సాక్షి, మేడారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. కారులో వచ్చిన దుండగులు ధర్మసాగర్‌కు చెందిన యువకుడిపై కత్తులతో దాడి చేశారు. అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
అతడు ప్రేమించిన అమ్మాయి తరపువారే ఈ ఘాతుకానికి పాల్పడివుంటారని అనుమానిస్తున్నారు. తన ప్రియురాలిని తీసుకువచ్చి ప్రేమవివాహం చేసుకుంటున్నాడన్న కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టివుంటారన్న మాటలు విన్పిస్తున్నాయి. మృతుడి తరపు వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మేడారంలో దారుణం
Published Sun, Jan 14 2018 8:18 PM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment