Top Stories
ప్రధాన వార్తలు

భారత్‌కు అండగా ఉంటాం: రష్యా
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. భారత్ కు అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మోదీకి ప్రత్యేకంగా ఫోన్ చేసిన పుతిన్.. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్ కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతిచెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పుతిన్,. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రన్ ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు రష్యా అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందుకు తీసుకురావాలని పుతిన్ నొక్కి చెప్పినట్లు స్సష్టం చేశారుఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని రెండురోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.

పోలీస్ అధికారులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం..
సాక్షి,విజయవాడ: పోలీస్ అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్‌రెడ్డి కేసులో అరెస్ట్ సమయం, తేదీపై తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని ఫైరయ్యింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వేసిన అఫిడవిట్లలో సమాచారం తప్పని హైకోర్టు తేల్చింది.2024 నవంబర్ 8న అరెస్ట్ చేసి 10న చేశామని ఎలా చెప్తారు? అని ప్రశ్నించింది. తాము తీసుకోబోయే చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కూటమి ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది. పులివెందుల అర్బన్ పోలీసుస్టేషన్లో పుల్లప్పగారి హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై క్రైమ్ నంబరు 409/24, అండర్ సెక్షన్ 386 ఐపీసీ 196, 351(3), 353(1)(సి), 112(2)(బి) రెడ్‌విత్ 3(5) బిఎన్ఎస్ 2023 సెక్షన్ 3(1)(ఆర్)(ఎస్), 3(2)(వి)(ఎ) ఎస్సీ ఎస్టీ (పీఓఏ) అమెండ్మెంట్ యాక్టు 2015, 67 ఐటీ యాక్టు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.రవీంద్రారెడ్డితో పాటు అతడికి ఆశ్రయం కల్పించిన కమలాపురం మండలం నల్లింగాయపల్లెకు చెందిన గుర్రంపాటి సుబ్బారెడ్డి అలియాస్ సుబ్బారెడ్డి, ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెకు చెందిన గురజాల ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కూడా కారులో ఉండటాన్ని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే,ఈ అక్రమ కేసులపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో వర్రా రవీంద్రారెడ్డికి పలు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది.

ఇదేం ఆట?.. గుడ్లు ఉరిమి చూసిన రియాన్.. ఒక్క చూపుతోనే..
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs RR)తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) అద్భుత ఇన్నింగ్స్ ఆడినా వృథాగానే పోయింది. 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఊహించని రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చాడు.45 బంతుల్లో 95 పరుగులుఇరవై ఏడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రియాన్ పరాగ్.. ఆ తర్వాత ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది స్కోరు బోర్డును దౌడు తీయించాడు. కేకేఆర్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్ (13వ ఓవర్)లో వరుస సిక్స్‌లతో అలరించి వహ్వా అనిపించాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి 95 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 45 బంతుల్లో 95 పరుగులు చేసి నిష్క్రమించాడు.అయితే, ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టడంతో రియాన్ పరాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఐదు, ఆరో నంబర్ బ్యాటర్లు ధ్రువ్ జురెల్, వనిందు హసరంగ డకౌట్ కావడం పట్ల రియాన్ ఆగ్రహానికి లోనయ్యాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్ తొలి బంతికి వరుణ్ చక్రవర్తి ధ్రువ్ జురెల్ (0)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మరో రెండు బంతులకు అదే రీతిలో వనిందు హసరంగ (0)ను కూడా బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు.చూపుతోనే చంపేసేలాఇక హసరంగ అవుట్ కావడాన్ని రియాన్ పరాగ్ సహించలేకపోయాడు. సహచర ఆటగాడిని ఒ క్క చూపుతోనే బెంబెలెత్తేలా ఓ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో కొంత మంది రియాన్ ఆగ్రహంలో అర్థం ఉందని అంటుంటే.. మరికొందరు మాత్రం కెప్టెన్‌గా ఉండటం మామూలు విషయం కాదని అతడికి ఇప్పుడే తెలిసి వస్తోందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్తాన్ రాయల్స్ ఆదివారం కోల్‌కతాతో తలపడింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు సాధించింది.ఒక్క పరుగు తేడాతో ఓడిభారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయినా.. రియాన్ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఆఖరి బంతి వరకు రాజస్తాన్ పోరాడిందంటే అందుకు కారణం కెప్టెన్. అయితే, రియాన్ అవుటైన తర్వాత పరిస్థితి మారిపోయింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన వేళ.. శుభమ్‌తో కలిసి పరుగు పూర్తి చేసిన జోఫ్రా ఆర్చర్ రనౌట్ అయ్యాడు. దీంతో రాజస్తాన్ ఓటమి ఖరారైంది. కేకేఆర్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడి.. ఈ సీజన్లో పన్నెండింట తొమ్మిదో పరాజయం నమోదు చేసింది.రాజస్తాన్ బ్యాటర్లలో రియాన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. యశస్వి జైస్వాల్ (34), షిమ్రన్ హెట్మెయిర్ (29), శుభమ్ దూబే (14 బంతుల్లో 25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా వాళ్లలో వైభవ్ సూర్యవంశీ(4) పూర్తిగా విఫలం కాగా.. కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్, హసరంగ డకౌట్లుగా వెనుదిరిగారు. ఆర్చర్ ఆఖర్లో 12 పరుగులు చేశాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీలా సెంచరీ చేయనక్కర్లేదు!.. ఆయుశ్‌కు ధోని చెప్పిందిదే!Through the gate ✖ 2️⃣ \|/Varun Chakaravarthy is weaving his magic in Kolkata! 👏Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @chakaravarthy29 | @KKRiders pic.twitter.com/vHcMTObTrL— IndianPremierLeague (@IPL) May 4, 2025

రైతులకు బాసటగా వైఎస్సార్సీపీ: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్ జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్‌కు వైఎస్ జగన్ సూచించారు.

వక్ఫ్ చట్టం చట్టబద్ధతపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం(Waqf Amendment Act) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ మే 15కి వాయిదా వేసిందిసీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్లపై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా వక్ఫ్ కేసు విచారణను జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనానికి బదిలీ చేసింది. మే 13న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా రిటైర్ కానున్న నేపథ్యంలో కేసు బదిలీపై నిర్ణయం తీసుకుంది.వక్ఫ్ కేసులలో తదుపరి విచారణ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారణ కొనసాగించనుంది.వక్ఫ్ (సవరణ) చట్టం2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖయ్యాయి. ఇప్పటికే పలుసార్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కేంద్రం విజ్ఞప్తి మేరకు నేటి వరకు గడువు ఇచ్చింది. గత విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబంధనలను తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. మే 5వ తేదీ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపింది. గత వాదనల్లో.. వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. గత విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అన్నిరకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి వాదనలు వినకపోవడం సముచితం కాదని పేర్కొన్నారు. మరోవైపు.. వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించొద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ చెప్పింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫీషియో సభ్యులను నియమించొచ్చని.. ఈ మేరకు వక్ఫ్(సవరణ) చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదించింది.

ఈనాడు పేపర్‌నే కూటమి సర్కార్ ఫాలో అయ్యేది: ఉండవల్లి
తూర్పుగోదావరి, సాక్షి: సీనియర్ పోలీస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికకు ఆంజనేయులిపై చాలా కక్ష ఉండి ఉండొచ్చని.. ఈ అరెస్ట్ పోలీస్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలని అన్నారాయన. ఈ కేసులో అసలు ముంబై నటి ని రేప్ చేసారన్న వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు?. ఆంజనేయులు లాంటి అధికారులను వేధించడం సరికాదు. ఇలా అయితే పోలీసులు ఎలా పని చేస్తారు?. ముంబైలో నమోదైన కేసులో ఏం జరుగుతుందో?. ఈనాడు పేపర్‌కు ఆంజనేయులిపై కక్ష చాలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈనాడు పేపర్లో ముందురోజు ఏమి వస్తుందో.. ఆ తర్వాతి రోజు ప్రభుత్వం అదే ఫాలో అవుతోంది అని ఉండవల్లి అన్నారు. ఆంధ్రా నుంచి ఎవరూ మాట్లాడరా?ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి 11 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఇదేనని ఉండవల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకూ అఫిడవిట్ ఫైల్ చేయలేదు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. నేనే 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టుకు హాజరయ్యాను. విభజన చట్టంలో ఆంధ్రా కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరాం. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరు. పబ్లిక్ మీటింగ్‌లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు.. కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారు.. అందుకే ఆయనకు లెటర్ రాశాను.. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ ను తీసుకువచ్చి వాదన వినిపించమని కోరుతున్నా. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ 100 లోక్‌సభలో ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా అమలు కాలేదు అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

సీమ రాజా, కిర్రాక్ ఆర్పీలాంటోళ్లను చట్టం వదలదు: అంబటి
గుంటూరు, సాక్షి: తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని.. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారాయన.సోమవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ వైఎస్సార్సీపీపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై, తనపైనా తప్పుడు ప్రచారం చేస్తోంది. అందుకే ఐటీడీపీపై ఫిర్యాదు చేశాం. అలాగే.. వైఎస్సార్సీపీ కండువా చేసి ప్రేలాపనలు చేసే సీమ రాజా అనే వ్యక్తిపైనా, మాజీ మంత్రి రోజా తదితరులపైనా వీడియోలు చేసే కిర్రాక్ ఆర్పీపైనా ఫిర్యాదు చేశాం.గతంలోనూ మేం ఫిర్యాదులు చేశాం. కానీ, పోలీసులు చర్యలు తీసుకోలేదు. అందుకే ఈసారి రసీదు తీసుకున్నాం. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీస్ వ్యవస్థ టీడీపీ గుప్పిట్లో ఉంది. పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టులకు వెళ్తాం.ఐటీడీపీ పేరుతో చంద్రబాబు, లోకేష్ ప్రొత్సహంతో వైఎస్సార్సీపీ నేతలపై ప్రేలాపనలు చేస్తున్నారు. పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తాం. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. పార్టీ ఇన్ పర్సన్‌గా నా ఆవేదనను నేనే స్వయంగా వినిపిస్తా. చట్టం సీమ రాజాను, కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్లను చట్టం వదలదు. ఎంత పెద్దవారు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరు.

అసెంబ్లీలో ‘మ్యాచ్ ఫిక్సింగ్’?.. ఎమ్మెల్యే అరెస్ట్!
ఆయనో యువ ఎమ్మెల్యే. అవినీతి మీద చట్ట సభలో ప్రశ్నలు సంధించారు. ఆనక.. నోరు మెదపకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. రాజస్థాన్‌లో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఏసీబీ ఆదివారం అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. జైపూర్: భారత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ జైపూర్ జ్యోతి నగర్‌లోని తన అధికార నివాసంలో ఒక మైనింగ్ కంపెనీ యజమాని నుంచి రూ 20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు ఆ రాష్ట్ర ఏసీబీ వెల్లడించింది. కరౌలి జిల్లాలోని తోడభీమ్ బ్లాక్‌లోని కొన్ని మైనింగ్ లీజులకు సంబంధించిన మూడు ప్రశ్నలను గత అసెంబ్లీ సమావేశాల్లో అడిగారు. అయితే ఆ ప్రశ్నలను ఉపసంహరించుకునేందుకు మైనింగ్ యజమాని నుంచి ఎమ్మెల్యే మొత్తంగా రూ.10 కోట్లను డిమాండ్ చేశారు. అయితే చివరకు డీల్ రూ.2.5 కోట్లకు కుదరడం, కొంత కొంతగా చెల్లించేందుకు ఎమ్మెల్యే ఒప్పుకోవడం జరిగిపోయిందట. అదే సమయంలో ఈ ఏప్రిల్‌లోనే ఏసీబీకి ఆయన సమాచారం అందించాడట.ఈ క్రమంలో.. ఇప్పటికే లక్ష చెల్లించగా.. ఆదివారం మరో రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఓ యజమాని ప్రయత్నించాడు. దీంతో.. ఏసీబీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, స్పీకర్ వాసుదేవ్‌కి తెలియజేసి అరెస్ట్‌కు ముందస్తుగానే అనుమతి పొందారు. సరిగ్గా డబ్బు తీసుకుంటున్న సమయంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ రవి ప్రకాష్ మెహర్దా మీడియాకు తెలియజేశారు. అంతేకాదు.. ఎమ్మెల్యే కృష్ణ పటేల్ డబ్బు తీసుకుంటున్న టైంలో ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే అనుచరుడొకరు డబ్బు సంచితో ఉడాయించినట్లు, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారాయన. లోక్ సభ ఎన్నికలతో పాటు కిందటి ఏడాది జరిగిన బగిడోరా నియోజవర్గం(బంస్వారా జిల్లా) ఉప ఎన్నికల్లో కృష్ణ పటేల్(38) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. భారత్ ఆదివాసీ పార్టీకి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అరెస్టు తరువాత ఎమ్మెల్యేను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ పరిణామంపై భారత్ ఆదివాసీ పార్టీ కన్వీనర్, బంస్వారా ఎంపీ రాజ్‌కుమార్ రావోత్ స్పందించారు. ఇది బీజేపీ కుట్ర అయ్యి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ కృష్ణపటేల్ హస్తం ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయాల్లో అవినీతి పనికి రాదని ఆ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ అన్నారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ చేస్తున్న రాజకీయాలపైనా చర్చ జరగాలని కోరారాయన. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించాల్సి ఉంది.

శ్రీతేజ్‌ను పరామర్శించిన నిర్మాత అల్లు అరవింద్, బన్నీవాసు
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్(Sri Tej )ను సోమవారం ఉదయం నిర్మాతలు అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాసు పరామర్శించారు. కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ ప్రస్తుతం ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న నిర్మాతలు, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.శ్రీతేజ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు అతని యోగక్షేమాలను నిరంతరం అడిగి తెలుసుకుంటున్నారు. శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులతోపాటు, అతని కుటుంబానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఆర్థిక సహాయం అందించారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని, సాధారణ స్థితికి చేరే వరకు, భవిష్యత్‌లో అతనికి ఏ అవసరమైనా అతనికి, అతని కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నుంచి రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స వరకు, అల్లు అరవింద్, బన్నీ వాసుల ద్వారా శ్రీతేజ్ ఆరోగ్య వివరాలను అల్లు అర్జున్ నిరంతరం తెలుసుకుంటున్నారు.

ఫారం 16లో జరిగిన మార్పులు ఇవే.. గమనించారా?
2024–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారంలో 16 మార్పులు వచ్చాయి. మీ యజమాని ఈ మార్పులు చేసిన తర్వాత మీకు ఫారం 16 జారీ చేస్తారు.ఫారం 16 అంటే ఏమిటి?యజమాని తన దగ్గర చేసే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం జారీ చేసేది ఫారం 16. ఇందులో మొదటి భాగంలో ఉద్యోగులు, యజమాని ప్రాథమిక వివరాలు ఉంటాయి. రెండో భాగంలో జీతభత్యాలకి సంబంధించిన పూర్తి వివరాలు .. అంటే జీతాలు, అలవెన్సులు, టాక్సబుల్ ఇన్‌కం వివరాలు, మినహాయింపులు, తగ్గింపులు, డిడక్షన్లు, నికరజీతం లేదా ఆదాయం, టీడీఎస్ వివరాలు ఉంటాయి. ‘సులభతరం, పారదర్శకత, స్పష్టత’ అనే లక్ష్యాలతో ఫారం 16 రాబోతోంది.ఫారం 16 చాలా ముఖ్యమైంది..రిటర్నులు వేయడానికి మొదటగా చూసే డాక్యుమెంటు ఇదే. లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు, రుణ సంస్థలు ఈ ఫారంనే ప్రాతిపదికగా తీసుకుంటాయి. ఈ ఫారంతో ఉద్యోగి ‘రుణ స్తోమత’ నిర్ధారిస్తారు. దీంతోనే పన్ను భారం, చెల్లింపులు నిర్ధారించవచ్చు. రీఫండు కోసం కూడా ఇదే ఫారంని ‘బేస్’గా తీసుకుంటారు. ఎందుకంటే, పన్ను వసూలు చేయడం, దాన్ని ప్రభుత్వానికి చెల్లించడాన్ని దీని ద్వారానే నిర్ధారించుకుంటారు. ఇవే అంశాలు 26ఏఎస్‌లో ఉంటాయి.ప్రతి మూడు నెలలకు సమ్మరీ, జీతం, టీడీఎస్ చెల్లించినది, గవర్నమెంటుకు ఎలా చెల్లించారు, ఏ బ్యాంకు ద్వారా చెల్లించారు, ఏ తేదీన కట్టారు, చలాన్ నంబరు ఎంత వగైరా వివరాలన్నీ ఉంటాయి. జీతం, అలవెన్సులు, బోనస్‌లు, ఏరియర్స్, సెక్షన్ 10 ప్రకారం మినహాయింపులు, ఇంటి అద్దె అలవెన్సు, గ్రాట్యుటీ మొదలైన అన్ని డిడక్షన్లు 80 C నుంచి 80 TTA వరకు ఉంటాయి. ఆ తరువాత పన్ను భారం లెక్కింపులు, స్టాండర్డ్ డిడక్షన్లు ఉంటాయి. 89(1) రిలీఫ్ కూడా ఉంటుంది. వచ్చిన మార్పులు ఏమిటంటే..80 ఇఇఏ ప్రకారం అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కి ఇచ్చిన విరాళాలకు సంబంధించిన మినహాయింపు ఉంటుంది. జీతాలకు సంబంధించిన అంశాలు వర్గీకరిస్తారు. హెచ్ఆర్ఏకి సంబంధిత వివరాలుంటాయి. అలాగే రెంట్‌ఫ్రీ వివరాలు, ఇతర ప్రిరిక్వజిట్లు, ప్రతి డిడక్షన్‌కి సంబంధించి మరిన్ని వివరాలు పొందుపరుస్తారు. కొత్త కాలమ్ ద్వారా టీడీఎస్, టీసీఎస్కి సంబంధించిన వివరాలు తెలిసేలా, సరి చేసుకునే వీలు కల్పించడానికి ఫారం 24 Q టీడీఎస్/టీసీఎస్ రిటర్నులు కనిపించేలా చేస్తారు. దీనివల్ల 26 Aను అప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్మీరు చేయాల్సిందేమింటంటే..ఫారం 16 యజమాని ఇచ్చే సర్టిఫికేట్. ఇది విలువైంది. ఎందుకంటే ఇది మీ టీడీఎస్, టీసీఎస్ రికవరీ అయినట్లు... చెల్లించినట్లు. గవర్నమెంటు చేతికందినట్లూ. మీ ఖాతాలో జమ అయినట్లు ధృవీకరించే ఏకైక పత్రం. అయితే ఇందులో ప్రతి అంశాన్ని మీరే సరి చూసుకోవాలి. నెలసరి శాలరీ స్లిప్పులతో మినహాయింపు, తగ్గింపులు... మొదలైనవి చెక్ చేసుకోవాలి. మీరు ఇచ్చే ఆదాయపు వివరాలు ఉన్నాయా లేదా ఎక్కువ పడ్డాయా చెక్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన కాగితాలు భద్రపరుచుకోవాలి. మీరు కొత్త రెజీమ్‌లో ఉన్నారా లేక పాత పద్ధతిలో ఉన్నారో చెక్ చేసుకొండి. మీరు సంవత్సరంలో ఉద్యోగం మారితే రెండు ఫారం 16లు ఉంటాయి. అప్పుడు రిపోరి్టంగ్లో హెచ్చు తగ్గులు... డబుల్ క్లయిమ్/తప్పుడు క్లయిమ్ ఉండొచ్చు. చెక్ చేసుకోండి. యజమానికి అంటే ‘డిస్బర్సింగ్’ అధికారి ఇవన్నీ అదనపు భాద్యతలు... తగిన జాగత్ర వహించాలి. గతంలో ఏర్పడిన ఇబ్బందులు, సమస్యలు కొత్త ఫారమ్ 16 వల్ల రావని ఆశిద్దాం! ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య
ఎవరిమీద మీ సమరం?.. ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్ ఆగ్రహం
‘సినిమా’ చూపించిన ట్రంప్.. అమెరికాలో కష్టమే!
పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు
మూడోసారి టైటిల్... సబలెంకా ప్రైజ్‌మనీ ఎంతంటే?
నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
నీట్ పరీక్ష రాసింది.. ఇంటికొచ్చి ప్రాణం తీసుకుంది!
స్నానం కూడా చేయలేదు.. అమ్మ జీవితాంతం నన్ను..: రష్మీ
మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
300 ఏళ్ల నాటి ఆలయం..అక్కడ ప్రసాదం పిల్లులకు నివేదించాకే..
అప్పు ఇవ్వొద్దు,పాక్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్..
నా కొడుకును సంపేయండి
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
బంగారం భారీగా పడిపోతుంది!
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
ఇంట్లో పాముల కలకలం
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
3 నిమిషాలకో మరణం
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
‘ఛీ’నా రాజకీయం...
కొందరికే ‘భరోసా’
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
శ్రీకృష్ణ లీలలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్‌లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
పాక్ నడ్డి విరిగేలా..
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
ఒకే ఇల్లు.. ఒకే వంట
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
ముష్కర మూకలకు ముచ్చెమటలు
ఎవరిమీద మీ సమరం?.. ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్ ఆగ్రహం
‘సినిమా’ చూపించిన ట్రంప్.. అమెరికాలో కష్టమే!
పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు
మూడోసారి టైటిల్... సబలెంకా ప్రైజ్‌మనీ ఎంతంటే?
నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
నీట్ పరీక్ష రాసింది.. ఇంటికొచ్చి ప్రాణం తీసుకుంది!
స్నానం కూడా చేయలేదు.. అమ్మ జీవితాంతం నన్ను..: రష్మీ
మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
300 ఏళ్ల నాటి ఆలయం..అక్కడ ప్రసాదం పిల్లులకు నివేదించాకే..
అప్పు ఇవ్వొద్దు,పాక్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్..
నా కొడుకును సంపేయండి
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
బంగారం భారీగా పడిపోతుంది!
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
ఇంట్లో పాముల కలకలం
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
3 నిమిషాలకో మరణం
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
‘ఛీ’నా రాజకీయం...
కొందరికే ‘భరోసా’
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
శ్రీకృష్ణ లీలలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్‌లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
పాక్ నడ్డి విరిగేలా..
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
ఒకే ఇల్లు.. ఒకే వంట
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
ముష్కర మూకలకు ముచ్చెమటలు
సినిమా

ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మలయాళ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరీ ముఖ్యంగా బాసిల్ జోసెఫ్ నుంచి వస్తున్న ప్రతి సినిమా ఆకట్టుకుంటోంది. రీసెంట్ టైంలో పలు చిత్రాల డబ్బింగ్ లతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు మరో మూవీతో ఓటీటీలో రచ్చ చేసేందుకు సిద్ధమైపోయాడు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్?(ఇదీ చదవండి: ఓటీటీలో 'జాక్' సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..) స్వతహాగా డైరెక్టర్ అయిన బాసిల్ జోసెఫ్ గత కొన్నాళ్ల నుంచి హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది కాలంలో నూనక్కుళి, సూక్ష్మదర్శిని, ప్రావింకుడు షప్పు, పొన్ మన్ తదితర చిత్రాలతో వచ్చాడు. ఇప్పుడు 'మరణమాస్' మూవీతో రాబోతున్నాడు. మలయాళ పండగ విషు సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మే 15 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాని ప్రముఖ హీరో టొవినో థామస్ నిర్మించడం విశేషం.(ఇదీ చదవండి: ‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్’ మూవీ రివ్యూ) 'మరణమాస్' విషయానికొస్తే.. ఓ రాత్రి అనుకోకుండా సీరియల్ కిల్లర్ తోపాటు ఓ శవం ఉన్న బస్సులో కొందరు వ్యక్తులు చిక్కుకుంటారు. ఆ శవాన్ని వాళ్లు ఏం చేశారు? ఆ సీరియల్ కిల్లర్ నుంచి ఎలా తప్పించుకున్నారనేదే స్టోరీ. ఈ సినిమాలో లూక్ పీపీ అనే ఇన్ ఫ్లూయెన్సర్ గా బాసిల్ జోసెఫ్ నటించాడు. ఓ అమ్మాయి తన ప్రేమని అంగీకరించకపోవడంతో లూక్.. ఆమెను వేధిస్తూ ఉంటాడు. అదే ఊరిలోని వృద్ధులను చంపి నోటిలో అరటిపండు పెడుతుంటాడు సీరియల్ కిల్లర్. డార్క్ కామెడీగా తీసిన ఈ సినిమా వచ్చే వారాంతంలో రిలీజ్ అవుతుంది.(ఇదీ చదవండి: 'కిర్రాక్ ఆర్పీ మోసాన్ని నా జీవితంలో మర్చిపోను'.. జబర్దస్త్ తన్మయ్) Welcome to a world where nothing makes sense, but everything will crack you up!Watch #Maranamass on SonyLIV From 15 May #MaranamassOnSonyLIV pic.twitter.com/s3GTEM5YEz— Sony LIV (@SonyLIV) May 5, 2025

నా వయసు 12 ఏళ్లు.. బస్సులో భయానక సంఘటన: బుల్లితెర నటి
బాలీవుడ్ భామ, బుల్లితెర నటి గౌతమి కపూర్ బీ టౌన్లో పరిచయం చేయాల్సిన పనిలేదు. సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. గౌతమి చివరిసారిగా కొరియన్ డ్రామా రీమేక్ అయినా గ్యారహ్.. గ్యారహ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలతో బిజీగా ఉన్న గౌతమి తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన చిన్నతనంలో ఎదురైన ఓ షాకింగ్ అనుభవాన్ని పంచుకుంది.ముంబయిలో పాఠశాల ఇంటికి వస్తుండగా ఓ అపరిచిత వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. తాను ఆరో తరగతిలో ఉండగా ఈ సంఘటన జరిగిందని గుర్తు చేసుకుంది. ఓ వ్యక్తి ఏకంగా తన ప్యాంట్ లోపలికి చేయి పెట్టాడని ఆ భయానక అనుభవాన్ని పంచుకుంది. అప్పుడు నా వయసు 12 ఏళ్లు కావడంతో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం పట్టిందని తెలిపింది. ఆ తర్వాత భయంతో వెంటనే బస్సుదిగి వెళ్లిపోయానని గౌతమి కపూర్ ఆ చేదు సంఘటనను వివరించింది. ఆ వ్యక్తి నన్ను అనుసరిస్తున్నాడా అని నేను ఆలోచిస్తూనే ఉన్నానని వెల్లడించింది. ఈ విషయాన్ని అమ్మతో చెప్పడానికి భయపడ్డానని గౌతమి చెప్పింది.ఈ సంఘటన జరిగినప్పుడు తాను తన స్కూల్ యూనిఫాంలోనే ఉన్నానని గౌతమి పంచుకుంది. ఇంటికి వచ్చి నా తల్లికి జరిగిందంతా వివరించానని తెలిపింది. వెంటనే 'నీకు పిచ్చి పట్టిందా? నువ్వు వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి కాలర్ పట్టుకుని ఉండాల్సిందని.. ఎప్పుడూ భయపడవద్దని అమ్మ నాకు ధైర్యం చెప్పిందని తెలిపింది. ఎవరైనా అలా చేస్తే.. వారి చేతిని గట్టిగా పట్టుకుని బిగ్గరగా అరవండి.. భయపడకుండా పెప్పర్ స్ప్రే వారి ముఖంపై కొట్టండి అని సలహా ఇస్తోంది బాలీవుడ్ భామ.

ఓటీటీలో 'జాక్' సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda) నటించిన జాక్ సినిమా ఓటీటీ ప్రకటన వచ్చేసింది. చాలారోజుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 10న విడుదలైన జాక్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.'జాక్' సినిమా మే 8న ఓటీటీలో విడుదల కానుందని 'నెట్‌ఫ్లిక్స్'(Netflix) ప్రకటించింది. తెలగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట అందుకొని ఫుల్ జోష్‌లో ఉన్న సిద్ధు.. జాక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. అయితే, ఆయన అంచనాలు తప్పడంతో భారీ నష్టాలను ఈ మూవీ మిగిల్చింది. సిద్ధు గత సినిమా 'టిల్లు స్క్వేర్'కి రూ.23 కోట్లు తొలిరోజే రాబట్టింది. అయితే 'జాక్' చిత్రానికి మాత్రం రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే ఫస్ట్ డే వచ్చాయి. సుమారు రూ. 36 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద ఫైనల్‌గా కేవలం రూ. 7 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.కథేంటంటే.. పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ) రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ కావాలని కలలు కంటాడు. తనకున్న టాలెంట్ అంతా ఉపయోగించి ఇంటర్వ్యూ వరకు వెళ్తాడు. ఆ రిజల్ట్ రాకముందే ఖాలీగా ఉండడం ఎందుకని దేశాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. ఉగ్రవాదులు, హైదారాబాద్‌తో పాటు భారత్‌లోని ఇతర ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు జాక్ ఏం పని చేస్తున్నాడో కనుక్కోమని ప్రైవేట్ డిటెక్టివ్ అఫిషాన్ బేగం (వైష్ణవి చైతన్య)కు లక్ష రూపాయలు ఇస్తాడు అతని తండ్రి పాన్ ఇండియా ప్రసాద్(నరేశ్). అఫిషాన్ బేగం భానుమతి పేరుతో జాక్కి దగ్గరై జాక్ పనిపై నిఘా పెడుతుంది. టెర్రరిస్టులను పట్టుకునే క్రమంలో పొరపాటున ‘రా’ఏజెంట్ మనోజ్(ప్రకాశ్ రాజ్)ని కిడ్నాప్ చేస్తాడు జాక్. ఆ తర్వాత ఏం జరిగింది? టెర్రరిస్ట్ గ్యాంగ్‌ని జాక్ పట్టుకోగలిగాడా లేదా? అసలు జాక్ ‘రా’ ఏజెంట్ కావాలని ఎందుకు అనుకున్నాడు? చివరకు తను కోరుకున్న ఉద్యోగం పొందగలిగాడా లేదా? అనేదే తెలియాలంటే జాక్(Jack Movie Review) సినిమా చూడాల్సిందే.

హిట్3 కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన అర్జున్ సర్కార్
'హిట్3: ది థర్డ్ కేస్' వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది. కేవలం నాలుగురోజుల్లోనే ఈ రికార్డ్‌ను సాధించడంతో నాని ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం పెరిగింది. మొదటిరోజే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ మూవీ ఆ తర్వాతి రోజుల్లో కూడా జోరు పెంచింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి పెద్దగా పోటీ లేకపోవడం ఆపై సినిమా పట్ల పాజిటీవ్ టాక్ రావడంతో థియేటర్స్ వద్ద అర్జున్ సర్కార్ సందడి చేస్తున్నాడు. హిట్3 వంద కోట్ల క్లబ్లో చేరిందని తాజాగా ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు.హిట్3 సినిమా కేవలం నాలుగురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 101 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ప్రకటించారు. నాని కెరీర్లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా దసరా (రూ.120 కోట్లు) ఉంది. మరో వారంలోపే ఆ రికార్డ్‌ను సులువుగా హిట్3 చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు నాని కెరీర్లో వంద కోట్ల క్లబ్లో ఉన్న సరిపోదా శనివారం రూ.101 కోట్లు, ఈగ రూ. 100 కోట్లు చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు హిట్3 నాలుగో చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.హిట్3 విడుదల సమయంలో సూర్య 'రెట్రో', హిందీలో అజయ్ దేవగణ్ 'రైడ్ 2' చిత్రాలు మే 1న థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో ఏదీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, హిట్3 మూవీలో కాస్త వయెలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ నాని అద్భుతమైన నటనతో దుమ్మురేపాడు. ఈ మూవీకి నిర్మాత కూడా నానినే కావడం విశేషం. త్వరలో 'ప్యారడైజ్' షూటింగ్లో నాని జాయిన్ అవుతాడు. ఆ తర్వాత సుజీత్‌తో సినిమా చేస్తాడు. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల చిత్రానికి నిర్మాత కూడా నానినే. ఇలా నాని లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. SARKAAR'S CENTURY 💥💥💥101+ CRORES GROSS WORLDWIDE for #HIT3 in 4 days ❤🔥Book your tickets now!🎟️ https://t.co/8HrBsV0jItA massive first weekend for the action crime thriller 🔥#BoxOfficeKaSarkaar pic.twitter.com/QJgST28de0— Wall Poster Cinema (@walpostercinema) May 5, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

IPL 2025: కెప్టెన్‌గా ధోనిని అధిగమించిన శ్రేయస్ అయ్యర్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా మారిపోయాడు. ప్రస్తుత సీజన్లో పంజాబ్ కింగ్స్ సారధిగా వ్యవహరిస్తున్న అయ్యర్.. వివిధ జట్ల తరఫున (ఢిల్లీ, కేకేఆర్, పంజాబ్) 81 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 45 విజయాలు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో కనీసం 80 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన వారిలో శ్రేయస్‌దే అత్యధిక విజయాల శాతం.తాజాగా లక్నోపై విజయంతో (ధర్మశాల) ఐపీఎల్లో శ్రేయస్ విన్నింగ్ పర్సెంటేజీ 58.22కు చేరింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ అయిన ధోనిని శ్రేయస్ విన్నింగ్ పర్సెంటేజీ అంశంలో అధిగమించాడు. ఐదు సార్లు సీఎస్కేను ఛాంపియన్‌గా నిలబెట్టిన ధోని ప్రస్తుత సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో సీఎస్కేకు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్లో 6 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని కేవలం ఒకే ఒకే మ్యాచ్‌లో (లక్నోపై) తన జట్టును విజయపథాన నడిపించాడు.తాజా వైఫల్యాల తర్వాత కెప్టెన్‌గా ధోని ట్రాక్ రికార్డు అమాంతం పడిపోయింది. అతని విన్నింగ్ పర్సంటేజీ 58.82 నుంచి 57.75కి దిగజారింది. ఈ మధ్యలో వరుస విజయాలు సాధించిన శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా ధోనిని అధిగమించారు.ఈ సీజన్లోనే పంజాబ్ కెప్టెన్‌గా నియమితుడైన శ్రేయస్ తన జట్టుకు అపురూపమైన విజయాలు అందిస్తూ ప్లే ఆఫ్స్ దిశగా నడిపిస్తున్నాడు. ఈ సీజన్లో శ్రేయస్ నేతృత్వంలో పంజాబ్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలతో 15 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానాంలో కొనసాగుతుంది. 2014 సీజన్ తర్వాత పంజాబ్ ఓ సీజన్లో 15 పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. నిన్న మ్యాచ్ జరిగిన ధర్మశాలతో పంజాబ్ 12 ఏళ్ల తర్వాత గెలిచింది. ఈ సీజన్లో పంజాబ్ శ్రేయస్ కెప్టెన్సీలో గతానికి భిన్నంగా సాగుతోంది. పంజాబ్ ఇదే జోరును కొనసాగిస్తే వారి టైటిల్ కల నెరవేరుతుంది. గత సీజన్లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా, అంతకుముందు ఢిల్లీని రన్నరప్‌గా నిలబెట్టిన శ్రేయస్.. పంజాబ్ తలరాత మారుస్తాడేమో చూడాలి.ప్రస్తుత ఐపీఎల్ కెప్టెన్ల విజయాల శాతం..శ్రేయస్ అయ్యర్- 58.22 (81 మ్యాచ్‌లు)ధోని- 57.75 (232 మ్యాచ్‌లు)హార్దిక్ పాండ్యా- 60.00 (55 మ్యాచ్‌లు)రిషబ్ పంత్- 52.77 (54 మ్యాచ్‌లు)రహానే- 40.00 (36 మ్యాచ్‌లు)కమిన్స్- 46.15 (26 మ్యాచ్‌లు)శుభ్‌మన్ గిల్- 54.54 (22 మ్యాచ్‌లు)అక్షర్ పటేల్- 50.00 (11 మ్యాచ్‌లు)రజత్ పాటిదార్- 72.72 (11 మ్యాచ్‌లు)రియాన్ పరాగ్- 25.00 (8 మ్యాచ్‌లు)

కేఎల్ రాహుల్‌ను కలిసిన బీఆఎర్ఎస్ ఎమ్మెల్యే.. కుమార్తెకు ఓ ‘గిఫ్ట్’!
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC)తో తలపడనుంది. సొంత మైదానం ఉప్పల్‌లో అక్షర్ సేనను కమిన్స్ బృందం ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సాంకేతికంగా రైజర్స్‌కు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఒకవేళ సోమవారం నాటి మ్యాచ్‌లో గనుక ఢిల్లీ చేతిలో ఓడితే.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తర్వాత ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన మూడో జట్టుగా సన్‌రైజర్స్ నిలుస్తుంది. ఈ క్రమంలో కీలక పోరు కోసం కమిన్స్ బృందం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.కేఎల్ రాహుల్‌ను కలిసిన బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేమరోవైపు.. ఢిల్లీ జట్టు కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు అన్ని విధాలా సన్నద్ధమైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను కలిశారు.ఈ సందర్భంగా తన కుమార్తె శ్రీనికను కూడా కౌశిక్ రెడ్డి వెంట తీసుకువెళ్లారు. ఇక రాహుల్ కూడా ప్రేమ పూర్వకంగా నవ్వుతూ వీరిని పలకరించాడు. అదే విధంగా.. శ్రీనిక తీసుకువచ్చిన టీ-షర్టుపై తన ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. అంతేకాదు ముగ్గురు కలిసి సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఫొటోలు కూడా దిగారు.ఇందుకు సంబంధించిన వీడియోను పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఇంతకు ముందు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. అదే జట్టుకు ఆడుతున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను కూడా కౌశిక్ రెడ్డి కలిశారు.కాగా కౌశిక్ రెడ్డి కూడా క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. దేశీ క్రికెట్లో ఆయన హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు.అదరగొడుతున్న రాహుల్ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 సీజన్లో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 371 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 93 నాటౌట్. ఇక ఢిల్లీ జట్టు పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరింట గెలిచి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. కాగా తన భార్య అతియా శెట్టి తమ తొలి సంతానం ఇవారాకు జన్మనిచ్చిన నేపథ్యంలో రాహుల్ సీజన్లో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు.చదవండి: IPL 2025: ఈ పంత్ మనకొద్దు, పీకి పడేయండి సార్..! Had a great time with KL Rahul. I absolutely loved his outfit colour...PINK PERFECT 🩷@KLRAHUL@Kaushik @Shrinika@Cricket@PinkVibes pic.twitter.com/NI6Faiq5dD— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) May 5, 2025

IND vs ENG: బుమ్రాకు షాక్.. వైస్ కెప్టెన్‌గానూ అవుట్!
గత కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఇంగ్లండ్‌లో సత్తా చాటి పూర్వ వైభవం పొందాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు సీనియర్ టీమ్, భారత ‘ఎ’ జట్టు కోసం కలిపి ఇప్పటికే ప్రాథమికంగా 35 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. ఇందులో కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma)పేరు దాదాపుగా ఖరారు కాగా.. వైస్ కెప్టెన్ ఎవరన్న అంశంపై సందిగ్దం నెలకొంది.నిజానికి స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3-0తో క్లీన్‌స్వీప్, ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (BGT)ని చేజార్చుకున్న తర్వాత రోహిత్ టెస్టు భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అతడు విఫలం కావడంతో ఇక సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కెప్టెన్‌గానే కాదు.. వైస్ కెప్టెన్‌గానూ బుమ్రా అవుట్!ఈ నేపథ్యంలో రోహిత్ స్థానాన్ని పేస్ దళ నాయకుడు, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం రోహిత్‌నే కెప్టెన్‌గా కొనసాగించేందుకు మొగ్గు చూపిన బోర్డు.. బుమ్రా పేరును కనీసం వైస్ కెప్టెన్సీ రేసులోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఐదు టెస్టులకూ అందుబాటులో ఉండే ఆటగాడికే వైస్ కెప్టెన్ ఇవ్వాలని భావిస్తున్నాం.నిజానికి బుమ్రా ఈ పర్యటనలో అన్ని మ్యాచ్‌లు ఆడడు. కాబట్టి కెప్టెన్‌కు డిప్యూటీగా వేర్వేరు మ్యాచ్‌లలో వేర్వేరు ఆటగాళ్లను నియమించలేము. అందుకే ఐదు టెస్టులు ఆడే ఆటగాడినే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తాం’’ అని పేర్కొన్నాయి.గాయం తిరగబెట్టే అవకాశం!కాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఐదింట రెండు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు.. పేస్ దళం భారం మొత్తాన్ని బుమ్రానే మోశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2023-25 సీజన్లో ముప్పై రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కానీ ఈ సిరీస్‌లో భారత్ ఓడిపోయింది. మరోవైపు.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో బుమ్రా గాయపడ్డాడు.వెన్నునొప్పి తిరగబెట్టడంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకూ అతడు దూరమయ్యాడు. దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగానే న్నాడు.ఈ క్రమంలో బుమ్రా ఫిట్నెస్ దృష్ట్యా ఇంగ్లండ్‌లోనూ అతడిని వరుస మ్యాచ్‌లలో ఆడిస్తే మళ్లీ గాయం తిరగబెట్టే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.బుమ్రా వంటి విలువైన ఫాస్ట్ బౌలర్‌ను కాపాడుకోవాలంటే.. ఒక టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టు కోసం అతడికి విశ్రాంతినివ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై పనిభారం తగ్గించే విషయంలో సెలక్టర్లు కూడా ఓ నిర్ణయానికి వచ్చారని.. అందుకే వైస్ కెప్టెన్సీ రూపంలో అదనపు బాధ్యతల నుంచి కూడా తప్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.రేసులో ఆ మూడు పేర్లుఒకవేళ బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్ల ఎవరన్న చర్చ ఇప్పటికే మొదలైంది. రిషభ్ పంత్ లేదంటే.. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌ల పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, అసలే ఇంగ్లండ్‌తో టెస్టులు కాబట్టి యువ ఆటగాళ్ల వైపు మొగ్గుచూపకుండా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌లకు బోర్డు బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు. కాగా టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. మే 25న క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ జరుగనుండగా.. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.చదవండి: PBKS VS LSG: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్ పంత్

IPL 2025: ఈ పంత్ మనకొద్దు, పీకి పడేయండి సార్..! విసుగెత్తిపోయిన లక్నో అభిమానులు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ దారుణ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ సీజన్లో అతను ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 128 పరుగులు (99.22 స్ట్రయిక్ రేట్‌తో) మాత్రమే చేశాడు. నిన్న (మే 4) పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 18 పరుగులు చేసి అసాధారణ రీతిలో ఔటయ్యాడు.Bat goes in the air 🎙️🎙️pic.twitter.com/ySjmdC9qMm— CricTracker (@Cricketracker) May 4, 2025అజ్మతుల్లా బౌలింగ్‌లో ముందుకు వచ్చి భారీ షాట్‌కు ప్రయత్నించగా.. బ్యాట్ ఓ పక్క, బంతి ఓ పక్క గాల్లోకి లేచాయి. శశాంక్ సింగ్ క్యాచ్ పట్టడంతో పంత్ నిరాశగా పెవిలియన్‌కు వెనుదిరిగాడు. పంత్ విచిత్ర రీతిలో ఔటైన అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా కూడా చాలా దిగాలుగా, కోపంగా కనిపించాడు. Sanjiv Goenka Reaction After Rishabh Pant wicket 🥵#LSGvsPBKS #PBKSvsLSG pic.twitter.com/jUeuVlqz6n— MAHIPAL GURJAR (@Chikugurjar83) May 4, 2025ఈ పంత్ ఇక మారడా అన్నట్లు హావభావాలు పెట్టాడు. గొయెంకా ఎక్స్‌ప్రెషన్స్‌ను సోషల్‌మీడియాలో అభిమానులు మీమ్స్‌గా వాడుకుంటున్నారు. గొయెంకా ఓపిక నశించింది. ఇక పంత్‌కు బడిత పూజే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.మరోవైపు పంత్ వరుస వైఫల్యాల నేపథ్యంలో లక్నో అభిమానులు విసుగెత్తిపోయారు. ఈ పంత్ మనకొద్దు, తక్షణమే జట్టు నుంచి తొలగించండంటూ లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకాను అభ్యర్థిస్తున్నారు. పంత్‌పై రూ. 27 కోట్ల పెట్టుబడి సుద్ద దండగ అని కామెంట్లు చేస్తున్నారు. If you were Sanjiv Goenka, what would you have done?1. Release Rishabh Pant and invest 27cr into other players in auction2. Release Rishabh Pant and and buy him back for a cheaper price3. Reinvest 27 cr for another season? pic.twitter.com/xtPQ4jhOla— Dinda Academy (@academy_dinda) May 4, 2025కాగా, ఈ సీజన్ మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా పంత్ రికార్డుల్లోకెక్కాడు. అయితే ఈ సీజన్లో పంత్ తీసుకున్న డబ్బుకు కనీస న్యాయం కూడా చేయలేకపోతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో ఘెరంగా విఫలమై అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాడు. 2016లో అరంగేట్రం చేసిన తర్వాత ఐపీఎల్లో పంత్ ఇంత ఘోరమైన ప్రదర్శనలు ఎప్పుడూ చేయలేదు.ఈ సీజన్లో పంత్ కెప్టెన్‌గానూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. తొలి 6 మ్యాచ్‌ల్లో టాపార్డర్ ఆటగాళ్లు చెలరేగడంతో లక్నో 4 విజయాలు సాధించింది. అయితే గడిచిన ఐదు మ్యాచ్‌ల్లో టాపార్డర్ అంతంతమాత్రంగా ఆడుతుండటంతో పంత్ కెప్టెన్సీ లోపాలు బయటపడ్డాయి. చివరి ఐదు మ్యాచ్‌ల్లో లక్నో నాలుగింట ఓడింది. పంత్ జట్టును గెలిపించే ఒక్క మంచి నిర్ణయం కూడా తీసుకోలేకపోయాడు. పైగా బ్యాటింగ్ ఆర్డర్లో తనను తాను వెనక్కు పంపుకోవడం లాంటి చెత్త నిర్ణయాలు తీసుకున్నాడు. ఛాంపియన్ జట్టుకు కావాల్సిన అన్ని వనరులు ఉన్నా పంత్ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా ఇంతలా విఫలమవుతున్న పంత్‌పై యజమానిగా గొయెంకాకు కోపం రావడం సహజమే. పైగా పంత్ కోసం అతను కేఎల్ రాహుల్ లాంటి గొప్ప ప్లేయర్‌ను కాదనుకున్నాడు. లక్నో అభిమానుల బాధలోనూ అర్దముంది. జట్టు బాగాలేకపోతే ఏదో అనుకునే వారు. అన్నీ బాగున్నా జట్టును విజయపథంలో నడిపించలేకపోతే అది కెప్టెన్ వైఫల్యమే అవుతుంది. అందుకే వారు ఈ స్థాయిలో పంత్‌పై రియాక్ట్ అవుతున్నారు. కాగా, నిన్న (మే 4) రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో.. టాపార్డర్ ఘోరంగా విఫలం కావడంతో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆయుశ్ బదోని (40 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రతిఘటించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగలిగింది.ఈ ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లక్నో ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్‌లు గెలిచినా ఇతర జట్ల జయాపజయాలపై వారి ఫేట్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం లక్నో రన్ రేట్ (-0-469) కూడా చాలా తక్కువగా ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లలో ఈ ఒక్క జట్టు రన్‌రేట్ మాత్రమే మైనస్‌లో ఉంది. లక్నో ఒక వేళ మూడు మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కాలంటే భారీ తేడాతో గెలవాలి. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు (11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) ఉన్నాయి. పంజాబ్ చేతిలో ఓటమితో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది.
బిజినెస్

పడి లేచిన పసిడి ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో సోమవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,750 (22 క్యారెట్స్), రూ.95,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.220 పెరిగింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.200 పెరిగి రూ.87,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.220 పెరిగి రూ.95,880 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా సోమవారం వెండి ధర(Silver Prices)లు తిరోగమనం చెందాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,08,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ఎన్నడూ లేనంత ఆర్థిక అనిశ్చితి
ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గణనీయంగా తగ్గించేసింది. కరోనా సమయం కంటే అధిక అనిశ్చితి నెలకొన్నట్టు పేర్కొంది. ప్రపంచ జీడీపీ 2025లో 2.8 శాతం, 2026లో 3 శాతం చొప్పున వృద్ధి సాధిస్తుందని తాజాగా అంచనా వేసింది. యూరో ప్రాంతంలో వృద్ధి 2025లో 0.8 శాతం, 2026లో 1.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ఐఎంఎఫ్ విడుదల చేసిన గణాంకాలతో పోల్చి చూస్తే ప్రపంచ వృద్ధి అంచనా 0.5 శాతం తగ్గగా, యూరో ప్రాంతం వృద్ధి అంచనా 0.2 శాతం తక్కువ కావడం గమనార్హం. మూడు నెలల క్రితంతో పోలి్చతే మరింత అనిశ్చితుల్లో నేడు ప్రపంచం ఉన్నట్టు ఐఎంఎఫ్ తాజా నివేదిక పేర్కొంది. టారిఫ్‌లు, అనిశ్చితి..అమెరికా టారిఫ్ విధానాలను ఊహించలేకుండా ఉన్నామని ఐఎంఎఫ్ తెలిపింది. 2025 ఏప్రిల్ 2 లిబరేషన్ డే అన్నది ఆధునిక ప్రపంచంలో అతిపెద్ద టారిఫ్‌ల పెంపుగా నిలిచిపోతుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల పెంపునకు 90 రోజుల విరామం ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ తర్వాత పరిస్థితి ఏంటన్న సందేహాన్ని వ్యక్తం చేసింది. వచ్చే డిసెంబర్, రెండేళ్ల తర్వాత పరిస్థితి ఏంటి? చైనా–అమెరికా మధ్య టారిఫ్‌ల పోరు ఎంత కాలం పాటు కొనసాగుతుంది? వీటికి సమాధానాలు ఎవరికీ తెలియవంటూ ఐఎంఎఫ్ నిట్టూర్చింది. ఐఎంఎఫ్ ప్రపంచ వాణిజ్య అశ్చితి సూచీ 2024 అక్టోబర్ నాటితో పోలిస్తే ఏడు రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఇది కరోనా విపత్తు నాటితో పోల్చినా గరిష్టానికి చేరింది. టారిఫ్‌ల కారణంగా కంపెనీలు తమ తయారీ చైన్‌ను పునర్వ్యవస్థీకరించుకోవాల్సి ఉంటుందని, వినియోగదారులు ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వైపు చూడొచ్చని ఐఎంఎఫ్ నివేదిక తెలిపింది. ఆర్థిక అస్థిరత..టారిఫ్‌లు, ప్రణాళికలు తరచూ మారిపోతుండడం ఫైనాన్షియల్ మార్కెట్లలో పెద్ద ఎత్తున అస్థిరతకు దారితీస్తుందని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా నాటి స్థాయి అనిశ్చితులను ఫైనాన్షియల్ మార్కెట్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ‘ఐదేళ్ల క్రితం అమెరికా రుణ భారంతో అనిశ్చితులు పెరిగాయి. రక్షణాత్మక ధోరణితో ఇన్వెస్టర్లు అధిక రిస్క్‌తో కూడిన సాధనాల్లో (ఈక్విటీ) అమ్మకాలు చేసి, బంగారం, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితిని చూస్తున్నాం. యూఎస్ బాండ్ల ధరలు లిబరేషన్ డే నాటి నుంచి తగ్గిపోయాయి. అంటే ఇన్వెస్టర్లు వాటిని విక్రయిస్తున్నారు. అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలను సురక్షిత పెట్టుబడి సాధనంగా మార్కెట్లు భావించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్, అమెరికా రుణానికి ఉన్న పాత్రను దృష్టిలో పెట్టుకుని చూస్తే, భవిష్యత్తులో మరింత ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చు’ అని ఐఎంఎఫ్ తెలిపింది.ఇదీ చదవండి: అనిశ్చితిని ఎలా ఎదుర్కోవాలి?కరోనా సమయంలో ఉత్పత్తి కార్యకలాపాలను బలవంతంగా నిలిపివేయాల్సి రావడంతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అవరోధాలు ఏర్పడగా.. నేడు టారిఫ్‌ల కారణంగా అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినట్లు పేర్కొంది. నేడు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితులకు ఎలాంటి వైరస్ కారణం కాదంటూ.. ట్రంప్ సలహాదారులు అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోణంలో వీటికి కారణమవుతున్నట్టు తెలిపింది.

లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 10:16 సమయానికి నిఫ్టీ(Nifty) 132 పాయింట్లు పెరిగి 24,478కు చేరింది. సెన్సెక్స్(Sensex) 391 పాయింట్లు పుంజుకుని 80,891 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.67 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 59.06 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.3 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.47 శాతం లాభపడింది. నాస్డాక్ 1.51 శాతం ఎగబాకింది.ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడుతుంది. ఇండియా-పాక్ ఉద్రిక్తతలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. దీంతోపాటు అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ను మార్కెట్లు గమనిస్తున్నాయి. తగ్గిన చమురు ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

అనిశ్చితిని ఎలా ఎదుర్కోవాలి?
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను నిబంధనలు అమల్లోకి వచ్చాయని విన్నాను. ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్ పరిమితుల్లోనూ మార్పులు చేసినట్టు తెలిసింది. సీనియర్ సిటిజన్‌గా (60 ఏళ్లకు పైన) నాకు డెట్ సాధనాలపై వస్తున్న వడ్డీ ఆదాయమే ప్రధానంగా ఉంది. కాబట్టి ఆదాయపన్ను మార్పుల ప్రభావం నాపై ఏ మేరకు ఉంటుంది? – వినోద్ బాబుకొత్త విధానం కింద ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్‌లో మార్పులు చోటుచేసుకున్నాయన్నది నిజమే. టీడీఎస్ పరిమితిని సీనియర్, నాన్ సీనియర్ సిటిజన్లకూ (60 ఏళ్లలోపు) తగ్గించారు. సీనియర్ సిటిజన్స్‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు ఉంది. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెరిగింది. ఆదాయం ఈ లోపు ఉంటే టీడీఎస్ వర్తించదు. నాన్ సీనియర్ సిటిజన్స్‌కు రూ.40,000గా ఉన్న పరిమితి రూ.50,000కు పెరిగింది. అంటే వడ్డీ ఆదాయం రూ.50వేలు మించినప్పుడే టీడీఎస్ వర్తిస్తుంది. అద్దె ఆదాయంపై టీడీఎస్ అమలును రూ.2.4 లక్షల పరిమితి నుంచి రూ.6లక్షలకు పెంచారు. ఇది పన్ను చెల్లింపుదారులందరికీ వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయం రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచారు. అంటే ఫండ్స్ నుంచి డివిడెండ్ ఆదాయం రూ.10,000 మించినప్పుడే టీడీఎస్ అమలవుతుంది. కొత్త పన్ను విధానంలో ఆదాయపన్ను శ్లాబుల్లోనూ మార్పులు జరిగాయి. మొత్తం ఆదాయం రూ.12లక్షల వరకు ఉంటే సెక్షన్ 87ఏ కింద రాయితీ ప్రయోజనంతో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్ నుంచి వచ్చే మూలధన లాభాలు కూడా రూ.12 లక్షల ఆదాయంలోపే ఉన్నప్పటికీ.. మూలధన లాభాలపై విడిగా పన్ను చెల్లించడం తప్పనిసరి. ఇదీ చదవండి: రేట్ల తగ్గింపు ప్రతికూలం!మార్కెట్లు అస్థిరతంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు ఎలా ఎదుర్కోవాలి? – ఉషమార్కెట్లలో అస్థిరతలు సహజమే. ఇప్పుడనే కాదు.. గతంలోనూ ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ఆటుపోట్లను చూశాం. భవిష్యత్తులో మరింత ఎక్కువగా ఉండొచ్చు. గడిచిన ఐదు, పదేళ్ల కాలంలో ఇదే ధోరణి కనిపిస్తోంది. వీటిని ఎదుర్కొనే విధంగా ఇన్వెస్టర్ల పెట్టబడుల ప్రణాళిక ఉండాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాల్సి ఉంటుంది. ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌తో కుటుంబానికి ఆర్థిక, ఆరోగ్య రక్షణ కలి్పంచుకోవాలి. ఊహించని అవసరాలు ఏర్పడితే ఈక్విటీ పెట్టబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి అయి ఉండాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అస్థిరతల నుంచి గరిష్ట ప్రయోజనాన్ని పొందొచ్చు. రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్ కరెక్షన్లలో మంచి పెట్టుబడుల అవకాశాలు వస్తుంటాయి. వీటిని అనుకూలంగా మలుచుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌక ధరల వద్ద కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా దీర్ఘకాలంలో రాబడులను పెంచుకోవచ్చు.ధీరేంద్ర కుమార్సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
ఫ్యామిలీ

మిస్ వరల్డ్‌తో మోక్షం.!
బంజారాహిల్స్: ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ సిటీ ముస్తాబవుతోంది. మే 7 నుంచి 31 వరకు హైటెక్స్‌లో జరిగే పోటీల కోసం సుందరాంగులు నగరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరాన్ని సుందరీకరించే దిశలో వివిధ శాఖలు సమన్వయంతో ముందుకుసాగుతున్నాయి. ముఖ్యంగా అందగత్తెలు రాకపోకలు సాగించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన ట్రాన్స్ఫార్మర్లు, వేలాడుతున్న వైర్లు, తుప్పుబట్టిన కరెంటు స్తంభాల తొలగింపు, మరమ్మతులు చేస్తోంది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సబ్స్టేషన్ల పరిధిలో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు, లైన్మెన్లు, సిబ్బంది ఆదివారం మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఈనెల 18న సుందరాంగులు రానున్న నేపథ్యంలో ఈ రోడ్డులో శిథిలావస్థకు చేరిన 12 ట్రాన్స్ఫార్మర్లను మార్చారు. తుప్పుబట్టిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్తవి వేశారు. వేలాడుతున్న కేబుల్ వైర్లను సరిజేశారు. ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేస్తున్న సుందరాంగులు తమ షెడ్యూల్లో భాగంగా వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. అలాగే పోటీలు జరిగే హైటెక్స్‌కు కూడా ఈ ప్రాంతాల నుంచే వెళ్తారు. ఇక్కడ ఉన్న స్టార్ హోటళ్లలోనే వారంతా బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు గత వారం రోజులుగా సుందరాంగులు రాకపోకలు సాగించే, పర్యటించే ప్రాంతాలను సర్వే చేశారు. రోడ్డు మార్గంలో వెళ్లే క్రమంలో ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్లు శిథిలావస్థకు చేరాయో వాటిని గుర్తించారు. ఓవైపు ఒరిగిన ట్రాన్స్ఫార్మర్ల జాబితాను తయారు చేశారు. దీని ఆధారంగానే ఆదివారం నుంచి మరమ్మతులు చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. టీజీఎస్పీడీసీఎల్ ఫిలింనగర్ సబ్‌స్టేషన్ ఏఈ పవిత్ర పర్యవేక్షణలో 30 మంది సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. దాదాపు అన్ని సబ్స్టేషన్ల పరిధిలోనూ పనులు చేస్తున్నారు. ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు

ఊ(రి)ట బావులు : అంతుచిక్కని రహస్యాలు?
ఒకప్పుడు మంచి నీరు కావాలంటే బావికి వెళ్లాల్సిందే. తెల్లారితే చాలు గ్రామాలు, చిన్నపాటి పట్టణాల్లో కావిడి భుజాన వేసుకుని, చేతిలో చేద పట్టుకుని వీధుల నిండా జనం కనిపించేవారు. ఊరంతటికీ మంచినీటి బావి ఒకటుండేది. అక్కడకు వెళ్లే అందరూ మంచినీరు తెచ్చుకునే వారు. బావి లేని ఊరుండేది కాదు. రానురానూ బోర్లు, మంచినీటి పథకాలు అందుబాటులోకి వచ్చాక చాలా వరకూ బావులు కనుమరుగైపోయాయి. మంచినీటి మాట అటుంచితే కనీసం వాడుకలో కూడా లేకుండా పోయాయి. బావులు అంటే ఏమిటో భావితరాలకు తెలియని రీతిలో కనుమరుగయ్యాయి. కానీ చరిత్రలో తాము ఉన్నామంటూ కొన్ని బావులు మాత్రం ఇప్పటికీ ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. ఒక్కో బావి చుట్టూ ఒ క్కో విశ్వాసం పెనవేసుకుపోయింది. దీంతో ఆ బావుల్లో నమ్మకాల ఊట ఇప్పటికీ ఊరుతూనే ఉంది. అలాంటి బావులివి..గో.. - పిఠాపురంబొటన బావి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలవాడ తిరుపతి క్షేత్రంలోని శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయంలో ఉంది. సుమారు 9 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ నిర్మాణమంతా ఈ బావి నీటితోనే చేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆలయానికి ఆగ్నేయ మూలలో చతురస్రాకారంలో ఈ బావి ఉంది. చుట్టూ రాళ్లు పేర్చి చేసిన ఈ నేలబావి నిర్మాణం వింత గొలుపుతుంది. ఈ బావి నీటితోనే ఆలయంలోని మూలవిరాట్టుకు అభిషేకాలు నిర్వహిస్తూంటారు. ఈ బావిలోని నీటితో స్నానం చేసి, స్వామిని దర్శించుకుని, మొక్కుకుంటే కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం వంటి కోరికలు తీరుతాయని పలువు రు విశ్వసిస్తారు. కార్తిక మాసంలో ఈ బావి నీటితో స్నానం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. కార్తిక పౌర్ణమి నాడయితే మరింత ప్రాశస్త్యమని చెబుతారు. అది కూడా అర్చకులతో నీరు తోడించుకుని స్నానం చేస్తూంటారు. చైత్రం, శ్రావణం, ధనుర్మాసాల్లో భక్తులే స్వయంగా స్నానం చేస్తారు. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ బావి నీటిని సీసాల్లో నింపి, తీర్థంలా తమతో తీసుకుని వెళ్లి, మామూలు నీటితో కలిపి స్నానం చేస్తారు. ఎంత వర్షాభావ పరిస్థితులున్నా ఎప్పుడూ ఈ బావి ఎండిన ఆనవాళ్లు లేవని స్థానికులు చెబుతారు. ఎంత నీరు తోడినా ఈ బావి ఎప్పుడూ నిండుకుండలా కళకళలాడుతూంటుంది.ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుగొల్లగుంట నుయ్యి కాకినాడ జిల్లాలో మండల కేంద్రమైన ఉప్పాడ కొత్తపల్లిలో ఈ బావి పూర్వం నుంచీ పేరెన్నికగన్నది. గతంలో కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, వాకతిప్ప గ్రామాలకు ఇదే మంచినీటి బావి. ఈ మూడు గ్రామాల ప్రజలు ఈ బావి నుంచే మంచినీరు తెచ్చుకునే వారు. వందల ఏళ్ల నాటి ఈ బావి నుంచే పిఠాపురం మహారాజా వారి సంస్థానానికి గుర్రపు బగ్గీలపై మంచినీరు తీసుకెళ్లేవారని పెద్దలు చెబుతారు. సముద్ర తీరం దగ్గరలో ఉన్న ఈ గ్రామాల్లో ఎక్కడ తవ్వినా ఉప్పు నీరే పడగా ఈ బావిలో మాత్రమే మంచినీరు.. అదీ కొబ్బరి నీళ్లలా ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలందరూ దీనినే మంచినీటికి ఉపయోగించే వారు. ఎంతమంది ఎన్ని నీళ్లు తోడుకున్నా ఈ బావి ఎప్పుడూ ఎండిపోకపోవడం విశేషంగా చెబుతారు. ఎన్ని రకాల మంచినీటి పథకాలు వచ్చినా ఇప్పటికీ కొందరు ఈ బావి నీటినే తాగుతూంటారు.కవలల బావి తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పాత దొడ్డిగుంట గ్రామంలోని బావి కవల పిల్లల బావిగా పేరొందింది. ఈ బావి నీరు తాగితే కవల పిల్లలు పుడతారనే నమ్మకం పలువురిలో బలంగా ఉంది. ఈ గ్రామంలో ఏకంగా 110 మందికి పైగా కవల పిల్లలు పుట్టడమే దీనికి నిదర్శనమని చెబుతారు. ఈ గ్రామంలో ఆరు నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముసలివాళ్ల వరకూ కవలలున్నారు. గతంలో మూర్తి అనే ఒక ఉపాధ్యాయుడు గ్రామంలో జనాభా లెక్కల కోసం రాగా ఎక్కువగా కవల పిల్లలుండటం చూసి ఆశ్చర్యపోయారు. కొన్నాళ్లకు ఆయన అదే గ్రామానికి ఉపాధ్యాయుడిగా వచ్చి, అక్కడే నివాసం ఉన్నారు. కొద్ది రోజులకు ఆయనకు కూడా కవల పిల్లలు పుట్టారు. దీంతో, ఆ గ్రామంలోని బావి నీరు తాగడంతో కవల పిల్లలు పుడుతున్నారని అందరికీ చెప్పడంతో అప్పటి నుంచీ ఇది కవల పిల్లల బావిగా పేరొందింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచమంతా ఈ బావి పేరు మార్మోగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం జనం వచ్చి ఈ బావి నీటిని తీసుకెళ్తున్నారంటే ఎంతగా పేరొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా కవలలు ఎక్కువగా ఉండడం వల్లే తమ ఊరికి గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు.నిండు కుండలా.. సామర్లకోటలోని మాండవ్య నారాయణస్వామి వారి ఆలయంలో ఉన్న పురాతన బావి ఎప్పుడూ నిండుకుండలా ఉంటుంది. మామూలు బావుల్లో వేసవిలో నీరు అడుగంటుతూంటుంది. కనీసం నీరు తగ్గుతుంది. కానీ ఈ బావిలో నీరు ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.బావి నీరు వల్లే కవలలు మా గ్రామంలోని బావి నీరు తాగడం వల్లే కవలలు పుడుతున్నారన్నది మా నమ్మకం. ఎక్కువ మంది కవలలు ఒకే గ్రామంలో పుట్టడం అరుదుగా ఉంటుంది. అలా మా గ్రామంలో వంద మందికి పైగా కవలలు పుట్టారంటే దీనికి కారణం మా గ్రామంలోని బావి నీరేనని అందరూ నమ్ముతున్నారు. మాకు కవలలే పుట్టారు. గతంలో చాలా మంది నమ్మేవారు కాదు. కానీ, ఈ బావి నీరు తీసుకెళ్లిన దూర ప్రాంతాల వాళ్లకు కూడా కవలలు జన్మించినట్లు చెబుతూండటంతో అందరూ ఈ విషయం నమ్మి తీరుతున్నారు. – అడబాల రామదాసు, కవల పిల్లల తండ్రి, దొడ్డిగుంట, రంగంపేట మండలంకోరికలు తీర్చే బావిగా నానుడి మా ఊరి గుడిలోని బొటన బావి నీటితో స్నానం చేసి, స్వామిని దర్శించుకుని, మొక్కుకుంటే కోరికలు తీరుతాయనే నమ్మకం భక్తుల్లో ఉంది. అలా కోరికలు తీరిన వారు మా గ్రామంలో చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడకు దర్శనానికి వచ్చేవారు తప్పకుండా ఈ బావి నీటితో స్నానం చేయడం లేదా తాగడం చేస్తారు. తమతో పాటు నీటిని తీసుకెళతారు. ఈ బావి నీటిని స్వామి వారి తీర్థంగా భావిస్తారు. అంత పవిత్రంగా చూస్తారు. కోరిన కోర్కెలు తీరాక వచ్చి, స్వామి వారికి తులాభారాలు ఇస్తూంటారు. – కూనపురెడ్డి కోదండ రామయ్య, తిరుపతి, పెద్దాపురం మండలంఅపోహే.. ఇదిలా జరుగుతుందని మానసికంగా అపోహపడటం తప్ప బావి నీరు తాగడం వల్ల కవల పిల్లలు పుట్టడం, సంతానం కలగడం వంటివి ఉండవు. సంతాన ఉత్పత్తి జన్యుపరంగా జరుగుతుంది. మానసికంగా ఒక నమ్మకం కలిగించుకుంటారు తప్ప వాటి వల్ల ఎలాంటి సంతానం కలిగే అవకాశం శాస్త్రీయంగా లేదు. – డాక్టర్ కాటన్, మానసిక వైద్యుడు, జీజీహెచ్, కాకినాడచదవండి: Yoga: ఎమోషషన్స్‌ను బ్యాలెన్స్ చేసే యోగాసనం ఏదో తెలుసా?బావి నీటి వల్ల కాదు కవలలు పుట్టడం, సంతానం కలగడం వంటివి భార్యాభర్తల మధ్య జన్యుపరంగా జరిగేవే. బావి నీటి వల్ల కాదు. అలాగైతే పూర్వం అన్ని గ్రామాల్లో బావులుండేవి. అందరికీ కవలలు పుట్టాలి కదా! ఇదంతా ఒక నమ్మకం మాత్రమే. ఎక్కువగా ఆడపిల్ల ఇంట్లో కవలలు పుట్టిన వారు ఉంటే ఆ కుటుంబంలో మిగిలిన వారికి కవలలు పుట్టే అవకాశం ఉంటుంది. దొడ్డిగుంటలో ఇదే జరిగి ఉండవచ్చు. కేవలం రెండు అండాలు విడుదలవ్వడం వల్ల మాత్రమే కవలలు జన్మిస్తూంటారు. అంతే తప్ప బావి నీరు తాగడం వల్ల మాత్రం కాదు. – డాక్టర్ అనిత, గైనకాలజిస్టు, పిఠాపురం

Inspiration దశరథుడి మంత్రి మండలి
రాచరికాలు నడిచిన ప్రాచీన కాలంలో కూడా సమర్థులైన పాలకులెవరూ నిరంకుశులుగా, నియంతలుగా, కేవలం తమ ఇచ్చ వచ్చినట్టు పరిపాలించటం ఉండేది కాదు. మన పురాణేతిహాసాలలో ప్రసిద్ధులైన రాజులందరూ, రాజ్య పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలను, మేధావులయిన తమ మంత్రుల బృందాలతోనూ, ఇతర నిపుణులతోనూ, అవసరమయితే పౌర ప్రముఖులతోనూ, సామంతులతోనూ, జానపదులతోనూ విస్తృతంగా చర్చించిన తరవాతే తీసుకొనేవాళ్ళని కనిపిస్తుంది. అల్పబుద్ధులూ, ఆసురీ స్వభావులు మాత్రమే అధికార మదాంధకారంతో ధర్మాధర్మ విచక్షణ లేకుండా, నిరంకుశంగా, ఇష్టారాజ్యంగా పాలించి, అందరినీ అవస్థలు పెట్టి, అపయశస్సు కూడగట్టుకొని, ఆయువు తీరగానే కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళు.దశరథుడు అరవయి వేల సంవత్సరాలపాటు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలన చేశాడని రామాయణం చెబుతుంది. ఏ కీలక నిర్ణయమైనా, ఆయన సంబంధితులందరితో విస్తృతంగా చర్చించిగానీ తీసుకొనేవాడు కాదు అని వాల్మీకి వక్కాణించాడు. దశరథుడికి ఒక సమర్థమైన మంత్రిమండలి ఉండేది. వాళ్ళలో ప్రధానమైన మంత్రులు ఎనిమిది మంది: ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వీళ్ళుగాక, దశరథుడికి వసిష్ఠుడు, వామదేవుడు ముఖ్య పురోహితులుగా, ధర్మ నిర్దేశకులుగా, గురువులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ నేపథ్యం గురించి ఎంతో పరిశోధన జరిపించిన తరవాతే, దశ రథుడు తన మంత్రులను నియమించుకొనేవాడు. వాళ్ళు ఎన్నో పరీక్షలు నెగ్గవలసి ఉండేది. అందుకే ఆ మంత్రులందరూ పరువు ప్రతిష్ఠలు కలవారుగా, సంస్కా రులుగా, శాస్త్ర జ్ఞాన నిష్ణాతులుగా ఉండేవారు. వాళ్ళు కుశాగ్ర బుద్ధులు, విద్యావంతులు, లోకజ్ఞులు, నీతి వేత్తలు. ఎప్పుడూ రాజు శ్రేయస్సునూ, రాజ్య శ్రేయస్సునూ కాంక్షించే నిస్వార్థపరులు, నిజాయతీపరులు. అపరాధులయితే, సొంత పుత్రుల నయినా నియమానుసారం దండించే నిష్పక్షపాతులు. ఇంతటి నిపుణులతో, నీతిమంతులతో, ధర్మజ్ఞులతో అన్ని విషయాలూ కూలంకషంగా చర్చించిన తరవాతే అన్ని ముఖ్యమైన నిర్ణయాలూ తీసుకోవటం జరిగేది. కనకనే దశరథుడి సుదీర్ఘ పాలనలో ప్రజలంతా ధర్మమార్గంలో తృప్తిగా, సుఖశాంతులతో జీవించారు అని వాల్మీకి రామాయణం వర్ణిస్తుంది.– ఎం. మారుతి శాస్త్రి

నోని కీర్తికి స్త్రీ శక్తి పురస్కారం
‘పరిశ్రమ స్థాపించిన ప్రతి మహిళ వెనుక ఒక కథ ఉంటుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ’ అని చెక్ బయో ఆర్గానిక్స్ కో–ఫౌండర్ కీర్తి అంటున్నారు. ఇటీవల నగరంలోని నోవోటెల్ హోటల్ వేదికగా స్త్రీ శక్తి పురస్కార ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఎంటర్టైన్మెంట్, బ్యూటీ, టూరిజమ్, వైద్యం, ఎంటర్ప్రెన్యూర్ వంటి వివిధ విభాగాల్లో 30 మంది మహిళలు పురస్కారాలను అందుకున్నారు. వారిలో చెకోటి కీర్తి రెడ్డి ఎంటర్ప్రెన్యూర్ జర్నీ వైవిధ్యమైనది. ఆమె ఏనాడూ ఒక పారిశ్రామికవేత్త కావాలని కల కనలేదు. కంప్యూటర్ రంగాన్ని ఎంచుకున్న కీర్తి, హైదరాబాద్‌కి కంప్యూటర్ పరిచయమైన తొలినాళ్లలో కోచింగ్ సెంటర్ నిర్వహించారు. కానీ జీవితం ఆమెను వ్యవసాయం, పరిశ్రమల రంగం వైపు నడిపించింది. పరిశ్రమను నడిపించడంలో ఆమె పాటించిన నియమాలే ఆమెను తన రంగంలో వన్ అండ్ ఓన్లీగా నిలిపాయి. ‘రైతు నేస్తం, ఏరువాక, నాచురల్ హెల్త్ సైన్స్ అసోసియేషన్ అవార్డు, ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్’ పురస్కారాలు ఆమెకు గతంలో గుర్తింపునిచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ వేదికగా ప్రకటించిన ‘నారీశక్తి’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆ కీర్తి ప్రస్తుతం స్త్రీ శక్తి పురస్కారం అందుకుని మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచారు. పాతిక ఉత్పత్తులకు ప్రభుత్వ అనుమతులు..‘తొగర చెట్టు.. ప్రకృతి మనదేశానికి అందించిన వరం. సంజీవని వంటి తొగర పండు మీద పాశ్చాత్య దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. కానీ ఆ చల్లటి వాతావరణంలో ఈ చెట్లు మనలేవు. మా కుటుంబ సభ్యులకు నోని ఫ్రూట్ ఔషధంగా పని చేయడంతో నేను ఆ పండు మీద అధ్యయనం మొదలుపెట్టాను. దీని కోసం పొలం కొని పంట వేశాను. పండ్లతో జ్యూస్‌లు, లోషన్, షాంపూ, హెయిర్ ఆయిల్ వంటి పాతిక ఉత్పత్తులకు ప్రభుత్వ అనుమతులు లభించాయి. కేవలం పరిశ్రమ నిర్వహణ మాత్రమే కాకుండా వ్యవసాయం, ఆరోగ్యం కలగలిసి ఉండడంతో నాకు ‘ఫార్మర్స్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ వెల్నెస్ ప్రోడక్ట్స్’ విభాగంలో ఈ పురస్కారం లభించింది. నోని పండు మీద చేసిన పరిశోధనల కారణంగా ‘నోని కీర్తి’ నయ్యాను. ఈ స్త్రీ శక్తి పురస్కారం ఎంపిక ప్రక్రియలో దేశ విదేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు పాతిక మంది పాల్గొన్నారు. జ్యూరీ సభ్యులు పురస్కార గ్రహీతలను జూమ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారు’ అని వివరించారు కీర్తిరెడ్డి. ఈ కార్యక్రమంలో 30 మంది మహిళలు స్త్రీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. వీరితోపాటు తెలంగాణ సంప్రదాయ గోంద్లడ్డు, నారాయణపేట చీరలు, టెర్రకోట బొమ్మలు వంటి హస్తకళాకృతులను తయారు చేస్తున్న ఐదుగురు గ్రామీణ, ఆదివాసీ మహిళలు స్త్రీ రత్న పురస్కారాలను అందుకున్నారు. (చదవండి: అందాల తారల ఆగమనం..)
ఫొటోలు
అంతర్జాతీయం

మాకు కావాల్సింది భాగస్వాములు.. బోధకులు కాదు: జై శంకర్
న్యూఢిల్లీ: యూరోపియన్ దేశాలపై భారత విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ధ్వజమెత్తారు జైశంంకర్. యూరోపియన్ దేశాలు భారత భౌగోళిక రాజకీయ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శలు చేశారు. భారతదేశానికి భాగస్వాములు కావాలని, అంతే కానీ బోధకులు అవసరం లేదని చురకలంటిచారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరిగిన ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఐస్లాండ్ మాజీ అధ్యక్షుడు గ్రిమ్సన్ తదితరులతో జరిగిన చర్చావేదికలో యూరప్ తీరును జైశంకర్ బహిర్గతం చేశారు. యూరప్ దేశాల నుంచి భారత్ ఏం కోరుకుంటుదని అడిగిన ప్రశ్నలో భాగంగా జై శంకర్ఇలా సమాధానమిచ్చారు. ‘మనం ప్రపంచాన్ని చూసినప్పుడు, భాగస్వాముల కోసం చూస్తాం. ముఖ్యంగా కొన్ని విదేశాలు చాలా బోధనలు చేస్తారు, వాటిని సొంత దేశంలో ఆచరించరు. కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికీ ఈ సమస్యతో పోరాడుతున్నాయని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు.ఇప్పుడు యూరప్ దేశాలు వాస్తవిక వైపు అడుగులు వేయగలరా లేదా అనేది చూడాలి. మనం భాగస్వామ్యాన్ని చేసుకోవాలంటే, కొంత అవగాహన ఉండాలి, కొంత సున్నితత్వం ఉండాలి, పరస్పర ప్రయోజనాల పట్ల అవగాహ ఉండాలి, ప్రపంచం ఎలా పనిచేస్తుందో గ్రహించాలి, ఈ విషయంలో కొన్ని యూరప్ దేశాలు సమర్థవంతంగా ఉండగా, మరికొన్ని వెనుకబడి ఉన్నాయన్నారు.గతంలో కూడా యూరప్ దేశాల తీరుపై జైశంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి సమస్యల్ని ప్రపంచ సమస్యలుగా చూపిస్తారని, ప్రపంచ సమస్యల్ని మాత్రం వారు పట్టించుకోరంటూ వ్యాఖ్యలు చేశారు.

‘మీరు యుద్ధంలో పాల్గొంటారా?.. లేదు.. ఇంగ్లండ్ పారిపోతా’
కరాచీ: తమపై భారత్ యుద్ధానికి దిగితే ఏంటనే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ లో కనిపిస్తోంది. భారత్ తో పోరాడే పూర్తి శక్తి సామర్థ్యాలు ఏ రకంగా చూసే పాక్ కు లేవు. పైకి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ నిజంగా భారత్ యుద్ధానికి దిగితే మాత్రం తమకు చుక్కలే కనిపిస్తాయనే భావన కొందరి నాయకుల్లో కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఒక పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. ఒకవేళ తమతో భారత్ యుద్ధానికి దిగితే తాను ఇంగ్లండ్ కు పారిపోతానంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ఎంపీ సరదాగా చేసినా సీరియస్ గా ఈ వ్యాఖ్యలు చేసినా ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చేతగాని ప్రభుత్వంగానేఅభివర్ణించినట్లు ఆయన మాటల్లో కనబడుతోంది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి చెందిన ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక లోకల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సదరు ఎంపీ ఈ కామెంట్స్ చేశారు. పాక్ పై భారత్ యుద్ధానికి దిగితే మాత్రం తాను ఇంగ్లండ్ వెళ్లిపోతానంటూ తేల్చిచెప్పారు.ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని వెనక్కి తగ్గమని చెప్పొచ్చు కదా.. అని అడిగిన మరో ప్రశ్నకు ‘నేను చెబితే వినడానికి.. మోదీ జీ ఏమైనా మా బంధువా.? అంటూ చమత్కరించారు ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్.Pakistaniyon ki fat ke char ho gayi hai🧵Journalist : Aapko nahi lagta Modi ko thoda pichhe hatna chahiyeSher Afzal Khan Marwat, a lawyer and senior #PTI leader : Modi kya meri Khala ka beta hai, jo mere kehne pe ruk jayega😂Journalist : Agar india ne attack kar diya to?… pic.twitter.com/jNu5H3lzQ1— KashmirFact (@Kashmir_Fact) April 30, 2025 ప్రస్తుతం పాక్ జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్. పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) తరఫున ఆయన ఎంపీగా ఉన్నారు. గతంలో అంటే ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ఎంపీ హవా నడిచేది. పీటీఐలో కీలకంగా వ్యవహరించేవారు షెర్ ఆఫ్జల్ ఖాన్,.గత కొన్నినెలలుగా ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు అఫ్జల్ ఖాన్,. ఈ క్రమంలోనే భారత్ తో యుద్ధాన్ని పాక్ తట్టుకోలేదనే సంకేతం వచ్చేలా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఎంపీ అఫ్జల్ ఖాన్.

అదే జరిగితే.. భారత్‌కు పాక్ మరోసారి అణు బెదిరింపులు
మాస్కో: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపడుతున్న చర్యలు.. పాక్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తాజాగా రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ అణు బూచిని భారత్‌కు చూపించి బెదిరించే యత్నం చేశారు. ఒక వేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రష్యా ఛానల్ ఆర్టీకి ఇంటర్వ్యూ ఇస్తూ.. భారత్‌కు చెందిన బాధ్యతారాహిత్య మీడియా నుంచి వస్తున్న ప్రకటనలు మమ్మల్ని తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయి. ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసింది. ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే ప్రజల మద్దతుతో మా సంప్రదాయ, అణు బలంతో పూర్తిస్థాయిలో స్పందిస్తాం’’ అని జమాలీ పేర్కొన్నారు. గత వారం ఆ దేశ రైల్వేశాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న ఘజన్నవీ, ఘోరీ, షహీన్ క్షిపణులు, 130 అణ్వాయుధాలు భారత్ కోసమే ఉంచినట్లు ప్రకటించారు. పాక్ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్ లోయలో దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ టెర్రరిస్టులు పాక్ జాతీయులని తేలింది. దీంతో భారత్ ప్రతిచర్యలకు దిగింది. ఇప్పటికే సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్‌కు భారత్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులు, ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకొనే విషయంలో భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్కడ, ఎప్పుడు ఎలా దెబ్బకొట్టాలో వారే నిర్ణయిస్తారన్నారు. సైనిక చర్య కూడా ఉండొచ్చన్న ఆందోళనతో.. యుద్ధం వస్తే తాము అణ్వాయుధాలు వాడతామంటూ పాక్ ప్రకటనలు గుప్పిస్తోంది.

భారత్‌తో టెన్షన్ వేళ పాక్‌కు షాక్.. ఊహించని దెబ్బకొట్టిన బీఏల్ఏ
క్వెట్టా: పహల్గాం ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ సైన్యానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఊహించని షాక్ తగిలింది. పాక్ సైన్యానికి సవాల్ విసురుతూ కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా పట్టుకుంది. అలాగే, బీఎల్ఏ బలగాలు.. క్వెట్టా నగరం దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యాన్ని టార్గెట్ చేసిన బీఎల్ఏ దాడులు చేసింది. ఇక, తాజాగా పాక్ సైన్యంపై తిరుగుబాటు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ సవాల్ విసిరింది. కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. బీఎల్ఏకు చెందిన అత్యంత క్రూరమైన, ప్రత్యేక శిక్షణ పొందిన 'డెత్ స్క్వాడ్' బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ బృందం మంగుచోర్ పట్టణంలోకి చొచ్చుకెళ్లి, అక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, భద్రతా సంస్థల ప్రాంగణాలను తమ అదుపులోకి తీసుకుంది. ఇంతటితో ఆగకుండా, పట్టణంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నత స్థాయి సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా చేసుకుంది.బలుచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో బీఎల్ఏ వరుస దాడులతో బలూచిస్తాన్‌పై పాకిస్తాన్ నియంత్రణ కోల్పోతోంది. ఇక, ఇప్పటికే బీఎల్ఏ దాడుల్లో వందలాదిమంది పాక్ సైనికులు మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం పాక్ సైనికులు వెళుతున్న ట్రైన్‌ని హైజాక్ చేసిన బీఎల్ఏ.. పాక్ సైనికులను హతమార్చింది. కొద్ది రోజుల క్రితం బీఎల్ఏ పాక్ సైన్యం కాన్వాయ్‌పై ఐఈడీ దాడి చేయడంతో ఏకంగా 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారు ఎంత దూకుడుగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారో పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు.Baloch sarmachars are roaming openly through Mangocher city, seizing control of banks, as well as government and military assets. Certain handles suggest that government personnel have been forced to evacuate, and that several state institutions are no longer operational.… https://t.co/h9KewE0JZc pic.twitter.com/P4mdw3l6aG— Char (@cqc_coffee_guns) May 3, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లోని నైరుతి ప్రాంతమే బలూచిస్తాన్. ఇది పాక్‌లో ఒక ప్రావిన్స్‌గా ఉంది. పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో 44 శాతం బలూచిస్తాన్ ఉంటుంది. విస్తీర్ణంపరంగా పాకిస్థాన్‌లో అతి పెద్ద ప్రావిన్స్‌గా బలూచిస్తాన్ ఉంది. అలాగే మిగతా అన్ని ప్రావిన్స్‌లో కెల్లా అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్ కూడా బలూచిస్తానే. బలూచిస్తాన్‌లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వనరులు పుష్కలంగా ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయకముందువరకు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగానే ఉండేది. బ్రిటిష్ వారి నుంచి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో భాగమైంది. ఆ తర్వాత కొంత కాలానికి స్వతంత్ర దేశం కోసం బలూచిస్తాన్ నుంచి డిమాండ్ పుట్టుకొచ్చింది.అలాగే ఆ ప్రావిన్స్‌లో పాక్ సాగిస్తున్న మారణకాండ కూడా తిరుగుబాటుకు మరో కారణం. 2011 నుంచి 2024 జనవరి వరకు పాక్‌లో మొత్తం 10,078 మంది అదృశ్యం అయ్యారు. అదృశ్యమైనవారిలో 2,752 మంది బలూచ్ పౌరులే. 2001-2017 మధ్య 5,228 మంది బలూచ్ పౌరులు అదృశ్యం కావడం గమనార్హం. ప్రస్తుతం బీఎల్ఏ యాక్టివ్‌గా వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తోంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్‌తో బీఎల్ఏ ఏర్పాటైంది. దశాబ్ద కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోంది.
జాతీయం

బోర్డర్‌కు అదనంగా భారత సైన్యం.. ఆర్మీ ప్లానేంటి?
శ్రీనగర్: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది. నియంత్రణ రేఖ వెంబడి 11వ రోజు మరోసారి కాల్పులు జరిపింది. కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బానీ, అఖ్నూర్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. దీంతో, వెంటనే భారత భద్రతా బలగాలు అప్రమత్తమై పాక్ ఆర్మీ ప్లాన్‌ను తిప్పికొట్టాయి.మరోవైపు.. సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించింది. కొత్తగా 16 అదనపు బెటాలియన్లు రంగంలోకి దిగాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేశారు. కాగా, పాకిస్తాన్‌పై దాడి సన్నాహాల్లో భాగంగా సైన్యం మోహరించినట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే ఇరు దేశాల సరిహద్దుల్లో 193 బెటాలియన్లు మోహరించాయి. ఒక్కో బెటాలియన్‌లో దాదాపు 1000 మందికిపైగా సైనికులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి కీడు తలపెట్టాలని చూసేవారి తాట తీయడంలో సైనిక బలగాలతో కలిసి పనిచేయడం, దేశ సరిహద్దుల్ని కాపాడుకోవడం తన కర్తవ్యమని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ గురించి ప్రజలకు బాగా తెలుసునని.. ఆయన పనితీరు, కట్టుబాటు, జీవితంలో రిస్కు తీసుకునే విధానంపైనా వారికి అవగాహన ఉందని చెప్పారు. ప్రజలు కోరుకున్నవన్నీ మోదీ నేతృత్వంలో తప్పకుండా జరిగి తీరుతాయని చెప్పారు. అంతకు మించి దానిపై వివరించలేదు.

ఛీ.. వీళ్లేం పేరెంట్స్!
బెంగళూరు: పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితమే అయిపోయినట్లు ఫీలైపోయి ప్రాణాలు తీసుకునే విద్యార్థులను చూసుంటాం. లేదంటే.. ఏదో నేరం చేసినట్లు పిల్లల్ని మందలించే.. దండించే పేరెంట్స్‌ను చూసుంటాం. కానీ, పరీక్ష తప్పితే ఇంటా.. బయటా అవమానాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏముందని అభిషేక్ తల్లిదండ్రులు అనుకున్నారు. అందుకే.. ఎవరేం అనుకుంటే ఏమి అనుకుంటూ ఇలా కేక్ కట్ చేయించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. కర్ణాటకలోని బాగల్కోట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొడుకు పరీక్ష తప్పితే.. చుట్టుపక్కల వాళ్లను పిలిచి.. కేక్ తెప్పించి కట్ చేయించి.. చిన్నపాటి వేడుక నిర్వహించారు. మరోసారి పరీక్షలు రాసి పాస్ అవ్వాలంటూ కొడుకుకు నచ్చజెప్పారు. In a heartwarming gesture, the parents of Abhishek, a student at Basaveshwara English Medium High School in Bagalkot, chose to celebrate his effort rather than scold him for failing his exams. Despite scoring just 200 out of 625 marks and not clearing any subject, the family held… pic.twitter.com/RxnlTwrcHp— The Siasat Daily (@TheSiasatDaily) May 4, 2025టెన్త్‌లో అన్ని సబ్జెక్ట్‌ల్లో ఫెయిలయ్యాడు అభిషేక్. మొత్తం 600 మార్కులకుగాను 200 మార్కులు మాత్రమే వచ్చాయి. లాగిపెట్టి కొట్టక.. ఇదేం పని అని తిట్టుకున్న వాళ్లు ఉన్నారు ఈ ఫొటోలు, వీడియో చూశాక. కానీ, ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు బాధను అర్థం చేసుకునేది ఆ తల్లిదండ్రులేగా!. మరోసారి రాసి పాసవుదులేరా అని వెన్నుతట్టి ప్రొత్సహించారు. పరీక్షలలో ఫెయిల్ కావడం అంటే జీవితంలో ఫెయిల్ కావడం కాదు, భవిష్యత్తులో విజయానికి పట్టుదల కీలకం అని సందేశం ఇచ్చారు ఆ పేరెంట్స్. అఫ్కోర్స్.. అభిషేక్ తల్లిదండ్రులు చేసిన ఈ పని నచ్చనివాళ్లు కూడా ఉంటారనుకోండి. అది వేరే విషయం.

మూడేళ్ల చిన్నారి ‘సల్లేఖనం’
ముంబై: మూడేళ్ల చిన్నారి వియానా. ఐటీలో పనిచేసే పీయూష్, వర్షా జైన్ దంపతుల ఒక్కగానొక్క కూతురు. మాటలు కూడా పూర్తిగా రాని చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు గత జనవరిలో నిర్ధారణ అయ్యింది. ముంబైలో ఆపరేషన్ చేయించినా లాభం లేకపోయింది. రోజురోజుకూ పరిస్థితి విషమించడంతో జైన మతస్తులైన వారు ఇండోర్‌లోని తమ మత గురువు రాజేష్ ముని మహరాజ్ దగ్గరకు వెళ్లారు. చిన్నారిని ‘సంతారా/సల్లేఖన’ (ఆమరణ నిరాహార దీక్ష) చేయించాలని సూచించగా అగీకరించారు. అయితే ఆ దీక్ష తీసుకున్న పది నిమిషాల్లోనే చిన్నారి మరణించింది. అతి పిన్న వయసులో ‘సల్లేఖన దీక్ష’ స్వీకరించిన వ్యక్తిగా ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో వియానా పేరు నమోదవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏమిటీ దీక్ష? సంతారా లేదా సల్లేఖనం అంటే స్వచ్ఛందంగా ఆమరణ నిరాహార దీక్ష చేసే జైన ఆచారం. అలా శరీరాన్ని కృశింపజేసుకుంటూ మరణాన్ని ఆహా్వనించడం. సాధారణంగా వృద్ధులు ఈ దీక్ష తీసుకుంటారు. మూడేళ్ల చిన్నారికి అలాంటి దీక్ష ఇవ్వడం చర్చనీయంగా మారింది. జీవించే హక్కును కాలరాస్తూ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. తల్లిదండ్రుల వాదన వేరేలా ఉంది. ‘‘కూతురు చనిపోవాలని ఏ తల్లీ కోరుకోదు. నా బిడ్డతో సంతార ప్రతిజ్ఞ చేయించడానికి ఎంత బాధపడ్డానో చెప్పలేను! ట్యూమర్‌తో తను విలవిల్లాడుతోంది. ఆ స్థితిలో చూడలేకే అంగీకరించాం’’ అని వర్ష తెలిపింది. ‘‘నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడ్డ స్థితిలో పాపకు చివరి క్షణాలు సమీపించాయి గనుక మా గురువు సలహా మేరకు సంతారకు అంగీకరించాం’’ అని పీయూష్ చెప్పారు. కానీ అలాంటి నిర్ణయం తీసుకునే హక్కు తల్లిదండ్రులకు లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ‘‘మత స్వేచ్ఛ నమ్మకానికి సంబంధించింది మాత్రమే. ప్రాణాలు తీసే ఆచారాలను పాటించడానికి కాదు’’ అన్నది వారి వాదన. సల్లేఖనం నేరమన్న హైకోర్టు సంతారా/సల్లేఖన దీక్ష నేరమని 2015లో రాజస్థాన్ హైకోర్టు పేర్కొంది. ఈ ఆచారాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఆత్మాహత్యాయత్నంగా పరిగణించి శిక్షార్హమైన నేరంగా ప్రకటించింది. ఇది న్యాయ, జైన మత వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తీర్పును జైన సంస్థలు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.

అవే ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: అవే ఉద్రిక్తతలు. అదే ఉత్కంఠ. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. దాయాది కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా పదో రోజూ కాల్పులకు తెగబడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం దాకా జమ్మూ కశ్మీర్లో కుప్వారా, పూంచ్, రాజౌరీ, మేంధార్, నౌషేరా, సుందర్బనీ, అఖూ్నర్ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలు, భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించారు.నావికా దళాధిపతి చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠితో సమావేశమైన 24 గంటల్లోపే ఎయిర్ చీఫ్ మార్షల్‌తో మోదీ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రదాడులపై ప్రతీకారం విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత వాయుసేనతో త్వరలో ఘర్షణ జరగవచ్చంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కొత్త పల్లవి అందుకున్నారు. తమ గగనతలంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారత రఫేల్ యుద్ధ విమానాలను అడ్డుకున్నట్టు చెప్పుకున్నారు. మరోవైపు మిత్ర దేశాల మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. తుర్కియేకు చెందిన భారీ యుద్ధనౌక ఆదివారం కరాచీ తీరం చేరుకుంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై దాడికి తెగబడ్డ వారికి త్వరలో మర్చిపోలేని రీతిలో సమాధానం చెప్పి తీరతామని పునరుద్ఘాటించారు. ‘‘సైనికులను కాపాడటం నా బాధ్యత. ప్రధాని మోదీ పట్టుదల అందరికీ తెలుసు. ప్రజలు కోరుతున్నది ఆయన నాయకత్వంలో జరిగి తీరుతుంది’’ అని ప్రకటించారు.దీర్ఘకాల సెలవులు రద్దుఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సిబ్బందికి దీర్ఘకాల సెలవులు రద్దు చేస్తూ మ్యునీíÙయన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎల్ పరిధిలో 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలున్నాయి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు వాటిలో తయారవుతాయి. ఆయుధ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికే సెలవులు రద్దు చేసినట్లు ఎంఐఎల్ అధికారి ఒకరు చెప్పారు. భద్రతా మండలికి పాక్ పహల్గాం దాడిని అడ్డు పెట్టుకొని భారత్ తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని పాక్ వాపోయింది. దీనిపై ఐరాస భద్రతా మండలిని ఆశ్రయిస్తామని పాక్ ప్రకటించింది. వీలైనంత త్వరగా భద్రతామండలి భేటీ జరిగేలా చూడాలని ఐరాసలోని తమ శాశ్వత ప్రతినిధి, రాయబారి అసీం ఇఫ్తికార్‌ను పాక్ విదేశాంగ శాఖ ఆదేశించింది. ‘‘సింధూ జల ఒప్పందం నిలిపివేత ప్రాంతీయ శాంతిభద్రతలకు దెబ్బ. భారత్ వైఖరిని అంతర్జాతీయ సమాజానికి వివరిస్తాం’’ అని చెప్పుకొచి్చంది. భద్రతా మండలిలో పాక్ తాత్కాలిక సభ్యదేశం.నేడు పాక్ పార్లమెంట్ ప్రత్యేక భేటీ భారత్‌తో ఉద్రిక్తతలపై చర్చించేందుకు పాక్ పార్లమెంట్ సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశం కానుంది. సింధూ ఒప్పందం నిలిపివేత వంటి అంశాలపైనా చర్చిస్తామని ఎంపీలు తెలిపారు.మళ్లీ ‘అణు’ ప్రేలాపనలు పాక్ మరోసారి అణు ప్రేలాపనలకు దిగింది. పాక్‌లోని కొన్ని భూభాగాలపై భారత్ త్వరలో దాడి చేయనున్నట్లు తమకు సమాచారముందని రష్యాలో ఆ దేశ రాయబారి మొహమ్మద్ ఖలీద్ జమాలీ చెప్పుకొచ్చారు. ‘‘దాడికి దిగితే భారత్‌కు గట్టిగా బదులిస్తాం. అణ్వాయుధాలు సహా సర్వశక్తులూ ప్రయోగిస్తాం’’ అని హెచ్చరించారు. యుద్ధం జరిగితే పాక్ కచ్చితంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తుందన్నారు. భారత్‌పై అణు బాంబులు ప్రయోగిస్తామని పాకిస్తాన్‌మంత్రి హనీఫ్ అబ్బాసీ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఎన్ఆర్ఐ

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
క్రైమ్

పాముకాటుకు వివాహిత మృతి
కడెం(మంచిర్యాల): పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దూర్‌కు చెందిన నేరెళ్ల రజిత (35), దాసు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దె ఇంటి డబ్బుల భారంతో గత కొన్నినెలలుగా పెద్దూర్ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి పరిసరాల్లో రజిత తోటకూర తెంపుతుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కడెంలో ప్రథమ చికిత్స చేయించి, నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. తల్లి మృతదేహం వద్దమృతదేహం వద్ద రోదిస్తున్న కూతురు కూతుళ్ల రోదన అందరిని కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు వివాహం నిశ్చయం కాగా, అంతలోనే తల్లి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయ లు అలముకున్నాయి. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపారు.

ప్రియురాలి చేతిలో ట్రావెల్ ఏజెంట్ హత్య
అన్నానగర్(తమిళనాడు): మద్యం, మాంసంలో నిద్రమాత్రలు కలిపి దుబాయ్ ట్రావెల్స్ సీఈఓను హత్య చేసిన ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుక్కుడి కి చెందిన త్యాగరాజన్(69) ఇతను కోయంబత్తూరు వచ్చి ఖతీమా నగర్లో నివశించే సమయంలో గోమతి అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. గోమతికి నీల, శారద అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2016లో శారదతో గొడవపడిన ఆమె భర్త గుణవేల్ను హత్య చేసి త్యాగరాజన్ జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్‌పై వచ్చాడు. ఈ క్రమంలో శారద పని నిమిత్తం దుబాయ్ వెళ్లింది. ఆ సమయంలో తిరువారూరు జిల్లాకు చెందిన ట్రావెల్ ఏజెంట్ సిగమణి(47)తో శారదకు అక్రమ సంబంధం ఏర్పడింది. శారదకు, సిగమణికి డబ్బులు ఇచ్చి పుచ్చుకునే దాంట్లో సమస్య వచ్చింది. దీంతో శారద కోవైకి తిరిగి వచ్చింది. శారదను శాంతింపజేసేందుకు సిగమణి 21న కోయంబత్తూరుకు వచ్చాడు. అతనిని శారద తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో త్యాగరాజన్ నెల్లైకి చెందిన ప్రముఖ రౌడీ పశుపతిపాండియన్ సహచరుడు పుదియవన్ కోయంబత్తూరుకు ఆహ్వానించారు. ఆ తర్వాత 22వ తేదీ రాత్రి మద్యం, మాంసంలో 30కి పైగా నిద్ర, నొప్పి నివారణ మాత్రలు కలిపి సిగమణిని హత్య చేశారు. అనంతరం సిగమణి మృతదేహాన్ని త్యాగరాజన్, శారద, పుదియవన్ కారులో తీసుకెళ్లి కరూర్ పొన్నమరావతి పక్కన పడేసి, పారిపోయారు. మిగిలిన ఇద్దరు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. దీనిపై సిగమణి భార్య ప్రియా(69) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోయంబత్తూరు బీలమేడు పోలీసులు విచారణ చేపట్టారు. త్యాగరాజన్(69), ఇతని వివాహేతర ప్రియురాలు గోమతి (53), ఆమె కూతుళ్లు నీల (33), శారద (35), కోడలు స్వాతి (26), పుదియవన్(48) సిగమణిని హత్య చేసినట్లు తేలింది. ఆదివారం శారదతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

భర్త వివాహేతర సంబంధం.. గుండెపోటుతో భార్య మృతి..!
ఖమ్మంక్రైం: వరుసకు వదిన అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగగా.. మృతురాలిది ఖమ్మం. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సాహితి (30)కి ఖమ్మం పట్టణానికి చెందిన రేగుల అనిల్‌తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. అనిల్ హైదరాబాద్‌లోని పోలీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండటంతో దంపతులు అక్కడే ఉంటున్నారు. కాగా, అనిల్ వరుసకు వదిన అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని పెద్దల సమక్షంలో హెచ్చరించినా మార్పు రాలేదు. శనివారం రాత్రి సాహితిని విపరీతంగా కొట్టడంతో ఆమె మృతిచెందగా గుండెపోటుతో మృతిచెందినట్లు చిత్రీకరించేందుకు అనిల్ యత్నంచాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.మృతురాలి శరీరంపై కూడా గాయాలున్నాయని, హైదరాబాద్ నుంచి మృతదేహన్ని తీసుకొచ్చి ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సీఐ బాలకృష్ణ వారితో మాట్లాడి అనిల్‌పై ఫిర్యాదు చేయాలని, పోస్టుమార్టంలో హత్య అని తేలితే కేసు నమోదు చేస్తామని, సర్దిచెప్పగా మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. టూటౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అనిల్ పరారీలో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు.

ప్రాణాలు తీసిన పెంపుడు కుక్క..!
వెంగళరావునగర్(హైదరాబాద్): తాను పెంచుకుంటున్న శునకమే ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్న ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన డి.పవన్‌కుమార్ (37) తన స్నేహితుడు సందీప్‌తో కలిసి పదేళ్లుగా మధురానగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గదిలో నిద్రపోయాడు. పక్కనే అతని పెంపుడు కుక్క కూడా ఉంది. ఉదయం సందీప్ తలుపు తట్టగా పవన్ లేవలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారితో తలుపు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా పవన్ విగతజీవిగా కనిపించాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటి నిండా రక్తం ఉంది. కుక్క అతడి మర్మాంగాలను గాయపర్చడం వల్లే మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పవన్‌కుమార్‌కు గతంలో వివాహమైంది. భార్యతో విడాకులు కావడంతో నగరంలో ఉంటున్నాడు. స్నేహితుడు సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.