
సాక్షి, భూపాలపల్లి: గోదావరిఖని నుంచి మంథని మీదుగా భూపాలపల్లి వెళుతున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం పీవీనగర్ వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. గోదావరి ఖని డిపోకు చెందిన ఈ బస్సులో 63 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో 25 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.
కాగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ గుట్కా వేసుకుంటూ స్టీరింగ్ వదిలేయడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
డ్రైవర్ నిర్లక్ష్యం బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
Comments
Please login to add a commentAdd a comment