Communist Party of India (Maoist)
-
బూటకపు ఎన్నికలను బహిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోగా, ప్రజలకు వ్యతిరేకం గా పాలన సాగిందన్నారు. తెలంగాణ ఉద్యమ ఫలితాలను కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుని మోసం చేశారని తెలిపారు. ప్రజాద్రోహిగా, నియంతగా పరిపాలించిన కేసీఆర్ పాలనపట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందన్నారు. ఆ ఆగ్రహం సంఘటితం కాకముందే వీలైనంత త్వరగా బయటపడాలని కేసీఆర్ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఓడిపోతామని ఊహించారన్నారు. కేసీఆర్ ముందుగానే ప్రధాని మోదీని, ఎన్నికల కమిషన్‌ను కలిసి అసెంబ్లీ రద్దుకు సిద్ధపడ్డారన్నారు. 25 లక్షల మం దితో గొప్పసభ నిర్వహించాలని భావించి ఘోరంగా విఫలమయ్యారన్నారు. మొదటి నుంచీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇతర పార్టీలలోని ఎమ్మెల్యే, ఎంపీలకు పదవులు, డబ్బు ఆశ చూపించి ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్షాలను బలహీన పరిచారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు బంగారు తెలంగాణ సాధన లక్ష్యం అని ప్రకటించారన్నారు. తెలంగాణలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సహార, ఈఎస్ఐ వంటి స్కాము ల్లో నిందితుడని ఘాటుగా విమర్శించారు. షాబుద్దీన్ కేసులో అమిత్‌షా వ్యవహారం బయటకు రాకుండా, రామేశ్వర్‌రావుకు నయీం వల్ల సమస్యలు రాకుండా హత్య చేసి ఎన్కౌంటర్ కట్టుకథ అల్లారని ఆరో పించారు. సీపీఎం దళితుల ఓట్లు సంపాదించడానికి గద్దర్ వంటి వాళ్లతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ను ఏర్పా టు చేసి అధికారంలో వాటా కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కూటమితో కలిసి చివరికి చేరాల్సిన చోటుకే చేరారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ దోపిడీ వర్గ పార్టీలేనని, సీపీఐ, సీపీఎంల రివిజనిస్టు విధానాలను బహిష్కరించాలని కోరారు. ధర్నా చౌక్‌ను పునరుద్ధరిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
సమాచారం, సహకారం ఇచ్చి పుచ్చుకోవాలి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: శాంతి భద్రతల పరిరక్షణ, మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, నేరాల నియంత్రణలో రాష్ట్రాల పోలీసు విభాగాలు పరస్పర సమాచార మార్పిడి, సహకారం ఇచ్చి పుచ్చుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం భువనేశ్వర్‌లో సదtరన్ రాష్ట్రాల డీజీపీల భేటీ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు కృషి చేస్తున్న అంశాలు, ప్రణాళికలపై డీజీపీలు చర్చించారు. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణకు అన్ని రాష్ట్రాలు పరస్పర సహకారం తీసుకోవాల్సిందిగా ఈ సదస్సులో అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న టెక్నాలజీ వ్యవస్థపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చారు. -
మోదీ హత్యకు కుట్ర?
పుణె: ప్రధాని మోదీ హత్యకు మావోయిస్టులు భారీ కుట్ర పన్నారా? మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తరహాలో మోదీపై దాడికి వ్యూహ రచన చేశారా? అవుననే అంటున్నారు పుణె పోలీసులు. ప్రధానిని హత్య చేసేందుకు మావోయిస్టులు పెద్ద ప్రణాళిక రచించారంటూ వారు సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని భీమా–కోరెగావ్‌లో జరిగిన అల్లర్లతో సంబంధమున్న ‘ఈల్గర్ పరిషద్’కు చెందిన ఒక వ్యక్తి అరెస్టుతో ఈ కుట్ర కోణం వెలుగులోకి వచ్చిందని పుణె సెషన్స్ కోర్టుకు పోలీసులు తెలిపారు. భీమా–కోరెగావ్ కేసులో ఈ వారంలో ముంబై, నాగపూర్, ఢిల్లీల్లో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేయగా.. వారిలో ఒకరైన రోనా విల్సన్ ఇంటి నుంచి పోలీసులు 3 లేఖల్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఆ ఐదుగురిని సెషన్స్ కోర్టులో హాజరుపర్చిన సందర్భంగా ఒక లేఖలోని అంశాల్ని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల పవార్ కోర్టుకు వెల్లడించారు. ‘మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని హత్య చేసిన తరహాలో రోడ్‌షోల్లో మోదీని లక్ష్యంగా చేసుకోవాలని లేఖలో ఉంది. తనను తాను ‘ఆర్’గా పేర్కొన్న ఒక వ్యక్తి.. మావోయిస్టు ప్రకాశ్‌ను ఉద్దేశించి ఈ లేఖ రాశారు. హత్య కోసం ఎం–4 రైఫిల్, 4 లక్షల రౌండ్ల మందుగుండు సమకూర్చుకునేందుకు రూ. 8 కోట్లు అవసరముందని లేఖలో పేర్కొన్నారు’ అని పవార్ కోర్టుకు వెల్లడించారు. విల్సన్‌తో పాటు మరో నలుగురికి కోర్టు జూన్ 14 వరకు రిమాండ్ విధించింది. అరెస్టైన వారిలో విల్సన్‌తో పాటు లాయర్ సురేంద్ర గాడ్లింగ్, దళిత కార్యకర్త సుధీర్ ధావలే, షోమా సేన్, మహేశ్ రౌత్ ఉన్నారు. విల్సన్ ఇంటి నుంచి పోలీసులు మరో 2 లేఖల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని ఒకదాంట్లో విప్లవ రచయిత వరవరరావు పేరు ఉంది. ఆయన మార్గదర్శకత్వం ఆధారంగా గడ్చిరోలి, చత్తీస్‌గఢ్, సూరజ్‌గఢ్‌లో జరిపిన దాడులతో మనకు దేశవ్యాప్తంగా పేరొచ్చిందని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. అసలు లేఖలో ఏముంది.. ‘హిందూ అతివాదాన్ని ఓడించడం మన ప్రధాన అజెండానే కాకుండా పార్టీ ముఖ్య కర్తవ్యం. సీక్రెట్ సెల్స్‌కు చెందిన పలువురు నేతలు, ఇతర సంస్థలు ఈ విషయాన్ని చాలా గట్టిగా నొక్కిచెప్పాయి. స్థానిక ఆదివాసీల జీవితాల్ని మోదీ నేతృత్వంలోని హిందూ అతివాద పాలన నాశనం చేస్తోంది. బిహార్, పశ్చిమ బెంగాల్‌ల్లో ఓడినా 15కిపైగా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల్ని మోదీ ఏర్పాటు చేయగలిగారు. ఇదే వేగం కొనసాగితే అన్ని వైపులా నుంచి మన పార్టీకి భారీ నష్టం తప్పదు. మోదీరాజ్ను అంతమొందించేందుకు కామ్రేడ్ కిషన్, మరికొందరు సీనియర్ కామ్రేడ్స్ నిర్మాణాత్మక చర్యల్ని ప్రతిపాదించారు. రాజీవ్ హత్య∙తరహాలో మేం ఆలోచిస్తున్నాం’ అని లేఖలో ఉంది. మే 21, 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో మహిళా ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోయారు. ‘అయితే ఇది ఆత్మహత్యాసదృశ్యమే. దీని అమలులో మనం విఫలమయ్యే అవకాశమున్నా పార్టీ పీబీ(పోలిట్ బ్యూరో/సీసీ(సెంట్రల్ కమిటీ)ఈ ప్రతిపాదనపై ఆలోచన చేయాలని మనం కోరుకుంటున్నాం. మోదీ రోడ్‌షోలను లక్ష్యంగా చేసుకోవడం ఉత్తమ వ్యూహం. అన్ని త్యాగాల కంటే పార్టీ మనుగడే ముఖ్యమని మనమంతా నమ్ముతున్నాం’ అని లేఖలోని అంశాల్ని పవార్ కోర్టుకు వివరించారు. రెండో లేఖలో ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పు ప్రస్తావన ఇక రెండో లేఖను కామ్రేడ్ ఆనంద్‌ను ఉద్దేశిస్తూ కామ్రేడ్ ప్రకాశ్ రాసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్పకుండా గొడవలకు దారి తీస్తుంది. మనం మూడు నెలల క్రితం ఒక రాష్ట్రంలో ప్రారంభించాం. అది మరో మూడు రాష్ట్రాలకు వ్యాపించింది. దళిత ప్రచారం విషయంలో మీరు చేసిన కృషి పట్ల సీసీ(సెంట్రల్ కమిటీ) ఆనందంగా ఉంది. దళిత అంశాలపై సెమినార్లు, ప్రసంగాల కోసం ఏడాదికి రూ. 10 లక్షలు ఇచ్చేందుకు సీసీ అంగీకరించింది’ అని లేఖలో ఉంది. మహారాష్ట్ర సీఎంకు బెదిరింపు లేఖలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌కు మావోల నుంచి 2 బెదిరింపు లేఖలొచ్చాయి. ‘నన్ను, నా కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తూ మావోలు సీఎం కార్యాలయానికి ఈ లేఖలు పంపారు. ఇంతవరకూ నక్సల్స్ గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయ్యారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు విస్తరించారు’ అని ఫడ్నవిస్ చెప్పారు. ఈ లేఖల్లో గడ్చిరోలి ఎన్కౌంటర్లలో 39 మంది మావోలు మరణించిన అంశాన్ని ప్రస్తావించారని, వారం క్రితం ఈ లేఖలు సీఎం కార్యాలయానికి వచ్చాయని, దర్యాప్తు కోసం వాటిని పోలీసులు అందచేసినట్లు మహారాష్ట్ర హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మూడో లేఖలో వరవరరావు ప్రస్తావన.. ‘గత 4 నెలల్లో నక్సల్ సానుభూతిపరుడు వరవర రావు, కామ్రేడ్ సురేంద్ర గాడ్లింగ్ అందించిన మార్గనిర్దేశకత్వం ఆధారంగా మనం చేసిన దాడులతో జాతీయ స్థాయిలో పేరొచ్చింది. గడ్చిరోలి, చత్తీస్‌గఢ్, సూరజ్‌గఢ్‌లో చేసిన దాడులు పేరు తీసుకొచ్చాయి. వచ్చే కొద్ది నెలలు వీటిని కొనసాగించాలి. ఇదే తరహా దాడుల్ని విజయవంతంగా కొనసాగించే బాధ్యతను వరవర రావుకు అప్పగించారు. వాటి కోసం సురేంద్రకు వరవర రావు నిధులు సమకూర్చారు. నిధులు సురేంద్ర మీకిస్తారు. మార్చి, ఏప్రిల్‌లో జరిగే సమావేశాల కోసం వరవర రావు, సురేంద్ర వ్యక్తిగతంగా మార్గనిర్దేశకత్వం చేస్తారు’ అని కామ్రేడ్ ‘ఎం’ ఈ లేఖ రాశారని పోలీసులు చెప్పారు. ఈ కథలు మోదీకి మామూలే ప్రజాదరణ తగ్గినప్పుడల్లా ఇలాంటి కథలు అల్లడం సీఎంగా ఉన్నప్పటి నుంచి మోదీకి అలవాటేనని కాంగ్రెస్ పార్టీ నేత సంజయ్ నిరుపమ్ అన్నారు. లేఖల కల్పితమని చెప్పట్లేనని, విల్సన్ ఇంట్లో దొరికినట్లు చెపుతున్న లేఖలపై దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మమ్మల్ని కలచివేశాయి: రవిశంకర్ మోదీని హత్య చేసేందుకు మావోలు కుట్ర పన్నారన్న కథనాలు తీవ్రంగా కలచివేశాయని, మావోయిస్టులకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. మావోల కుట్రను బయటపెట్టేలా నిజాయతీగా దర్యాప్తు జరగాలని, దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. -
‘పోలీసులకు తగిన గుణపాఠం చెబుతాం’
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్గడ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలోని జేగురు కాండు అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మరోసారి కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో పలువురు మావోలు చనిపోగా, ఆ కాల్పుల్లో తప్పించుకున్న వారికోసం నిన్నటి నుంచి దండకారుణ్యంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఉదయం సుక్మాలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు.. మావోయిస్టులు ఎదురుపడటంతో మరోసారి కాల్పులు మోత కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్లు బూటకం మరోవైపు మహారాష్ట్ర - ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లు బూటకమని మావోయిస్టు పార్టీ నేత జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. పోరుబిడ్డలపై రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్న పాలకులకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. త్వరలో పోలీసులకు తగిన గుణపాఠం చెబుతామని జగన్ పేర్కొన్నారు. -
భద్రాద్రి జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
సాక్షి, భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు సమీపంలోని రోటింత వాగుపై నిర్మించిన లెవల్ చప్టా (కల్వర్టు)ను మావోయిస్టులు పేల్చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు విధించిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం నిరసన దినంగా ప్రకటించాలని మావోయిస్టులు మంగళవారం లేఖను విడుదల చేశారు. ఈ క్రమంలోనే కల్వర్టును ధ్వంసం చేశారు. భారీ మందు పాతర వినియోగించడంతో కల్వర్టు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. -
ఎన్కౌంటర్: ఐదుగురు మావోయిస్టుల మృతి
రాంచీ : జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. సెరెన్‌దాగ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఏకే 47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కూంబింగ్ కొనసాగుతున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. -
జార్ఖండ్‌లో భారీ ఎన్కౌంటర్
రాంచీ : జార్ఖండ్‌లోని పలము జిల్లాలో సోమవారం తెల్లవారుజాము సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలకు మావోయిస్టులు తారసపడగా.. ఇరు వర్గాల మధ్య ఎదరుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్టు బలగాలు గుర్తించాయి. మరికొందరు మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం కూంబింగ్ కొనసాగుతోంది. -
ఏవోబీలో విస్తృత తనిఖీలు
సాక్షి, విశాఖ: ఏవోబీ సరిహద్దులో మావోయిస్టుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన మావోయిస్టుల దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్ల ద్వారా కూంబింగ్‌ను నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల సరిహద్దులోని పాములగెడ్డ, టిక్కరపాడు ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టుల ఉన్నట్టు గుర్తించారు అదే విధంగా మావోయిస్టు అగ్రనేత ఆర్కే సరిహద్దులో ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు, భద్రతా బలగాల మోహరింపు మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఆ ముగ్గురు ఎవరు?
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు గోదావరి తీర ప్రాంతమైన మహదేవపూర్ మండలంలో మావోయిస్టుల అలజడి మళ్లీ మొదలైందని ప్రచారం జరుగుతోంది. సోమవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ముగ్గురు మావోయిస్టులు సంచరించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు కరపత్రాలు వదలడం, ఇన్ఫార్మర్లను హతమార్చడం ద్వారా మావోయిస్టులు గోదావరి తీరప్రాంతాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నారు. కాళేశ్వరంలో ముగ్గురి సంచారం ? తాజాగా ఈ నెల 5న మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అదే రోజు కాళేశ్వరంలో ముగ్గురు అనుమానితులు సంచరించినట్లు సమాచారం. వారి మాటల ప్రకారం మావోయిస్టులుగా అనుమానించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. అసలు వారు నకిలీలా ? నిజంగా మావోయిస్టులా అనే విషయం కూడా తేల్చేందుకు పోలీసులు కూపీ లాగుతున్నట్లు సమాచారం. మకాం మార్చిన నాయకులు.. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భూసేకరణలో కీలకపాత్ర పోషించిన వారిపై మావోయిస్టులు గురిపెట్టినట్లు స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అధికార పార్టీ నాయకులను పిలిచి పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అధికారపార్టీ నాయకులంతా హైదరాబాద్, వరంగల్ నగరాలకు మకాం మార్చారు. భారీ బందోబస్తు.. సరిహద్దులో మావోయిస్టుల సంచారం నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు కన్నెపల్లి పంప్‌హౌస్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతంలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఎస్పీ ఆర్.భాస్కరన్ ప్రత్యేక పోలీసు బలగాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాళేశ్వరం బ్యారేజీల వద్ద భద్రతను పటిష్టం చేస్తున్నారు. మావోయిస్టులు రాలేదు.. సోమవారం సాయంత్రం కాళేశ్వరంలో మావోయిస్టులెవరూ రాలేదు. అనుమానితులు మద్యం తాగినట్లు ఉన్నట్లు తెలిసింది. వారిని మహారాష్ట్రకు చెందినవారిగా స్థానికులు గర్తించారు. మావోయిస్టులు మాత్రం కాదు. బంద్ నేసథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా బ్యారేజీల వద్ద కూంబింగ్ చేస్తున్నాం. – సీహెచ్.శ్రీనివాస్, ఎస్సై, కాళేశ్వరం -
దంతెవాడ జిల్లాలో ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టులు హతమయ్యాడు. సంఘటనా స్థలం నుంచి ఓ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దులో మావోయిస్టులు దాడులకు పాల్పడుతుండటంతో బలగాలు కూంబింగ్‌ను విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున మావోయిస్టులు ఉనికితో భద్రతా బలగాలు కాల్పలు జరిపినట్టు తెలుస్తోంది. -
నల్లమలలో మావోయిస్టుల డంప్
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో కలకలం రేగింది. జిల్లాలోని నాగలూటీ చెంచు గూడెం వద్ద మావోయిస్టుల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డంప్‌లో గ్రనేడ్, జిలెటిన్ స్టిక్సను గుర్తించారు. మావోయిస్టుల డంప్ లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు. -
సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టుల దాడి?
సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. జిల్లాలోని చర్ల మండలంలోని కలివేరు గ్రామంలో ఉన్న సీఆర్పీఎఫ్ పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ రోజు తెల్లవారుజామున పెద్ద శబ్ధం వినిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. సీఆర్పీఎఫ్ క్యాంపుపై మూడు ప్రెషర్ బాంబులను విసిరినట్టు సమాచారం . ఈ ఘటనలో పలువురు జవాన్లకు గాయాలయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ సంఘటనను పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, ఒక పక్క మావోయిస్టులు మరో పక్క పోలీసుల మధ్య ఆదివాసీలు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయాందోళనలు చెందుతున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మావోయిస్టులను నిర్మూలించే పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై చేస్తున్న ఫాసిస్టు నిర్బంధానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 5న బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌లు సంయుక్తంగా ప్రకటన జారీ చేశారు. -
12 మంది మావోయిస్టుల అరెస్టు
చత్తీస్ఘడ్: చత్తీస్‌ఘడ్‌లోని భారీ ఎత్తున మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. మల్కన్‌గిరి జిల్లాలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మల్కన్‌గిరిలో 12 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని కలిమెల, మాథిలి, చిత్రకొండ ప్రాంతాలలో వారిని అరెస్టు చేశారు. మల్కనగిరిలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో పోలీసులు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మావోలు పట్టుబడినట్టు తెలిపారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులు వివిధ విభాగాలకు చెందిన వారని, పలువురు ఈ మధ్యకాలంలో జరిగిన ముగ్గురు వ్యక్తుల హత్యలో పాల్గొన్నారని తెలిపారు. -
భూపాలపల్లి జిల్లాలో బాంబుల కలకలం
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాంబులు కలకలం రేపాయి. జిల్లాలోని వెంకటాపురం(కె) మండలంలోని అబ్బాయిగూడెం సమీపంలోని రహదారిపై రెండు బాంబులు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వాహనాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులే ఈ ఘతుకానికి పాల్పడి ఉంటరాని అనుమానిస్తున్నారు. రహదారిలో ప్రెషర్ బాంబులు అమర్చినట్లు గుర్తించడంతో.. బాంబు స్క్వాడ్ సాయంతో వాటిని నిర్వీర్యం చేయడానికి యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సర్పంచ్‌ను హతమార్చిన మావోయిస్టులు
కోరాపుట్: ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలో ఓ గ్రామ సర్పంచ్‌ను మావోయిస్టులు హతమార్చారు. హతిబరి గ్రామ సర్పంచ్ జగన్నాధ్ఖొరా ఇంటిపై 50 నుంచి 60 మంది మావోయిస్టులు అర్ధరాత్రివేళ దాడిచేసి ఆయన్ను కాల్చి చంపారు. ఆయనకు చెందిన కారు, ఒక ట్రాక్టరు, ఒక కమాండర్ వాహనాన్ని తగులబెట్టారు. -
చర్లలో మావోయిస్టు పోస్టర్ల కలకలం
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు పోస్టర్ల కలకలం రేగింది. జిల్లాలోని చర్ల మండల పరిషత్తు కార్యాలయం వద్ద మావోయిస్టు పార్టీ చర్ల, శబరీ ఏరియా కమిటీ పేరుతో పోస్టుర్లు వెలిసాయి. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారితే కఠిన చర్యలు తప్పవని. పోడు భూముల జోలికి వస్తే వదిలేది లేదని.. నకలీ విత్తనాలతో అమాయకులను మోసం చేయాలని చూస్తే ఇబ్బందులు తప్పవని.. నాణ్యమైన విత్తనాలనే సరఫరా చేయాలని వ్యాపారులను హెచ్చరించారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాల్పుల కలకలం
నారాయణపూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మళ్లీ విరుచుకుపడ్డారు. నారాయణపూర్ జిల్లా ధనోరా అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ధనోరా అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపైకి మావోలు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుదాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పినపాకలో మావోయిస్టు పోస్టర్లు
పినపాక: ఖమ్మం జిల్లా పినపాక మండలం మల్లారం పంచాయతీ వెంకటేశ్వరపురం గ్రామంలో మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. నక్సల్బరీ సాయుధ 50వ వార్షికోత్సవాలను గ్రామ గ్రామాన విప్లవ ఉత్తేజంతో జరపాలని అందులో పేర్కొన్నారు. నక్సలిజమే భారత ప్రజల విముక్తికి ఏకైక మార్గమని, నక్సలిజం రగిల్చి ప్రజా యుద్ధ జ్వాలల్లో భూస్వాములను భస్మీపటలం చేద్దామని ప్రజలకు నక్సల్స్ పిలుపునిచ్చారు. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేద్దామని, నక్సల్బరీ ఏకీ రాస్తా అని, సామ్రాజ్యవాదం నశించాలని ఆ పోస్టర్లలో నక్సల్స్ పేర్కొన్నారు. -
బస్సును తగులబెట్టిన నక్సల్స్
ఛత్తీస్‌గఢ్: నారాయణపూర్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఓ ప్రైవేటు బస్సును మావోయిస్టులు తగులబెట్టారు. అబూజ్మడ్-నారాయణపూర్ రహదారి నిర్మాణాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. -
ఆ ఎమ్మెల్యేను బెదిరించింది బంధువులే
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను రెండేళ్లుగా బెదిరింపులకు గురిచేసిన వారిని పోలీసులు పట్టుకున్నారు. నక్సలైట్ల పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురిని టేకులపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఆయనకు రెండు సార్లు బెదిరింపు లేఖలు, రెండుసార్లు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఎమ్మెల్యే ఫిర్యాదుతో అప్పమత్తమైన పోలీసులు దర్యాప్తు చేప్టటారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యేను బెదిరించిన నిందితులు ఆయన బంధువులు కావడం విశేషం. నిందితులు పూనెం బాలకృష్ణ, పూనెం ప్రకాష్, ఇర్ప కిషోర్‌లు చాలా సార్లు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి బెదిరిస్తుండేవారు. తండ్రీకొడుకులైన బాలకృష్ణ, ప్రకాష్‌లు మరో నలుగురితో కలిసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రూ. లక్ష ఇవ్వాలని ఎమ్మెల్యే కనకయ్యను డిమాండ్ చేస్తూ చంపుతామని హెచ్చరించారని వివరించారు. వీరిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. -
ఇల్లందు ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖలు
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు మావోయిస్టుల పేరుతో బెదిరింపులు వస్తుండటం జిల్లాలలో కలకలంగా మారింది. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఆయనకు రెండు సార్లు బెదిరింపు లేఖలు, రెండుసార్లు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. ఎమ్మెల్యే కనకయ్యకు భద్రను పెంచారు. ఆయన నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమరాలు ఏర్పాటుచేయడంతో పాటు, రక్షణ కోసం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కొరం కనకయ్య.. కొద్ది నెలలకే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా, బెదిరింపు వ్యవహారం మావోయిస్టుల పనేనా? లేక నకిలీలదా అనేది తెలియాల్సిఉంది. -
ఎన్కౌంటర్: మావోయిస్టు ఏరియా కార్యదర్శి మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ బార్చూర్ ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్ మృతి చెందాడు. సంఘటన స్థలంలో ఏకే-47 ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దులో ఉన్న బస్తర్ జిల్లాలోని బుర్గుం పోలీస్‌స్టేషన్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో తారసపడ్డ మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన బార్చూర్ ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్ మృతి చెందారు. మృతదేహం వద్ద నుంచి ఒక ఏకే-47 తుపాకీని, కిట్‌బ్యాగ్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టు ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ 16 లక్షల రివార్డ్‌ను ప్రకటించి ఉన్నట్లు తెలిసింది. -
ముగ్గురు మావోయిస్టుల పట్టివేత
రాయిపూర్: తీవ్రవాద ప్రభావిత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలీసులు ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు ఒడిశాకు చెందిన వారు. పుష్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాష్ట్ర భద్రతా బలగాలు, పోలీసులు చేపట్టిన సంయుక్త కూంబింగ్‌లో వీరు పట్టుబడ్డారని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. బస్తర్ జిల్లా దర్భా ప్రాంతానికి చెందిన కవాసి హద్మా(32)తో పాటు, ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరికి చెందిన రామ్‌నాథ్ నాగ్(21), బచ్ఛా ధుర్వా(24)గా గుర్తించారు. మావోయిస్టు పార్టీలో భాగమైన జన్‌మిలీషియాకు చెందిన ఈ ముగ్గురూ మార్చి 28వ తేదీన పోలీసులపై జరిగిన దాడిలో కీలక సూత్రధారులని తెలిపారు. మంగళవారం వీరిని సుక్మా జిల్లా కోర్టులో హాజరుపరిచామన్నారు. -
జై బోలో పార్లమెంటు!
‘ఎర్ర చొక్కానే నీ కోసం మార్చాను.. సాయుధ పంథాకే గుడ్ బై కొట్టాను.. ఓటు బాటనే ట్రెండీగా పట్టాను.. పార్టీని వదిలేసి నీ కోసం వచ్చాను.. ఓటరూ.. లెట్స్ డూ ఓటింగూ..’ సుబ్బారావు ఆనందం పట్టలేక గద్దర్ని కావలించుకున్నాడు. ప్రజాగాయకుడు గద్దర్, సుబ్బారావు చాలాకాలంగా స్నేహితులు. గద్దర్ మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసినట్టు పేపర్లో చదవగానే సుబ్బారావు గద్దర్ ఇంటికి వెళ్లాడు. సుబ్బారావు లోపలి వెళ్లగానే గద్దర్ ఏదో సీరియస్‌గా రాసుకుంటూ కనిపించాడు. ఎదురుగా లాప్ టాప్, పక్కనే సీడీలు, పుస్తకాలూ... ‘రా, సుబ్బన్నా.. రా... చాలా కాలానికి కనిపించి నవు.. ‘నోరారా ఆహ్వానించాడు గద్దర్ సుబ్బారావుని. ‘నువ్వు మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసి ప్రయోజన జీవన స్రవంతిలోకి వచ్చావు కదా.. శుభాకాంక్షలు చెప్పి పోదామని వచ్చాను’ అన్నాడు సుబ్బారావు. కొరకొరా చూశాడు గద్దర్. ‘గదేం మాట భై ...నేనేం అజ్ఞాతంలో లేను, అయినా ప్రయోజన జీవన స్రవంతి అని కొత్త మాట అంటున్నవేంది..’ అన్నాడు. ‘అంటే.. పార్లమెంటు, ఎన్నికలు, ఓటు అంటూ ఏదేదో మాట్లాడావు కదా.. అందుకే అలా అన్నా.. నాకో చిన్న డౌట్ అన్నా.. ఇదివరకు పోలీసులు నిన్ను మావోయిస్టు పార్టీ సభ్యుడివి అంటే అంతెత్తున ఎగిరి పడి ఖండించేవాడివి, కేవలం ఆ పార్టీ సానుభూతిపరుణ్ణి అని చెప్పేవాడివి.. సానుభూతిపరుడివే అయితే రాజీ నామా చేయడమెందుకు, పార్టీ వాళ్లు నిన్ను బతిమాలడం ఎందుకు..’ తెగించి అడిగేశాడు సుబ్బారావు. ‘అది అప్పటి వ్యూహం.. అది ఒక చారిత్రక అవసరం..’ అనేసి మళ్లీ బరబరా రాసుకోవడంలో మునిగిపోయాడు గద్దర్. సుబ్బారావులో కుతూహలం పెరిగింది, గద్దర్ ఏంటి రాస్తున్నాడా అని. అదే అడిగాడు. గద్దర్ రాయడం ఆపి, మెటికలు విరుచుకుంటూ అన్నాడు. ‘చూడు సుబ్బన్నా.. గతంలో నేను కొన్ని వందల విప్లవ గీతాలు పాడిన.. కొన్ని వేరేటోల్లయి.. కొన్ని నేను రాసుకున్నయి.. గిప్పుడు మనం రూటు మార్చినం కదా.. మళ్లీ గవ్వే పాడితే బాగుండదని నా కొత్త పంథాకి తగ్గట్టుగా తిరగ రాస్తున్నా..’ ‘కొత్త పంథా అంటే ? ఎలగెలగెలాగా?’ అమాయకంగా అడిగాడు సుబ్బారావు. గద్దర్ నవ్వుతూ చెప్పాడు. ‘ఇన్నాళ్లుగా జనంకి నా పాటల ద్వారా ఏం చెప్పా ను? రాజ్యాంగాన్ని నమ్మొద్దన్నాను.. రాజ్యం మీద తిరగబడమన్నాను.. ఎన్నికలు బూటకమన్నాను.. ఎన్నికల్ని బహిష్కరించమన్నాను.. బులెట్ ద్వారా తప్ప బ్యాలెట్ ద్వారా పేదోడికి న్యాయం జరగదన్నాను.. సాయుధ పోరాటానికి సిద్ధం కావాలన్నాను.. గిప్పుడు సీను రివర్స్ అయింది బిడ్డా.. గిప్పుడు మనది ఎన్నికల పాట.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య బాట.. దానికి తగ్గట్టుగా నా పాత పాటల్ని అటకెక్కించి వాటిని మార్చి తిరగరాస్తున్నా..’ ‘చాలా మంచి పని చేస్తున్నావు గద్దరన్నా .. ఏదీ, ఒక శాంపిల్ వినిపించు’ గద్దర్ ఒక్క గెంతులో నిలబడి ‘హా..’ అని పెడబొబ్బ పెట్టాడు. సుబ్బారావు తుళ్లిపడి, గద్దర్ పాటలోకి దిగుతున్నాడని గ్రహించి స్తిమితపడ్డాడు. గద్దర్ మొదలెట్టాడు. ‘ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా.. ఓటు మనదిరా, పోలింగ్ బూతు మనదిరా, మావో ఏందిరో.. వాని పీకుడేందిరో..’ సుబ్బారావు చప్పట్లు కొట్టాడు. ‘సూపరుంది గద్దరన్నా.. ఆ పాత చింతకాయ విప్లవ బాణీని వదిలేసి ఈ రోజులకి తగ్గట్టుగా ట్రెండీ వరసలో పాడరాదే..’ అని సలహా ఇచ్చాడు. గద్దర్‌కి ఆ సలహా నచ్చింది. ఎలాగో చెప్పమన్నాడు. వెంటనే సుబ్బారావు లాప్టాప్లో యూట్యూబ్ ఓపెన్ చేసి చిరంజీవి లేటెస్ట్ సినిమాలో పాట ప్లే చేశాడు. గద్దర్ ‘ప్రేమమ్’ సినిమాలో శృతి హాసన్‌లా ఒకటికి రెండుసార్లు విని, మళ్లీ ఎగిరి గంతెయ్యబోయాడు. సుబ్బారావు అతడ్ని చటుక్కున ఆపి, ‘ఈ పాటకి గంతులు, హా హూ లు లేవు’ అన్నాడు. గద్దర్ తల ఊపి చిరంజీవి స్టెప్పుల్తో పాట మొదలుపెట్టాడు. ‘ఎర్ర చొక్కానే నీ కోసం మార్చాను.. సాయుధ పంథాకే గుడ్ బై కొట్టాను.. ఓటు బాటనే ట్రెండీగా పట్టాను.. పార్టీని వదిలేసి నీ కోసం వచ్చాను.. ఓటరూ.. లెట్స్ డూ ఓటింగూ..’ సుబ్బారావు ఆనందం పట్టలేక గద్దర్ని కావలించుకున్నాడు. ‘గద్దరన్నా.. ఇకనుంచి నువ్వు ప్రజాయుద్ధనౌకవి కావన్నా.. ఓటు యుద్ధనౌకవి..’ పారవశ్యంతో అన్నాడు. గద్దర్ కళ్లు చెమర్చాయి. ‘చాలా థాంక్స్ అన్నా.. అది సరే గానీ, ఇంకో పాట రాస్తూ చిన్న డౌట్ వచ్చి ఆపిన.. అది విని, ఆ డౌట్ తీర్చి పో..’ అన్నాడు. సరేనన్నాడు సుబ్బారావు. గద్దర్ మొదలుపెట్టాడు. ‘ఆగదు, ఆగదు, ఆగదు, ఈ బాలెట్ పోరు ఆగదు.. ఈ పార్టీ పాలన అంతం వరకు నా ఓట్ల పాట ఆగదు.. తొర్రపడ్డ ఊపిరితిత్తి ఊదూమంది రాగం తీసి, కిడ్నీనుంచి పోయిన తూటా మీటుమంది కిన్నెరనేమొ, ఈ ఎడమచేతిని చీల్చిన తూటా ఎత్తూమందీ ఎర్ర జెండా..’ అంటూ ఆగిపోయాడు గద్దర్. ‘గిప్పుడు ఎర్రజెండాని వదిలి పెట్టిన కదా సుబ్బన్నా.. ఏ రంగు జెండా రాయాల్నా అని ఆలోచిస్తున్న.. నువ్ జెప్పు..’ అన్నాడు. సుబ్బారావు కాసేపు ఆలోచించి, ‘తెల్ల రంగు అయితే బెటరేమో గద్దరన్నా..’ అన్నాడు. తెల్ల రంగు ఎందుకని అడిగాడు గద్దర్ అర్థం కాక. సుబ్బారావు వివరించాడు. ‘సాధారణంగా యుద్ధంలో ఓడిపోయినప్పుడు శత్రువుని శరణువేడుతూ సింబాలిక్‌గా తెల్లజెండా పట్టుకుం టారు కదా. నీ మారిన పంథాకి తెల్ల జెండా సూటవుతుం దని అలా చెప్పా.. సరే కాని సాయంత్రం రామాలయంకి వచ్చేయ్.. అక్కడ కలుద్దాం.. మాంచి భజన ప్రోగ్రాం ఉందిలే ఇవాళ.. కలిసి విందాం.. నే వెళ్తున్నా మరి..’ మంగు రాజగోపాల్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈమెయిల్ : mangurajagopal@gmail.com -
గద్దర్ సంచలన ప్రకటన