దండకారణ్యంలో గాలిస్తున్న ప్రత్యేక పోలీసులు (ఫైల్)
సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. జిల్లాలోని చర్ల మండలంలోని కలివేరు గ్రామంలో ఉన్న సీఆర్పీఎఫ్ పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ రోజు తెల్లవారుజామున పెద్ద శబ్ధం వినిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. సీఆర్పీఎఫ్ క్యాంపుపై మూడు ప్రెషర్ బాంబులను విసిరినట్టు సమాచారం . ఈ ఘటనలో పలువురు జవాన్లకు గాయాలయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ సంఘటనను పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.
కాగా, ఒక పక్క మావోయిస్టులు మరో పక్క పోలీసుల మధ్య ఆదివాసీలు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయాందోళనలు చెందుతున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మావోయిస్టులను నిర్మూలించే పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై చేస్తున్న ఫాసిస్టు నిర్బంధానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 5న బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌లు సంయుక్తంగా ప్రకటన జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment