
ట్రెంచ్ పైనుంచి దూకుతున్న కలెక్టర్ అజీమ్
సాక్షి, భూపాలపల్లి:‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ శుక్రవారం పలు కాలనీల్లో పర్యటించారు. ఈక్రమంలో జవహర్ కాలనీలో శ్మశాన వాటిక స్థల అన్వేషణ కోసం శివారులో ఫారెస్టు చుట్టూ ఉన్న ట్రెంచ్ దాటేందుకు జంప్ చేశారు. అచ్చం సినిమా షూటింగ్‌లో మాదిరి ఆయన జంప్ చేయగా.. ప్రజాప్రతినిధులు మాత్రం కాలువలో రాళ్లు వేసి దాటారు.
కలిసిపోయి.. కలివిడిగా..
‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ శుక్రవారం తొర్రూరులో పర్యటించారు. పార్కుల ఏర్పాటు, ఇతరత్రా అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. తర్వాత ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. అప్పటికే మధ్యాహ్న భోజన సమయం కావడంతో విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటే మెట్లపై కూర్చుని భోజనం చేస్తూ వారి బాగోగులపై ఆరా తీయడం ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment