సాక్షి, భూపాలపల్లి: వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామాస్థులు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాఫ్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామంలోని ప్రజలందరినీ సేఫ్‌జోన్‌కు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా మోరంచపల్లి గ్రామస్తులు అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
అంతకుముందు మోరాంచపల్లిలో రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఫైర్ సర్వీస్& డిజాస్టర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 70మందిని సేఫ్ చేశామని, దాదాపు గ్రామాన్ని కాళీ చేస్తున్నామని పేర్కొన్నారు.వరరంగల్ టౌన్‌లో సైతం బోట్స్ సహాయంతో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. మంథనిలో ఇసుక క్వారి వద్ద తొమ్మిది మందిని కాపాడామని, ఇద్దరిని ఇంకా కాపాడే ప్రయత్నం సాగుతోందని తెలిపారు.
ఎలికాఫ్టర్ సహాయంతో రెస్క్యూ ప్రయత్నం సాగుతుందన్నారు. కాటారం మండలం గంగారం నలుగురిని కాపాడే రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుందన్నారు. ఎక్కడ ఇబ్బందిఉన్నా 100,101కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సెల్ఫీలు, ఫొటోలు దిగడానికి ఎవరు కూడా బయటకు వెళ్లరాదని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకి రావద్దని, రేపు కూడా వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలోఅప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుతున్నాయి. కుండపోత కారణంగా మోరంచ వాగు ప్రవాహం ప్రమాదకర స్థాయి దాటి మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే.
దీంతో కొందరు గ్రామస్తులు వర్షంలోనే బిల్డింగ్‌లపైకి ఎక్కి రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గ్రామస్తులు వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. చాలామంది సెల్‌ఫోన్లు కూడా పని చేయడం లేదని.. దీంతో అధికారుల సాయం కోరేందుకు కూడా వీలుకావడం లేదని వాపోతున్నారు. వందేళ్ల తర్వాత ఇలాంటి స్థాయిలో వరద ముంచెత్తినట్లు తెలుస్తోంది.
మోరంచపల్లి గ్రామంలో 300 మంది.. వెయ్యి జనాభా దాకా ఉంది. వానాకాలం వచ్చినప్పుడల్లా మోరంచవాగు ప్రవాహంతో గ్రామం చుట్టూ నీరు చేరుతుంటుంది. అయితే ఈ దఫా గ్రామాన్ని వాగు పూర్తిగా ముంచెత్తడం గమనార్హం. ఈ ప్రభావంతో భూపాలపల్లి-హన్మకొండ వైపు రహదారిపై ఆరు అడుగుల ఎత్తు నుంచి నీరు ప్రవహిస్తుండగా.. రాకపోకలు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment