
నర్సింహారావును విచారిస్తున్న ఎస్సై
సాక్షి, మంగపేట (జయశంకర్ భూపాలపల్లి): మంగపేట మండల కేంద్రంలోని పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలోకి దిగి ఆత్మహత్యకు యత్నించిన కమలాపురం బిల్ట్ ప్యాక్టరీ కార్మికుడు బోజాట్ల నర్సింహారావు అనే వ్యక్తిని ఎస్సై వెంటేశ్వర్‌రావు బుధవారం కాపాడారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్యం మత్తులో ఉన్న నర్సింహారావు ఆత్మహత్య చేసుకునేందుకు నదిలోకి దిగాడు. అక్కడే చేపలు పడుతున్న వ్యక్తి ఆయను గమనించి వివరాలు ఆరా తీశాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తాను చనిపోతే ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చి సమస్య తీరుతుందని చెప్పాడు.
వెంటనే చేపలు పడుతున్న వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని నర్సింహారావును కాపాడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సంఘటనపై కుటుంబ సభ్యులను విచారించగా నర్సింహారావు మతిస్థిమితం సరిగా లేదని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులకు ఎస్సై కౌన్సిలింగ్ ఇచ్చి ఆయనను అప్పగించారు.

నర్సింహారావును కుటుంబసభ్యులకు అప్పగిస్తున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment