సాక్షి, కాటారం: భూమి ఆన్‌లైన్ నమోదు, పట్టా పాస్‌పు స్తకం కోసం ఓ రైతునుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటూ మహిళా తహసీల్దార్ ఏసీబీకి పట్టుబ డ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం లో గురువారం జరిగింది. కాటారం మండలం సుంద రాజ్‌పేటకు చెందిన ఐత హరికృష్ణ అనే దివ్యాం గుడికి కొత్తపల్లి శివారులో ని సర్వేనంబర్ 3లో 4 ఎకరాల 25 గుంటల భూమి ఉంది. ఈ భూమి గతంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆన్‌లైన్ ధరణి పోర్టల్‌లో నమోదు చేసి కొత్త పట్టా పాస్ పుస్తకం కోసం తహసీల్దార్ మేడిపల్లి సునీతకు విన్నవించుకున్నాడు.
భూమి వివాదంలో ఉన్నందున ఆన్‌లైన్ నమోదు, పట్టాపాస్ పుస్తకం ప్రక్రియ పూర్తి చేయడానికి రూ.5 లక్షలు ఇవ్వాలని తహసీ ల్దార్ డిమాండ్ చేశారు. చివరకు రూ.3 లక్షలకు ఒప్పందం కుదిరింది. హరికృష్ణ 50 వేలు ఇచ్చినా మిగతా డబ్బు ఇస్తేనే పాస్‌పుస్తకం ఇస్తానని సునీత చెప్పడంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం గురువారం సాయంత్రం తహసీల్దార్‌కు తన కార్యాలయంలో రూ.2లక్షలు అందజేయగా.. ఏసీబీ అధికారులు డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. సునీతను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment