vaagu
-
ఆపరేషన్ మోరంచపల్లి.. గ్రామస్తులు సేఫ్
సాక్షి, భూపాలపల్లి: వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామాస్థులు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాఫ్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామంలోని ప్రజలందరినీ సేఫ్‌జోన్‌కు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా మోరంచపల్లి గ్రామస్తులు అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అంతకుముందు మోరాంచపల్లిలో రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఫైర్ సర్వీస్& డిజాస్టర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 70మందిని సేఫ్ చేశామని, దాదాపు గ్రామాన్ని కాళీ చేస్తున్నామని పేర్కొన్నారు.వరరంగల్ టౌన్లో సైతం బోట్స్ సహాయంతో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. మంథనిలో ఇసుక క్వారి వద్ద తొమ్మిది మందిని కాపాడామని, ఇద్దరిని ఇంకా కాపాడే ప్రయత్నం సాగుతోందని తెలిపారు. ఎలికాఫ్టర్ సహాయంతో రెస్క్యూ ప్రయత్నం సాగుతుందన్నారు. కాటారం మండలం గంగారం నలుగురిని కాపాడే రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుందన్నారు. ఎక్కడ ఇబ్బందిఉన్నా 100,101కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సెల్ఫీలు, ఫొటోలు దిగడానికి ఎవరు కూడా బయటకు వెళ్లరాదని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకి రావద్దని, రేపు కూడా వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలోఅప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుతున్నాయి. కుండపోత కారణంగా మోరంచ వాగు ప్రవాహం ప్రమాదకర స్థాయి దాటి మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో కొందరు గ్రామస్తులు వర్షంలోనే బిల్డింగ్‌లపైకి ఎక్కి రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గ్రామస్తులు వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. చాలామంది సెల్ఫోన్లు కూడా పని చేయడం లేదని.. దీంతో అధికారుల సాయం కోరేందుకు కూడా వీలుకావడం లేదని వాపోతున్నారు. వందేళ్ల తర్వాత ఇలాంటి స్థాయిలో వరద ముంచెత్తినట్లు తెలుస్తోంది. మోరంచపల్లి గ్రామంలో 300 మంది.. వెయ్యి జనాభా దాకా ఉంది. వానాకాలం వచ్చినప్పుడల్లా మోరంచవాగు ప్రవాహంతో గ్రామం చుట్టూ నీరు చేరుతుంటుంది. అయితే ఈ దఫా గ్రామాన్ని వాగు పూర్తిగా ముంచెత్తడం గమనార్హం. ఈ ప్రభావంతో భూపాలపల్లి-హన్మకొండ వైపు రహదారిపై ఆరు అడుగుల ఎత్తు నుంచి నీరు ప్రవహిస్తుండగా.. రాకపోకలు నిలిచిపోయాయి. -
ఉధృతంగా పాలేరు వాగు.. రాకపోకలు బంద్
సాక్షి, కర్నూలు: గత కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో మహానంది మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మహానంది-గాజులపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. గుంటూరు ఎన్జీవో కాలనీలో 14.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. కదిరిలో రికార్డుస్థాయిలో 21 సెం.మీ, రామకుప్పం మండలం బండారుపల్లెల్లో 10.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. చిత్తూరు: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా వర్షాలు అడపాదడపా కురుస్తూనే ఉన్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు తిరుమలకొండలు తడిచి ముద్దవుతోంది. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు, మాడా వీధులు జలమయం అయ్యాయి. కాటేజీల ఆవరణలో వర్షుపు నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాల్లో నీటితో నిండిపోయాయి. ఘాట్ రోడ్డు ప్రకృతి అందాలను సంతరించుకుంది. భారీ వర్షాలకు చలి తీవ్రత తోడుకావడంతో భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముప్పు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఘాట్ రోడ్డులో అక్కడక్కడా కొండ చరియలు విరిగి పడుతున్నాయి. మరోపక్క జలాశయాలలో వర్షపు నీరు చేరుతుంది. నీటిమట్టం పెరుగుతుంది. ఇప్పటికే భక్తులు తక్కవ సంఖ్యలో తిరుమల కి వస్తున్నారు. కరోనా వైరస్ శ్రీవారి దర్శనాల సంఖ్యను టిటిడి తగ్గించింది. దీంతో నీటి వినియోగం కూడా తగ్గింది. మరోపక్క వర్షాలు కూడా సకాలంలో కురుస్తుంది. దీంతో మరో ఎడాదిన్నర పాటు తిరుమలలో నీటి కొరత ఉండే అవకాశం లేదు అంటున్నారు అధికారులు. తిరుమలలో ఐదు జలాశయాలు ఉన్నాయి. గోగర్బం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార,పసుపు ధార డ్యాములలో వర్షపు నీటితో నిండుతున్నాయు. జలాశయాలలో నీరు చేరడంతో పరిసర ప్రాంతాలన్ని అందాలను సంతరించుకుంది. -
34ఏళ్లకు బయటపడ్డ లారీ
సాక్షి, కరీంనగర్‌రూరల్ : మూడు దశాబ్దాల క్రితం.. భారీ వరదల కారణంగా ఇరుకుల్ల వాగులో గల్లంతైన లారీ ఆనవాళ్లు కనిపించాయి. ఇసుక తవ్వకాలతో లారీ విడిభాగాలు బయటపడ్డాయి. గల్లంతైన లారీ కనిపించడంతో చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివస్తున్నారు. 1984లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. వారంపాటు కురిసిన భారీవర్షాలకు కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల వాగు పొంగిపొర్లింది. పాత వంతెనపైనుంచి వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే కరీంనగర్‌కు చెందిన లారీలో డ్రైవర్ సలీం, కటికె శంకర్ (పశువుల వ్యాపారి) వంతెన దాటేందుకు ప్రయత్నిస్తుండగా లారీ వరదనీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో లారీతోపాటు డ్రైవర్, పశువుల వ్యాపారి ఇద్దరూ గల్లంతరయ్యారు. అనంతరం రాజీవ్ రహదారి నిర్మాణంలో భాగంగా ఇరుకుల్ల వాగుపై కొత్త వంతెన నిర్మించారు. దీంతో పాతవంతెన మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నేళ్లుగా ఇరుకుల్ల వాగునుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్లద్వారా ఇసుక తరలిపోతోంది. పాత వంతెన సమీపంలో మూడురోజుల క్రితం ఇసుక తవ్వుతుండగా.. అప్పుడు గల్లంతయిన లారీ విడి భాగాలు బయటపడ్డాయి. లారీ క్యాబిన్ ఇనుప రేకులు కన్పిస్తున్నాయి. దాదాపు 34ఏళ్ల క్రితం వాగులో గల్లంతైన లారీ విడిభాగాలు ప్రస్తుతం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. లారీ కనిపిస్తోందనే సమాచారంతో దుర్శేడ్, ఇరుకుల్ల, మొగ్ధుంపూర్ గ్రామస్తులు వచ్చి ఆసక్తిగా పరిశీలిస్తూ అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. -
ప్రాణాలు మింగేస్తున్నా పట్టదా..?
వెచ్చాలకు పోవాలన్నా వాగు దాటాల్సిందే రోగమొచ్చినా ఎదురీత తప్పదు ఇప్పటికి నలుగురు ప్రాణాలు వాగుపరం.. శిలాఫలకానికే పరిమితం కేటాయించిన రూ.25 లక్షలు ఏమైనట్టో? అడ్డతీగల : నిత్యావసరాలు, విద్య, వైద్యం, మరే ఇతర అవసరాలకైనా గ్రామ పొలిమేరల్లోని కొండవాగు దాటాల్సిందే. ఈ నిత్య జీవన పోరాటంలో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. వేటమామిడి పంచాయతీలోని పణుకురాతిపాలెం గ్రామస్తుల దుస్థితి ఇది. ఇక్కడి మొత్తం జనాభా 570 మంది. 325 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామం కన్నేరు (పెద్దేరు) వాగుకు ఆవలి వైపు ఉంది. వర్షాకాలం వస్తే ఈ గ్రామస్తులు ట్యూబుల సాయంతో ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటి ఆవలి ఒడ్డుకు వెళ్లి వస్తుంటారు. ఐదేళ్ల కాలంలో నలుగురిని ఈ వాగు పొట్టనపెట్టుకుంది. ఐదేళ్ళ క్రితం ఉలెం చిన్నారావు పింఛను తీసుకోవడానికి వాగు దాటే యత్నంలో ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచాడు. మరో ఘటనలో వివాహ నిశ్చితార్థమై, కొన్నిరోజుల్లో పెళ్లిపీటలెక్కబోతున్న పణుకురాతిపాలెం యువకుడు మామిడి మల్లేశ్ రెడ్డి కూలి పని కోసం వాగు దాటబోతూ అందులోపడి చనిపోయాడు. ఇంకో ఘటనలో భవననిర్మాణ కార్మికురాలు ముర్ల చిన్ని అడ్డతీగలలో పనిచేస్తూ తిరిగి స్వగ్రామానికి వెళ్తూ కనుమరుగైంది. నేటికీ ఆమె మృతదేహం జాడ కనపడలేదు. తాజాగా మామిడిలక్ష్మి అనే వృద్ధురాలు పింఛన్ సొమ్ము కోసం మంగళవారం వాగులోనికి దిగి నీటి ఉధృతి తట్టుకోలేక కొట్టుకుపోయి మృతిచెందింది. వీరంతా దగ్గర బందువులే కావడం గమనార్హం. రోప్ బ్రిడ్జి నిర్మాణాన్ని మరచారు వాగుపై రోప్‌బ్రిడ్జ్ నిర్మిస్తామని దాని నిర్మాణానికి రూ.25 లక్షలు కేటాయించినట్లు 2013 చివర్లో అప్పటి అరకు ఎంపీ కిశోర్‌చంద్రదేవ్ ఇతర ప్రజాప్రతినిధులు వేటమామిడి వైపు వాగు ఒడ్డునే శిలాఫలకం ప్రారంభించారు. కాలక్రమంలో ఆ శిలాఫలకం శిథిలమైంది. ఇటు అధికారులు అటు పాలకులు ఈవిషయాన్ని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవర్ ప్రాజెక్ట్ నీటి వల్ల ఇబ్బంది పణుకురాతిపాలేనికి ఎగువ నిర్మించిన పవర్‌ప్రాజెక్ట్ నుంచి నీటిని ఎటువంటి హెచ్చరికలు చేయకుండా దిగువకు వదలడం వల్ల హఠాత్తుగా నీటి ఉధృతి పెరిగి తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఆ నీటి ఉధృతి వల్లే మంగళవారం మామిడిలక్ష్మి అనే వృద్ధురాలు మృతి చెందింది. ఈ ప్రమాదాల నివారణకు నీటిని వదిలేటప్పుడు హెచ్చరికగా సైర¯ŒS ఏర్పాటు చేయాలంటున్నారు.