CRPF camp
-
పువర్తి క్యాంప్‌పై మావోల మెరుపుదాడి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టు అగ్రనేత మడకం హిడ్మా స్వగ్రామమైన పువర్తిలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో అడవిలో నక్కిన మావోయిస్టులు.. క్యాంప్‌పైకి రాకెట్ లాంచర్లు ప్రయోగించారు.అయితే ఇవి క్యాంప్ వెలుపల జవాన్ల సంచారం లేని చోట పడటంతో ప్రాణనష్టం తప్పింది. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. సుమారు గంటన్నరపాటు తుపాకులు, బాంబుల మోతతో పువర్తి అటవీ ప్రాంతం దద్దరిల్లింది. శుక్రవారం రాత్రంతా జవాన్లు అప్రమత్తంగా గడిపారు. శనివారం క్యాంప్ సమీప అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. చొచ్చుకుపోతున్న బలగాలు దాడులు చేయడంలో దిట్టగా పేరొందిన హిడ్మా సొంతూరిలో గత ఫిబ్రవరి 18న భద్రతా దళాలు క్యాంప్ ఏర్పాటు చేశాయి. వివిధ దళాలకు చెందిన వేలాది మంది జవాన్లు కేవలం వారం రోజుల్లోనే యుద్ధప్రాతిపదికన ఈ క్యాంప్ ఏర్పాటు చేసి మావోయిస్టులకు గట్టి హెచ్చరిక పంపారు. అంతేకాక పువర్తిలో ఉన్న స్తూపాలను ధ్వంసం చేశారు. హిడ్మా సమావేశాలు నిర్వహించే ఇంటిని తమ అదీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత బస్తర్ అడవుల్లో వరుసగా చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 150 మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కోవర్టు ఆరోపణలతో ఈ ఏడాది పది మందిని మావోయిస్టులు హతమార్చారు. ఈ తరుణంలో మావోయిస్టు పార్టీలో అభద్రతా భావం నెలకొందని, తెలంగాణ కేడర్‌కు చెందిన నేతలను హిడ్మా నమ్మడం లేదనే ప్రచారం మొదలైంది. కవ్వింపు చర్య?: వరుస నష్టాల నుంచి తేరుకుని, భద్రతా దళాలను ఆత్మరక్షణలో నెట్టే లక్ష్యంతో మావోయిస్టులు పువర్తి క్యాంప్‌పై దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. రాత్రివేళ వ్యూహాత్మకంగా క్యాంప్‌పై దాడి చేసి, అక్కడున్న భద్రతా దళాలను చెదరగొట్టడంతోపాటు తమకు పట్టున్న అటవీ ప్రాంతంలోకి రప్పించి అంబుష్ దాడి చేసేందుకు యత్నించినట్టు సమాచారం. అందులోభాగంగానే భారీ సంఖ్యలో జవాన్లు మోహరించిన క్యాంప్‌పై రాకెట్ లాంచర్లు ప్రయోగించి కవ్వింపు చర్యలకు దిగారని తెలుస్తోంది. అయితే రాత్రంతా క్యాంప్ లోపలే ఉండడం ద్వారా మావోలు పన్నిన ఉచ్చులో జవాన్లు చిక్కుకోలేదని చెబుతున్నారు. జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 8 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు ఇదే జిల్లా చింతగుఫా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనాస్థలి నుంచి బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వా«దీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా సీఆర్పీఎఫ్ బెటాలియన్–226(గాదిరాస్, సుక్మా జిల్లా) క్యాంప్‌లో పనిచేస్తున్న అస్సాంకు చెందిన జవాన్ విపుల్ భయాన్ తన సరీ్వస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
Pulwama attack 2019: ‘పుల్వామా’పై అనుమానాలెన్నో
న్యూఢిల్లీ: 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న 2019 పుల్వామా ఉగ్ర దాడిపై అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయని కాంగ్రెస్ పేర్కొంది. ఉగ్రదాడి ముప్పుందని తెలిసి కూడా జవాన్లను విమానంలో కాకుండా రోడ్డు మార్గాన ఎందుకు పంపాల్సి వచ్చిందో మోదీ సర్కారు చెప్పి తీరాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘‘పుల్వామా దాడిపై నాటి జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ బయట పెట్టిన విషయాలు షాకింగ్‌గా ఉన్నాయి. జైషే ముప్పును, ఏకంగా 11 నిఘా హెచ్చరికలను ఎందుకు విస్మరించారు? ఉగ్రవాదులకు 300 కిలోల ఆర్డీఎక్స్ ఎలా వచ్చింది? ఉగ్ర దాడిపై విచారణ ఎంతదాకా వచ్చింది? బాధ్యులను గుర్తించారా?’’ అని ప్రశ్నించారు. -
మావోయిస్టుల ఇలాకాలో పోలీస్ బాస్‌లు
చర్ల: మావోయిస్టుల ఇలాకాగా పేరున్న ఛత్తీస్‌గఢ్‌కు సరిహ ద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నాపురం వద్ద సీఆర్పీఎఫ్ క్యాంపును వారు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హెలీకాఫ్టర్ ద్వారా చెన్నాపురం చేరుకున్న వారు క్యాంపు పరిసరాలతో పాటు అధికారులు, సిబ్బందికి కల్పించిన వసతులను పరిశీలించారు. అదనపు డీజీపీ ఎస్.ఎస్.చతుర్వేది, సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ అదనపు డీజీ నళిన్‌ప్రభాత్, సదరన్ సెక్టార్ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా, కుంట డీఐజీ రాజీవ్‌కుమార్ ఠాకూర్, డీఐజీ ఎస్.ఎన్.మిశ్రా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా క్యాంపులు సీఆర్పీఎఫ్ క్యాంపు ప్రారంభించిన అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, నక్సల్స్ నిర్మూలన కోసం కేంద్ర హోం శాఖ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బలగా లను పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లి, చెలిమల, తిప్పాపురం, కలివేరులో క్యాంపులు ఏర్పాటుచేయగా, జిల్లా పోలీసు యంత్రాంగం, సీఆర్పీఎఫ్ బలగాల సమన్వయంతో ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా మరింత పటిష్టమవుతుందని వెల్లడించారు. కాగా, అమాయకపు ఆదివాసీ గిరిజనులపై దుశ్చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులు తెలంగాణలో ఆదరణ కోల్పోయారని మహేందర్‌రెడ్డి పేరొన్నారు. సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్సింగ్ మాట్లాడుతూ మావోయిస్టులకు అడ్డుకట్ట వేయడంలో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల పోలీసుల పనితీరు అభినందనీయమని తెలిపారు. -
135 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కోవిడ్
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో కరోనా వైరస్ కలకలం రేపింది. ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది జవాన్లకు ట్రూపర్లకు కరోనా సోకింది. మరో 22 మందికి సంబంధించిన రిపోర్టులు అందాల్సి ఉంది. రాజధానిలోని మయూర్‌విహార్ ప్రాంతంలో ఉండే ఈ బెటాలియన్‌లో సుమారు వెయ్యి మంది జవాన్లుంటారు. ఈ బెటాలియన్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్(55) ఒకరు ఇటీవల కరోనా వైరస్ సోకి సప్థర్ జంగ్ ఆసుపత్రిలో చనిపోయారు. తాజా పరిణామంతో బెటాలియన్ కార్యాలయాన్ని మూసివేసి, అందులోని వారందరినీ ఐసొలేషన్ సెంటర్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
32 గంటల ఎన్కౌంటర్
శ్రీనగర్: సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడికి విఫల యత్నం చేసి ఓ ఇంట్లో దాక్కున్న ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇరు వర్గాల మధ్య సుమారు 32 గంటలు కొనసాగిన ఎన్కౌంటర్ మంగళవారం ముగిసింది. ఇక్కడి కరణ్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ఆపరేషన్‌లో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ఆపరేషన్ల బృందం(ఎస్ఓజీ), సీఆర్పీఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. సంఘటనా స్థలం నుంచి ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు, రెండు ఏకే 47 తుపాకులు, 8 మేగజీన్లను స్వాధీనం చేసుకున్నారు. మృతులు లష్కరే తోయిబాకు చెందినవారేనని పోలీసులు ధ్రువీకరించారు. సోమవారం సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేయడానికి వచ్చిన ఉగ్రవాదులపై అప్రమత్తంగా ఉన్న గార్డు కాల్పులు జరపడంతో వారు సమీపంలోని ఇంట్లోకి చొరబడ్డారు. ఆ తరువాత ప్రారంభమైన ఎన్కౌంటర్లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ చనిపోగా, ఒక పోలీస్ గాయపడ్డాడు. సోమవారం రాత్రి విరామం అనంతరం మంగళవారం ఉదయం పునఃప్రారంభమైన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. గార్డు అప్రమత్తతతో తప్పిన ముప్పు ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ సందర్భంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఐజీ ఎస్పీ పాని వెల్లడించారు. వారు దాక్కున్న ఐదంతస్తుల భవనం నివాస, వాణిజ్య సముదాయాల మధ్య ఉండటం వల్లే ఎన్కౌంటర్ పూర్తవడానికి సమయం పట్టిందని తెలిపారు. సమీప ప్రాంతంలో నివసిస్తున్న సీఆర్పీఎఫ్ కుటుంబాలు, ప్రజలను అక్కడి నుంచి తరలించి పక్కా రెక్కీ నిర్వహించిన తరువాతే ముష్కరులపై ముప్పేట దాడిని ప్రారంభించామని సీఆర్పీఎఫ్ ఐజీ రవిదీప్ సాహి చెప్పారు. ఒకవేళ గార్డు ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేయకుంటే జరిగే నష్టం ఊహించలేమని చెప్పారు. ఆ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాక్కున్నారా? అని ప్రశ్నించగా..గార్డు ఇద్దరినే చూశాడని చెప్పారు. మరో సైనికుడి మృతదేహం లభ్యం సంజువాన్ సైనిక శిబిరంలో జరిగిన ఎన్కౌంటర్ స్థలంలో మరో భారత జవాన్ మృతదేహం లభించింది. దీంతో ఈ ఉగ్రదాడిలో మరణించిన వారి సంఖ్య ముగ్గురు ఉగ్రవాదులతో కలుపుకుని 10కి చేరింది. ఈ దాడిలో అమరులైన కశ్మీర్ లోయకు చెందిన జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ హాజరయ్యారు. సైనిక శిబిరాలకు సమీపంలో ఇళ్లు నిర్మించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అధికారుల అనుమతితోనే వీటిని కడుతున్నందున ఆ తరువాత తొలగించడం కష్టమవుతోందని పేర్కొన్నారు. రాజ్‌నాథ్ సమీక్ష... కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరసగా రెండోరోజు జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితిపై సమీక్ష జరిపారు. మంగళవారం జరిగిన భేటీకి జాతీయ భద్రతా సలహాదారు దోవల్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా హాజరయ్యారు. సరిహద్దుల గుండా చొరబాట్లను నియంత్రించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. మరో కుట్ర భగ్నం జమ్మూలో మరో సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడి కుట్ర భగ్నమైంది. జమ్మూ–అక్నూర్ రోడ్డులో ఉన్న దోమనా శిబిరం ప్రధాన గేటు సమీపంలోకి బైకుపై వచ్చిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు గార్డుపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ప్రతికాల్పులకు దిగడంతో వారు పారిపోయినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ దేవేందర్ ఆనంద్ వెల్లడించారు. పరారైన ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. మేమూ బదులిస్తాం: పాక్ భారత్, పాక్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. భారత్ దుస్సాహసానికి పాల్పడితే అదే రీతిలో బదులిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. సంజువాన్ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడి వెనక పాక్ ఉందన్న రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ ఖాన్ మంగళవారం నిర్మలా వ్యాఖ్యలపై స్పందిస్తూ.. భారత్ ఎలాంటి దుస్సాహసానికి దిగినా తామూ అలాగే బదులిస్తామని అన్నారు. సంజువాన్‌లో అమరులైన జవాన్లకు మెహబూబా నివాళి -
ఏకే47లతో వచ్చి.. తోక ముడిచిన ఉగ్రవాదులు
సాక్షి, శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని సంజువాన్‌లో జరిగిన ఉగ్రదాడి విషాదాన్ని మరువకముందే పాకిస్తాన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోమవారం ఉదయం శ్రీనగర్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా ఉగ్రవాదులు తోకముడిచారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా ఉగ్రవాదులు ఘటనాస్థలం నుంచి కొన్ని క్షణాల్లోనే పరారయ్యారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇద్దరు ఉగ్రవాదులు ఏకే 47లు, బ్యాగులతో సీఆర్పీఎఫ్ క్యాంపును సమీపించారని అధికారులు తెలిపారు. క్యాంపును వద్దకు రాగానే ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరపగా, వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఉగ్రవాదులు పరారయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పరారైన ఉగ్రమూకల కోసం సీఆర్పీఎఫ్ సిబ్బంది గాలిస్తోంది. మరోవైపు ఇటీవల సంజువాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఒక పౌరుడు, ఐదుగురు ఆర్మీ సిబ్బందితో కలిపి మొత్తం ఆరుగురు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు, ఇతర సంస్థల ఉగ్రవాదులు తరచుగా సైనిక దుస్తుల్లో భారత్‌లో ప్రవేశించి దాడులకు తెగబడుతున్నారు. -
సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టుల దాడి?
సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. జిల్లాలోని చర్ల మండలంలోని కలివేరు గ్రామంలో ఉన్న సీఆర్పీఎఫ్ పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ రోజు తెల్లవారుజామున పెద్ద శబ్ధం వినిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. సీఆర్పీఎఫ్ క్యాంపుపై మూడు ప్రెషర్ బాంబులను విసిరినట్టు సమాచారం . ఈ ఘటనలో పలువురు జవాన్లకు గాయాలయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ సంఘటనను పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, ఒక పక్క మావోయిస్టులు మరో పక్క పోలీసుల మధ్య ఆదివాసీలు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయాందోళనలు చెందుతున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మావోయిస్టులను నిర్మూలించే పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై చేస్తున్న ఫాసిస్టు నిర్బంధానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 5న బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌లు సంయుక్తంగా ప్రకటన జారీ చేశారు. -
ఉగ్రదాడిలో టెన్త్ విద్యార్థి
శ్రీనగర్: కొత్త ఏడాది ఆరంభానికి కొద్ది గంటల ముందు జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో సంచలన విషయం వెలుగు చూసింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లా లెత్‌పొరాలోని సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) క్యాంప్‌పై జైష్ – ఎ – మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 16 ఏళ్ల బాలుడు ఉన్నట్టు గుర్తించారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో అతడు మృతి చెందాడు. పోలీసు కానిస్టేబుల్ గులాం మహ్మద్ ఖాండే కుమారుడైన ఫర్దీన్ అహ్మద్ ఖాండే మూడు నెలల క్రితం ఉగ్రవాదిగా మారాడని కశ్మీర్ పోలీసులు తెలిపారు. బుర్హాన్ వనీ స్వస్థలం త్రాల్‌కు చెందిన ఫర్దీన్ పదో తరగతి చదివాడు. ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో అతడితో పాటు మన్జూర్ బాబా డ్రబ్‌గామ్(22) కూడా హతమయ్యాడు. మరో ఉగ్రవాది కూడా మరణించి ఉంటాడని, అతని మృతదేహం కోసం క్యాంప్‌లో గాలిస్తున్నామని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి రాజేశ్ యాదవ్ తెలిపారు. చిన్నపిల్లలు ఉగ్రవాదం పట్ల ఆకర్షితులు కావడం కశ్మీర్ పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. దాడికి ముందు వీడియో మిలటరీ క్యాంప్‌పై దాడికి ముందు ఫర్దీన్ రికార్డు చేసిన ఎనిమిది నిమిషాల వీడియో మెసేజ్ వాట్సప్‌లో వైరల్‌గా మారింది. సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై వ్యూహం పన్నినట్టు వీడియో మెసేజ్‌లో ఫర్దీన్ వెల్లడించాడు. ‘ఈ సందేశం మీకు చేరేటప్పటికీ నేను స్వర్గంలో దేవుడి దగ్గర అతిథిగా ఉంటాన’ని వీడియోలో పేర్కొన్నాడు. ఆదివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. -
సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్ర దాడి
శ్రీనగర్: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లా లెత్‌పొరాలోని సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) క్యాంప్‌పై జైష్ – ఎ – మహ్మద్ ఉగ్రవాదులు దాడి జరిపి ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. గ్రెనేడ్ లాంఛర్లు, ఆటోమేటిక్ ఆయుధాలు ధరించిన కొందరు ముష్కరులు ఆదివారం వేకువజామున సీఆర్పీఎఫ్ క్యాంప్ వద్దకు వచ్చీ రావటంతోనే విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. క్యాంప్ లోపలికి దూసుకెళ్లటానికి వారు చేసిన యత్నాలను సీఆర్పీఎఫ్ గార్డులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఉగ్రవాది కూడా మరణించి ఉంటాడని, అతని మృతదేహం కోసం క్యాంప్‌లో గాలిస్తున్నామని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి రాజేశ్ యాదవ్ తెలిపారు. అమరులైన వారిని సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ తౌఫయిల్ అహ్మద్, ఇన్స్పెక్టర్ కుల్దీప్ రాయ్ (హిమాచల్ ప్రదేశ్), కానిస్టేబుళ్లు.. షరీఫుద్దీన్ గనీ (బుద్గాం), రాజేందర్ నైన్(రాజస్థాన్), పీకే పాండా(ఒడిశా)గా గుర్తించారు. చనిపోయిన ఉగ్రవాదులను మంజూర్ అహ్మద్ బాబా(పుల్వామా), ఫర్దీన్ అహ్మద్ ఖన్దే(త్రాల్)గా భావిస్తున్నారు. వీరి వద్ద ఉన్న మారణాయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ పోలీసులను పెద్ద సంఖ్యలో క్యాంప్‌నకు తరలించారు. ఈ దాడికి తమదే బాధ్యతని పాక్ ప్రేరేపిత జైష్–ఎ–మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. పాక్ కాల్పుల ఉల్లంఘన రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత పోస్టులపైకి పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఒక జవాను చనిపోయాడు. వేకువ జామున పాక్ బలగాలు రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లోని భారత్ ఫార్వర్డ్ పోస్టుల పైకి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో పంజాబ్‌కు చెందిన జవాను ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా పూంఛ్ జిల్లా దిగ్వార్ సెక్టార్లో అర్ధరాత్రి నుంచి వేకువజాము 5.30 గంటల వరకు పాక్ బలగాలు కాల్పులు కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపిన్ రావత్ జమ్మూకశ్మీర్‌లోని భద్రతా బలగాల యుద్ధ సన్నద్ధత, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష జరిపారు. రాజౌరీ సెక్టార్‌లోని నియంత్రణాధీన రేఖ వెంబడి ఫార్వర్డ్ పోస్టులను ఆదివారం పరిశీలించారు. డిసెంబర్ 10వ తేదీ వరకు ఎల్వోసీ వెంబడి పాక్ కాల్పుల ఉల్లంఘన ఘటనలు 881 జరగ్గా, గత ఏడేళ్లలో ఇదే అత్యధికం కావటం గమనార్హం. దీంతోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నవంబర్ వరకు మొత్తం 110 సార్లు పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ ఘటనల్లో 14 మంది సైనికులు, 12 మంది పౌరులు, నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు అమరులయ్యారని సైన్యం తెలిపింది. 2003లో భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య మొత్తం 3,323 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ‘పుల్వామా దాడి ప్రధాని వైఫల్యం’ పుల్వామా సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదుల దాడి ప్రధాని మోదీ విదేశాంగ విధానం వైఫల్యానికి నిదర్శనమని కాంగ్రెస్ మండిపడింది. దేశ విరోధులకు గట్టిగా బుద్ధి చెబుతామని ఎన్నికల సమయంలో చెప్పిన మోదీ మాటలు ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుశ్మితా దేవ్ ప్రశ్నించారు. -
సుక్మా ఘటనపై రాజ్‌నాథ్ దిగ్ర్భాంతి
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మావోయిస్టుల దాడిలో 24మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి బాధాకరమని, మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ హోంమంత్రితో రాజ్‌నాథ్ ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని దగ్గరుండి సమీక్షించాలని ఆదేశాలు ఇచ్చారు. Extremely pained to know about the killing of CRPF personnel in Sukma. My tributes to the martyrs and condolences to their families. 1/2 — Rajnath Singh (@rajnathsingh) 24 April 2017 సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి పిరికిపందల చర్య అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, జవాన్ల త్యాగం వృథాగా పోనివ్వమని మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. We are proud of the valour of our @crpfindia personnel. The sacrifice of the martyrs will not go in vain. Condolences to their families. — Narendra Modi (@narendramodi) 24 April 2017 కాగా బుర్కాపాల్- చింతగుఫ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు ఆకస్మాత్తుగా రెండువైపులా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అక్కడికక్కడే 26 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. దాడి ఘటనలో సుమారు 300మంది మావోయిస్టులు పాల్గొన్నారని గాయపడ్డ పీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తెలిపారు. తాము 150 మందిమి ఉన్నామని, ఒక్కసారిగా తమపై దాడికి దిగారన్నారు. తాము కూడా ఎదురు దాడి చేశామని, మావోయిస్టులు కూడా గాయపడినట్లు తెలిపారు. కాగా ఓ కమాండర్ తో పాటు ఆరుగురు జావాన్ల జాడ తెలియాల్సి ఉంది. ఇక దాడి ఘటన అనంతరం మావోయిస్టులు 30 వరకు ఆయుధాలను ఎత్తుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు ఈ ప్రాంతానికి వెంటనే హెలీకాప్టర్ ను పంపించి క్షతగాత్రులను రాయిపూర్‌లోని బాలాజీ, నారాయణ ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
మావోయిస్టుల మెరుపు దాడి; 11 మంది జవాన్ల మృతి
-
మావోల మారణకాండ
► సీఆర్పీఎఫ్ జవాన్లపై మెరుపుదాడి ► విచక్షణారహితంగా కాల్పులు, గ్రెనేడ్లు విసిరిన వైనం ► 25 మంది హతం, ఆరుగురికి గాయాలు ► భోజనానికి సన్నద్ధమవుతుండగా ఘటన రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మారణహోమం సృష్టించారు. సుక్మా జిల్లాలో మంగళవారం వందలాది మంది మావోలు జరిపిన దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోగా మరో ఆరుమంది గాయపడ్డారు. దక్షిణ బస్తర్‌లోని చింతగూడకు సమీపంలోగల కల్పధర్ అటవీ ప్రాంతంలో మధ్యాహ్నం గం 12.25 సమయంలో ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతున్న చోట ఉన్న జవాన్లపై దాదాపు 300 మంది మావోయిస్టులు అకస్మాత్తుగా దాడి చేసి రెండువైపులా కాల్పులు జరిపారు. మావోయిస్టులకు, సీఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆయుధాలను ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఈ ఘటన అనంతరం జవాన్లు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. సీఆర్పీఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎం.దినకరన్ మాట్లాడుతూ మొదట తమకు 11 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని, మరొకరు ఆస్పత్రిలో మరణించారని చెప్పారు . అనంతరం పరిసర ప్రాంతాల్లో గాలింపుల్లో మరో 12 మంది మృతదేహాలు కూడా లభ్యమయ్యాయని ఆయన తెలిపారు. ఈ విషయమై దాడిలో ప్రాణాలతో బయటపడిన ఓ జవాను మాట్లాడుతూ తాము భోజనం చేసేందుకు సన్నద్ధమవుతుండగా పొదల్లో మాటువేసిన 300 మంది మావోయిస్టులు దాడి చేశారని చెప్పాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, అంతేకాకుండా గ్రెనేడ్‌ను కూడా విసిరారని తెలిపాడు. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వెంటనే మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. మావోలు కాల్పులు జరపడంతో తాము ప్రతిదాడి చేశామని, ఇరువర్గాల మధ్య ఎన్కౌంటర్ జరిగిందన్నారు. కాగా క్షతగాత్రులను హెలికాప్టర్ద్వారా ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. ఇదే జిల్లాలో ఈ ఏడాది మార్చి, 12న జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోవడం తెలిసిందే. 2010లో జరిగిన ఎన్కౌంటర్లో ఏకంగా 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పిరికి చర్య: ప్రధాని మావోయిస్టుల దాడిని ప్రధాని నరేంద్రమోదీ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అమరవీరుల త్యాగాలు వృథాపోవన్నారు. ఈ దాడి గర్హనీయమన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారని ప్రధానమంత్రి ప్రకటించారు. బాధ కలిగింది: రాజ్‌నాథ్ మావోయిస్టుల దాడి తనను బాధించిందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ఘటనాస్థలిని సందర్శించాల్సిందిగా సహాయమంత్రి హన్స్‌రాజ్ ఆహిర్‌కు సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్న సీఎం ఎన్కౌంటర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని రాజధాని నగరం రాయ్‌పూర్ చేరుకున్నారు. ఉన్నతాధికారులతో సమావేశమై ఈ విషయమై చర్చించారు. బాధితులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం ఢిల్లీ నుంచి మంగళవారం రాష్ట్రానికి రావాల్సి ఉండగా, దాడి నేపథ్యంలో సోమవారమే వచ్చారు. -
తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ అధికారి ఆత్మహత్య
జగదల్పూర్(ఛత్తీస్‌గఢ్): ఓ సీఆర్పీఎఫ్ అధికారి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ జిల్లా కమనార్ సీఆర్పీఎఫ్ క్యాంపులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని సంజీవ్ పవార్‌గా గుర్తించారు. -
సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి: ముగ్గురు మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని షాపియన్ జిల్లా, గగ్రన్ సమీపంలోని సీఆర్పీఎఫ్ శిబిరంపై మధ్యాహ్నం తీవ్రవాదులు ఆకస్మికంగా దాడి చేశారు. భద్రతాదళాలు వెంటనే తేరుకుని ప్రతిగా కాల్పులు జరిపారు. దాంతో ముగ్గురు తీవ్రవాదులు అక్కడికక్కడే మరణించారని ఐజీ ఏ.జీ.మిర్ శనివారం ఇక్కడ వెల్లడించారు. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆయన వివరించారు. మృతులు ఏ సంస్థకు చెందిన తీవ్రవాదులో ఇంకా తెలియలేదని తెలిపారు.