్పి మాంసాన్ని కాపాడలేదు.. కలప స్మగ్లింగ్ ఆగలేదు. ఒక ఆఫీసర్ రెండు నుంచి ఐదు బీట్లను పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు అటవీ శాఖలో ఉంది. ప్రస్తుతం బీట్ ఆఫీసర్ల నియామకంతో కొంతలో కొంతైనా వారిపై భారం తగ్గనుంది. అడవి సంరక్షణలో బీట్ ఆఫీసర్లే కీలకం. క్షేత్రస్థాయిలో వన్య ప్రాణులు, కలప, అటవీ ఉత్పత్తుల కంటికి రెప్పలా కాపాడడంలో వీరిది అందవేసిన చేయి. అయితే కొంతకాలంగా వీరి కొతర అటవీశాఖను తీవ్రంగా వేధిస్తోంది. సిబ్బంది లేక తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వర్తిస్తున్న అటవీ అధికారులకు కొత్తగా బీట్ ఆఫీసర్ల నియామకంతో కాస్త భారం దిగనుంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో గత కొన్నేళ్లుగా తగినంత మంది బీట్ ఆఫీసర్లు లేక ఉన్నవారిపైనే అదనపు భారం పడేది. దీంతో ఒక్కో బీట్ అధికారి ఒకటి కంటే ఎక్కువ అటవీ బీట్ల విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కొత్త బీట్ ఆఫీసర్లు వస్తుండడంతో అటవీ పరిరక్షణ మరింతగా పెరుగనుంది. పెరిగిన ఆఫీసర్లు.. కొత్తగా బీట్ ఆఫీసర్లు వస్తుండడంతో జిల్లాలో అటవీ శాఖపై పనిభారం తగ్గనుంది. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కరీంనగర్ తూర్పు డివిజన్‌తో పాటు వరంగల్ నార్త్ డివిజన్ పరిధిలో ఉంది. భూపాలపల్లి జిల్లాకు కరీంనగర్ తూర్పు డివిజన్ నుంచి 80 మంది, వరంగల్ నార్త్ డివిజన్ నుంచి 24 మందిని కేటాయించారు. మొత్తంగా జిల్లాకు 104 మంది కొత్త బీట్ అధికారులు రానున్నారు. అదే విధంగా ములుగు జిల్లా పూర్తిగా వరంగల్ నార్త్ డివిజన్ పరిధిలో ఉంది. ములుగులోని ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం, ములుగు సబ్డివిజన్లకు 35 మంది చొప్పున 105 మంది బీట్ ఆఫీసర్లను కేటాయించారు. త్వరలో వీరు నియామకం కానున్నారు. అలాగే 80 పోస్టులు ఏజెన్సీ పరిధిలో ఉన్నాయి. వీటికి ఎస్టీ ట్రైబ్స్ ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని 13 మండలాలకు కేటాయించనున్నారు. స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట దట్టమైన అడవులు, పర్యాటక కేంద్రాలు ఉన్న ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బీట్ అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ఇన్నాళ్లు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో వన్య ప్రాణుల వేట, కలప అక్రమ రవాణా, అడవిలో లభించి విలువైన వన మూలికలు, ఇతర సరుకులు అక్రమాలకు కాసులకు కురిపించేవి. స్మగ్లర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. ప్రస్తుతం కొత్తగా బీట్ ఆఫీసర్లు వస్తుండడంతో ఇకపై అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే కొత్తగా పోడును నిలువరించడంతో పాటు హరితహారంలో మొక్కులు పెంచి అటవీని పచ్చగా మార్చుకోవచ్చు. ఖాళీగా కొన్ని బీట్లు తాజాగా జరిగిన నియామకాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో బీట్ ఆఫీసర్లు ఖాళీల నియామకాలు జరిగాయి. ఇన్ని నియామకాలు జరిగినా రెండు జిల్లాల్లోని కొన్ని బీట్లు ఖాళీగానే ఉన్నాయి. మొన్నటి వరకు రెండు జిల్లాలో 532 బీట్లు ఉంటే కేవలం 110 మంది బీట్ ఆఫీసర్లు ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలో మొన్నటి వరకు 190 బీట్లకు గానూ 32 మంది, ములుగులో 342 బీట్లకు గానూ 78 మంది మాత్రమే బీట్ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తించారు. సగటున ఒక బీటు చూసే అధికారి ఐదారు బీట్లు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కొత్తగా నియమించే సిబ్బందితో ఈ సమస్యలను అధిగమించవచ్చని అటవీశాఖ భావిస్తోంది. ప్రస్తుతం భూపాలపలి జిల్లాకు కొత్తగా 104 మంది, ములుగు జిల్లాకు 105 మంది రానుండటంతో ఖాళీల సంఖ్య తగ్గింది. కొత్తగా వచ్చిన బీట్ ఆఫీసర్ల నియామకం జరిగిన తర్వాత భూపాలపల్లిలో 54 ఖాళీలు ఉంటాయి. ఆదే విధంగా ములుగులో 159 ఖాళీలు ఉంటాయి. అయితే మరో 80 ఏజెన్సీ పోస్టుల నియామకం ఉండటంతో ములుగు జిల్లా కూడా ఖాళీల సంఖ్య 80కి తగ్గే అవకాశం ఉంది. -
ఆత్మహత్యకు యత్నం, కాపాడిన ఎస్ఐ
సాక్షి, మంగపేట (జయశంకర్ భూపాలపల్లి): మంగపేట మండల కేంద్రంలోని పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలోకి దిగి ఆత్మహత్యకు యత్నించిన కమలాపురం బిల్ట్ ప్యాక్టరీ కార్మికుడు బోజాట్ల నర్సింహారావు అనే వ్యక్తిని ఎస్సై వెంటేశ్వర్రావు బుధవారం కాపాడారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్యం మత్తులో ఉన్న నర్సింహారావు ఆత్మహత్య చేసుకునేందుకు నదిలోకి దిగాడు. అక్కడే చేపలు పడుతున్న వ్యక్తి ఆయను గమనించి వివరాలు ఆరా తీశాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తాను చనిపోతే ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చి సమస్య తీరుతుందని చెప్పాడు. వెంటనే చేపలు పడుతున్న వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని నర్సింహారావును కాపాడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సంఘటనపై కుటుంబ సభ్యులను విచారించగా నర్సింహారావు మతిస్థిమితం సరిగా లేదని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులకు ఎస్సై కౌన్సిలింగ్ ఇచ్చి ఆయనను అప్పగించారు. -
వీఆర్ఓను నిర్బంధించిన గ్రామస్తులు
-
రామగుండం ఎన్టీపీసీని సందర్శించిన కేసీఆర్
సాక్షి, రామగుండం: పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ రామగుండం ఎన్టీపీసీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఎన్టీపీసీలో సీఎం కేసీఆర్ విస్త్రత సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలుత రామగుండం ఎన్టీసీసీలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్-1 ప్లాంట్‌ను సీఎం కేసీఆర్ సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. పవర్ ప్లాంట్‌కు సంబంధించిన పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్లాంట్‌కు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పెద్దపలి, జయశంకర్ జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు కేసీఆర్ రామగుండం వచ్చారు. పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రికి ఎన్టీపీసీలోని జ్యోతిభవన్‌లో కేసీఆర్ బస చేస్తారు. ఇక రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయాన్ని కేసీఆర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పంపు హౌస్, మేడిగడ్డ బరాజ్ పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లో భాగంగా తెలంగాణ కోసం రామగుండం ఎన్టీపీసీలో 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తుండగా, తొలి విడుతలో చేపట్టిన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పనులు శరవేగం గా జరుగుతున్నాయి. రూ.10,598.98 కోట్ల వ్యయంతో రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను 2016 ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ పవర్ స్టేషన్ కోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రెండు టీఎంసీల నీటిని కేటాయించారు. ప్లాంట్ నిర్మాణం కోసం మే 2015లోనే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. కాగా, దీనికి ఒడిశాలోని మందాకిని-బీ మైన్ నుంచి బొగ్గు సరఫరా చేస్తారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ పర్యావరణ అనుమతులను కూడా సాధించగా, పనులు శరవేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన -
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తప్పిన పెను ప్రమాదం
-
డ్రైవర్ నిర్లక్ష్యం బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
-
డ్రైవర్ గుట్కా వేసుకుంటూ స్టీరింగ్ వదిలేయడంతో..
సాక్షి, భూపాలపల్లి: గోదావరిఖని నుంచి మంథని మీదుగా భూపాలపల్లి వెళుతున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం పీవీనగర్ వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. గోదావరి ఖని డిపోకు చెందిన ఈ బస్సులో 63 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో 25 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. కాగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ గుట్కా వేసుకుంటూ స్టీరింగ్ వదిలేయడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : డ్రైవర్ నిర్లక్ష్యం బోల్తా పడిన ఆర్టీసీ బస్సు -
పుకార్ల షికారు
సాక్షి, భూపాలపల్లి: కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవిలా మారింది కాంగ్రెస్ పరిస్థితి. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందోనని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరినప్పటికీ.. అనంతరం వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ పాగా వేసింది. ఇటీవల జరిగిన పరిణామాలతో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు. దీంతో కార్యకర్తలు, ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెండు జిల్లాల పరిధిలో ఉన్న ములుగు, మంథని, భూపాపలల్లి, భద్రాచలం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం వీరందరు కాంగ్రెస్‌లోనే ఉంటామని చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులపై చర్చ.. మనం ఎంతగానో కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని కార్యకర్తలు, ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరుసగా పక్క నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు చేజారిపోతుండడంతో జనాల్లో చర్చకు కారణమవుతోంది. మొన్నటి దాకా మహబూబాబాద్ ఎంపీ పరిధి కిందకు వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పినపాక, భద్రాచలం, ములుగు, ఇల్లందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే ప్రస్తుతం ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ములుగులో సీతక్క, భద్రాచలంలో పొదెం వీరయ్య మాత్రమే పార్టీలో మిగిలారు. జోరు కొనసాగేనా.. లోక్‌సభ ఎన్నికలు ముంచుకు వస్తుండడంతో జిల్లాలో కాంగ్రెస్ జోరు ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంపీ ఎన్నికల సమయానికి పార్టీలు మారే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొంత మంది లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే ఉంటారు, లేకుంటే పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎవరికీ తోచినట్లు వారు జోస్యం చెబుతున్నారు. కార్యకర్తల్లో అనుమానాలు.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగిన్పటికీ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుపొందింది. ఎమ్మెల్యేలు గెలుపొందినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాలు వినివస్తున్నాయి. అయితే అలాంటివి ఉండవని చాలా సార్లు ఎమ్మెల్యేలు కొట్టిపారేశారు. కానీ ఎన్నికలు వస్తున్న వేళ ఇటువంటి ప్రచారాలు కాంగ్రెస్ కార్యకర్తల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆత్మస్థైర్యం కోల్పోతున్న కార్యకర్తలు.. అసెంబ్లీ ఎన్నికల్లో తమ నేతలు గెలిచినా, పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ జీపీలను కైవసం చేసుకోలేదనే బాధ కాంగ్రెస్ కార్యక్తల్లో ఇప్పటికీ ఉంది. వచ్చే ఎంపీ ఎన్నికల్లో మరింత గట్టిగా పనిచేద్దాం అనుకుంటున్న తరుణంలో వరసగా పార్టీ నేతలు ఒక్కొక్కరుగా చేజారిపోతుండడంతో కారకర్తలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. తమ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రచారం కార్యకర్తల్లో జోరుగా సాగుతోంది. -
ఉప సర్పంచ్‌లకు నిరాశే..
సాక్షి, భూపాలపల్లి: నూతన పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చే వరకు కార్యదర్శి, సర్పంచ్‌కు ఉమ్మడి చెక్ పవర్ కల్పించే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పలు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గం ఏర్పడి రెండు నెలలు దాటినా అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చెక్‌పవర్ విషయంలో నెలకొన్న సందిగ్ధత తొలగకపోవడంతో పల్లెల్లో పాలన పడకేసింది. నిధులు ఉన్నా ఖర్చుపెట్టలేని పరిస్థితి. దీంతో ప్రభుత్వం ప్రస్తుతానికైతే పాత విధానంలోనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్‌ను కల్పించనుంది. అయితే ఇన్నాళ్లుగా చెక్‌పవర్‌పై ఆశలు పెట్టుకున్న ఉపసర్పంచ్లు నిరాశలో ఉన్నారు. రిజర్వేషన్లు కలిసి రాకున్నా ఉపసర్పంచ్ పదవి కొసం కొంత మంది పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. తాత్కాలికమేనా.. జీపీల్లో చెక్ పవర్ సర్పంచ్, కార్యదర్శులకే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కలెక్లర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది తాత్కాలికమా, లేక ఇలాగే కొనసాగిస్తారా అనే విషయంపై స్పష్టత లేదు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని 415 గ్రామపంచాయతీలకు ఎన్నికలు ముగిసి మూడు నెలలు కావస్తోంది. ఇప్పటికీ గ్రామాల్లో గెలిచిన సర్పంచ్‌లకు పవర్ లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. సర్పంచ్, ఉపసర్పంచ్‌ల ఉమ్మడి చెక్‌పవర్‌పై ప్రభుత్వం ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కనీసం గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలనెలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వీటిని దృష్టిలో పెట్టుకుని పాత విధానంలోనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు తాత్కాలికంగా చెక్‌పవర్ ఇచ్చే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం గ్రామాల్లో నిలిచిన బకాయిలు, బిల్లులు చెల్లించేందుకు మాత్రమే తాత్కాలికంగా సర్పంచ్, కార్యదర్శులకు ఉమ్మడి చెక్‌పవర్ ఇచ్చే అవకాశం ఉందని పలువురు ఉపసర్పంచ్లు అనుకుంటున్నారు. అయితే రాష్ట్రంలోని చాలా మంది డీపీఓలు సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శికే ఉమ్మడి చెక్ పవర్ ఉంటే నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చనే అభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. నిరాశలోనే.. ఇన్నాళ్లు చెక్ పవర్‌తో పవర్ వస్తుందనుకున్న ఉపసర్పంచ్‌లకు నిరాశే ఎదురుకానుంది. రెండు జిల్లాల్లో ఉన్న 415 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఉపసర్పంచ్‌ల ఎన్నికలు కూడా అదే స్థాయిలో తీసుకున్నారు. చెక్‌పవర్ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఉంటుందని ఈసారి చాలా మంది పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. కొన్ని చోట్ల సర్పంచ్ల కంటే ఉపసర్పంచ్ పదవి కోసం ఎక్కువ ఖర్చు చేసిన వారు కూడా ఉన్నారు. కొంత మంది రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో ఉపసర్పంచ్ పదవి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ప్రస్తుతం చెక్‌పవర్ పై స్పష్టత లేకపోవడం ఉపసర్పంచ్లు ఆందోళనలో ఉన్నారు. సమర్థ నిర్వహణకే.. ప్రభుత్వం సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పించే ఆంశంపై పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. కొత్త పంచాయితీరాజ్ చట్టం–2018 ప్రకారం సర్పంచ్, ఉపసర్పంచ్‌కు సమష్టిగా చెక్ పవర్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన పంచాయితీరాజ్ చట్టానికి గతేడాది ఆమోదముద్ర వేసింది. అయితే ఈ నిర్ణయం అములు విషయంలో సర్కారు ఆచితూచి అడుగువేస్తోంది. ముఖ్యంగా ఆర్థిక అధికారాలు ఇరువురు ప్రజాప్రతినిధులకు కట్టబెట్టడం వల్ల విధుల దుర్వినియోగం జరుగుతుందని, రికార్డుల నిర్వహణ కూడా కష్టసాధ్యమవుతోందని పంచాయితీరాజ్ శాఖ అంచనా వేసింది. అంతేకాకుండా లావాదేవీల్లో అధికారులను బాధ్యులను చేయడం కూడా కుదరదని తేల్చింది. మరోవైపు పంచాయతీ పాలనా వ్యవహారాల్లో కీలక భూమిక పోషించే కార్యదర్శుల కస్టడీలో రికార్డులు ఉంటాయని, ఈ తరుణంలో నిధుల వినియోగంలో వారికి బాధ్యతలు అప్పగిస్తే నియంత్రణ కష్టమని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. చెక్‌పవర్‌ను వారికి కల్పించి కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామనే నిర్ణయం సరికాదని అభిప్రాయపడింది. ఈ వాదనతో ఏకీభవించిన పంచాయితీరాజ్ శాఖ, గతంలో ఉన్న మాదిరే సర్పంచ్, కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ కల్పించే దిశగా ఆలోచన చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఎటువంటి సమాచారం రాలేదు – చంద్రమౌళి, జిల్లా పంచాయతీ అధికారి సర్పంచ్‌లు, కార్యదర్శులకు జాయంట్ చెక్ పవర్ గురించి ఎటువంటి సమాచారం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వస్తుంది. -
తీవ్ర ఉద్రిక్తత.. భద్రత నడుమ మంత్రి ప్రచారం!
సాక్షి, భూపాలపల్లి : ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా టీఆర్ఎస్ పార్టీకి అసమ్మతి నేతల బెదడ వీడటం లేదు. ఇప్పటికే పలు నియోజవకవర్గాల్లో టీఆర్ఎస్ తాజా మాజా ఎమ్మెల్యేకు అసమ్మతి నేతల నిరసనలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజవర్గంలో మంత్రి అజ్మీరా చందులాల్‌కు అసమ్మతి నేతల నుంచి షాక్ ఎదురైంది. ములుగులో మంగళవారం ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తిరుగుబాటు నేతలు చందులాల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తన తండ్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారన్న కోపంతో చందులాల్ కుమారుడు ప్రహ్లాద్ తన అనుచరులతో కలిసి అసమ్మతి నేతల వాహానాలను ఆదివారం నాడు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. మంత్రి కుమారుడి తీరుకు వ్యతిరేకంగా ప్రచారానికి వచ్చిన చందులాల్‌కు తిరుగుబాటు నేతల నుంచి అస్మమతి ఎదురైంది. దీంతో ములుగులో టీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. అసమ్మతి వర్గం, చందులాల్ వర్గాల మధ్య వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ములుగులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో.. పోలీసుల భద్రత నడుమ చందులాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చదవండి : రెచ్చిపోయిన చందూలాల్ వర్గీయులు -
ఫ్లడ్ కంట్రోల్ రూం ఏర్పాటు
సాక్షి, భూపాలపల్లి : జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు.. గోదావరి నీటిమట్టం పెరగడం.. వరద వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయం కేంద్రంగా ఫ్లడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. దానికి ఏటూరునాగారం తహసీల్దార్‌ను ఇన్చార్జి గా నియమించారు. 24 గంటలు అధికారులు చేపట్టాల్సిన భద్రతా చర్యలపై చర్చించడంతోపాటు సమాచారాన్ని కంట్రోల్ రూం ద్వారా కలెక్టర్ సమీక్షించనున్నారు. ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో నిత్యం కురిసిన వర్షపాతాన్ని నమోదుచేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(టీడబ్ల్యూయూ) అధికారిని ఏటూరునాగారం మండలానికి నోడల్ అధికారిగా నియమించారు. వరద ప్రమాదాల నుంచి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించడానికి వివిధ శాఖల అధికారులను 15 టీంలుగా విభజించారు. వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టీంటను అప్రమత్తం చేశారు. రామన్నగూడెం వద్ద గోదావరి నీటిమట్టం మరింత పెరిగి ప్రజలను పునరావాస కేం ద్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్నారు. 2, 3 ప్రమాద హెచ్చరికలు దాటితే మొదటి టీం ఏటూరునాగారంలోని హరిజనవాడ, నందమూరినగర్, నేతకానివాడ, రెండో టీం వాడగూడెం, మూడో టీం కుమ్మరివాడలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించానికి ప్రణాళికలు రూపొందిం చారు. వరద తీవ్రత నుంచి రక్షించుకునేలా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏటూరునాగా రం ఐటీడీఏ, పోలీస్‌ల సహకారంతో వాహనాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా ముందస్తుగానే గజ ఈతగాళ్లను, రెస్క్యూ టీంలను రంగంలోకి దించారు. హెల్ప్‌లైన్ సెంటర్ల ఏర్పాటు వరద భారీ నుంచి ప్రజలను రక్షించడానికి అధికారులకు తక్షణ సమాచారం ఇచ్చేందుకు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. జిల్లా కార్యాలయంలో 08713248080, ఏటూరునాగారంఐటీడీఏలో 7901091265 / 08717231247, 08717231246, తహసీల్దార్ కార్యాలయంలో 7680906616 / 08717231100, మహదేవపూర్ తహసీల్దార్ కార్యాలయంలో 9652608367 హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రదించాలని కలెక్టర్ సూచించారు. -
వైద్యాధికారి మంజులపై కలెక్టర్ ఆగ్రహం
మంగపేట జయశంకర్ జిల్లా : కలెక్టర్ అమయ్‌కుమార్ గురువారం మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంప్‌ను మధ్యాహ్నం 12 గంటలకు తనిఖీ చేశారు. టీమ్ మెడికల్ ఆఫీసర్ మంజుల విధులకు హాజరుకాక పోవడంతో ఆమె ఎక్కడున్నారో తెలుసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించగా ఆయన మెడికల్ ఆఫీసర్‌కు ఫోన్‌కలిపి ఇచ్చారు. ‘క్యాంప్‌కు ఎందు కు హాజరు కాలేదు.. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమ నిర్వాహణపై ఇంత నిర్లక్షమా.. అంటూ కలెక్టర్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మార్గమధ్యలో గోవిందరావుపేటలో ఉన్నా ని మంజుల చెప్పగా.. గంటసేపల్లో విధులకు హాజరు కావాలి.. లేదంటే టర్మినేట్ చేస్తానని.. తీవ్ర స్థాయిలో మందలించారు. క్యాంప్ వద్ద 10 మంది వరకు మాత్రమే ఉండటంతో రోజువారీ టార్గెట్ ఎంత, ఇప్పటివరకు ఎంత మందికి పరీక్షలు నిర్వహించారని కలెక్టర్ సిబ్బందిని ప్రశ్నిం చారు. రోజుకు 250 మది టార్గెట్ కాగా బుధవారం 28 మంది, గురువారం 17 మందికి పరీక్షలు నిర్వహించామని చెప్పగా ఇదేమిటని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగపేట పీహెచ్సీ వైద్యాధికారి మృదులను పిలిపించి కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించి ప్రతి రోజు టార్గెట్ పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. అంతకు ముం దు అకినేపల్లిమల్లారం పాఠశాలను సందర్శించడానికి వెళ్లిన క్రమంలో కలెక్టర్ కారు బురదలో దిగబడడంతో కొంతదూరం కాలినడకన వెళ్లారు. -
బొగత జలపాతం సందర్శనకు సెలవు
వాజేడు: బొగతజలపాతం సందర్శనకు ఆదివారం అధికారులు సెలవు ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి సమీపంలో బొగత జలపాతం ఉంది. భారీ వర్షాల కారణంగా జలపాతం పొంగి ప్రవహిస్తోంది. పర్యాటకులు ఈ విషయం గమనించాలని, భద్రతా కారణాల దృష్ట్యా సందర్శన నిలిపి వేసినట్లు అటవీ శాఖ అధికారి డోలి శంకర్ తెలిపారు. -
బైక్ పైనుంచి ఎగిరి టిప్పర్ కింద పడి..
శాయంపేట(భూపాలపల్లి) : స్పీడ్ బ్రేకర్, త్రిబుల్ రైడింగ్ ఓ మహిళ ప్రాణం తీసింది. స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ పైనుంచి ఓ మహిళ ఎగిరిపడగానే ఆమె తల మీదుగా వెనకాలే వస్తున్న టిప్పర్ వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, ఎస్సై జక్కుల రాజబాబు కథనం ప్రకారం... హన్మకొండలోని రాయపురకు చెందిన మంథుర్తి రాధిక(29), ఆమె భర్త శ్రీనివాస్, అత్త రాధమ్మ కలిసి రేగొండ మండలం తిర్మిలగిరి గ్రామానికి ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఈ క్రమంలో మాందారిపేట స్టేజీ సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ల వద్ద ద్విచక్రవాహనం ఎగరడంతో వెనకాల కూర్చున్న రాధమ్మ ముందుకు పడిపోయింది. దీంతో ఆమెను పట్టుకునే క్రమంలోనే రోడ్డుపై పడిపోయింది. వెనకాలే వస్తున్న టిప్పర్ వెనక టైరు రాధిక తలపై నుంచి వెళ్లడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందింది. పరకాల వైవీఎస్ సుధీంధ్ర, సీఐ షాదుల్లాబాబా, ఎస్సై జక్కుల రాజబాబు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి సోదరుడు న్యాల కర్ణాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై రాజబాబు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కలిగిఉండాలి
ములుగు రూరల్ వరంగల్ : సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపాలని కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ పిలుపునిచ్చారు. పౌరహక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని(సివిల్ రైట్స్ డే) పురస్కరించుకొని ఇంచర్ల గ్రామ ఎస్సీ కాలనీలో తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగిఉండాలని సూచించారు. నిమ్న జాతుల వారిని కించపరిచినట్లు మాట్లాడితే చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి రోజున గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక ఏర్పాటు చేయనున్న శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధిం చాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి పర్యాటక ప్రాంతాలలో ఆర్ధిక వనరులను కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా దళితులకు మూడెకరాల భూమిని కేటాయించాలని, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూ చేయాలని, సీసీ రోడ్లను నిర్మించాలని గ్రామస్తులు కలెక్టర్ కోరగా.. పంపిణీకి ప్రభుత్వ భూమి లేదని, అమ్మేవారు ఉంటే తహసీల్దార్ దృష్టిఇ తీసుకువెళ్లాలని సూచించారు. మంత్రి చందూలాల్‌తో మాట్లాడి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే సీసీరోడ్ల ఏర్పాటుకు నివేదికలు తయారు చేయాలని ఎంపీడీఓ విజయ్ స్వరూప్‌ను ఆదేశించారు. తన కూతురు కళ్యాణలక్ష్మీ దరఖాస్తును అధికారులు తిరస్కరించారని గ్రామానికి చెందిన వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా పరిశీలించి పథకం వర్తింపజేయాలని తహసీల్దార్‌ను ఆవేశించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ రవికిరణ్, ఎస్సై బండారి రాజు, జెడ్పీటీసీ సకినాల శోభన్, సర్పంచ్ ముడతనపల్లి కవితకుమార్, ఎంపీటీసీ సభ్యుడు శానబోయిన అశోక్, ఆర్ఐ అఫ్రీన్, యుగంధర్‌రెడ్డి, వీఆర్వో సూరయ్య పాల్గొన్నారు. -
సింగరేణి అధికారుల గృహ నిర్బంధం
కోల్‌బెల్ట్ : జయశంకర్ జిల్లా భూపాలపల్లి సింగరేణి ఏరియా పరిధి ఓసీపీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు జీఎంతోపాటు వెంట వచ్చిన అధికారులను గృహ నిర్భంధం చేశారు. కేటీకే ఓసీపీ-2లో బ్లాస్టింగ్ల కారణంగా సమీపంలోని ఆకుదారివాడకు చెందిన దుర్గం రజిత ఇంటిపై రాళ్లు పడగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న జీఎంతోపాటు ఎస్‌ఓటూ జీఎం పద్మనాభరెడ్డి, ప్రాజెక్టు ఆఫీసర్ జాన్ ఆనంద్, సెక్యూరిటీ ఆఫీసర్ మధుకర్ గురువారం గ్రామాన్ని సందర్శించారు. రజితకు సంబంధించిన ఇంటిలోపలికి వెళ్లి పరిశీలిస్తుండగా అక్కడికి చేరుకున్న ఓసీపీ నిర్వాసితులు అధికారులను రెండు గంటల పాటు ఇంటిలోనే నిర్భంధించారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యపై చర్చిస్తామని జీఎం గురువయ్య హామీ ఇవ్వడంతో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ ఓసీపీ సమీపంలోని సుమారు 800 ఇళ్ల విషయంలో సర్వే చేయిస్తామని హామీ ఇచ్చి అమలు చేయటం లేదన్నారు. అలాగే బ్లాస్టింగ్లతో బండరాళ్లు పడి ఇళ్లు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఆకుదారివాడకు చెందిన సెగ్గెం లక్ష్మి, చిన్న రాజయ్య, చిన్న సమ్మయ్య ఇళ్లు, బుధవారం దుర్గం రజిత ఇల్లు ధ్వంసమైందని, ప్రాణాపాయం పొంచి ఉందని తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీఎం మాట్లాడుతూ నిబంధనల ప్రకారం కంట్రోల్ బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నామని, ఇళ్లపై రాళ్లు పడటం దురదృష్టకరమన్నారు. త్వరలో సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పారు. -
సినిమా షూటింగ్‌లకు అడ్డాగా బొగత జలపాతం
వాజేడు జయశంకర్ జిల్లా : బొగత జలపాతం అందాలు ఇంత వరకు పర్యాటకులకే సొంతమయ్యాయి. ఇప్పుడు సినిమా షూటింగ్‌ల పుణ్యమా అని ప్రంపంచవ్యాప్తంగా వెండితెర, బుల్లితెరలమీద దర్శమిస్తున్నాయి. సినిమా హాల్లో, టీవీల్లో బొగత సోయగాలను చూసి ప్రేక్షకులు స్వయంగా స్పాట్‌కు వెళ్లాలని తహతహలాడుతున్నారు. ఈ జలపాతం జయశంర్ భూపాలపల్లి జిల్లా వాజేడు చీకుపల్లి అడవి ప్రాంతంలో ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, జాలువారే జలపాతం అందాలను చూసి తరించాల్సిందే. జలపాతం వద్ద ఇప్పటికే సినిమా పాటలతో పాటు బతుకమ్మ పాటలను చిత్రీకరించారు.అయితే గతంలో జలపాతం వద్ద సినిమాలు చిత్రీకరించడానికి కొందరూ టెక్నీషియన్లు వచ్చారు. హైదరాబాద్ నుంచి భద్రాచలం మీదుగా చుట్టూ తిరిగి రావడానికి విముఖత వ్యక్తం చేసి ఇక్కడ షూటింగ్‌లను విరమించుకున్నారు. పూసూరు–ముల్లకట్ట వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం చేకపట్టడంతో జలపాతం వద్ద సినిమాల చిత్రీకరణకు మార్గం సులువైంది. దీంతో ఇక్కడ షూటింగ్ తీయడానికిసినిమా వాళ్లు ఉత్సాహం చూపుతున్నారు. విదేశీయులు రాక.. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు సుపరిచితమైన బొగత జలపాతం. సినిమా షూటింగ్‌లతో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను సంపాదించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలతో జాలు వారుతున్న జలపాతంలో సేదతీరడానికి రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల పర్యాకులు విచ్చేస్తున్నారు. అంతేకాకుండా విదేశీ పర్యాటకులు సైతం వచ్చి బొగత అందాలను తనివితీరా ఆస్వాదించి తమ కెమెరాల్లో బంధించుకున్నారు. రోజురోజుకూ పర్యాటకుల రద్దీ పెరుగుతోంది. జలపాతం వద్ద బతుకమ్మ పాట.. గత సంవత్సరం బొగత జలపాతం వద్ద రెండు సినిమా పాటలు, రెండు బతుకమ్మ పాటలను చిత్రీకరించారు. అనువంశీల ప్రేమ కథ, సరోవరం చిత్రాల్లో పాటలను ఇక్కడ చిత్రీకరించారు. ఆ తర్వాత దసరా పండుగ సమయంలో బతుకమ్మపై టీవీ యాంకర్ మంగ్లీతో ఒక పాటను, మరో బతుకమ్మ పాటను గ్రూపుగా చిత్రీకరించారు. ఈ ఏడాది జూన్ నెలలో సావిత్రీ సీరియల్ లోని ఒక ఎపిసోడ్ సైతం చిత్రీకరించారు. దీంతో బొగత సినిమా, సీరియళ్ల చిత్రీకరణకు అనువైన ప్రదేశంగా ఉంది. చిన్న సినిమాలు తీసే డైరెక్టర్లు జలపాతాన్ని ఎంచుకుంటున్నారు.గోదావరి బ్రిడ్జి వద్ద..సినిమాల్లో గోదావరికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలంటే రాజమండ్రి, పాపికొండలు లాంటి ప్రదేశాలను ఎంచుకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. వాజేడు మండల కేంద్రానికి మూడు కిలో మీటర్ల దూరంలోని పూసూరు వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం జరుగడం, బొగత జలపాతం అందుబాటులో ఉండటంతో సినిమా వాళ్లు ఇక్కడ షూటింగ్‌పై దృష్టి సారిస్తున్నారు. గత ఏడాది బొగత జలపాతం వద్ద అనువంశీల ప్రేమ కథ సినిమాలో పాటను చిత్రీకరించిన సమయంలో గోదావరి వద్ద కూడా పాటను చిత్రీకరించారు. -
సర్కార్ బడిలో కలెక్టర్ పాఠాలు
భూపాలపలి అర్బన్: తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉచితంగా ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్యను పొందాలని కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ విద్యార్థుల తల్లిదండ్రులకు సూంచించారు. కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి భూపాలపల్లి మండలంలోని ఎస్ఎం కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి 4, 8, 10 వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. 8వ తరగతి విద్యార్థులకు సైన్స్, ఇంగ్లిష్, లెక్కల పాఠాలను, 10వ తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలను బోధించి విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం వరకు ప్రైవేట్ పాఠశాలలో చదివి ఇటీవల 8వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థిని ఇక్కడి విద్యార్థుల కన్నా చదువులో వెనుకబడి ఉండడాన్ని కలెక్టర్ గుర్తించారు. దీంతో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు బడుల్లో మంచి విద్యను అందిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అపోహలకు గురవుతున్నారని, దానికి నిదర్శనం ప్రస్తుతం చూస్తున్నామన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనంను రుచి చూసిన కలెక్టర్ వంటలు బాగా చేశారని ప్రతిరోజు ఇలాగే విద్యార్థులకు రుచికరమైన భోజనం అందిచాలన్నారు. ఎస్ఎం కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటానికి వంటగ్యాస్ సిలిండర్లను అందించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకొవాలన్నారు. పదో తరగతిలో సాంఘికశాస్త్రంలో విద్యార్థులు చురుగ్గా సమాధానాలు చెప్పడంతో ఆ సజ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు కోటిలింగంను అభినందించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు రజిత తదితరులు పాల్గొన్నారు. -
స్పీకర్ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం
-
స్పీకర్ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం
సాక్షి, జయశంకర్ భూపాల్పల్లి: తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో ప్రమాదం తప్పింది. భూపాలపల్లి జిల్లాలోని గణపురం శివారులో స్పీకర్ కాన్వాయిలోని వాహనాన్ని లారీ ఢీకొట్టింది. తన నియోజవర్గమైన గణపురంలో పల్లెనిద్ర ముగించుకుని భూపాలపల్లికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. లారీ ఢీకొనడంతో కాన్వాయిలోని వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అంతకుముందు గణపురం మండల కేంద్రంలో మధుసూదనాచారి పల్లె నిద్ర చేశారు. ఉదయం స్థానిక ప్రజలతో కలిసి నడుచుకుంటూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. -
హెరిటేజ్ తెలంగాణతో సర్వతో‘భద్రం’
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ప్రత్యేక చారిత్రక నిర్మాణంగా గుర్తింపు పొందిన సర్వతోభద్ర ఆలయ పునర్నిర్మాణ బాధ్యత నుంచి ప్రభుత్వం దేవాదాయ శాఖను తప్పించింది. ఆలయ ప్రత్యేకతలను దెబ్బతీసేలా దేవాదాయ శాఖ పనులు చేస్తుండటాన్ని ‘సాక్షి’వెలుగులోకి తేవడంతో.. సర్కారు స్పందించింది. ఈ పనులను హెరిటేజ్ తెలంగాణ (రాష్ట్ర పురావస్తు విభాగం)కు అప్పగించింది. ఈ పనుల కోసం దేవాదాయ శాఖకు మంజూరు చేసిన నిధులను కూడా పురావస్తు శాఖకే అప్పగించాలని ఆదేశించింది. దీంతో ఈ ఆలయ విశిష్టత దెబ్బతినకుండా.. పూర్తిగా రాతి నిర్మాణాలతో పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు పురావస్తుశాఖ సిద్ధమైంది. ఆలయానికి దూరంగా ఆర్కేడ్ భూపాలపల్లి జిల్లా నయన్‌పాక గ్రామంలో పురాతన సర్వతోభద్ర ఆలయాన్ని ఇటీవల గుర్తించిన విషయం తెలిసిందే. దానిని పునరుద్ధరించి పునర్వైభవం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి.. దేవాదాయ శాఖకు బాధ్యత అప్పగించింది. కానీ దేవాదాయ శాఖ అధికారులు పురాతన ఆలయ విశిష్టతనే దెబ్బతీసేలా రాళ్ల తొలగింపు, కాంక్రీటుతో పనుల వంటివి చేపట్టారు. ఈ వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ ‘సాక్షి’ఇటీవల కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన సర్కారు పునరుద్ధరణ బాధ్యతలను దేవాదాయ శాఖ నుంచి తప్పించి.. హెరిటేజ్ తెలంగాణకు అప్పగించింది. చర్యలు చేపట్టిన పురావస్తు శాఖ సర్వతోభద్ర ఆలయం అతి పురాతన నిర్మాణం కావడంతో.. దాని ప్రత్యేకత దెబ్బతినేలా, దాన్ని అనుకుని కొత్త నిర్మాణాలేవీ చేపట్టడానికి వీలు లేదు. దీంతో ప్రధాన ఆలయానికి చుట్టూ 60 అడుగుల దూరంలో చతురస్రాకారంలో భారీ ఆర్కేడ్ (మంటపం తరహాలో) నిర్మించాలని పురావస్తు శాఖ అధికారులు యోచిస్తున్నారు. అది కూడా పూర్తిగా రాతి నిర్మాణంగా ఉండనుంది. ఆలయానికి నాలుగు వైపులా ద్వారాలు ఉన్నందున ఆర్కేడ్ నాలుగు వైపులా ప్రత్యేక బాటలు ఏర్పాటు చేస్తారు. మధ్యలో పచ్చిక బయలు, పూల చెట్లు ఏర్పాటు చేస్తారు. ఇక ఈశాన్య దిశలో ఉన్న కోనేరులో పూడిక తీసి పునరుద్ధరిస్తారు. ఇక ఆర్కేడ్ వెలుపల భక్తులు, పర్యాటకుల వసతి కోసం ఇతర నిర్మాణాలను చేపడతారు. ఇక ఆలయ శిఖరంపై భాగాన ఇటుకలు పడిపోయి ఉన్నాయి. దీంతో అదే పరిమాణంలో కొత్త ఇటుకలు తయారు చేయించి.. శిథిలమైన చోట ఏర్పాటు చేసి, డంగుసున్నంతో పునరుద్ధరించ నున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
రేగొండ(భూపాలపల్లి): అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో ఈ సంఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తిరుమలగిరికి చెందిన రైతు గంటా రఘుపతి(45)కి మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత రెండేళ్లుగా మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, మిరప, మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నాడు. అయితే సకాలంలో వర్షాలు కురవక, తెగుళ్లబారినపడి పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే పెట్టుబడుల కోసం రూ.10 లక్షల మేర అప్పులయ్యాయి. ఆశించిన ఆదాయం రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనకు గురైన రఘుపతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గుండెపోటుతో రైతు మృతి ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు అందె సత్తయ్య(55) గుండెపోటుతో మృతి చెందాడు. పంటలు సరిగా పండకపోవడం, గల్ఫ్‌లో పనులు లభించక కుమారుడు ఇంటికి తిరిగిరావడం, ఇటీవల ఇద్దరు కూతుళ్ల వివాహం చేయడంతో రూ.5 లక్షల వరకు అప్పు అయింది. అప్పు తీర్చేదారిలేకపోవడంతో కొద్దిరోజులుగా మనస్తాపంతో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటుకు గురై మృతి చెందాడు. -
ఒక ద్రోహి సమాచారం వల్లే ఆ ఎన్కౌంటర్
సాక్షి, హైదరాబాద్ : తడపలగుట్టల్లో పోలీసులు శుక్రవారం జరిపిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు ఎవరూ మరణించలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు.. మిగతావారు ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాకు చెందినవారని ఆయన వెల్లడించారు. ఎన్కౌంటర్లో మృతిచెందిన దబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, కడిపికొండ జిల్లా కమిటీ కార్యదర్శి రత్న తెలంగాణ వారని వివరించారు. కార్పొరేట్ శక్తులను కాపాడేందుకు ఈ ఎన్కౌంటర్ జరిగిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులైన.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం సమీపంలో ఉన్న తడపలగుట్టల్లో శుక్రవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పది మంది మావోయిస్టులు, ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ, ఆయన భార్య సమ్మక్క, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కొయ్యాడ గోపన్న అలియాస్ సాంబయ్య ఆలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి ఉన్నట్లు అనుమానాలు రాగా.. ఈ వార్తలను సీపీఐ (మావోయిస్టు పార్టీ) తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఖండించారు. ఆయన ఏమన్నారంటే.. ‘ప్రజలతో మాట్లాడుతూ సేదదీరుతున్న సమయంలో ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఏకపక్షంగా కాల్పులు జరిపారు. పోలీసులు ప్రచారం చేస్తున్నట్లు ఈ ఎన్కౌంటర్లో హరిభూషణ్, బడే చొక్కారావు, కంకణాల రాజిరెడ్డి చనిపోలేదు. ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన 10 మందిలో జిల్లా కమిటీ సభ్యుడు హన్మకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, రత్న ఉన్నారు. మిగతా కామ్రేడ్స్ అంతా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, దంతెవాడ జిల్లాలకు చెందిన వారు’ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేట్ శక్తులకు నీళ్లు, భూమిని ధారాదత్తం చేసేందుకే కేసీఆర్ ఈ విధమైన బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇకపై తాము టీఆర్ఎస్ నేతలపై దాడులను ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. హిందుత్వ నాయకుడు రమణ్‌సింగ్, నియంత కేసీఆర్‌లు కలిసికట్టుగా ఆదివాసీలను, ప్రశ్నించే వారిని నిర్మూలించేందుకు దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత చనిపోయింది ఎవరనేది తెలిసినప్పటికీ పోలీసులు ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించడం కోసం అబద్ధాలు ప్రచారం చేశారని, ముఖ్యనాయకులు చనిపోయారని ప్రచారం చేసి ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని అన్నారు. కార్పొరేట్లకు వనరులు దోచిపెట్టడం కోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా దాడులు చేస్తోందని, ప్రజల సహకారంతో ఈ దాడులన్నింటినీ తిప్పికొడతామని తెలిపారు. -
ఇపుడిక.. బొంగులో కల్లు!
ములుగు: ఇప్పటి వరకు బొంగు చికెన్ విషయం మాత్రమే మనకు తెలుసు. గొత్తికోయలు విన్నూత్నంగా కంక బొంగులో కల్లును సేకరిస్తున్నారు. విశాఖపట్టణం సమీపంలోని అరకు, భద్రాచలం సమీపంలోని పాపికొండల ప్రాంతాలలో ఆదివాసీలు ఈ విధానం ద్వారా కల్లు తీస్తారు. మేడారానికి వచ్చే దారి మధ్యలో గొత్తికోయలు తాటి చెట్లకు మట్టి కుండలకు బదులు వెదురు బొంగులను ఏర్పాటు చేసి కల్లును సేకరిస్తున్నారు. పర్యాటకులు ఈ కల్లును సరికొత్తగా ఆస్వాదిస్తున్నారు. రెట్టింపు ధర.. సాధారణంగా తాటి చెట్టు నుంచి సేకరించిన కల్లును గీత కార్మికులు రెండు లీటర్ల బాటిల్‌కు రూ.100 చొప్పున తీసుకుంటున్నారు. కాగా, మేడారానికి వెళ్లే దారి మధ్యలో వెంగళాపురం, మొట్లగూడెం, ప్రాజెక్టునగర్ మధ్యలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన గొత్తికోయలు వినూత్నంగా తాటిచెట్ల గొలలకు కంక బొంగులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టునగర్ సమీపంలోని సుమారు 20 కుటుంబాలకు చెందిన ఏడుగురు గొత్తికోయలు సమీపంలోని 50 తాటి చెట్లకు వెదురు బొంగులను ఏర్పాటు చేసి 20 రోజులుగా కల్లును సేకరిస్తున్నారు. కల్లు కోసం క్యూ.. పట్టణాల నుంచి ఏజెన్సీలోని పలు ప్రాంతాల సందర్శనకు వస్తున్న పర్యాటకులు బొంగు కల్లు కోసం క్యూ కడుతున్నారు. కంక బొంగు ద్వారా సేకరిస్తున్న రెండు లీటర్ల తాటి కల్లుకు రూ.200 ధర పలుకుతోంది. రెట్టింపు ధర డిమాండ్ చేస్తున్నా కల్లును కొనుగోలు చేస్తున్నారు. కంక బొంగులో సేకరించిన కల్లు సాఫ్ట్‌గా ఉంటుందని వారు చెబుతున్నారు. ఆస్వాదిస్తున్నారు.. 15 సంవత్సరాల నుంచి మొట్లగూడెం సమీపంలో నివసిస్తున్నాం. స్థానికంగా ఉన్న తాటి చెట్లు కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉన్నాయి. ఈ విషయమై గ్రామస్తులను సంప్రదించి కల్లు గీయడానికి ఒప్పించాం. ప్రస్తుతం 20 కుటుంబాలకు చెందిన ఏడుగురం 50 తాటి చెట్లను కల్లు గీయడానికి ఒప్పదం కుదుర్చుకున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో మాదిరిగా ఎక్కువ పొడవు, లోతైన కంక బొంగులను తయారు చేసుకొని తాటి గొలలకు అమరుస్తున్నాం. కుండల ద్వారా సేకరించే కల్లుకు, మేము సేకరించే కంక బొంగు కల్లుకు వ్యత్యాసం ఉంది. రెండు లీటర్ల బాటిల్‌కు రూ.200 చొప్పున తీసుకుంటున్నాం. ప్రస్తుతం చెట్లన్నీ లేత దశలో ఉన్నాయి. మరో పది రోజుల్లో పూర్తి స్థాయిలో కల్లు అందుతుంది. ప్రజలు, పర్యాటకులు కంకబొంగు కల్లుపై ఆసక్తి చూపడంతో రోజుకు రూ.500 నుంచి 1000 మేర ఆదాయం వస్తోంది. మడక గంగయ్య, గొత్తికోయవాసి, మొట్లగూడెం -
ఇదంతా సమక్క–సారలమ్మ మహిమే
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘గత జాతరలో ఐటీడీఏ పీఓ హోదాలో పనిచేశాను. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చే విధుల్లో పాల్గొన్నాను. తల్లిని ఆలయం బయటకు తీసుకువచ్చే సమయంలో వచ్చే జాతరలో నీ సేవ చేసుకునే భాగ్యం కల్పించు అని మొక్కుకున్నా.. ఆ తర్వాత జిల్లాల విభజన కావడం జయశంకర్ జిల్లాకు నేను జాయింట్ కలెక్టర్‌గా నియమించబడ్డాను. అంతేకాదు జాతరకు ముందే నాకు ఐఏఎస్ హోదా వచ్చింది. ఇదంతా సమక్క–సారలమ్మ మహిమే’ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ అమయ్‌కుమార్ అన్నారు. టీడీఏ పీఓగా, జాయింట్ కలెక్టర్‌గా రెండు సార్లు ఆయన జాతర విధులు నిర్వర్తించారు. ఈ జాతర అనుభవాలు, వచ్చే జాతరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జేసీ ‘సాక్షి’ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... కలిసికట్టుగా పని చేశారు... జాతర నిర్వహణకు సరిపడా ఉద్యోగులు జయశంకర్ జిల్లాలో ఉన్నారు. అయితే వీరికి జాతరలో పని చేసిన అనుభవం లేదు. అందువల్లే ఇతర జిల్లాల నుంచి అధికారులు, సిబ్బందిని రప్పించాం. అందరు ఇది మన జాతర అన్నట్లుగా పని చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి సరైన వసతి, సమయానికి భోజనం అందించాం. ఎవరు ఏ విధులు నిర్వహించాలో చెప్పాం. అంతా కలిసికట్టుగా పని చేశారు. అంతేకాదు వచ్చే జాతరకు అనుగుణంగా జిల్లాలో ఉన్న 400 మంది ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వచ్చే జాతర పూర్తిగా జయశంకర్ జిల్లా అధికార యంత్రాంగంతో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తాం. నెల రోజుల ముందే... గతంతో పోల్చితే మేడారం భక్తుల సంఖ్య పెరిగిపోయింది. జాతరకు నెల రోజు ముందు నుంచే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీనికి అనుగుణంగా భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలన్నీ నెల రోజులు మందుగానే పూర్తి చేయాలి. అంతేకాదు ఇక నుంచి జాతరకు వచ్చే వీఐపీల సంఖ్య పెరుగుతుంది. వీఐపీల రాక సందర్భంగా భక్తుల క్యూ లైన్లను ఆపేయాల్సి వస్తుంది. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వీఐపీలు, భక్తులు ఒకే సారి దర్శనం చేసుకోవాల్సి వస్తే.. భక్తులు గద్దెల మీదకు బెల్లం విసరకుండా చూడాలి. దీని కోసం భక్తులకు అవగాహన కల్పించాలి. వీఐపీ దర్శనాలకు ప్రత్యేక టైమ్ కేటాయించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. సౌకర్యాలు పెరగాలి.. జాతర సందర్భంగా ప్రతీసారి తాత్కాలిక ఏర్పాట్ల కోసం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నాం. ఇకపై శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేయాలి. జాతర సమయంలో సిబ్బంది బస చేసేందుకు విరివిగా డార్మిటరీలు నిర్మించాలి. సాధారణ రోజుల్లో వీటిని భక్తులకు ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ వల్ల నీటి వృథాతో పాటు జాతర పరిసరాల్లో బురద ఎక్కువ అవుతోంది. దీన్ని నివారించేందుకు ఓవర్ హెడ్ ట్యాంక్‌ల ద్వారా నీటి సరఫరా చేయాలి. చెత్త నిర్వహణకు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలి. కోళ్లు, మేకల వ్యర్థాల కోసం ఇన్సులేటర్లు అందుబాటులో ఉంచాలి. ఇంటింటికీ వైద్యం... గతంలో జాతర తర్వాత మేడారం పరిసర ప్రాంత ప్రజల కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించే వాళ్లు. ఈసారి ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు నిర్వహించేలా మార్పులు చేశాం. ఎవరికైనా అనారోగ్యం ఉంటే అక్కడే చికిత్స అందిస్తున్నారు. జాతర తర్వాత 15 రోజుల వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. టాయిలెట్ల నిర్మాణం కోసం నిర్మించిన బేస్మెంట్లను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తొలగిస్తాం. రైతులకు ఎటువంటి ఇబ్బంది రానివ్వం. -
జాతర అంటే నెట్టుడే.. ఏం చేస్తావ్
సాక్షి ప్రతినిధి, వరంగల్: నా పేరు గౌతమ్.. మేడారం జాతర అంటేనే నెట్టేసుడు.. ఇక్కడ ఇలాగే ఉంటది. ఎవరికి చెప్పుకుంటవో చెప్పుకో.. అంటూ మేడారం వచ్చిన మహిళా భక్తులతో ఓ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడు. జాతరలో అతడి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతర సందర్భంగా సమ్మక్క , సారలమ్మలను దర్శించుకునేందుకు నిత్యం వేలాదిగా భక్తులు వస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు గద్దెల వద్ద కానిస్టేబుళ్లను, వలంటీర్లను నియమించారు. వీఐపీ దర్శనాలు, సిఫార్సు దర్శనాల విషయంలో దేవాదాయశాఖ అధికారులు స్పష్టమైన విధానం అమలు చేయడం లేదు. గద్దెలపైకి వెళ్లేందుకు కొందరికి అనుమతి ఇస్తూ మరికొందరని అడ్డంగా ఆపేస్తున్నారు. దీంతో గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్ గేటు తాళం తీసినప్పుడుల్ల అక్కడున్న ఇతర భక్తులు గద్దెలపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకునేందుకు ప్రయత్నించడం నిత్యకృత్యంగా మారింది. ఈ క్రమంలో శుక్రవారం ఓ యువ అధికారి కుటుంబం, స్నేహితులతో కలిసి దర్శనానికి వచ్చారు. వారి కోసం గేటు తాళం తీశారు. గద్దెలపైకి వెళ్లేందుకు అక్కడే ఉన్న ఓ కుటుంబం అలాగే ప్రయత్నించగా అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మహిళా భక్తులని చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ... విచక్షణారహితంగా నెట్టివేశాడు. ఇదేం పద్ధతి అని ఆ మహిళల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే.. మేడారం జాతర అంటేనే నెట్టేసుడు.. ఆ మాత్రం తెల్వకుండా ఇక్కడికి వచ్చిళ్ల అంటూ హేళనగా మాట్లాడాడు. నువ్వు ఎవరు, ఏ స్టేషన్ అని భక్తులు ప్రశ్నిస్తే.. నా పేరు గౌతమ్, నేను కానిస్టేబుల్‌ను ఏం చేసుకుంటారో చేసుకో అంటూ మరింత దురుసుగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న యువ అధికారి సారీ అని సర్ధిచెబుతున్న కానిస్టేబుల్ ప్రవర్తనలో మార్పు రాలేదు. సమ్మక్క గద్దె నుంచి సారలమ్మ గద్దె వరకు ఆ కుటుంబాన్ని వెంటాడుతూ ఎక్కడికక్కడ నెట్టివేశాడు. కోట్లాది మంది భక్తులు వచ్చే మేడారం జాతరకు పోలీసు శాఖ వేలాది మంది సిబ్బందిని నియమిస్తోంది. రాత్రీపగలు తేడా లేకుండా వారు మేడారం పరిసరాల్లో విధులు నిర్వహిస్తూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. కానీ జాతరకు కీలక స్థానమైన గద్దెల వద్ద కొందరు సిబ్బంది అనుచిత, దురుసు ప్రవర్తన కారణంగా ఆ శాఖకు పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. గద్దెలవంటి రద్దీ ప్రదేశాల్లో భక్తుల నియంత్రణకు మహిళా కానిస్టేబుళ్లను అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ నినాదం చెబుతూ.. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. -
జాకారానికే జై..
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ సిగలో మరో విద్యా కుసుమం విరబూయనుంది. ఎడ్యుకేషన్ హబ్‌గా వర్ధిల్లుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ కొలువుదీరనుంది. జయశంకర్ జిల్లా ములుగు మండలం జాకారం గ్రామ పరిధిలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశించారు. అలాగే మామునూరు వెటర్నిటీ కాలేజీకి సంబంధించి వచ్చే జూన్ నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి చెప్పారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులతో సచివాలయంలో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ములుగులోనే.. యూపీఏ ప్రభుత్వ హయాం నుంచి గిరిజన యూనివర్సిటీ ప్రతిపాదనలు ఉన్నాయి. మహబూబాబాద్ లేదా ములుగులో నెలకొల్పాలని తొలుత ప్రయత్నించారు. ఈ మేరకు ములుగు మండలం జాకారం గ్రామ పరిధిలో వర్సిటీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఉట్నూరు, ఖమ్మం జిల్లా భద్రాచలంలో గిరిజన వర్సిటీ నెలకొల్పాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో వర్సిటీ ఏర్పాటు ఎక్కడ అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తామని ప్రకటించి.. ఆ మేరకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఒక్కొక్కటిగా వరంగల్‌లో నెలకొల్పుతున్నా.. గిరిజన వర్సిటీపై ఉన్న సందేహాలు తొలగిపోలేదు. ఇటీవల మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్జవదేకర్ ఆధ్వర్యంలో జరిగిన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సమావేశంలో తెలంగాణలోని గిరిజన విశ్వవిద్యాలయం అంశంపై జరిగిన చర్చతో మళ్లీ కదలిక వచ్చింది. రాష్ట్ర గిరిజన శాఖ కార్యదర్శి మహేష్‌దత్ ఎక్కా గిరిజన యూనివర్సిటీ కోసం ములుగు జాకారంలో 169 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒకే సర్వే నంబర్లో సేకరించామని వివరించారు. అదేవిధంగా 213 ఎకరాల భూమి ఫారెస్ట్ ల్యాండ్ సమీపంలో ఉందని, దీన్ని సైతం వర్సిటీ కోసం కేటాయించేందుకు ఫారెస్టు అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సంతృప్తి చెంది, వర్సిటీ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించేందుకు ఫిబ్రవరిలో కేంద్ర అధికారుల బృందాన్ని క్షేత్రస్థాయి పర్యటనకు పంపేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో గిరిజన విశ్వవిద్యాలయం పనులను పర్యవేక్షించేందుకు ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించనున్నారు. జబల్పూర్ గిరిజన వర్సిటీ తరహాలో ములుగులో వర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు జబల్పూర్కు ప్రత్యేక బృందాన్ని పంపనున్నారు. వెటర్నరీ కాలేజీలో అడ్మిషన్లు మామునూరులోని పీవీ నర్సింహారావు వెటర్నరీ కాలేజీలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాశారు. ఇప్పటికే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు కూడా మామునూరు వెటర్నరీ కాలేజీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు వెటర్నరీ కాలేజీకి అవసరమైన భవనాలు, మౌలిక వసతులు, ల్యాబ్‌ల నిర్మాణం కోసం రూ.109.69 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులకు ఇటీవల శంకుస్థాపన జరిగింది. వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభించే అవకాశం ఉన్నందున భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశాలు జారీ చేశారు. -
మేడారంలో దారుణం
సాక్షి, మేడారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. కారులో వచ్చిన దుండగులు ధర్మసాగర్‌కు చెందిన యువకుడిపై కత్తులతో దాడి చేశారు. అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతడు ప్రేమించిన అమ్మాయి తరపువారే ఈ ఘాతుకానికి పాల్పడివుంటారని అనుమానిస్తున్నారు. తన ప్రియురాలిని తీసుకువచ్చి ప్రేమవివాహం చేసుకుంటున్నాడన్న కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టివుంటారన్న మాటలు విన్పిస్తున్నాయి. మృతుడి తరపు వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఇద్దరు వీఆర్ఏలపై గొడ్డలితో దాడి: ఒకరి మృతి
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కాటారం శివారులో శుక్రవారం ఇద్దరు వీఆర్ఏలపై దాడి జరిగింది. కాటారం వద్ద నుంచి వెళ్తున్న రాములు, మరో వీఆర్ఏలపై నివాస్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. భూ వివాదాల కారణంతోనే దాడి జరిగిందని స్థానికులు అంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థిలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
సోదరుడి ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకున్నాడని..
భూపాలపల్లి: జిల్లాలో కలకలం రేపిన చిన్నారి రేష్మపై అత్యాచారం, హత్య కేసు మిస్టరీ వీడింది. తన సోదరుడి చావుకు కారణమయ్యాడనే అక్కసుతో తండ్రిపై కక్ష కట్టి అభం శుభం ఎరుగని చిన్నారిని పొట్టనపెట్టుకున్నాడు. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4 తేదీన పుట్టినరోజు నాడే ఏడేళ్ల చిన్నారి రేష్మ హత్యకు గురై మృతదేహంగా కనిపించిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి(గోరి)లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈర్ల రాజు, ప్రవళిక కుమార్తె రేష్మ ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతోంది. గత ఆదివారం రాత్రి గ్రామంలో డీజే సౌండ్ సిస్టమ్ కళాకారులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. శబ్దాన్ని విన్న రేష్మ ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత తల్లి వచ్చి చూడగా బాలిక కనిపించలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రేష్మ కోసం వెతికారు. రాత్రి ఒంటిగంట వరకు వెతికినా ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో రేగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజు బంధువులు గ్రామంతోపాటు గ్రామ పరిసరాల్లో గాలించారు. మరుసటి రోజు రాజు సోదరుడు సదయ్య ఓ గడ్డివాములో రేష్మ మృతదేహం గుర్తించి సమాచారం అందించాడు. విచారణ చేపట్టిన పోలీసులు రేష్మ మృతికి కారకుడైన వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఆ చిన్నారిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. కనకం శివ సోదరుడు కుమార్ ప్రేమ విషయంలో రేష్మ తండ్రి రాజు అడ్డు పడటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలో రాజు పై కక్ష పెంచుకున్న శివ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి ఉరిశిక్ష పడేలా కేసు నమోదు చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. -
ఏడేళ్ల బాలిక దారుణ హత్య
భూపాలపల్లి: ఏడేళ్ల బాలిక హత్యకు గురై పుట్టినరోజు నాడే మృతదేహంగా కనిపించిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి(గోరి)లో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన ఈర్ల రాజు, ప్రవళికకు కుమార్తె రేష్మ(7) ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతోంది. ఆదివారం రాత్రి గ్రామంలో డీజే సౌండ్ సిస్టమ్, కళాకారులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. శబ్దాన్ని విన్న రేష్మ ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత తల్లి వచ్చి చూడగా బాలిక కనిపించలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రేష్మ కోసం వెతికారు. రాత్రి ఒంటిగంట వరకు వెతికినా ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో రేగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం రాజు బంధువులు గ్రామంతోపాటు గ్రామ పరిసరాల్లో గాలించారు. రాజు సోదరుడు సదయ్య ఓ గడ్డివాములో రేష్మ మృతదేహం గుర్తించి సమాచారం అందించాడు. బాలికపై అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సోమవారం రేష్మ పుట్టిన రోజు కాగా ఆదివారం తల్లి ప్రవళిక, రేష్మ పరకాలకు వెళ్లి కొత్త దుస్తులు, కేక్‌ను తీసుకొచ్చారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన రోజునే రేష్మ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. -
భిక్షమేస్తేనే వదిలేస్తా
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగడ మండలం తిరుమలగిరి బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర.. అక్కడ భిక్షాటన చేసే వ్యక్తి జాతరకు వచ్చిన వారిని ధర్మం చేయమని కాలు పట్టుకుని వదలకుండా చెమటలు పట్టించాడు. జాతరకు వచ్చిన ఓ యువకుడి కాలు పట్టుకుని వదలకుండా డబ్బులు ఇవ్వమని పట్టుబట్టాడు. సదరు యువకుడు డబ్బులు ఇచ్చేవరకు వదలలేదు. ప్రశాంతంగా దైవ దర్శనం కోసం వస్తే.. ఈ భిక్షగాళ్ల గోల భరించలేకపోతున్నామని భక్తులు వాపోతున్నారు. జాతరకు వచ్చిన భక్తులతో భిక్షగాడు చేసిన ఈ తతంగం అంతా ’సాక్షి’ క్లిక్ మనిపించింది. ఫొటోగ్రాఫర్: గుర్రం సంపత్ గౌడ్ -
భూపాలపల్లి జిల్లాలో బాంబుల కలకలం
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాంబులు కలకలం రేపాయి. జిల్లాలోని వెంకటాపురం(కె) మండలంలోని అబ్బాయిగూడెం సమీపంలోని రహదారిపై రెండు బాంబులు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వాహనాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులే ఈ ఘతుకానికి పాల్పడి ఉంటరాని అనుమానిస్తున్నారు. రహదారిలో ప్రెషర్ బాంబులు అమర్చినట్లు గుర్తించడంతో.. బాంబు స్క్వాడ్ సాయంతో వాటిని నిర్వీర్యం చేయడానికి యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భర్త ఇంటి ముందు నవ వధువు ఆందోళన
సాక్షి, తాడ్వాయి: ప్రేమించి.. పెద్దలను ఎదిరించి కూలాంతర వివాహం చేసుకొని ఇప్పుడు తనను కాదంటున్నాడంటూ.. ఓ నవ వధువు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలంలోని బీరెల్లి గ్రామానికి చెందిన మంగ రజిత(22)ను ఇదే పంచాయతి పరిధిలోని కామారం గూడానికి చెందిన బిక్షపతి(25) ప్రేమించుకున్నారు. బిక్షపతి యాదవ కులానికి చెందిన వాడు కాగా.. రజిత దళిత యువతి. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించారు. అయినా పెద్దలను ఎదిరించి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కాగా.. రెండు నెలలు కాపురం చేసిన అనంతరం నువ్వు తక్కువ కులం దానివి.. నాకు నీ అవసరం లేదంటూ బిక్షపతి.. భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఎటు పోవాలో దిక్కుతోచక స్థితిలో రజిత భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. ఆమెకు స్థానిక మహిళా సంఘం సభ్యులు సంఘీభావం తెలిపారు. -
ముగ్గురు నకిలీ రిపోర్టర్ల అరెస్ట్
ఏటూరునాగారం(భూపాలపల్లి): పేరున్న మీడియా సంస్థలో రిపోర్లమని పోజులిస్తూ అందినకాడికి అక్రమాలకు పాల్పడుతోన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం నుంచి ఇసుక తరలిస్తున్న లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు నకిలీ రిపోర్టర్లను గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ముగ్గురు నకిలీలు మంగపేట మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.