సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాంబులు కలకలం రేపాయి. జిల్లాలోని వెంకటాపురం(కె) మండలంలోని అబ్బాయిగూడెం సమీపంలోని రహదారిపై రెండు బాంబులు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వాహనాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులే ఈ ఘతుకానికి పాల్పడి ఉంటరాని అనుమానిస్తున్నారు. రహదారిలో ప్రెషర్ బాంబులు అమర్చినట్లు గుర్తించడంతో.. బాంబు స్క్వాడ్ సాయంతో వాటిని నిర్వీర్యం చేయడానికి యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment